11, ఆగస్టు 2024, ఆదివారం

భాస్కరాచార్యుడు

 భాస్కరాచార్యుడు…….  సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను. ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

Panchaag


 

పార్వతి సృష్టించిన శక్తులు

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

22కం.

శక్తుల రోషము శిఖియై

వ్యక్తము గానట్టి రీతి నఖిలాండములన్!

భుక్తిగ గొనుచుండ పరా

శక్తిని శాంతింప జేయ శంభుని గోరన్!


భావము: పార్వతి సృష్టించిన శక్తులు ప్రళయాగ్నులై జగములను దహించుచుండ ఆ పరాశక్తిని శాంతంప జేయగోరుటకై శివుని చెంతకు ...

నిత్యపద్య నైవేద్యం-1576 వ రోజు

 నిత్యపద్య నైవేద్యం-1576 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-211. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

గాంధర్వం చ కవిత్వం చ 

శూరత్వం దానశీలతా l

అభ్యాసేన న లభ్యంతే 

చత్వారస్సహజా గుణా:ll


తేటగీతి:

మధుర సంగీతము, మధురమైన కవిత,

తనరుచున్న శూరత్వము, దానగుణము,

నాల్గివి సహజగుణములు నరులకెల్ల 

జన్మతో వచ్చు, నేర్వగ సాధ్యపడదు.


భావం: సంగీతం, కవిత్వం, శూరత్వం, దానగుణం.. ఈ నాలుగూ సహజ గుణములు. ఇవి పుట్టుకతో రావలసినవే గానీ నేర్చుకుందామంటే అలవడునవి కావు.

మాసిన చీర మానినికి*

 🌹పద్యలహరి🌹

    10.08.2024

      శనివారం 


" *మాసిన చీర మానినికి* 

 *మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో"* 

..................................................


 *ఉత్పలమాల...* 


చూసిన వారలెల్ల కడుచోద్యపు 

రీతిని జెప్పునట్లుగా


భాసిలు పెండ్లివేడుకలు, వంటల 

విందులు మిన్నుముట్టగన్


కాసులు మిద్దెలున్ననొక కాంత 

యుపాసన జేయువేళ నా


మాసినచీర మానినికి 

మాన్యతఁ గూర్చును పెండ్లివిందులో..

..................................................

ఉపాసన  ... సేవ ( పెళ్లిలో సేవ )

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఆగష్టు,11, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 🌹 *ఆగష్టు,11, 2024*🌹

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి : సప్తమి* పూర్తిగా ఈరోజంతా రాత్రితో సహా

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : స్వాతి* పూర్తిగా ఈరోజంతా రాత్రితో సహా


*యోగం : శుభ* మ 03.49 వరకు ఉపరి *శుక్ల*

*కరణం : గరజి* సా 06.53 *వణజి* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00*

అమృత కాలం :*రా 10.45 - 12.32*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.38*


*వర్జ్యం : మ 12.03 - 01.50*

*దుర్ముహుర్తం :సా 04.53 - 05.43*

*రాహు కాలం :సా 04.59 - 06.34*

గుళిక కాలం :*మ 03.23 - 04.59*

యమ గండం :*మ 12.12 - 01.48*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.51* 

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.51 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.02*

*ఆబ్ధికం తిధి : శ్రావణ శుద్ధ సప్తమి*

సాయంకాలం :*సా 04.02 - 06.34*

ప్రదోష కాలం :*సా 06.34 - 08.50*

నిశీధి కాలం :*రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


  🌞 *॥ శ్రీ సూర్య స్తోత్రం ॥*🌞


ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |

సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ ||


    🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

       🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌿🌞🌞🌿🍃🌹

ఆత్మజ్ఞానం

 *ఆత్మజ్ఞానం గురువునుండి* *మాత్రమే లభిస్తుంది* 

 

మానవ కార్యకలాపాల లక్ష్యాలు నాలుగు : విధులను నెరవేర్చడం, సంపద పెంచడం , కోరికల నెరవేర్పు(చివరికి), మోక్షాన్ని సాధించడం. వీటిలో మోక్ష ప్రాప్తి శ్రేష్ఠమైనది. ఆత్మజ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుంది. ఈ విషయం శృతిలో చాలా స్పష్టంగా చెప్పబడింది

 అంటే ఆత్మసాక్షాత్కారం తర్వాతే మరణానికి మించిన స్థితి లభిస్తుంది. ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం కేవలం గురువు నుండి మాత్రమే లభిస్తుంది. 

తనకు గురువు ఉన్నవాడే నిజమైన పురుషుడని శృతిలో కూడా చెప్పబడింది.

 గురువు ఎవరు? అనే ప్రశ్న ప్రతీ వారికీ వస్తుంది. శిష్యునియొక్క అన్ని అధర్మాలను రూపుమాపి , తన శిష్యుని ధర్మ మార్గమనే మంచి జీవితంలో నిమగ్నమయ్యేలా చేసే వాడే గురువు అని సమాధానం. 

అసలైన గురువు యొక్క గుణములు శ్రీ శంకర భగవత్పాదుల బాటలో పూర్తిగా కనిపించాయి. అంతర్లీనంగా అన్ని శాస్త్రాలలో దాగి ఉన్న తత్వం ఆయనకు తెలుసు. సమస్త మానవ జాతి శ్రేయస్సు కోసం ఆయన కృషి చేశారు. ఎన్నో శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆయన ప్రసాదించిన వేదాలకు సంబంధించిన మార్గదర్శకాలు సూర్యకాంతి వెలుగుగా నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాయి.

 శ్రీ శంకరులు కూడా ఉపనిషత్తులలో అద్వైతాన్ని ప్రబోధించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుడు వివరించిన అద్వైత తత్త్వమే ఈ తత్వమని పండితుల ఏకాభిప్రాయం. కాబట్టి మనమందరం శ్రీ శంకర భగవత్పాదులు , విద్వత్స్వరూపి, ప్రేమ సాగరుడు అయిన వారిని నిత్యం పూజించాలి. 

 కష్టపడే వారికి మోక్షం! భక్తి మార్గం కోరుకునేవారికి పూజాఫలం తప్పక లభిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక ఋషులను తప్పక పూజించాలని శ్రుతి చెబుతోంది. భక్తులందరికీ శ్రీ శంకర భగవత్పాదుల ఆశీస్సులు లభించుగాక!  


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

మహనీయుని మాట*🌹

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏


     🌼*🌺

       -------------------

🌹 *మహనీయుని మాట*🌹

        -------------------------

"బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమే

తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే

గంజాయి మొక్కలతో పెరిగినప్పటికీ తులసి దైవ స్వరూపమే

జీవిస్తున్న స్థలాన్ని బట్టి

చుట్టూ వుండే జనాన్ని బట్టి

ఎవరినీ అంచనా వేయకూడదు.

పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"అనుభవం 

ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు

తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌻పంచాంగం🌻

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 11 - 08 - 2024,

వారం ... భానువాసరే ( ఆదివారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - వర్ష ఋతువు,

శ్రావణ మాసం - శుక్ల పక్షం,


తిథి : సప్తమి తె3.26 వరకు,

నక్షత్రం : స్వాతి తె5.33 వరకు,

యోగం : శుభం మ2.22 వరకు,

కరణం : గరజి మ2.36 వరకు,

               తదుపరి వణిజ రా3.26 వరకు,


వర్జ్యం : ఉ9.24 - 11.09,

దుర్ముహూర్తము : సా4.44 - 5.35,

అమృతకాలం : రా7.55 - 9.40,

రాహుకాలం : సా4.30 - 6.00,

యమగండం : మ12.00 - 1.30,

సూర్యరాశి : కర్కాటకం,

చంద్రరాశి : తుల,

సూర్యోదయం : 5.45,

సూర్యాస్తమయం: 6.26,


              *_నేటి విశేషం_*


               *భాను సప్తమి*

     ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. 

ఇది చాలా గొప్ప యోగం, సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే... 

     మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం,

     రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు , ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.

      మూడవది ఒంటికి , తలకు నూనె పెట్టుకోరాదు. నాల్గవది ఉల్లి , వెల్లుల్లి , మద్యము , మాంసాహారానికి దూరంగా ఉండాలి.

     ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. 

ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా , వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది.


     అవివాహితులకు వివాహమవుతుంది, సంతానం కలుగుతుంది, మనఃశ్శాంతి లభిస్తుంది. 

      సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.

     ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది , గొప్ప యోగము. 

      ఈ రోజు చేసే స్నానం , దానము , జపము , హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. 


     ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

 

    సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక , ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని , దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. 

 

    ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి...


*భావం:-🌷*

తినకూడని పదార్ధాలు , మద్యము , మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు.

    ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. 

    స్త్రీ సమాగమము , తైలం రాసుకోనుట , మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం , వ్యాధి , దారిద్ర్యం ఉండదు , వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.

     ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. 


   కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.


ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం , ఆదిత్య హృదయం , సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.


    సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను , ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.


    శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది...


ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః🙏🌻


               *_🌻శుభమస్తు🌻_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సుభాషితమ్


🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


    *దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా*

    *నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుఁ, డర్ణోరాశి కన్యావిభుం*

    *డు విశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ*

    *చి విచారింపవు లేమి నెవ్వఁడెపుడున్‌ శ్రీకాళహస్తీశ్వరా*!


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 07*


*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! నీ ఐశ్వర్యము అంతింత గాదు... కల్పవృక్షము, కామధేనువు నీ సంపద, రత్నఖచితమైన విల్లు నీ స్వంతము... కుబేరుడు నీ స్నేహితుడు.... నీ అర్చకుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు... అట్టి నీవు చూసి విచారించకయున్న ఎవ్వడు మా దారిద్ర్యమును పోగొట్టును ప్రభో* ? 

      

✍️💐🌹🌷🙏

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.*

 🕉 *మన గుడి : నెం 405*


⚜ *కర్నాటక  : కొప్పర - రాయచూర్*


⚜ *శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.*



💠 కొప్పర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చెట్టు రూపంలో కొలువైన నరసింహ స్వామి కొలువైన విశిష్టమైన ఆలయం. 

నరసింహ స్వామిని ఇంత అద్భుతమైన రూపంలో పూజించడం మరెక్కడా లేదు.


💠 కర్ణాటకలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పురాతన నరసింహ దేవాలయం కనిపిస్తే మీరు ఎప్పటికీ ఆశ్చర్యపోరు. 

ప్రపంచంలో మరెక్కడా కనిపించని ప్రతి దేవాలయం తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. 

నరసింహ ఆలయం విషయానికి వస్తే, నరసింహ స్వామి భక్తులకు కర్ణాటక వైకుంఠం వంటిది, ఎందుకంటే వారు నరసింహ స్వామిని దర్శించి సంతృప్తి చెందుతున్నారు.


💠 కొప్పర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది. 

చెట్టుపై నరసింహ స్వామి కొలువై ఉండటం వల్ల ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. 

ఆ చెట్టు నిండా సాలిగ్రామ శిలలు ఉన్నాయని నమ్ముతారు.


💠 దేవుడు ఇందు గలడని అందు లేడని సందేహం వలదు.. ఎందెందు వెతికిన అందుగలడు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకై..ధర్మ పరిరక్షణకై శ్రీ మహావిష్ణువు రక రకాల అవతారాలు ఎత్తి మానవాళిని, సమస్త భూ మండలాన్ని కాపాడుతూ ఉన్నారని మన నమ్మకం. 

అటువంటి విష్ణువు అవతారల్లో ఒకటి నరసింహస్వామి అవతారం.


💠 తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించుకోవడానికి హిరణ్యకశ్యపుడిని శిక్షించడానికి విష్ణుడు ఎత్తిన అవతారం నరసింహుడు.

ఈ నరసింహ అవతారం ఎంతో విశిష్టతను సంపాదించుకుంది. 

అయితే ఈ నరసింహ స్వామి వృక్ష రూపం లో కొలువైన భక్తుల పాలిట కొంగుబంగారంగా పిలవబడుతూ పూజలను అందుకుంటున్నాడు. ఆ దివ్య క్షేత్రం 5వ శతాబ్దానికి చెందినదిగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది..


💠 నరసింహ భగవానుడు సర్వవ్యాపి. 

అతను ప్రతి అణువులో కూర్చున్నాడు. అదే విధంగా ఇక్కడ ఈ చెట్టుపై నరసింహుడు కొలువై ఉన్నాడు. ఇది చాలా ప్రశాంతమైన ,చిన్న దేవాలయం అందమైన కృష్ణ తీరాన వెలసిన దేదీప్యమానమైన నరసింహ క్షేత్రం.


🔆 *మూలం* 🔆


💠 భృగు ముని వంశానికి చెందిన కర్పర ఋషి అనే గొప్ప ముని ఉండేవాడు. 

కృష్ణా నది ఒడ్డున ఉన్న నరసింహ స్వామిని రోజూ పూజించేవారు. 

అతని సేవకు సంతోషించిన నరసింహ భగవానుడు ప్రతిరోజూ దర్శనం ఇచ్చేవాడు. భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాతే కర్పర ఋషి భోజనం చేసేవాడు.


💠 సత్య-యుగం గడిచినందున, నరసింహ భగవానుడు కర్పర ఋషికి ఇక నుండి తాను భౌతిక రూపంలో కనిపించనని చెప్పాడు. బదులుగా, అతను చెట్టు రూపంలో తనను తాను వ్యక్తపరుస్తాడు. అప్పటి నుండి, నేటి వరకు, నరసింహ భగవానుడు ఇక్కడ చెట్టు రూపంలో కొలువై ఉన్నాడు.

ఈ క్షేత్రం కార్పర నరసింహక్షేత్రంగా కాలక్రమంలో అది కోప్పరాగా మారింది అని తెలుస్తుంది..



💠 మరొక సంఘటన:


 ఒకసారి ఆ చెట్టును నరికివేయబోతుండగా, చెట్టు లోపల నుండి సాలిగ్రామాలతో నిండి ఉందని వారు కనుగొన్నారు. దాని నుండి సాలిగ్రామాలు రాలడం ప్రారంభిస్తాయి. నరసింహ భగవానుడు ఈ వృక్షంలో ఉన్నాడు మరియు తన భక్తులను అనుగ్రహిస్తున్నాడని ఇది నిరూపించబడింది.


💠 షోడశ బాహు నరసింహ లేదా సాలిగ్రామ శిల మీద చెక్కబడిన భగవంతుని పదహారు హస్తరూపం ఆలయంలో నిత్య పూజలు అందుకుంటుంది.


💠 ప్రక్కనే ఉన్న కృష్ణమ్మ తల్లి ఒడి లో స్నామాచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు,రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం...కోరిన కోరికలు నెరవేర్చే తండ్రి నరసింహుడు. 

నరసింహ జయంతికి విశేషామైన పూజ కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి..


💠 కృష్ణ నది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఒక సారి అయిన చూడాలని.. దేవదేవుని అనుగ్రహం పొందాల్సిందేనని స్వామివారిని దర్శించుకున్న భక్తులు చెబుతుంటారు.


💠 వర్షాకాలంలో కృష్ణా నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తే ఆలయం సగం నీటిలో మునిగిపోతుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం బాగుంటుంది మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి సందర్శించడం మంచిది.


💠 సమీప రైల్వే స్టేషన్ రాయచూర్. రాయచూర్ కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలలోని వివిధ ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది

రాయచూరు నుంచి 68 కి మీ దూరం.

ముక్కు తెగినప్పుడు

 ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 


      చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 


          ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.


       ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.


          మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

_ఆగష్టు 11, 2024_*

 🌹    ॐశుభోదయం  ॐ  🌹  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

    *_ఆగష్టు 11, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*శ్రావణ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *సప్తమి*

మర్నాడు తె3.26

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *స్వాతి*

మర్నాడు తె5.33

యోగం: *శుభం* మ2.22

కరణం: *గరజి* మ2.36

&

*వణిజ* రా3.26

వర్జ్యం: *ఉ9.24-11.09.*

దుర్ముహూర్తము: *సా4.44-5.35*

అమృతకాలం: *రా7.55-9.40*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30.*

సూర్యరాశి: *కర్కాటకం*

చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *5.45*

సూర్యాస్తమయం: *6.26*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

దేవాలయాలు - పూజలు 7*

 *దేవాలయాలు - పూజలు 7*




దేవాలయాలు - పూజలు అను శీర్షికన వ్యాస పరంపర కొనసాగుతున్నప్పుడు...

ఇందులోభాగంగా...


దేవాలయాలు, పూజలు మరియు అర్చకులు అను అంశాల ప్రస్తావన వస్తున్నది. *అనాదిగా* అర్చకులు అంటే తొంబది తొమ్మిది శాతము బ్రాహ్మణ వంశీయులు మరియు వారి కుటుంబాలే దేవాలయ అర్చకులుగా, పూజారులుగా స్థిరపడ్డారు. 


శాస్త్ర నియమము ప్రకారము సంస్కారము, పూజాదుల పట్ల శ్రద్ధ, దైవ కార్యములలో నిమగ్నత, విశిష్టతలతో బాటు తప్పనిసరిగా మంత్ర పఠనము, వేద మంత్రార్థములలో నిష్ణాతులైన ఉండవలసి ఉన్నది, ఉంటుంది కూడా. *ఈ వ్యాసాంశము పరిపూర్ణంగా ఉండాలంటే ఇందుకు సంబంధించిన తాజా సమాచారమును కూడా పొందుపరచవలసి ఉంటుంది*.


2018 వ సంవత్సరంలో వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో *అర్చకులు కావడానికి అన్ని కులాల వారు అర్హులే, అవుతే వారు ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాలి*. 


ఇందుకు పూర్వ భూమిక... మద్రాసు హై కోర్టు ఇచ్చిన తీర్పు. హై కోర్టు తీర్పు ప్రకారం *ఆలయ నిగమ నిబంధనలు, పూజా విధానాలలో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా దేవాలయాలలో అర్చకులు కావచ్చును*. 


మద్రాస్ హై కోర్టు తీర్పునకు పూర్వ పీఠిక...తమిళనాడు ప్రభుత్వము హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్న పలు దేవాలయాలలో దళితులతో పాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించుటయే. 


*మాన్యులు విజ్ఞప్తి*.

*దేవాలయము - పూజలు* అను విషయమై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితము మరియు విస్తృతమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత, విశేష్యము గల అంశము గనుక ఈ గ్రూప్ లోని మాన్యులు... 

ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.


ధన్యవాదములు.

*(సశేషం)*

భయానక నరమేధం

 .   😭 బంగ్లాదేశ్ లో మరో భయానక నరమేధం 😭

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

బంగ్లాదేశ్ 🇧🇩 అల్లర్ల సమయంలో మానవతావాది జ్యోతికా-బసు-ఛటర్జీ అతి క్రూరంగా R@p€d మరియు సజీవంగా Bu4n€d : ఎ ట్రాజిక్ టేల్ ఆఫ్ ఫర్గాటెన్ మెర్సీ---

_  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _  _


.       బంగ్లాదేశ్‌కు చెందిన జ్యోతికా బసు-ఛటర్జీ ఒక గొప్ప మానవతావాది మరియు అత్యంత గొప్ప లౌకికవాది కూడా. ఆమె హిందువుల నుండి విరాళాలు సేకరించి ఆఁ నిధుతో అక్కడి ముస్లింలకు విద్య, తిండి మరియు ఆరోగ్య సంరక్షణతో వారి జీవితాల్ని మెరుగుపరచడానికి తన జీవితం మొత్తాన్ని అంకితం చేసింది. ఎవరికి సహాయం అవసరమైనా మొదటగా ఆఁ జ్యోతిక పేరునే అక్కడ ప్రతి ఒక్కరి పెదవులపై నానుతుండేది.


.                కానీ ఇవ్వాళ్ల అదే జ్యోతిక జీవితం ఇవ్వాళ్టి బంగ్లా అల్లర్లల్లో తన నుండి సహాయం పొందిన వారి చేతుల్లోనే అత్యంత నిర్దయగా.. అసహయంగా అంతమైంది. ఆఁ సమయంలో ఆమె దయాదాతృ గుణాన్ని మరియు ఆమె నుండి తాము పొందిన సహాయాల్ని ఆఁ సమాజం అంతా మరచిపోయింది. ఆమెను అత్యంత భయంకరమైన హింసకు గురిచేస్తూ మొదటగా అతి దారుణంగా అత్యంత అవమానకరమైన రీతిలో దుషిస్తూ ఆమెతో అతి బలవంతంగా వేల గుంజీలు తీయించింది, ఆ తరువాత వాళ్లంతా ఆమెను నగ్నంగా చేశారు. ఆపై ఒక ఇరవై మంది పైగా పురుషులు ఆమెను వరుసగా r@p€ద్...  చివరికి అక్కడున్న పురుషులు, మహిళలు మరియు పిల్లలు నవ్వుల కేరింతలతో మరియు వాళ్ళ మతపరమైన నినాదాల మధ్య ఆమె సజీవంగా దహనం చేయబడింది. ఇదే సమయంలో జ్యోతిక యొక్క దీనస్థితిని వివరిస్తూ ఆమె సోదరుడు ఒక వీడియో ద్వారా భారత ప్రభుత్వం నుండి సహాయం కోసం వేడుకుంటు ప్రయత్నం చేస్తున్న వాడిని కూడా ఆఁ తరువాత అదే గుంపు పట్టుకొని సజీవంగా దహనం చేసింది.

(స్వేచ్చానువాదం)


#SOURCE : TWITTER @ X https://x.com/MrNationalistJJ/status/1821917146043093162?t=HKds2NHyohrMfit8XHRPZQ&s=07


#అంకితం : భాధాతప్త హృదయంతో భారతీయ సెక్యూలర్లకు ఈ నా పోస్ట్ అంకితం.


మిత్రులారా 🙏🙏 !

ఇక్కడ అత్యంత దయానక ఈ పోస్టులో కేవలం ఇలాంటి "😥" ఎమోజిలు పెట్టి వదిలేయడం కాకుండా, దయచేసి ఇలాంటి పోస్టుల్ని SHARE చేస్తు వైరల్ చేయండి. ఇలాంటి విషయాలు తెల్సుకొని మనలో మనం ఏడిస్తే ఏం ఫలితం లేదు...  వీటిని మన తోటి నలుగురికి చెప్పి, ఇంకో నలుగురిని జాగృత పర్చుదాం దయచేసి 🙏🙏

పంచాంగం 11.08.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 11.08.2024 Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష సప్తమి తిధి భాను వాసర: స్వాతి  నక్షత్రం శుభ యోగ: గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి ఈ రోజు పూర్తిగా ఉంది 

స్వాతి ఈ రోజు పూర్తిగా ఉంది.


సూర్యోదయం : 06:02

సూర్యాస్తమయం : 06:41


వర్జ్యం : మధ్యాహ్నం 12:02 నుండి 01:49 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 05:00 నుండి 05:50 వరకు.


అమృతఘడియలు : రాత్రి 10:43 నుండి 12:30 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

హిందువుకు నరకపు నేలది*

 *ఇపుడు హిందువుకు నరకపు నేలది*


చీమునెత్తురు లేదండీ మనకు...

సిగ్గుశరం లేదండీ మనకు...

చచ్చిన పీనుగంటి సాలేగాళ్ళు 

నమాజే దేవుడన్న నేరగాళ్ళు

నడివీధిలో నగ్నంగా నడిపిస్తే

అక్క చెల్లితల్లినేమో చెరిపేస్తే

హిందువైనా పాపానికి రాబందులు 

హింసపెట్టి చంపుతుంటే

చూస్తూ నిలబడ్డా ప్రపంచ హిందువులు...

సందేహం లేదు సన్నాసి చవటలు...


మా అన్నవు నువ్వంటే అత్యాచారాలు చేయబట్టే...

మా తమ్మీ నువ్వంటే తలమీద తన్నబట్టే...

మనం మనం ఒకటంటే మందిరాలే కూల్చబట్టే...

ఇంత జరుగుతున్న 

సెక్యులరు సాహితీ కలాల నుంచి అక్షరాలు దేవుడెగురు అయ్యోపాపమన్నా జాలీ మూత్రబిందువైనా కారకుండా ఇంకబట్టే...

*థూ... మీ బ్రతుకుల మీద మన్ను బొయ్యా...*


అల్లరి చేష్టలతో

ఆకాతాయి మదాంగా కత్తులతో

నడివీధిలో బట్టలిప్పి 

కుక్కలోలే మీదదూకి దేహాలను చించుతుంటే...

ప్రాణాలను చంపుతుంటే...

చలించలేని మనిషి కన్నా మృగాడు ఇంకెవడయ్యా...

శాంతి శాంతి అనుకుంటూ

సర్వేజన సుఖమంటూ

చచ్చు చెదలపురుగుల చేతిలో చితికిపోతున్నది హిందువు చూడయ్యా...


చెవులు మూగబోవెందుకో

కళ్ళ చూపు చావదెందుకో

బాయ్ బాయ్ అన్నోడినే బలిచేసే

ఈ నకరాల నేరాలను మెచ్చుకోడు ఆ అల్లా...


దేశాన్నే దిశమార్చి

శవాల కుప్పగా మార్చి

సనాతనంపై శవాలను చల్లుతున్న ప్రతి పేలానికి 

ప్రపంచమే వేయాలి శిక్ష...


ఐక్యరాజ్య సమితి నీ ఏడుపు సరిపోదు

తిరగబడ్డ ఓ హిందువు నీ కోపం సరిపోదు

పడ్డచోటే నిలబడు 

పడగొట్టిన గొట్టపు ముఖాలపై ధైర్యంగా బలపడు...

అధర్మాన్ని ఆపా ప్రతిఘటనా ప్రమిదై ఎగబడు...


ప్రపంచ మనోజాలమా

జరుగుతున్న ఘోరాలకు ఘోరీ కట్టి

హిందువైన ముస్లిమైన క్రిస్టియనైనా 

ఏ జాతి వాడైనా 

మనుగడను గౌరవించు...

అప్పుడే శాంతి క్షేమం...


ఏ దేవుడు చెప్పలేదు కొట్టుకుని చావమని

ఏ దేవుడు చెప్పలేదు బలహీనుడిని చంపమని

ఏ గ్రంథం చెప్పలేను పరాయివాణ్ణి అణచమని

ఓ మనిషి ఓ వెర్రి మనిషి...

నీది ఏ మతమైనా...

నీది ఏ జాతైనా...

నీది ఏ కులమైనా...

ప్రతివారు ప్రతిఘటించాల్సిన సమయమిది...

మనిషిగా నిలబడాల్సిన వేళ ఇది...

దయచేసి దయ ఉంచి ధర్మానికి కర్రవ్వండి...


*ఓ హిందువుగా కంటతడితో *