11, ఆగస్టు 2024, ఆదివారం

నిత్యపద్య నైవేద్యం-1576 వ రోజు

 నిత్యపద్య నైవేద్యం-1576 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-211. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

గాంధర్వం చ కవిత్వం చ 

శూరత్వం దానశీలతా l

అభ్యాసేన న లభ్యంతే 

చత్వారస్సహజా గుణా:ll


తేటగీతి:

మధుర సంగీతము, మధురమైన కవిత,

తనరుచున్న శూరత్వము, దానగుణము,

నాల్గివి సహజగుణములు నరులకెల్ల 

జన్మతో వచ్చు, నేర్వగ సాధ్యపడదు.


భావం: సంగీతం, కవిత్వం, శూరత్వం, దానగుణం.. ఈ నాలుగూ సహజ గుణములు. ఇవి పుట్టుకతో రావలసినవే గానీ నేర్చుకుందామంటే అలవడునవి కావు.

కామెంట్‌లు లేవు: