11, ఆగస్టు 2024, ఆదివారం

ఆత్మజ్ఞానం

 *ఆత్మజ్ఞానం గురువునుండి* *మాత్రమే లభిస్తుంది* 

 

మానవ కార్యకలాపాల లక్ష్యాలు నాలుగు : విధులను నెరవేర్చడం, సంపద పెంచడం , కోరికల నెరవేర్పు(చివరికి), మోక్షాన్ని సాధించడం. వీటిలో మోక్ష ప్రాప్తి శ్రేష్ఠమైనది. ఆత్మజ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుంది. ఈ విషయం శృతిలో చాలా స్పష్టంగా చెప్పబడింది

 అంటే ఆత్మసాక్షాత్కారం తర్వాతే మరణానికి మించిన స్థితి లభిస్తుంది. ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం కేవలం గురువు నుండి మాత్రమే లభిస్తుంది. 

తనకు గురువు ఉన్నవాడే నిజమైన పురుషుడని శృతిలో కూడా చెప్పబడింది.

 గురువు ఎవరు? అనే ప్రశ్న ప్రతీ వారికీ వస్తుంది. శిష్యునియొక్క అన్ని అధర్మాలను రూపుమాపి , తన శిష్యుని ధర్మ మార్గమనే మంచి జీవితంలో నిమగ్నమయ్యేలా చేసే వాడే గురువు అని సమాధానం. 

అసలైన గురువు యొక్క గుణములు శ్రీ శంకర భగవత్పాదుల బాటలో పూర్తిగా కనిపించాయి. అంతర్లీనంగా అన్ని శాస్త్రాలలో దాగి ఉన్న తత్వం ఆయనకు తెలుసు. సమస్త మానవ జాతి శ్రేయస్సు కోసం ఆయన కృషి చేశారు. ఎన్నో శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆయన ప్రసాదించిన వేదాలకు సంబంధించిన మార్గదర్శకాలు సూర్యకాంతి వెలుగుగా నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాయి.

 శ్రీ శంకరులు కూడా ఉపనిషత్తులలో అద్వైతాన్ని ప్రబోధించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుడు వివరించిన అద్వైత తత్త్వమే ఈ తత్వమని పండితుల ఏకాభిప్రాయం. కాబట్టి మనమందరం శ్రీ శంకర భగవత్పాదులు , విద్వత్స్వరూపి, ప్రేమ సాగరుడు అయిన వారిని నిత్యం పూజించాలి. 

 కష్టపడే వారికి మోక్షం! భక్తి మార్గం కోరుకునేవారికి పూజాఫలం తప్పక లభిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక ఋషులను తప్పక పూజించాలని శ్రుతి చెబుతోంది. భక్తులందరికీ శ్రీ శంకర భగవత్పాదుల ఆశీస్సులు లభించుగాక!  


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: