7, జూన్ 2021, సోమవారం

ఆకలి విలువ.*.

 🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

          *ఆకలి విలువ.*. 

🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

*విజయవాడ, బంధువుల పెళ్లికని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో  ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరూ.......*


*టిఫిన్ సగం తిని, సగం  వదిలేసి  మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు.   మిగిలి పోయిన టిఫిన్  చూసి నా మనసు కలుక్కుమంది.  ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా...... మొత్తం తింటారనుకున్నా. కానీ ఇలా వదిలేస్తారనుకోలేదు.*


*దారి మధ్యలో ఒక చోట పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి  ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద  ఉప్పు చల్లి  అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు.  ఇక్కడా అదే తంతు. అందరూ తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది.  మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను.  వద్దని వారిస్తే పిసినారి పైసా పోనీయడు, తాను తినడు, తినేవారిని  తిననీయడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను.*


 *పెళ్ళికి వెళ్ళాము. అక్కడ అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది.* *వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు.* 


*కూల్ డ్రింక్ తాగిన  వారిలో చాలా మంది సగం వదిలేశారు. షుగరు ఉన్నవారు కూడా ఎవరికీ తమ వ్యాధి తెలియకూడదని,  కూల్ డ్రింక్ తీసుకున్నారు. కానీ త్రాగకుండా ప్రక్కన పెట్టారు. మేము పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము.*  *ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పట్టింది.  నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది.  భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే  కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు.*


*జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు ,తినలేదు ,ఇప్పుడు  తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో,ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడంలేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది.  అక్కడ జరుగుతున్న తతంగ మంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి భోజనానికి వెళదామని పిలిచింది. చేతిలో పళ్లెం దానినిండా పదార్థాలు.* *కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు.  నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను.*


*అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను.  నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన అపరాధ భావనా కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది.* *తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను.*


*ఏమైంది నాన్నా? అని*

*పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది.   నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే  వందరూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను.* *ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు.*

*ఏమి మాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా?*


*గాలిగాని సోకిందా, దెయ్యంగానీ పట్టిందా? విసురుగా చూసి వంద రూపాయలు నా జేబులో కుక్కింది.*


*ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంత కోపం వచ్చింది కదా....?   పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు వంటి మీరు వదిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా?   మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు. నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే  మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా? వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటూ .... మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా  చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి.*

*ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను.*

*అందరూ ఆలోచనల్లో పడిపోయారు. "మార్పు కి బీజం పడినట్లే.......*

*ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకి వస్తామా అనిపిస్తుంది..*.

*ఇకనుండి నేను ఆహారాన్ని వృధాకానివ్వను ...అని మనస్సులో నిర్ణయించుకున్నాను..*

*మరి మీరో....???????👈👈👈👈👈👈👈👈👈👈*

🍛🍛🍛🍛🍛🍛🍛🍛🍛

*ఆకలి విలువ తెలిసినవారు, ఆహారాన్ని వృధాచేయరు. అలా చేస్తే ఆరుగాలం శ్రమించిన రైతు కష్టాన్ని, భూమాతను అవమానించినట్లే*

*గొప్పల కోసం, స్థాయిని, స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాలు వండి వార్చి వృధాచేయకండి. కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాధల, పేదల, అన్నార్తుల కడుపులు నింపవచ్చు. వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మన పిల్లలకు శ్రీరామరక్ష. మిగిలితే వృద్దాశ్రమాలకూ, అనాధ శరణాలయాలకూ పంచండి. లేకుంటే ప్యాకెట్లు చేసి రోడ్డు ప్రక్క అన్నార్తులకు పంచండి. మారండి. తమను తాము ఈ విషయంలో మార్చుకునే ప్రయత్నం చేసిన వారికి సహాకరించండి*


*సర్వేజనా సుఖినోభవంతు*

🙏🙏🙏🙏🙏🙏🙏

దేవాలయాలలో వసతి

 ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది 

దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4

ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis

రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5

జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe

శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS

గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M

ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P

పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW

పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj

తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD

శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

కాశి గురించి  : https://goo.gl/DZzKa1

రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424

అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE

మదురై గురించి : https://goo.gl/1Ntthd

శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo

కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v

ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y

మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV

భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp

టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

తెగిన పేగు* కథ

  


*తెగిన పేగు*  పిశుపాటి ఉమా మహేశ్వరరావు


కన్యాశుల్క దురాచారానికి బలైపోయి, ఉన్న ఊరుని, కన్న వారినీ వదులుకుని, స్వంత ఇంట్లో, పరాయి పంచన బతికినట్టు బతికిన ఒక స్త్రీమూర్తి వ్యథ......ఈ కథ!




సుబ్బారావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి, కాస్త స్థిమిత పడ్డాడో లేదో 

అతని భార్య సావిత్రి వచ్చి, అతనితో నెమ్మదిగా, 

"అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు. ఇందాకటి నుంచీ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు” అంది. 

‘ఎందుకు?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు.  ‘ఏమో’ , అన్నట్టు పెదవి విరిచింది సావిత్రి. 

సుబ్బారావు తల్లికి ఈమధ్య సుస్తీ చేసి, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సాధారణంగా అతను ఆఫీసు నుంచి వచ్చాకా, స్నానమూ ,భోజనమూ అయ్యాకా వెళ్ళి, కాసేపు ఆవిడ పక్కన కూచుని మంచీ చెడూ మాట్లాడి వస్తాడు. 

ఆవేళ– సాయంత్రం నుంచే “అబ్బాయి ఇంకా రాలేదా?” అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి.  అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడడానికి తల్లి ఆతృత పడుతున్నట్టు చెప్పింది సావిత్రి. ఎందుకో అని అతను భోజనం కూడా చెయ్యకుండా తల్లి దగ్గరకెళ్లేడు.


“ఎలా ఉందమ్మా ఒంట్లో?” అడిగేడు సుబ్బారావు, తల్లి పక్కనే మంచం మీద కూచుంటూ. 

“ఎంతసేపైందిరా నువ్వింటికొచ్చి?” అందామె సమాధానంగా.  తల్లి గొంతుకెందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి. 

"ఇప్పుడే పది నిముషాలైంది…. నువ్వు మందు పుచ్చుకున్నావా….?” అన్నాడు. “ఊ….” అని ఊరుకుంది. తరవాత ఏమీ మాట్లాడలేదు. తల్లి ఏమన్నా చెబుతుందేమోనని ఎదురుచూసి, ఒక నిమిషం పోయాకా.., "ఎందుకో అడిగేవుట….” అన్నాడు సుబ్బారావు. ఆవిడ ఏమీ జవాబివ్వకుండా అతని మొహంలోకి మార్చి మార్చి చూస్తోంది. తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ , 

"ఏమన్నా కావాలా…? అన్నాడు మృదువుగా. ఒక్క క్షణం ఆగి  మెల్లగా, “నువ్వు దక్షిణదేశ యాత్ర కోసం సెలవు పెట్టేవు కదా…. అందామె. 

“అవును” అన్నాడు సుబ్బారావు. అతను లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరో పదిహేను రోజులలో పిల్లలకి సెలవులివ్వగానే బయల్దేరబోతున్నాడు.


"కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గిర ఊళ్ళో…. అదే…మా ఊరినీ…మా ఇంటినీ ఓసారి చూపిస్తావా…?” అంది ఆమె. సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. 

తనతండ్రి ఆరోజుల్లో ఈమెని అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడన్న విషయం అతను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా ఒక్కక్షణం ఆ విషయం గురించి అనుకోవడం తప్ప, తన తల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళిందీ లేదు.., ఎవరూ అక్కణ్ణుంచి వచ్చిందీ లేదు. ఆమె ఇక్కడ జీవవాహినిలో కలిసిపోయి , తెలుగింటి ముత్తైదువుగా మారిపోయిన డెబ్భై ఏళ్ళ తరవాత…..ఇప్పుడు ఇంత అభిమానంగా తూచి తూచి, ఆగి ఆగి అడుగుతుంటే…., సుబ్బారావు విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు.


యాభై అరవై ఏళ్ల క్రితం వరకూ కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది. బోలెడు డబ్బుపోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి, పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని చౌకగా కొని తెచ్చుకునేవారు. నాగలక్ష్మి ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇల్లాలుగా ఆంధ్రదేశం తీసుకురాబడింది.  

వచ్చేకా ఆమెకు ఇదే లోకమైపోయింది. ఒక్క తాళిబొట్టు--పుట్టింటి మీదా, తోబుట్టువుల మీదా, బంధుమిత్రుల మీదా ఆమెకున్న బంధాల్నీ, అనుబంధాల్నీ తెంచేసింది. అక్కడినుంచి మళ్ళీ వచ్చి చూసినవారూ లేరు. ఇక్కడినుంచి ఈమెను తీసుకెళ్ళి చూపించినవారూ లేరు. 

వయసొచ్చేకా , ఎప్పుడన్నా ఒక్కసారి పుట్టింటివేపెళ్ళి చూసొద్దామని ఆమెకు కోరిక కలిగినా, భర్త హయాంలో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు. ఆ తర్వాత ఈ సంసారంలో పడి ఆమె తన జన్మ సంగతే మర్చిపోయింది. 


భర్త పోయాకా కొడుకు తనని బాగానే చూసుకుంటున్నాడు. ఇన్నాళ్ళకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణదేశ యాత్ర చెయ్యబోతున్నాడు. కొంచెం అటూ ఇటూగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు. అందుకే, ఎన్నేళ్లుగానో నిద్రాణమైన కోరిక ఆమెలో మళ్ళీ మేలుకుంది.

"అహ…. నీకేమీ ఇబ్బంది లేకపోతేనే…” అందావిడ మొహమాటంగా. 

ఆ మాటతో చలించిపోయాడు సుబ్బారావు. ఆ ఒక్కమాటలో అతనికి అనేక అర్థాలు గోచరించాయి. 

తను కేరళ ఆడపడుచయి ఉండి, తమ పుట్టింటివారి దారిద్ర్యంవల్ల మరో దేశం వారికి అమ్ముడుబోయి, తన వారికి దూరంగా వచ్చేసి, ఈ రోజుకి కూడా పరాయి వారి పంచన బతుకుతున్నట్టు భావిస్తూ , కన్నతల్లి అధికారం లేదనుకుని ఎంతో మొహమాటంగా తనవారిని చూడాలని ఆమె మనసులో మాటని వెల్లడించిన తీరు…. సుబ్బారావుని కదిలించివేసింది. 

ఇన్నేళ్ళకి తల్లి ఋణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంతో పులకరించి పోయాడు. 

"వెళ్దామమ్మా….. తప్పకుండా తీసుకెళ్తాను. ఎంతో విశ్వాసంగా చెప్పేడు సుబ్బారావు. ఆ మాటకి ఆవిడలో కలిగిన ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయి, అలా మౌనంగా ఉండిపోయింది.


ఇక ఆ మర్నాటి నుంచీ తన ఆఫీసులో కేరళా వెళ్ళి వచ్చిన వాళ్ళందర్నీ పాల్ఘాట్ వెళ్ళే రూటు గురించీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించీ వాకబు చెయ్యడం మొదలెట్టేడు సుబ్బారావు. పెద్దగా ఎవరూ సమాచారం ఇవ్వలేకపోయారు కానీ, ఒకరిద్దరు మాత్రం,

"ముందు పాల్ఘాట్ వెళ్లు….. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్లను గురించి అక్కడ వాకబు చెయ్… ఏదో ఒక ఆధారం దొరక్కపోదు.” అన్నారు. 


సుబ్బారావుకి ఈ సలహా బాగానే ఉందనిపించింది. ఆ విధంగానే ముందు మద్రాసు, శ్రీరంగం, మైసూరు, బెంగుళూర్లు కానిచ్చుకుంటూ…రామేశ్వరం , కన్యాకుమారీలు కూడా చూసేసి, తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాటుకి చేరుకున్నారు.

వచ్చాడే కానీ స్టేషనులో దిగేకా ఎక్కడికెళ్ళాలో, ఏం చేయాలో పాలుపోలేదు సుబ్బారావుకి. నాగలక్ష్మికి తమ ఊరు పాల్ఘాటుకి అతి దగ్గరలోనే అని తెలుసు. ఆమె భర్త కూడా అప్పుడప్పుడు ఆ ఊరి పేరు చెబుతూండేవాడు. కానీ ఇప్పుడు వయసు పైబడ్డం వల్ల ఆమెకాపేరు నోట్లో ఆడుతోన్నట్టుంది కానీ, పైకి చెప్పలేక పోతోంది. 

సుబ్బారావు క్షణం ఆలోచించి, నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గిరకి పోయి, తానున్న పరిస్థితి వివరించి, అతని సాయంతో పాల్ఘాట్ కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి, తల్లికి ఒక్కొక్కటీ చదివి వినిపించాడు.  'వేజ్ఞప్పోడి’ అన్న పేరు వింటూనే , “ఆ…అదే..!” అందావిడ ఆనందంగా. 


సుబ్బారావు ఆ ఊరి గురించి బుకింగ్ క్లర్క్ ని మళ్ళీ అడిగేడు. ‘వేజ్ఞప్పోడి’ అయిదు మైళ్ల దూరం కూడా లేదనీ, ఆ ఊరు పోడానికి ప్రైవేట్ బస్ సర్వీసు తప్ప వేరే మార్గం లేదనీ చెప్పేడు. భాష చాలా ఇబ్బంది పెట్టినా, అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్సుని పట్టుకోగలిగేడు సుబ్బారావు.

వేజ్ఞప్పోడిలో కుటుంబంతో సహా దిగేడు సుబ్బారావు. అక్కడ పెద్ద సమస్య ఎదురైంది సుబ్బారావుకి. ఆ కుగ్రామంలో ఇంగ్లీషు ముక్క వచ్చినవాడు ఒక్కడూ తారసపడలేదు అతనికి. 

మగాళ్లు అడ్డకట్టు గళ్ళలుంగీలతోనూ, ఆడాళ్ళు పైటలు లేకుండానూ తిరుగుతున్నారు. గంటన్నర తంటాలు పడగా ఇంగ్లీషు తెలిసిన ఒక ముసలాయన దొరికేడు. ఆయన రిటైర్డ్ టీచరుట. సుబ్బారావు తన విషయం వివరించేడు. ఆయన అంతా విని, సానుభూతిగా ఆమెవంక చూసి పెదవి విరిచాడు. “ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం” అని చెప్పేడు.

ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్న వారేనట! ఆ రోజుల్లో ఉన్నంత కాకపోయినా , ఈనాటికీ అదే పరిస్థితిట!! ఒక నిమిషం ఆగి మళ్లీ ఆయనే ,  "కనీసం ఆ ఇంటి ఆనవాలైనా చెబితే, ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకబు చేయించచ్చు.” అన్నాడు. 

సుబ్బారావు తన తల్లిని మరికొన్ని వివరాలు అడిగేడు. ఎంత ప్రయత్నించినా అమెకేమీ గుర్తు రాలేదు. ఇంతలో హఠాత్తుగా ఆమెకి భర్త చాలా సార్లు చెప్తూండే ,  "మీ ఇంటి పక్క గుళ్ళో నాగమల్లి పువ్వులేరుతూండగా నిన్ను మొదటిసారి చూశాను.” అనే మాట జ్ఞాపకానికొచ్చింది. వెంటనే ఆ గుడి సంగతీ, నాగమల్లి చెట్టు సంగతి కొడుక్కి చెప్పింది. ఆ పెద్దాయన నవ్వేశాడు. "గుళ్ళంటే.. చిన్న ఊరైనా, చాలా గుళ్లున్నాయి. అయినా చూద్దాం…. పదండి” అంటూ దారి తీశాడు. 


ఆయనకి కూడా చాలా కుతూహలం కలిగింది. రెండు మూడు గుళ్ళు వెదికేకా నాలుగో గుడి నిజమైంది. దాన్ని చూస్తూనే ఆవిడకి లీలగా ఏదో పునర్జన్మ గుర్తుకొచ్చింది. గుడికి ఎడంపక్క ఇంటివేపు అనుమానంగా చూసి, అదే అయి ఉండాలి అంది. కానీ అది పెంకుటిల్లని గుర్తు. అదిప్పుడు డాబా అయింది.  "కనుక్కుందాం ఉండండి” అని ఆయన లోపలికెళ్లేడు. సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళేరు. 

లోపల మండువాలో ఓ ముసలాయన వాలుకుర్చీలో పడుకుని, రేడియో వింటున్నాడు. ఈ మాస్టారు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడేరు. ఆ ముసలాయన లేచి నించుని ఓసారి సుబ్బారావు తల్లికేసి చూశాడు. తనకో తమ్ముడుండాలి. బహుశా ఇతనేనేమో…. పోలికలున్నాయి. ఆవిడలో ఏదో నమ్మకం బలపడసాగింది. ఆ ఇంటి వాతావరణం చూస్తోంటే.., అప్రయత్నంగా ఆవిడ నోటినుంచి ‘ అప్పు’ అన్న మాటొచ్చింది. 

"అవును…నేనే, నన్ను ఇంట్లో అందరూ ‘అప్పు’ అనే అంటారు. 

అప్పుకుట్టి!” అన్నాడాయన మలయాళంలో. మాస్టారు ట్రాన్సులేట్ చేశారు. 

ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ పోగయ్యేరు. వింతగా చూడసాగారు.

నాగలక్ష్మికేదో ఉన్నట్టుండి అనుమానమొచ్చి మండువా మధ్యకి వెళ్లి , ఇక్కడ ఉయ్యాలా ఉండాలి..” అంది. 

"ఓసారి దూలం విరిగింది… అప్పట్నుంచీ తీసేశాం” అన్నాడాయన. ఆవిడకి ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టగా పిచ్చెక్కినట్టు తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరిగింది. దొడ్లో బాదం చెట్టూ, పున్నాగ చెట్టునూ గురించి అడిగింది. ఇలాగే ఏవేవో అడిగింది. చూసేవాళ్ళకి ఏదో పునర్జన్మ తంతులా అనిపించింది. ఓసారి తుఫానుకి పెంకుటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా వేయించిన సంగతి చెప్పేడాయన. 


ఆయనకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగార్ని ఎవరికో అమ్మేసారని వాళ్లూ వీళ్లూ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆమెలో తన పోలికలు కూడా లీలగా అగుపడ్డాయి. 

"అమ్మా.. నాన్నా…? ” అడిగిందావిడ. వాళ్ళు పోయి చాలా కాలమైందన్నాడాయన. నలుగురక్కలూ , ఇద్దరన్నలూ కూడా కాలం చేసినట్టు చెప్పి, ఒక తమ్ముడు మాత్రం వేరేచోట ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు. 

తనకే డెబ్భైయ్యేళ్లు దాటినప్పుడు…, తన పైవాళ్ళింకా ఎలా ఉంటారు? అనుకుంది ఆమె. ఇంతమందీ పోయారని తెలిసి ఆమెకు దుఃఖం వచ్చింది. కాసేపు పోయాక ఆమె ఓ గదిలోకి వెళ్లి, అక్కడ గోడమీద ఒక గూడు కోసం వెతుక్కుంది. అది కనబడగానే అక్కడే కూచుని భోరుమని ఏడవసాగింది. చిన్నప్పుడు తను ఆ గూట్లో బొమ్మలు పెట్టుకుని ఆడుకునేది. ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చెయ్యి కాలింది. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది. 

తను కూడా పుట్టినచోటే మెట్టి, గిట్టే భాగ్యానికి నోచుకుంటే….నా అన్న ప్రతివారికీ దూరమై, మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా..! అనుకుంది. 

గర్భ దరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవడమే సాంఘికనీమమేమో!! అని దుఃఖించింది.


చాలా చిన్న గ్రామమేమో…వీళ్ళ సంగతి ఇట్టే ఊళ్ళో తెలిసిపోయింది. కొంతమంది ఇంటిదగ్గర పోగయ్యేరు. మాస్టారు బాగా ఆలోచించి, ఆ ఊళ్లోకల్లా పెద్దవాడైన ఓ తొంభై ఏళ్ళ వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకీ వీళ్లకీ పెళ్ళి బేరాలు కుదిర్చి, పావలో పరకో సంపాదించుకునేవాడు. ఆయన వచ్చి, ఆనీ ఆనని చూపుతో ఆవిడని పరీక్షగా చూశాడు. బాగా జ్ఞాపకం తెచ్చుకుని….,

"నువ్వటే అమ్మా నాగలక్ష్మీ..” అంటూ ఆప్యాయంగా పలకరించి దగ్గరకి తీసుకున్నాడు. ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని భావం ఆమెకి అందింది.  

"చిన్నప్పుడు దీన్ని ఈ చేతుల్తోనే ఎత్తుకున్నాను. ఈ చేతుల్తోనే ఒక తెలుగాయనకు నూట అరవై రూపాయలకి అమ్మేను…” అంటూ ఏవేవో చెప్పేడు. మాస్టారు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పేరు. 

ఆ ముసలాయన అప్పుని దగ్గరకి పిల్చి, “ఇదిగోరా నాన్నా మీ అక్కయ్య నాగలక్ష్మి. నీకు ఊహ తెలిసేసరికే అది ఈ ఇల్లు, ఊరు దాటి వెళ్లిపోయింది.” అంటూ ఇద్దరి చేతులూ కలిపేడు. 

అంతవరకూ పరాయి వాళ్ళల్లా ఉన్న వాళ్ళిద్దరి మధ్యా ఆ క్షణంలో అక్కా తమ్ముళ్ళ మనే భావన పొంగిపొర్లింది. ఒకరి భాష ఒకరికి రాదు. ‘అక్కా’ అనలేడాయన. ‘తమ్ముడూ’ అనలేదామె. కానీ ఇరువురి చేతులూ మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి. ఇద్దరి కళ్లూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మూగభాషలోనే వాళ్ల అనుభూతుల్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. మధ్య మధ్యలో ముసిలాయన ఏమేమో చెబుతున్నాడు. మాస్టారు ఇంగ్లీషు లోనూ, సుబ్బారావు తెలుగు లోనూ అవస్థ పడుతున్నారు.


అందరూ వింతగా చూస్తున్నారు– ఈ అపూర్వ సంగమాన్ని! కాసేపాగి ఒక్కొక్కరూ క్రమంగా కదిలేరు. భగవంతుడి లీలలు చిత్రం అనుకుంటూ అంతా ఆయన నెత్తిమీదకి తోసేసేరు. నీ మరదలు ఇదిగో అంటే.. నీ మేనల్లుడిడిగో అంటూ ఏవేవో పరిచయాలు అయ్యాయి. తమ్ముడి భార్య కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ కాఫీ వీళ్ళెవరికీ రుచించలేదు. కానీ ఏదో ఆత్మీయత వెల్లివిరిసింది. 

నాగలక్ష్మి అడగదల్చుకున్నవేవో అడిగింది. తమ్ముడు చెప్పగలిగినవేవో చెప్పేడు. మాస్టారు దుబాసీలా బాగా సహకరించారు. కాసేపటికి తనివితీరా మాట్లాడ్డం అయిపోయింది. అందరూ బొమ్మల్లా నిలబడ్డారు. మళ్ళీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది.

వాళ్ల పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండ తగ్గదిగా కనిపించలేదు. 

అక్కా, తమ్ముడూ ఇద్దరూ పెద్దవాళ్లే. నేడో రేపో రాలిపోయేట్టున్నారు. ఆ తర్వాతి తరాలు వేరయిపోయాయి. వందల మైళ్ళ దూరంలో నివాసం. చీటికీ మాటికీ వచ్చిపోయే వ్యవహారం కాదు. భాషా సంప్రదాయాలు వేరు. కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు. ఇప్పుడు కలిసే బంధమూ కాదు…కొనసాగే అవకాశమూ లేదు. 

కానీ నాగలక్ష్మి వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ ఓ మూడుసార్లు తిరిగి, అయిన వాళ్ళందర్నీ తనివితీరా అక్కునచేర్చుకుని కాలు బయట పెట్టింది. బస్సు ఊరి పొలిమేర దాటేకా ,  ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించకు దేవుడా' అని మొక్కుకుంది నాగలక్ష్మి.

                           ******



*ఈ కథ రాసి దాదాపు 37 సంవత్సరాలు దాటింది.*  అప్పటికి యాభై 

అరవై ఏళ్ల క్రితం నుండి మన సమాజంలో పాతుకుపోయిన ఇలా ఆడపిల్లని కొనుక్కోవడం/ అమ్ముకోవడం అనే దుష్ట సంస్కృతిని ప్రతిబింబిస్తూ రచయిత ఈ కథను రాశారు. 

అంటే ఆయన కథ రాసే సమయానికి సకృత్తుగా నైనా ఈ పాల్ ఘాట్ కుటుంబాలు, అమ్మేసిన ఆడవాళ్ళు మన సమాజంలో ఉన్నారన్నమాట. కథలో సుబ్బారావు కుటుంబం పాల్ఘాట్ వెళ్ళినప్పుడు,

"ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికీ అదే పరిస్థితి” అని మాస్టారు చెబుతారు. ఇది అత్యంత విషాదకరం!


అంగడిలో సరుకుని అమ్మినట్టు ఆడపిల్లల్ని …పెళ్ళి పేరిట ముక్కూ-మొహం, భాష, సంస్కృతి…వీటితో ఏమీ సంబంధం లేని కుటుంబాలకి ఏదో వెలకట్టి అమ్మేయడం పరమ నికృష్ట కార్యం కాదూ..! 

పాపం అలా వచ్చిన ఆడపిల్లలు-- తాము ఇక్కడి వాళ్ళం కాదనీ , పరాయి పంచన బతుకుతున్నామనే బానిస భావంతోనే ఉండిపోయేవారు. 

ఏళ్ళ తరబడి సంసారం చేసి, పిల్లల్ని కని, మనవల్ని ఎత్తినా సరే! 

ఎంత కటువుగా ఉన్నా ఇది చారిత్రక సత్యం! 


నాగలక్ష్మిలో చెలరేగిన ఈ భావాల్ని రచయిత చాలా బలంగా చెప్పేరు. కడుపున పుట్టిన (ఆడ) పిల్లల్ని…తమ దారిద్ర్యం కొంతైనా తీరుతుందని ఖరీదు కట్టి అమ్మేయడం ఇంకా ఇప్పటికీ కొన్ని జాతుల్లో ఉన్న దుర్భర పరిస్థితి. మానవత వెల్లివిరిస్తే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రాదు.


ఇక మనిషికి స్వంత ప్రాంతం మీదా, పుట్టిన భూమి మీదా ఎంత మమకారం!  అక్కడ తను ఆట్టే కాలం ఉండకపోయినా, ఆ ఊరు, ఆ పేరూ వింటే ఎంతో పులకరించి పోతాడు. 

జీవితంలో ఒక్కసారైనా ఆ నేల, ఆ ఇల్లు, ఆ మనుషుల్నీ చూసుకోవాలని ఉవ్విళ్లూరిపోతాడు. ఏళ్లు గడిచిపోయినా, నాగరికత మారిపోయినా , తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశం, తాత తండ్రుల బతికిన చోటు ఓసారి చూడాలని తహతహ లాడిపోతాడు. 

మాతృభూమిపై ఉండే అటువంటి మమకారం ఎంతటిదో హృద్యంగా చెప్పిన కథ ఈ 

 *తెగిన పేగు*.


ఇది చదివి తీరవలసిన కధ 🙏🙏

మంచి పదాలు, చెడు అర్థాలు*

 *మంచి పదాలు, చెడు అర్థాలు*


ఆధునిక కాలంలో భగవంతునికి, పూజకు, ఆరాధనకూ ఆధ్యాత్మిక అంశాలకు చెందిన *హిందూ ధార్మిక పదాలను తెచ్చి అతి నీచమైన అర్థాలలో ప్రయోగించే ఒక అధమమైన ప్రక్రియ మన లోకి ప్రవేశించింది*. ఎంతో చదువుకున్నవారు, తమ ధర్మాన్ని ప్రేమించేవారు కూడా తమకు తెలియకుండానే, ఆ పదాలను వాడేసే విధంగా జన బాహుళ్యం లోనికి సినిమాల ద్వారా, ఇతర మీడియా విధానాల ద్వారా, ప్రచారసాధనాల మాధ్యమంగా సామాన్యులకు చొప్పించటం జరిగింది .... ఇట్ల పదప్రయోగం చేయటం మన ధర్మానికి అవమానకరమే కాక, భాషకు ఉన్న సాహిత్య, ఆధ్యాత్మిక, ధార్మిక విలువలను దిగజార్చే ప్రయత్నం కూడా అవుతుంది .... ఆధ్యాత్మిక బలం కలిగించి, సంస్కృతికి దర్పణాలైన చక్కని భావాలను ఇట్ల నీచమైన, హేయమైన అర్థాలలో వాడటం అనేది ఒక పైశాచికత్వమే అనిపిస్తుంది ....


చక్కని తెలుగు పదాలలో చేరిన ఈ భావ కాలుష్యం గుర్తించి, ఇప్పటికైనా తీసేసే ప్రయత్నం జరగాలి .... కనీసం కొందరైనా ఆ పదాల వాడకం గురించి తెలుసుకుని, ఇతరులకు వివరణతో సహా అందించి, ఆ ప్రయోగాలను వాడటం తప్పు అని, వారి చేత కూడా మాన్పింప చేయవలసిన అవసరం ఉంది .... నాకు అందిన కొన్ని ప్రయోగాలు - వాటి అసలు అర్థం, కావాలని చెడిపి, వక్రీకరించిన అర్థం ఇక్కడ ఇస్తున్నాను ....


1. భాగవతం - భాగవతమంటే భగవంతునికి, ఆయన భక్తులకు చెందిన చక్కని కథలు, ఆధ్యాత్మిక అంశాలకు నెలవు ... ఈ పదాన్ని ముఖ్యంగా ‘నేరం, జుగుప్స కలిగించే ఉదంతం, విషయం’ అని చెప్పటానికి వాడుతున్నారు.“....ఈ భాగవతం బయటకు వచ్చింది”. “ఎన్నాళ్ళుగా సాగుతొంది ఈ భాగవతం..?” అంటూ అసహ్యకరమైన సన్నివేశాలకు ఈ మాటను ప్రయోగించటం వ్యాసభాగవతానికి అత్యంత అవమానకరం .... 


2. *కుంభకోణం* -  ఇది తమిళనాడులో ఉన్న ఒక తీర్థ క్షేత్రం. దీన్ని (తెలుగులో వేరే పదమే లేనట్టుంది) ఘోటాలా, గఫ్¬లా (పెద్ద ఎత్తున మోసపూరిత కార్యం/ SCANDAL) అనే అర్థాలలో వాడుతున్నారు .... 


3. *సోది* - ఇది ఒక దివ్యదృష్టితో భవిష్యత్తు చెప్పే పారంపరిక ప్రక్రియ ... దానికి సంబంధించిన నియమాలు, పద్ధతులు అనాదిగా ఉన్నాయి ... ఈ పదాన్ని ‘అనవసరమైన మాటలు, అసంబద్ధ ప్రేలాపనలు’ అనే అర్థానికి వాడుతున్నారు. “ఊరికే సోది పెట్టకు” అంటూంటారు ...


4. *కైంకర్యం* - భక్తిభావంతో తమ ఇష్టంతో భగవంతునికి సమర్పణం చేసే వస్తువు, సేవ ఈ పదానికి అసలు అర్థం... ఇది దేవాలయ పరంపరలోని పదం... దీన్ని ‘ఏదైనా తమకు చెందని వస్తువును, ఆస్తిని, లేదా ధనాన్ని తమ స్వంతం కోసం వాడుకునేందుకు అనైతికంగా తీసేసుకోవటం’ అనే అర్థానికి వాడుతున్నారు ... 


5. *తీర్థం పుచ్చుకోవటం* - ఇది గుడిలో దేవునికి సమర్పించి, భక్తులకు ఇచ్చే తులసి నీరు, పాలు, కొబ్బరి నీరు, లేదా కర్పూరాదులు కలిపిన పానీయం ... ఈ పదాన్ని ‘మద్యపానానికి, కల్లు తాగటానికి’ బదులుగా వాడుతున్నారు. ఎంత అసహ్యకరం! ....


6. *ప్రేమాయణం* - రామాయణం అనే మాటకు *చెడుపు*. సమస్య ఏంటంటే చాలామటుకు సామాన్యులకు ప్రేమకు, కామానికి తేడా తెలియదు. స్త్రీ పురుషులు పరస్పరం ఏ రకమైన ఆకర్షణకు లోనైనా దాన్ని ప్రేమ అనుకోవటం కద్దు ... అటువంటి వాటిల్లో కొన్ని సార్లు హేయమైన సంబంధాలు ఏర్పడుతుంటాయి .... వాటికి కూడా ఈ పదాన్ని వాడటం చాలా కష్టకరంగా ఉంటుంది ....


7. *ఎగనామం పెట్టటం*, పంగనామం పెట్టటం - ఇది వైష్ణువుల ఆచారం చూపించే ఒక సంకేతం .... నుదుట పెట్టే మూడు నిలువు గీతలు. వాటిని తిరునామాలు అంటారు... ఆ పదాన్ని ‘బడికి పోకుండా ఇంట్లో ఉండటం, తప్పించుకు పోవటం, చెప్పకుండా మానివేయటం, తీసుకున్న రుసుము చెల్లించకపోవటం’ వంటి అర్థాలలో వాడి అవమానిస్తున్నారు ....


8. *నైవేద్యాలు* - భగవంతునికి భక్తితో సమంత్రంగా ఇచ్చి, తరువాత భక్తులు సేవించే ఆహారం ఈ పదానికి అర్థం .... దాన్ని సామాన్యంగా తినే అన్నానికి వాడటం తప్పు. “మా ఇంట్లో ఇంకా నైవేద్యాలు కాలేదు..” అంటే మేమెవ్వరం ఇంకా అన్నాలు తినలేదు, మా భోజనాలు కాలేదని అర్థం.  చివరకు లంచాలు తీసుకోవటంలో కూడా ఈ పదం ప్రయోగం కనిపిస్తోంది ....


9. *ఊరేగటం* - భగవంతునికి చేసే వాహన సేవ .... సామాన్యులు చూడటానికి అనువుగా ఆయన విగ్రహాలను నగర సందర్శనం చేయించటమే ఊరేగింపు .... ఈ పదాన్ని ‘ఏ పనీ లేకుండా గాలికి తిరగటం’ అనే అర్థానికి, ఏ ప్రయోజనం లేకుండా సమయం గడుపుతూ, ఇంటి బయట కాలక్షేపం చేయటం అనే అర్థానికి వాడుతున్నారు .... “ఇంత సేపు ఎటు ఊరేగి వచ్చావు..?” అంటూ దెప్పి పొడవటానికి వాడుతున్నారు ....

'ఊరేగించుట' అన్నది తెలియక జానపదులు అనే మాట.... మనం భగవంతుడి విషయంలో ఆ పదం వాడకూడదు.... *అసలు పదం = 'ఊరు ఎఱిగించుట'* కాలక్రమేణా ఊరేగించుట అయింది .... ఊరిలో ప్రతి ఇంటి ముందుకు స్వామిని పల్లకీలో తీసుకవెళ్లి తెలియ జేస్తారు (ఎఱుక చేస్తారు) ....


10. *స్వాహా చేయటం* - ఇది స్వాహా అనే పవిత్రమైన మంత్రం. స్వాహా దేవి అగ్నిదేవుని భార్య కూడా. ‘అగ్నయే స్వాహా,’ అని ‘ఇంద్రాయ స్వాహా’ అని హవిస్సును ఆయా దేవతలకు చెందింప చేసే వాక్కు .... ఈ పదాన్ని ‘అవినీతిగా, తనకు చెందని ధనం తస్కరించటం’ అనే అర్థానికి బదులుగా వాడుతున్నారు. “భూములు స్వాహా చేశారు .... గనులు స్వాహా చేశారు ..” వంటి అతి నీచమైన అర్థంలో వాడకం కనిపిస్తున్నది ....  


11. *(బూతు)పురాణం* - పురాణాలు వ్యాసుడు రచించిన అమూల్య జ్ఞాన భాండాగారాలు .... వాటిని ప్రజల ధార్మిక ఉద్బోధ కోసం వాడారు ... కానీ ఇప్పుడు అతి నీచమైన వ్యవహారాలకు ‘బూతు’ అనే పదం కూడా చేర్చి పురాణ శబ్దాన్ని వాడుతున్నారు. “ఎప్పటి నుంచి సాగుతున్నదీ బూతు పురాణం” అంటూ అసహ్యకరమైన సందర్భాలలో అనైతికమైన ప్రేమ వ్యవహారాలలో దీన్ని వాడుతున్నారు ....


12. *పురాణ కాలక్షేపమా, హరికథా కాలక్షేపమా, పురాణం విన్నట్టు* - పురాణాలు, హరికథలు కూడా మహా పురుషుల కథలను, భాగవదంశాలను శ్రద్ధగా వినటానికి, ఆలోచించి ఆచరణలో పెట్టే మంచి విషయాలను సులువుగా ప్రజలకు అర్థమ్యే రీతిలో అందించే ప్రయత్నం .... పురాణం కూడా ఏం ఊరికే విని వదిలేసేది కాదు ... మహర్షుల ఆలోచనా విధానాన్ని పట్టుకుంటే జీవితంలో చాలా ఉత్తమమైన సాధనమార్గంలో సులువుగా ప్రవేశించవచ్చు .... కానీ దాన్ని విద్యార్థి పాఠం వినకపోతే “ఇదేం పురాణకాలక్షేపమా విని మర్చిపోవటానికి..?” లేదా, “హరికథలాగ వింటే ఏమీ అర్థం కాదు..” అంటూ దెప్పిపొడవటానికి వాడుతున్నారు .... 


13. *మహాభారత యుద్ధం* - చిన్న చిన్న సందర్భాలలో ఏదైనా గొడవ జరగిన వెంటనే వారిద్దరి మధ్య మహాభారత యుద్ధం జరిగింది అంటారు ... మహాభారతం ధర్మయుద్ధం. అందులో కృష్ణుడు ధర్మపక్షపాతియై సక్రమంగా నిర్వహించాడు .... ఆ సంగతి మరచి అనవసరమైన చిన్నాచితకా గొడవలకు దాన్ని వాడటం తప్పు ...


14. *పతివ్రత - భర్తయే తన సర్వస్వంగా భావించి, ఆయన సేవే తన వ్రతంగా కలిగిన స్త్రీ*. కానీ ఇప్పుడు ఈ పదాన్నే ఎంతో అసహ్యకరంగా సరిగ్గా విరుద్ధార్థంలో వాడుతున్నారు .... భర్తను గణించక, వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ వరకు చాలా హేయమైన అర్థాలను ఈ పదానికి ఆపాదించారు ....


15. *విశ్వరూపం* - ఇది భగవంతుని సమగ్రమైన తత్త్వాన్ని ప్రతిపాదించే రూపం.... కానీ ప్రస్తుతం *నిర్వస్త్రంగా ఉండటం* అనే అర్థానికి ఈ పదాన్ని వాడుతున్నారు... విశ్వ రూప సందర్శన యోగం అని భగవద్గీతను వినేవేళ అటువంటి అర్థాలు స్ఫురించటం వల్ల మనస్సుకు ధర్మగ్లాని కలిగి ఎంత విక్షేపమవుతుందో వివరించనవసరం లేదు ... 


16. *చాదస్తం* - ఛాందసం అనే మాటకు వికృతి .... ఛందస్సు అంటే వేదం అని ఒక అర్థం .... వైదిక భావాలు కలిగి ఉండటాన్ని ఛాందసం అంటారు. కానీ ఇప్పుడు ఇదే పదం ‘పాతభావాలు పట్టుకుని వేలాడటం, ధర్మం, న్యాయం, నీతి నియమం అని మాట్లాడటా’నికి వాడుతున్నారు. పాతభావాలు అన్నీ వర్జ్యాలు కాదు. కొత్తది అంతా సరైనది అనీ కాదు ....


17. *గోవింద - గోవిందా గోవింద*.... అని భక్తితో భక్తులు తమ వేంకటేశ్వరుని తలచుకుంటారు .... కొండ ఎక్కుతూ స్మరణ చేస్తారు ... గోవింద నామం అన్ని నామాలలో ప్రశస్తమైనదని భావిస్తారు... కానీ ఇప్పుడు అదే పదం ‘దొంగిలించిన వస్తువు’ కోసం ప్రయోగిస్తున్నారు .... ఏదైనా వస్తువును మనం పోగొట్టుకుంటే, అది తిరిగిరాదని సూచిస్తూ, “ఇంకేముంది .... అంతా గోవిందా ....” అంటారు. అంటే గోవిందునికి ఏదైనా అర్పిస్తే మంచిదంటారు.... అట్లాంటిది దాన్ని ‘దొంగిలించిన వ్యక్తికి సమర్పించటం’ అనే అర్థంలో వాడటం ఎంతో హేయం .... 


18. *తాండవం చేయటం* - తాండవం అంటే శంకరుడి నృత్యం .... ఆయన నృత్యప్రియుడు ... సంధ్యావేళలలో నృత్యం చేసి అందరినీ ఆనందింపచేస్తాడు ...)?. ‘తలపు కదలికలే శివతాండవం’ అని ఆధ్యాత్మికసంకేతాలలో చెప్తారు .... అటువంటి పవిత్రమైన తాండవ పదాన్ని ‘దేనికైనా రభస చేయటం’ గురించి, ‘కొట్లాట గొడవ చేయటం’ గురించి అంటున్నారు ....


19. *చిందు వేయటం* - చిందు అంటే చక్కని లయ ప్రకారం భజన పాట పాడుతూ నృత్యం చేసే ప్రక్రియ .... కోలాటం లాగ, తప్పెట్ల భజన లాగ అది కూడా ప్రసిద్దమైన ఒక దేశీ పద్ధతి .... ఆ పదానికి ‘కోపంతో అరవటం, గొడవ చేయటం’ గురించి అర్థం చేర్చి వాడతున్నారు ....


20. *భజన చేయటం* - భగవంతునికై పాటలు పాడటం అనేది అసలు అర్థం .... వాయిద్యాలతో, చప్పట్లతో చిన్నచిన్న మాటలు, లేదా సరళమైన వాక్యాలతో కూడిన, సులువైన రాగాలతో కూర్చిన నామాల సంకీర్తనం భజన .... దాన్ని ‘ఇతరులను *అనవసరంగా పొగడటం*, పని వ్యాజంగా ప్రశంసించటం’ అనే అర్థంలో వాడుతున్నారు ....


ఇంకా కొన్ని-


21. భట్రాజు పొగడ్తలు 

22. శఠగోపం -

23. మాయదారి సంత 


- _సంకా ఉషారాణి_

Taken from other groups ....

పదాలు ఒక్క స్త్రీ కే

 ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు.మీరు కూడా చదివి తెలుసుకోండి.

అందుకే మీకు కూడా copy & share చేస్తున్నా.


స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!*

1. అంగన

2. అంచయాన

3. అంబుజాలోచన

4. అంబుజవదన

5. అంబుజాక్షి

6. అంబుజనయన

7. అంబురుహాక్షి

8. అక్క

9. అతివ

10. అన్ను

11. అన్నువ

12. అన్నువు

13. అబల

14. అబ్జనయన

15. అబ్జముఖి

16. అలరుబోడి

17. అలివేణి

18. అవ్వ

19. ఆటది

20. ఆడది

21. ఆడగూతూరు

22. ఆడుబుట్టువు

23. ఇంచుబోడి

24. ఇంతి

25. ఇదీవరాక్షి

26. ఇందునిభాష్య

27. ఇందుముఖి

28. ఇందువదన

29. ఇగురాకుబోణి

30. ఇగురాకుబోడి

31. ఇభయాన

32. ఉగ్మలి

33. ఉజ్జ్వలాంగి

34. ఉవిధ

35. ఎలతీగబోడి

36. ఎలనాగ

37. ఏతుల

38. కంజముఖి

39. కంబుకంఠ

40. కంబుగ్రీవ

41. కనకాంగి

42. కన్నులకలికి

43. కప్పురగంధి

44. కమలాక్షి

45. కరబోరువు

46. కర్పూరగంది

47. కలకంఠి

48. కలశస్తిని

49. కలికి

50. కలువకంటి

51. కళింగ

52. కాంత

53. కించిద్విలగ్న

54. కిన్నెరకంఠి

55. కురంగానయన

56. కురంగాక్షి

57. కువలయాక్షి

58. కూచి

59. కృషమధ్యమ

60. కేశిని

61. కొమ

62. కొమరాలు

63. కొమిరె

64. కొమ్మ

65. కోమ

66. కోమలాంగి

67. కొమలి

68. క్రాలుగంటి

69. గజయాన

70. గరిత

71. గర్త

72. గుబ్బలాడి

73. గుబ్బెత

74. గుమ్మ

75. గోతి

76. గోల

77. చంచరీకచికుర

78. చంచలాక్షి

79. చంద్రముఖి

80. చంద్రవదన

81. చక్కనమ్మ

82. చక్కెరబొమ్మ

83. చక్కెర

84. ముద్దుగుమ్మ

85. చాన

86. చామ

87. చారులోన

88. చిగురుంటాకుబోడి

89. చిగురుబోడి

90. చిలుకలకొలోకి

91. చెలి

92. చెలియ

93. చెలువ

94. చేడి(డియ)

95. చోఱుబుడత

96. జక్కవచంటి

97. జని

98. జలజనేత్ర

99. జోటి

100. ఝషలోచన

101. తనుమధ్య

102. తన్వంగి

103. తన్వి

104. తమ్మికింటి

105. తరళలోచన

106. తరళేక్షణ

107. తరుణి

108. తలిరుబోడి

109. తలోదరి

110. తాటంకావతి

111. తాటంకిని

112. తామరకంటి

113. తామరసనేత్ర

114. తియ్యబోడి

115. తీగ(వ)బోడి

116. తెఱువ

117. తెలిగంటి

118. తొగవకంటి

119. తొయ్యలి

120. తోయజలోచన

121. తోయజాక్షి

122. తోయలి

123. దుండి

124. ధవలాక్షి

125. ననబోడి

126. నళినలోచన

127. నళినాక్షి

128. నవల(లా)

129. నాంచారు

130. నాచారు

131. నాచి

132. నాతి

133. నాతుక

134. నారి

135. నితంబవతి

136. నితంబిని

137. నీరజాక్షి

138. నీలవేణి

139. నెచ్చెలి

140. నెలత

141. నెలతుక

142. పంకజాక్షి

143. పడతి

144. పడతుక

145. పద్మముఖి

146. పద్మాక్షి

147. పర్వందుముఖి

148. పల్లవాధర

149. పల్లవోష్ఠి

150. పాటలగంధి

151. పుచ్చడిక

152. పుత్తడిబొమ్మ

153. పువు(వ్వు)బోడి

154. పువ్వారుబోడి

155. పుష్కరాక్షి

156. పూబోడి

157. పైదలి

158. పొల్తి(లతి)

159. పొల్తు(లతు)క

160. త్రీదర్శిని

161. ప్రమద

162. ప్రియ

163. ప్రోడ

164. ప్రోయాలు

165. బంగారుకోడి

166. బాగరి

167. బాగులాడి

168. బింబాధర

169. బింబోష్ఠి

170. బోటి

171. భగిని

172. భామ

173. భామిని

174. భావిని

175. భీరువు

176. మండయంతి

177. మగువ

178. మచ్చెకంటి

179. మడతి

180. మడతుక

181. మత్తకాశిని

182. మదిరనయన

183. మదిరాక్షి

184. మసలాడి

185. మహిళ

186. మానవతి

187. మానిని

188. మించుగంటి

189. మించుబోడి

190.మీనసేత్రి

191. మీనాక్షి

192. ముగుద

193. ముదిత

194. ముదిర

195. ముద్దరాలు

196. ముద్దియ

197. ముద్దుగుమ్మ

198. ముద్దులగుమ్మ

199. ముద్దులాడి

200. ముష్ఠిమధ్య

201. మృగలోచన

202. మృగాక్షి

203. మృగీవిలోకన

204. మెచ్చులాడి

205. మెఱుగారుబోడి

206. మెఱుగుబోడి(ణి)

207. మెలుత

208. మెళ్త(లత)మెల్లు(లతు)

209. యోష

210. యోషిత

211. యోషిత్తు

212. రమణి

213. రామ

214. రుచిరాంగి

215. రూపరి

216. రూపసి

217. రోచన

218. లతకూన

219.లతాంగి

220. లతాతన్వి

తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.

దేశభాషలందు తెలుగు లెస్స!


సేకరణ:-

అష్టమస్థాన పరీక్ష - 5 .

 ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష  గురించి సంపూర్ణ వివరణ - 5 . 


 *  మల పరీక్ష  - 


        వాతరోగము నందు మలబద్దకం కలుగును. మరియు పురీషము మిక్కిలి నల్లనై మిక్కిలి కఠినముగా వెడలుచుండును. పిత్త వ్యాధినందు పసుపుపచ్చగానైనను , ఎర్రగా రక్తముతో కూడియైయినను ఉండును. మరియు మృదువుగా , ధారాళముగా అయినను విరేచనం అగును. శ్లేష్మవ్యాధుల యందు మలము తెల్లగా , అజీర్తిగా , బంకగా , నురుగుతో కూడుకుని గట్టిగా వెడలుచుండును. ఎవైనా రెండురకాల దోషములు కలిసి ఉన్నప్పుడు రెండు దోషముల రంగులు మరియు లక్షణాలు కలిసి ఉండును. 


             శరీరము నందు వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తపు చారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్దకం ఉండును. అనాహము , ఆధ్మాన్నము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్టను ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును. అతిసారము మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతటా నిండి ఉండి బుడబుడమనే ధ్వనితో పలుమార్లు బయటకి వెడలుచుండును. 


  *  జిహ్వ పరీక్ష  - 


        వాతరోగము నందు నాలుక పగిలి ముళ్ళ వలే గరగరలాడుచుండును. తడిలేకుండా నల్లగా గాని , బూడిద వర్ణముతో గాని ఉండును. పైత్యవ్యాధుల యందు నాలుక ఎర్రబారి పూసి లాలాజలం కారుచూ మృదువుగా ఉండును. శ్లేష్మరోగి యొక్క నాలుక తెల్లగా కరుడుకట్టి పాచికలిగి ఉండును. మొద్దుబారి ఉండును. జ్వరం నందు చేదు కలిగి ఉండును. స్ప్లీన్ మరియు కాలేయం చెడినప్పుడు క్షయవ్యాధిలో వలే నాలుకపైన పుండ్లు కనిపించును. 


 *  మూత్రపరీక్ష  - 


           ఆరోగ్యవంతుని మూత్రం లఘువుగా , తెల్లగా ఉండును. పిత్తప్రకృతి కలిగినవారికి పసుపచ్చగా మరియు వేడిగా ఉండును. శ్లేష్మ మరియు పిత్తప్రకృతి కలిసి ఉండిన నూనె వలే ఉండును. శ్లేష్మప్రకృతి ఉన్న బురద వలే ఉండును. వాత మరియు శ్లేష్మప్రకృతులు రెండు కలిసి ఉన్న మూత్రం చిక్కగా , తెల్లగా ఉండును. రక్తవాత ప్రకృతి కలిగి ఉన్న కుసుంబా పుష్పము వలే మూత్రం ఉండును. 


            వ్యాధి లక్షణములు లేకున్న లేక కేవలం మూత్రం మాత్రం చెడుగా కనపడి ఉన్న రోగం ఉన్నట్టు నిర్ధారణ చేయకూడదు . అనగా వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలు ఉన్నప్పుడే రోగనిర్దారణ చేయవలెను . 


                              సమాప్తం 


       గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

శివ సోత్రం

 శివ సోత్రం (శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం)


కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున శశిరేఖ నమృతంబు జాలువార

హరి నీల పాత్రిక సురభి చందనమున గతి నాభి ధవళ పంకజము మెరయ

గురియైన చెలువు ననెరసిన లోకరక్షణ మనంగ గళంబు చాయతోప

ప్రథమాద్రిదోతెంచు భాను బింబమునానురమ్మున కౌస్తుభ రత్న మొప్ప.


సురనదియును కాళిందియుబెరసినట్టి

కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి

నామ నంబునానందమగ్నముగజేయ

నెలిమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు.


పైన జటాజూటంలో అమృతం కారిపోతున్న చంద్రం వంక, నాభి వంక చూస్తే నల్లటి శరీరం అందులో నుండి చక్కటి కమలం విరిసి ఉన్నది. నాభి భాగంలో చూస్తే శ్రీ మహా విష్ణువు. తల మీద చూస్తే చంద్రరేఖ ఉన్న పరమశివుడు. కొంచెం తేరిపార చూస్తే తెల్లటి కంఠంలో నల్లటి మచ్చ. హలాహలం త్రాగినప్పుడు కంఠం లో ఏర్పడిన మచ్చ తో ఉన్నాడు. అంతే శంకర దర్శనం అయ్యింది. కొంచెం ఆశ్చర్యపోయి కిందకు చూస్తే కౌస్తుభం కనబడింది ఏమి ఆశ్చర్యం? గంగానది కాళింది కలిస్తే ఎలా ఉంటుందో అలా తెల్లటి నల్లటి వర్ణాలు రెండు కలిసి పోయినట్టి హరిహరనాథుడు ప్రత్యక్షమయ్యాడు.అప్పుడు మహానుభావుడు తిక్కన చెప్పుకున్నాడు.


శ్రీ యన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింపభ

ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూ

పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్త జనంబు వైదిక

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్.


తిక్కన హరిహరమూర్తి కి హరునికి హరికి బేధం లేకుండా, లక్ష్మికి గౌరీ కి బేధం లేకుండా ఇద్దరు ఒకటే అన్న భావంతో దర్శనం చేస్తున్న వారందరికీ భద్రత కల్పించడానికి హరిహర నాథుడు తనకు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నారు. హరిహర నాథుడు తిక్కన గారు రాస్తున్న భారతాన్ని తనకు అంకితమివ్వమని అడిగారు. అది తిక్కనగారి గొప్పదనం. అలా ఒకే స్వరూపం అయిన హరిహరనాథునకు తాను ఆంధ్రీకరించిన బాగాన్ని అంకితం ఇచ్చారు.

హరిహరనాథుడైన స్వామి పార్వతిదేవికి శివ అష్టోత్తర శతనామ (108 నామాలు) ఉపదేశం ఇచ్చారు. ధ్యాన శ్లోకాన్ని మొదట మనసులో ధ్యానం చేయాలి.


ధవళ వపుషమిందోర్మండలేసన్నివిష్టం

భుజగవలయహారం,భస్మదిగ్ధాంగమీశం

మృగయపరశుపాణిం,చారుచంద్రార్ధ మౌళిం

హృదయ కమలమధ్యే, సంతతం చింతయామి.

శివ అష్టోత్తర శతనామం చదివేటప్పుడు ముందుగా ధ్యాన శ్లోకాన్ని ధ్యానం చేయాలి.


తెల్లని శరీరం తో ఉన్న వాడు చంద్రమండలం లో కూర్చుని ఉన్నాడు. శివలింగానికి పైన ధారా పాత్ర కడతారు. దాని నుండి సన్నటి ధారా పడుతుంటుంది. శివలింగం ఎంత చల్లగా ఉంటే మన కోరికలు అంత తీరుతాయి. స్వామి చల్లగా ఉండాలి. శివలింగానికి అభిషేకం లేకుండా వేడిక్కి పోయేటట్లు ఉంచకూడదు. మిగిలిన దేవతా స్వరూపాలకు అలా ఉండదు. ధారా పాత్ర కి ఒక దర్భ పెట్టి సన్నటి ధార శివలింగం మీద అలా పడుతుండాలి. ఈ రహస్యం యజుర్వేదం లోని రుద్రాధ్యాయం లో చెప్పారు.


ఆపాతాళ నభః స్థలాన్త భువన బ్రహ్మాండ మావి స్ఫరత్

జ్యోతి స్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాన్త మృతైః "

అస్తోకాప్లుత మేకమీశమనిసశం రుద్రాను వాకాన్ జపేత్

ధ్యాయే దీప్సి తసిద్ధయే ధ్రువపదం విప్రో  భిషించేచ్ఛివమ్ "


బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచాభాసమానాభుజంగైః

కంఠే కాలఃకపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః "

త్ర్యక్షారుద్రాక్షమాలా స్సులలిత వపుషశ్శాంభవా మూర్తిభేదాః

రుద్రాశ్ర్శీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్"


చంద్రమండలం లోని అమృతం జాలువారి ఆయన మీద పడుతూ ఉంటుంది. కిందకి కారిపోతున్న అమృతాన్ని పాత్రలు చేతితో పట్టుకుని మళ్లీ తీసి తనమీద తానే పోసుకుంటూంటాడు. తనలోతానే రమిస్తూ అమృత అభిషేకాన్ని పొందుతుంటాడు. బ్రహ్మాండాలంతా వ్యాపించి పోయి ఉంటుంది. ఆ శివలింగం.


ఉదయగ్రావము పానవట్ట మభిషేకోద ప్రవాహంబు వా

ర్ధి దరీధ్వాంతము ధూపధూమము,జలద్దీప ప్రభారాశి కౌ

ముది,తార నివహంబు లర్పిత సుమంబుల్ గా తమోదూరసౌ

ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్.,,


సువర్ణముఖి నది లో స్నానం చేసి బయటకి వచ్చిన ధూర్జటీకి జలాలు అన్ని ఉత్తర దిక్కు సముద్రంలోకి ఎలా పడుతున్నాయో అర్థంమయ్యింది. శివా! ప్రాణకోటి, దేవతలు అందరూ అభిషేకం చేస్తే అలా వెళ్లి పడ్డాయి. అందరూ పూజ చేసిన పువ్వులే ఆకాశంలో నక్షత్రాలయి. ధూపం ఆకాశంలో మేఘ మండలమయి ఎగురుతున్నది. ప్రపంచమంతా శివలింగంగా కనబడుతున్నది. శివలింగం తప్ప వేరొకటి లేదంటాడు.

సత్కాలక్షేపం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*ఆదివారం సత్కాలక్షేపం కోసం* 

              🌷🌷🌷

చివరలో *యం* పదాలు కనిపెట్టండి..


1. గెలుపు..

2. భీతి వంటిది..

3. వయసు..

4. దెబ్బ..

5. సూర్యుడు వస్తే.‌‌.

6. గుర్రం..

7. ప్రేమ..

8. శరీరం..

9. కన్ఫర్మ్ ఓకే ష్యూర్ పక్కా..

10. సిగ్గు..

11. అప్పడం తోడిది..

12. చేతికి వేసుకునేది..

13. తెలుగు హెల్ప్..

14. అదృశ్యం..

15. ఒక సుగంధ ద్రవ్యం..

16. గీతలో పత్రం పుష్పం ఫలం__

17. ఇష్టం..

18. అంతం లాంటిది..

19. నన్నయ తిక్కన ఎర్రన..

20. కోవెల..

21. కాలం..

22. అసెంబ్లీలో స్పీకర్ ఉండే చోటు..

23. చీకట్లో మెరుస్తూ కనబడేది..

24. లివర్..

25. గుండె..

26. రొంప దగ్గు వస్తే తాగేది..

27. ఉప్పు రసాయన నామం..

28. నమ్మిన దైవం ఇచ్చేది..

29. పాట లాంటిది..

30. ఒక రంగు..

నిశ్చయ తాంబూలానికే

 *నేటితరానికి ఈ వ్యాసం ఒక చెంపపెట్టు!*


అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! 


*శ్రీరస్తు!శుభమస్తు!అవిఘ్నమస్తు!*


*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,

*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,

*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

*ఆర్భాటంగా మండపాలు కట్టడం,

*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,

*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం, 

*దావత్ పేరుతో తాగితందనాలాడటం,

*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,

*మధ్యతరగతి మనిషికి అవసరమా?


*ఒకడిని చూసి ఒకడు,

*ఒకడ్నిమించి ఒకడు

వెర్రెక్కి పోతున్నారు

నేటి కాలంలో.


*ఎంత తింటాడు మనిషి?

*దేంట్లో దొరుకుతుంది వినోదం?

*ఎలా చేయాలి వేడుక?

*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

*ఏది కడితే వస్తుంది హుందాతనం?

*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

*ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.


*పదిమందితో పట్టెడన్నం తింటే,

*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.


*ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

*చెమటపడితే కారిపోయే రంగుకీ,

*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,

*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,

*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,

ఉన్నదంతా ఊడ్చిపెడితే

పదికాలాలు బతకడానికొచ్చే 

కొత్తమనిషికి

తర్వాత పెట్టేది ఏమిటి?


*అప్పు చేసి ఖర్చుచేసే,

వెర్రితనం కాదు పెళ్ళంటే!

*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే

ఇంగితమైన పని వివాహ మంటే!

*శక్తికి మించి ఎగరటం,

*అప్పుచేసి ఆర్బాటం చేయటం 

*ముమ్మాటికీ తప్పు*.


*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు!*

Shared message

అక్షయతృతీయ విశిష్టత*

 _*వైశాఖ పురాణం - 28 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*అక్షయతృతీయ విశిష్టత*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా ! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు , ఋషులకు , పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.


పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన ఇంద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.


ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని ఇంద్రుడు వారితో చెప్పెను.


ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.


ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిథి చాల శక్తివంతమైనది. ఆనాడు  చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుడుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము , శక్తి , యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు , మునులకు , పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని , ముక్తిని ఇచ్చి సార్ధక నామము కలిగియున్నది.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.

శఠగోపం అంటే ఏమిటి

 *శఠగోపం అంటే ఏమిటి ? గుడిలో శఠగోపం పెట్టడానికి గల కారణం తెలుసా ?*


శఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనం ఇస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతే కాదు శఠగోపం అత్యంత గోప్యమైనది కనుక అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి, తీర్థం, శఠగోపనం తీసుకుంటారు.


శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు.


శఠగోపం తలమీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తలమీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.


శఠగోపం మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి. చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.

  

కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. పక్కకు వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత శఠగోప్యము పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి.

మార్పు వారితోనే సాధ్యం

 ఇలా చెప్పె ముస్లింలు ఉన్నారా?


మసీదు లేదా మదరసాల్లో మౌల్వీలు లేదా ముస్లిం పెద్దలు ఇవి చెప్పి విదేశీ ముష్కరులు తమ పూర్వికులను ఈ దేశాన్ని ఎలా హింసించి దోచుకున్నారో చెబుతారా? 

మార్పు వారితోనే సాధ్యం

ఇవి చెప్పి శాంతి ...దేశభక్తి నేర్పితె.....

ఈ దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది...ఈా దేశంలోని ప్రతీ ముస్లిం తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన చరిత్ర ఇది


 1.అల్లావుద్దీన్ కామం వలనే 

రాణీ పద్మావతి తన ఆత్మగౌరవాన్ని  కాపాడుకోవడానికి తన రాజమందిరంలో ఉన్న 14000 పరిచారికలతొ కలిసి ఆత్మాహుతి  చేసుకుందని


2. ఇస్లాం మతం స్వీకరించడానికి అంగీకరించని ఛత్రపతి శివాజీ తనయుడు శాంభాజీ మహరాజ్ దేహాన్ని  అతి కిరాతకంగా క్రూరమైన పద్దతిలో బ్రతికి ఉండగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చంపడం 


3. ఒక్క రోజులొ లక్షలమంది హిందువులను,  బ్రాహ్మణులను చంపిన పాపాత్ముడు టిప్పు సుల్తాన్ అని....అది జరిగింది దీపావళి పర్వదినం నాడని....ఇప్పటికీ కర్ణాటకలొ కొడగు బ్రాహ్మణులు దీనికి గుర్తుగా దీపావళి జరుపుకోరని (మన  తెలుగువారిలొ కూడా కొంతమంది దీపావళి జరుపుకోరు)


4. కసాయి షాజహాన్ బలవంతంగా 14 సంవత్సరాల బ్రాహ్మణ ఆడపిల్లను ఆత్యాచారం చేశాడని


5. ఆటవిక బాబర్ మన శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా లక్షల మంది అమాయక హిందువులను చంపాడని 


6. సికిందర్ లోఢీ ఉత్తరప్రదేశ్ లొ ఉన్న కంగర నాగర్కోట్ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని చిన్న చిన్న ముక్కలుగా ధ్వంసం చేసి ఆ విగ్రహ శకలాలను విసిరి పడేసాడని  


7. ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించని హిందూ స్త్రీలను నగ్నంగా ముస్లిం సైనికుల ముందుకు విసిరేసాడని 


8. కనికరం లేకుండా వాజీర్ ఖాన్ అనే క్రూరుడు

 బండా భైరాగీ అనే ఆధ్యాత్మిక గురువును బ్రతికి ఉండగానే ఆయన శరీరాన్ని ఎముకలు కనిపించేత వరకూ కాల్చవేసాడని 


9. ఇస్లాం స్వీకరించడానికి అంగీకరించనందుకు జిహాదీ వాజీర్ ఖాన్, గురు గోబింద్ సింగ్ ఇద్దరు కుమారులను ఫతె సంగ్(6 సంవత్సరాలు), జోబర్ సింగ్(5 సంవత్సరాలు) బ్రతికి ఉండగానే ఒక రాతి గోడలొ సమాధి చేశాడని 


10. కసాయి ఔరంగజేబు శాంభాజీ మహారాజ్ రెండు కళ్లను కాల్చిన ఇనుప చువ్వలతో కాల్చాడని...కారణం ఇస్లాం మతం స్వీకరించ లేదని 


 11.కసాయి ఔరంగజేబు ...

మోతి దాస్ అనే స్వామిజీ శరీరాన్ని ప్రజలందరూ చూస్తుండగా రెండుగా చీల్చి చంపేశాడని


 చివరిగా....


వారిలొ ఒక్కరు కూడా నీ పండుగులకు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.....మరి నువ్వు ఎందుకు ఎగేసుకొని శుభాకాంక్షలు చెబుతావు? ఇన్ని దారుణాలు జరిగాయి....నీకు తెలియదు

కారణం ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాం అని చెప్పుకుంటున్న గాంధీ కుటుంబికులు చెప్పలేదు

ఇప్పుడు తెలిసింది కాదా....ఇక మీదట చేయకు


ఇజ్రాయెల్ తన దేశ పౌరులకు నేర్పింది ఇదే

అందుకె ఆ దేశంలో పౌరులు 

ఆ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయరు

తమ యూదు జాతిని ఇంత వరకూ మోసం చేసిన యూదుడు లేడు....

వారి ధర్మాన్ని అవమానించిన యూదుడు కూడా లేడు🙏

correct గా answers రాసాను.

 🤔*ఒకబ్బాయి  Exams లో అన్నిటి కి correct

గా answers రాసాను..కావాలనే మాస్టారు zeero marks వేశారంటే..వాళ్ళ నాన్న...Recounting apply చేస్తే.వాడు.సమాధానాలు చూడండి*😂



*☘తాజ్ మహల్ ఎక్కడ ఉంది?*

జవాబు: కట్టిన చోటే!


*☘చలికా లంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?*

జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.


*☘రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?*

జవాబు: రసం తీసి!


*☘గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?*

జవాబు: నుదుటికి!



*☘నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?*

జవాబు:మెలకువ వస్తుంది


*☘సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..?*

జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది


*☘నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?*  

జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి

*☘టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం.?*

జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.!

*☘అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?*

జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని


*☘భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు?* జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని


*☘స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది...?*

జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని



*☘పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు....?*    జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి.......