ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 5 .
* మల పరీక్ష -
వాతరోగము నందు మలబద్దకం కలుగును. మరియు పురీషము మిక్కిలి నల్లనై మిక్కిలి కఠినముగా వెడలుచుండును. పిత్త వ్యాధినందు పసుపుపచ్చగానైనను , ఎర్రగా రక్తముతో కూడియైయినను ఉండును. మరియు మృదువుగా , ధారాళముగా అయినను విరేచనం అగును. శ్లేష్మవ్యాధుల యందు మలము తెల్లగా , అజీర్తిగా , బంకగా , నురుగుతో కూడుకుని గట్టిగా వెడలుచుండును. ఎవైనా రెండురకాల దోషములు కలిసి ఉన్నప్పుడు రెండు దోషముల రంగులు మరియు లక్షణాలు కలిసి ఉండును.
శరీరము నందు వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తపు చారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్దకం ఉండును. అనాహము , ఆధ్మాన్నము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్టను ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును. అతిసారము మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతటా నిండి ఉండి బుడబుడమనే ధ్వనితో పలుమార్లు బయటకి వెడలుచుండును.
* జిహ్వ పరీక్ష -
వాతరోగము నందు నాలుక పగిలి ముళ్ళ వలే గరగరలాడుచుండును. తడిలేకుండా నల్లగా గాని , బూడిద వర్ణముతో గాని ఉండును. పైత్యవ్యాధుల యందు నాలుక ఎర్రబారి పూసి లాలాజలం కారుచూ మృదువుగా ఉండును. శ్లేష్మరోగి యొక్క నాలుక తెల్లగా కరుడుకట్టి పాచికలిగి ఉండును. మొద్దుబారి ఉండును. జ్వరం నందు చేదు కలిగి ఉండును. స్ప్లీన్ మరియు కాలేయం చెడినప్పుడు క్షయవ్యాధిలో వలే నాలుకపైన పుండ్లు కనిపించును.
* మూత్రపరీక్ష -
ఆరోగ్యవంతుని మూత్రం లఘువుగా , తెల్లగా ఉండును. పిత్తప్రకృతి కలిగినవారికి పసుపచ్చగా మరియు వేడిగా ఉండును. శ్లేష్మ మరియు పిత్తప్రకృతి కలిసి ఉండిన నూనె వలే ఉండును. శ్లేష్మప్రకృతి ఉన్న బురద వలే ఉండును. వాత మరియు శ్లేష్మప్రకృతులు రెండు కలిసి ఉన్న మూత్రం చిక్కగా , తెల్లగా ఉండును. రక్తవాత ప్రకృతి కలిగి ఉన్న కుసుంబా పుష్పము వలే మూత్రం ఉండును.
వ్యాధి లక్షణములు లేకున్న లేక కేవలం మూత్రం మాత్రం చెడుగా కనపడి ఉన్న రోగం ఉన్నట్టు నిర్ధారణ చేయకూడదు . అనగా వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలు ఉన్నప్పుడే రోగనిర్దారణ చేయవలెను .
సమాప్తం
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి