13, ఫిబ్రవరి 2024, మంగళవారం

భారత రత్న శ్రీ ఎల్‌కే అద్వానీ

 భారత రత్న శ్రీ ఎల్‌కే అద్వానీ పూర్తి పేరు లాల్‌ కృ​ష్ణ అ‍ద్వానీ. ఆయన 1927 నవంబర్‌ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్‌(భారత్‌ విభజన కాకముందు)లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్‌ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. ఇక, 1947లో ఆర్‌ఎస్‌ఎస్‌ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వర్తించారు.


దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్‌ 12న భారత్‌కు అద్వానీ వలస వచ్చారు.

1957లో ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ.  

1960లో ఆర్గనైజర్‌ పత్రికలో జర్నలిస్ట్‌గా విధుల్లో చేరారు. 

1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక. 

1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక.

1973-76లో జన్‌సంఘ్‌ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 

1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా నియామకం

1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు

1998 వాజపేయ్‌ మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు

2002 ఉప ప్రధానమంత్రిగా నియామకం.

2004 లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు

2005 జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదలిపెట్టాల్సి వచ్చింది

2007 ప్రధాన మంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది

2008 "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు.


మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర..

అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్‌) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.


పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ

కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైనస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ‘ఉక్కుమనిషి’గా పేరుగాంచాడు. రామ​ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


కేంద్ర ప్రభుత్వం.. భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్​ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్​కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఇప్పటివరకూ 49 మంది ‍ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వరకు.. ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు.

Panchaag


 

జరాసంధ వధ

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.                *పురాణ పఠనం*

.        *🪐శ్రీ కృష్ణావతారం🪐*

.               *88వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


జరాసంధ వధ 


రెండు పర్వతాలూ, రెండు సముద్రాలూ, రెండు సింహాలూ, రెండు వృషభాలూ, రెండు అగ్నులూ, రెండు మత్తేభాలూ తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా, భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా...హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్ర మైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని, తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు. భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్దపులుల్లాగా ఒకరినొకరు వీపులూ మూపులూ ముంజేతులూ శిరస్సులూ తొడలూ మోకాళ్ళూ నడుములూ బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదాఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ, తప్పించుకుంటూ...పెనుగదలు బద్దలై పొడిపొడిగా రాలేలాగ, పిడుగులు పడేలా, చుక్కలు రాలేలా, నిప్పురవ్వలు వ్యాపించేలా, దిక్కులు వణికేలాగ, సముద్రాలు అల్లకల్లోల మయ్యేలాగ, భూమి చలించేలా; కొట్టుకుంటూ, నెట్టుకుంటూ; ఒకరికొకరు తీసిపోకుండా; పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా, తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు.

అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాదండాలు ఖండఖండాలు అయిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాలవంటి ప్రచండ బాహుదండములు సాచి ముష్టియుద్ధానికి తలపడి.....కాళ్లతో కుమ్ముకుంటూ కీళ్ళు విరగకొట్టుకుంటూ, నొసళ్ళూ, ప్రక్కలూ, చెక్కిళ్ళూ, రొమ్ములు పగిలేలా, ఎముకలు విరిగేలా, గాయాలనుండి నెత్తురు కాలువలు కట్టి ప్రవహించేలా, భూత, బేతాళాలు కేరింతలు కొడుతూ ఉండగా భీమజరాసంధులు ఇరువురూ యుద్ధం చేయసాగారు. ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలూ, చెక్కులూ, మెడలూ పగిలేలా చేతులతో బాదుకుంటూ, ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ, డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు. భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరి నొకరు తాకుతూ, తిరిగి దూరమవుతూ, శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్ళతో కుమ్ముకుంటూ, పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ, సోలుతూ, వాలుతూ, రొప్పుతూ రోజుతూ, తేరుకుంటూ, బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడ సాగారు. ఇలా దేవేంద్రుడి వజ్రాయుధంలాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోకవృక్షాలలా, ఎఱ్ఱని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటిచెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చునట్లు, వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు.


 రాజబంధమోక్షంబు 


జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు..జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ (విడిపించాడు) .

అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు. బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు.


కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా ఇలా స్తుతించారు.


“ఓ దయామయా! సజ్జనుల దుఃఖాలను పోగొట్టేవాడా! ఆశ్రితరక్షకా! దురిత నివారణ! వరదా! పద్మనాభా! శ్రీహరీ! శ్రీకృష్ణ! వాసుదేవా! గోవిందా! ఇందిరావల్లభా! ఆశ్రిత ఆర్తి హరణా! శాశ్వతా! అనంతా! లక్ష్మీపతి! నీకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాము. యాదవవంశ మనే సముద్రానికి చంద్రుని వంటి వాడా! పరమజ్ఞానీ! శ్రీకృష్ణా! నీ పాదాలను ఆశ్రయించిన మాకు జరాసంధుడి బంధనాల వలన కలిగిన పరితాపాన్ని నీ కరుణాకటాక్షమనే జడివానతో చల్లార్చావు. అవును, సజ్జనులను రక్షించుట, దుర్జనులను శిక్షించుట చేయడమే నీ కర్తవ్యాలు కదా. వినవయ్యా శ్రీకృష్ణా! జరాసంధుడు మా దగ్గర బంధువే కాని శత్రువేం కాదు. రాజ్యవైభవం అనే మదాంధులమైన మా గురించి చెప్పటం అనవసరం. దుర్జనులు మనోఙ్ఞమైన నీటి అలలలాగా, దీపశిఖలలాగా చంచలములు ఐన సిరిసంపదలు శాశ్వతాలని నమ్మి, పరానికి సంబంధించిన కార్యకలాపాలను పరిత్యజించుతారు; పరస్పరం విరోధాలను పెంచుకుంటూ దుష్ఠులు అయి, ప్రజలను బాధిస్తూ ఉంటారు; మరణభయాన్ని మరచిపోయి, పొగరుబోతులై ప్రవర్తిస్తారు. ఓ మాధవా! లక్ష్మీపతీ! త్రిలోకశరణ్యా! అట్టి దుర్జనులు చివరకు ఐహికసుఖాలను నష్టపోతారు; వ్యర్ధమైన కోరికల వెంటబడి నీళ్ళనే భ్రమతో ఎండమావులను చేరినట్లు భ్రష్టులైపోతారు; సంసారసముద్రాన్ని దాటలేక నశించిపోతారు; అటువంటి క్లేశములు మేము అనుభవించలేము. యశోదామాతచే ఉదరమున తాడు కట్టబడిన దామోదరా! శ్రీకృష్ణా! దుష్ట సంసారసాగరాన్ని తరింపచేసేవాడా. ఈ సమస్త సృష్టికీ కారణమైన వాడా. వేదాంత వీధుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలచి ఉండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు.” భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు. “ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు. కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి...మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు. జరాసంధుడిచే బంధింపబడిన ఆరాజులందరూ ఈ విధంగా శ్రీకృష్ణుడిచేత బంధవిముక్తులై, ఎంతో సంతోషంతో గౌరవప్రదంగా వారి వారి రాజ్యాలకు బయలుదేరారు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, శ్రీకృష్ణుడిని... ఆ రాజులు అనేక రకాల నుతిస్తూ తమ తమ రాజ్యాలకు వెళ్ళారు. ఆ రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి, తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరంగా నివేదించాడు. కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలుతుండగా కృష్ణుడికి తమమీద గల స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. “ఓ కమల నయనా! శ్రీకృష్ణా! నీ అంశంనుండి జన్మించిన దిక్పాలకులు అందరూ సర్వలోకాలకూ గురుడవైన నీ ఆజ్ఞను శిరసావహిస్తూ లోకాలు అన్నింటినీ పరిపాలిస్తున్నారు. అంతటి నీకు ఒక సామాన్యుడైన భూపాలుడిని శిక్షించడం ఒక లెక్కలోనిది కాదు. ఇదంతా నీ మాయ కాక మరేమిటి గోవిందా! పుండరీకాక్ష! లోకరక్షకా! చిన్మయరూపా! అద్వితీయమైన నీ తేజస్సుకు తిరుగు లేదు. నీ పాదసేవకులకు భేదభావం ఏమాత్రం కానరాదు.”


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

శ్రీ బుడా అమర్ నాథ్ మందిర్

 🕉 మన గుడి : నెం 230


⚜ జమ్మూకాశ్మీర్  : రాజ్ పురామండి


⚜ శ్రీ బుడా అమర్ నాథ్ మందిర్



💠 కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహలో ఉన్న పార్వతికి పరమశివుడు చెప్పిన అమరత్వం యొక్క కథ బుధఅమర్‌నాథ్ ప్రదేశం నుండి ప్రారంభమైందని మరియు ఇప్పుడు ఈ ఆలయ దర్శనం లేకుండానే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది అని నమ్ముతారు. 

బుద్ధ అమర్‌నాథ్ క్షేత్రం దర్శించనిదే అమరత్వం సాధ్యం కాదు.

కథ మాత్రమే కాదు, అమర్‌నాథ్ యాత్ర కూడా అసంపూర్ణం.  


💠 హిందువులకు మతపరమైన స్థలం అయినప్పటికీ, దాని చుట్టూ హిందూ ఇళ్ళు లేకపోవడం మరియు ఈ ఆలయాన్ని సమీపంలో నివసిస్తున్న ముస్లిం కుటుంబాలు మరియు సరిహద్దు భద్రతా దళం సిబ్బంది మాత్రమే చూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.



💠 ఈ ఆలయంలోని శివలింగం సహజంగా ఏర్పడినది. 

బుద్ధ అమర్‌నాథ్ మందిరం కాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌జీ యొక్క చారిత్రక గుహ మందిరం కంటే పురాతనమైనది.


💠 పూంచ్ జిల్లాలో ఉన్న బాబా బుడా అమర్నాథ్, బుద్ధ అమర్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 4,600 అడుగుల ఎత్తులో ఉంది.  దాని సుందరమైన ప్రదేశం, లోయలు మరియు సమీపంలో ప్రవహించే పులస్తీ నది, ఆలయ అందాన్ని పెంచుతాయి.  


💠 అమర్‌నాథ్ యాత్ర కోసం ప్రజలు ఈ ప్రదేశానికి వస్తారు మరియు ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో శివలింగము ఉంది.  

వేలాది మంది యాత్రికులు, శివునిపై ఉన్న అపారమైన విశ్వాసం కారణంగా, ఈ ఆలయానికి చేరుకోవడానికి, స్వామివారి ఆశీర్వాదం కోసం, వంకర మార్గాలు మరియు పర్వతాల మీదుగా కష్టతరమైన ప్రయాణం చేస్తారు. 



💠 పిర్ పంజాల్ పర్వత శ్రేణి దిగువన నెలకొని ఉన్న ఈ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలు ఏడాది పొడవునా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటాయి, ఇది ఎల్లప్పుడూ అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది.  

లోరన్ నది కూడా ఆలయం యొక్క ఒక వైపున ప్రవహిస్తుంది, దీనిని 'పులస్త్య నది' అని కూడా పిలుస్తారు మరియు దాని నీరు మంచు కంటే చల్లగా ఉంటుంది. 


💠 పూంచ్ పట్టణం యొక్క మొదటి పేరు పులస్త్య అని గమనించాలి.  మంచుతో కప్పబడిన పర్వతాలు, ఒడ్డున ప్రవహించే స్వచ్ఛమైన నీటి నది మరియు దాని చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాల కారణంగా, ఈ అందమైన ప్రదేశం హిల్ స్టేషన్ కంటే తక్కువ కాదు.


💠 పురాణాల ప్రకారం ఇక్కడ ప్రవహించే నదికి రావణుడి తాత అయిన ఋషి పుల్సత పేరు పెట్టారు.

యాత్రికులు ఆలయంలోకి ప్రవేశించే ముందు పుల్సత నదిలో స్నానం  పవిత్రమైనదని చాలామంది నమ్ముతారు.  

ఈ పవిత్ర స్థలం నల్లా గాగ్రీ మరియు పుల్స్తా నది అనే రెండు ప్రవాహాల సంగమం మీద ఉంది. 


💠 ఆలయ సముదాయంలో శివుని ప్రధాన మందిరం మరియు గణేశుడు మరియు దుర్గాదేవి వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న ఆలయాలు ఉన్నాయి.

 

💠 ఈ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి వార్షిక బుధ అమర్‌నాథ్ యాత్ర, ఇది ప్రతి సంవత్సరం జూలై మరియు ఆగస్టులో జరుగుతుంది. 

ఈ యాత్ర భారతదేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులను ఆలయానికి సవాలుగా ట్రెక్ చేస్తారు. 

ఈ నడక దాదాపు 16 కి.మీ పొడవు మరియు 2-3 రోజులు పడుతుంది, ఈ ప్రాంతంలోని అత్యంత అందమైన మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాల గుండా వెళుతుంది.


💠 వార్షిక యాత్రతో పాటు, ఆలయాన్ని సందర్శించే సందర్శకులు ట్రెక్కింగ్ , క్యాంపింగ్ మరియు ప్రకృతి నడక వంటి వివిధ కార్యకలాపాలను కూడా ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల పర్వతాలు మరియు అడవులు అనేక అరుదైన మరియు అంతరించిపోతున్న జాతులతో సహా వివిధ వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి.


💠 రక్షా బంధన్ సందర్భంగా జరిగే  మతపరమైన కార్యక్రమం( మేళా) స్వామి బుధ అమర్నాథ్  పండుగగా పిలువబడుతుంది. మేళాకు మూడు రోజుల ముందు, మతపరమైన సమావేశం జరుగుతుంది.


💠 ఈ సభలో అఖారా మహంత్ యొక్క భజన, కీర్తనలు మరియు ప్రవచనాలు (ప్రసంగం) తర్వాత అన్ని వర్గాల ప్రజలు వచ్చి నివాళులు అర్పిస్తారు. 


💠 ఛరీ ముబారక్ ఊరేగింపు అఖారా నుండి ప్రారంభమవుతుంది. 

వేలాది మంది భక్తులు మరియు సాధువులు కాలినడకన మండి వద్ద స్వామి బుధ అమర్‌నాథ్ జీ మందిరానికి దారితీసే ఊరేగింపుతో పాటు వెళతారు. 

మొదటి మరియు ప్రధాన హాల్ట్ చందక్ వద్ద ఉంది. 

పూంచ్ నుండి మండికి వెళ్లే మార్గంలో, ఛరీ ముబారక్‌ను స్వాగతించడానికి అనేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు మరియు యాత్రలు మరియు ఉచిత లంగర్ మరియు ఇతర తినదగిన వస్తువులు వారికి అందించబడతాయి. 

స్టాల్స్‌ను ముస్లింలు కూడా నిర్వహిస్తున్నారు


 💠 జమ్మూ నుండి 235 కి.మీ దూరంలో ఉన్న చందక్ గుండా వెళుతుంది మరియు జమ్మూ-పూంచ్ హైవేపై పూంచ్ పట్టణానికి కేవలం 11 కి.మీ ముందు చందక్ వస్తుంది. 

శిశుపాల వధ, జరాసంధుని వధ

 https://youtu.be/6xIHAREpufc?si=tF3E22_LFavTTiPl


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 ఉత్తర దేశం, దక్షిణ ప్రాంతంలోని మహాభారతం గ్రంధాల్లో ఎన్ని రకాల వ్యత్యాసాలున్నాయో ఈ ఎపిసోడ్ లో సోదాహరణంగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. నీరజ గారు. శిశుపాల వధ, జరాసంధుని వధ లో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాగే మయసభ, ద్రౌపదీ వస్త్రాపహరణం ఘట్టాల్లోనూ చాలా మార్పులు కనిపిస్తాయి. ధృతరాష్ట్రుడు ద్రౌపదికిచ్చిన వరాలేమిటి? ఎందుకిచ్చాడు? అన్నది తెలుసుకోవాల్సిందే. అందరికీ తెలియని ఎన్నో విషయాలు వివరించారు. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

*శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు..*


శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపం లోని ఫకీరు మాన్యం భూమిని తన ఆశ్రమం కోసం ఎంపిక చేసుకోవటం..అందుకు శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లు సంతోషంగా సమ్మతి తెలపడం..ఆ భూమిని శ్రీ స్వామివారి పేరిట రిజిస్ట్రేషన్ చేయటం చక చకా జరిగిపోయాయి..ఇక ఆశ్రమ నిర్మాణం జరగాలి..

"శ్రీధరరావు గారూ..మీరు గృహస్థులు..మీకూ బాధ్యతలున్నాయి..ఆశ్రమనిర్మాణానికి మీమీద భారం పడదు.. అందుకు వేరేవాళ్ళు వస్తారు.." అని శ్రీ స్వామివారు చెప్పారు..


నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ఆ బాధ్యత నెత్తిమీద తీసుకున్నారు..శ్రీ స్వామివారి మీద  అచంచల విశ్వాసం మీరాశెట్టి దంపతుల స్వంతం..తమ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆశ్రమ నిర్మాణ స్థలానికి వచ్చేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేదు..శ్రీ స్వామివారు ఆ విషయంలో చాలా స్పష్టంగా "మీరాశెట్టీ మీకు సంతాన యోగం లేదు..నాకు ఆశ్రమం కట్టిస్తే మీకు పిల్లలు పడతారని అపోహ పడొద్దు.." అని ముందుగానే చెప్పారు..మీరాశెట్టి గారు కూడా తాను ఆశ్రమాన్ని నిర్మించి ఇవ్వదల్చుకొన్నాననీ..మరేవిధమైన కోరికా లేదని తేల్చి చెప్పేసారు..


ఆశ్రమం నిర్మాణం పూర్తయిన తరువాత కూడా..మీరా శెట్టి దంపతులు శ్రీ స్వామివారి దర్శనార్ధం తరచూ వచ్చేవారు..ఒక్కొక్కసారి తమతో పాటు కొంతమంది వ్యక్తుల ను కూడా తీసుకొచ్చేవారు..అలా వచ్చినవారి ప్రాప్తాన్ని బట్టి శ్రీ స్వామివారి దర్శనం జరిగేది..శ్రీ స్వామివారు తనకు నచ్చినప్పుడే మనసు విప్పి మాట్లాడేవారు..అందుకు ఒక నిర్దిష్ట సమయమంటూ లేదు..తన దగ్గరకు ఎవరు ఏ కోరికతో వస్తున్నారో ముందుగానే శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసు..అందుకు తగ్గట్టు గానే మాట్లాడేవారు..ఈ విషయం లో శ్రీధరరావు దంపతులకు(మా తల్లిదండ్రులు) మీరాశెట్టి దంపతులకు చాలా అనుభవాలు కలిగాయి..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా మీరాశెట్టి గారు ఆశ్రమానికి వస్తూ వుండేవారు..వారి ప్రోద్బలం, కృషి తోనే..శ్రీ చెక్కా కేశవులు గారు, శ్రీ మెంటా మస్తానరావు గారు, శ్రీ గోనుగుంట పెద్దిశెట్టి గారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి మందిర వెనుకవైపు స్థలంలో..మందిరానికి అతి సమీపంలో "ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని" కట్టించారు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి, మహాశివరాత్రి పర్వదినానికి.. ఆర్యవైశ్య అన్నదాన సత్రం తరఫున అందరికీ అన్నదానం చేసేవారు..ప్రస్తుతం వారెవ్వరూ జీవించి లేకపోయినా..వారిచ్చిన స్ఫూర్తి తో ఆ సత్రం తరఫున యధావిధిగా సేవలు జరుగుతున్నాయి..శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు..


మీరాశెట్టి గారు జీవించి ఉన్నంత కాలమూ..తనకు తెలిసిన వాళ్ళెవరికి ఏ సమస్య వచ్చినా..వారి సమస్య పరిష్కారం కోసం శ్రీ స్వామివారి సమాధిని దర్శించి, మ్రొక్కుకోమని చెప్పేవారు..అలా ఎంతోమంది స్వాంతన పొందేవారు..మీరాశెట్టి గారికి సంతానం లేకపోయినా..సంతానం లేని వారికి మాత్రం..శ్రీ స్వామివారి సమాధి వద్ద మ్రొక్కుకుంటే చాలు సంతానం కలుగుతుందని గట్టిగా చెప్పేవారు..చిత్రంగా ఆయన నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు..అలా సంతానం పొందిన వారి వద్ద ముందుగానే శ్రీ స్వామివారి మందిర అభివృద్ధికి సహాయం చేయాలని ఒప్పించేవారు..అలా మీరాశెట్టి గారి ద్వారా శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించి, సంతానం పొందిన అనేక మంది భక్తులలో..వింజమూరు గ్రామానికి చెందిన కామేశ్వర రావు గారొకరు..శ్రీ కామేశ్వర రావు గారు మీరాశెట్టి గారికి దగ్గర బంధువు కూడా..మీరాశెట్టి గారిని "పెదనాయనా" అని పిలిచేవారు..


ఆ కామేశ్వర రావు గారు ఈమధ్య తన కూతురి వివాహం కుదిరందనీ..ఆ వివాహానికి మందిరం లో ఉన్న మమ్మల్ని అందరినీ రమ్మని పిలువడానికి వచ్చినప్పుడు, తనకు సంతానం కలగడానికి శ్రీ స్వామివారి ఆశీర్వాదమే కారణమని..అందుకు శ్రీ మీరాశెట్టి గారి ప్రోద్బలమే కారణమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..


మీరాశెట్టి గారి సలహాతో శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించి తరించిన భక్తుల అనుభవాలను..మీరాశెట్టి గారి ద్వారా స్వయంగా నేను విన్నవీ..భక్తుల ద్వారా సేకరించినవీ..కొన్నింటిని..రేపటి నుంచీ..ముందుగా శ్రీ కామేశ్వర రావు గారి అనుభవంతో మొదలుపెట్టి..ఓ నాలుగైదు రోజుల పాటు ఈ సోషల్ మీడియా వేదికగా చదువుకుందాము..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం -‌ చతుర్థి - ఉత్తరాభాద్ర -‌ భౌమ వాసరే* *(13-02-2024)* 


ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*13-02-2024 / మంగళవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

వృషభం


నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

---------------------------------------

మిధునం


గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.

---------------------------------------

సింహం


భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు.

---------------------------------------

కన్య


దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

---------------------------------------

తుల


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.

---------------------------------------

వృశ్చికం


శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

ధనస్సు


గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి.

---------------------------------------

మకరం


నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం


సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.

---------------------------------------

మీనం


కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

🍀 *శుభం భూయాత్* 🍁

వైరాగ్యం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 

*తద్వైరాగ్యం జిహా సా యా దర్శన శ్రవణాదిభిః!*

*దేహాది బ్రహ్మపర్యన్తే హ్యనిత్యే భోగవస్తుని!!*


*_సాధనాచతుష్టయం_*

*_శ్రీ శంకారాచార్య_*


తా𝕝𝕝 *వైరాగ్యం అనగా, ఈ దేహం మొదలుకొని, సమస్త అశాశ్వతమైన ఇంద్రియ సంబంధిత కోరికలు, చివరకు బ్రహ్మపదవిని కూడా దూరముగా పెట్టగలిగిన నిగ్రహం అలవరచుకోగలగటమే*....

History

 .

 1 = 1193 *ముహమ్మద్ ఘోరి*

 2 = 1206 *కుతుబుద్దీన్ ఐబాక్*

 3 = 1210 *అరామ్ షా*

 4 = 1211 *ఇల్టుట్మిష్*

 5 = 1236 *రుక్నుద్దీన్ ఫిరోజ్ షా*

 6 = 1236 *రజియా సుల్తాన్*

 7 = 1240 *ముయిజుద్దీన్ బహ్రమ్ షా*

 8 =1242 *అల్లావుద్దీన్ మసూద్ షా*

 9 = 1246 *నాసిరుద్దీన్ మెహమూద్*

 10 = 1266 *గియాసుడిన్ బల్బన్*

 11 = 1286 *కై ఖుష్రో*

 12 = 1287 *ముయిజుద్దీన్ కైకుబాద్*

 13 = 1290 *షాముద్దీన్ కామర్స్*

        1290 *బానిస రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)


 *ఖిల్జీ రాజవంశం*

 1 = 1290 జలాలుద్దీన్ *ఫిరోజ్ ఖిల్జీ*

 2 = 1296 *అల్లాదీన్ ఖిల్జీ*

 4 = 1316 *సహబుద్దీన్ ఒమర్ షా*

 5 = 1316 *కుతుబుద్దీన్ ముబారక్ షా*

 6 = 1320 *నాసిరుదిన్ ఖుస్రో షా*

 7 = 1320 *ఖిల్జీ* *రాజవంశం ముగిసింది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)


 *తుగ్లక్ రాజవంశం*

 1 = 1320 *గయాసుద్దీన్ తుగ్లక్ I*

 2 = 1325 *ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ*

 3 = 1351 *ఫిరోజ్ షా తుగ్లక్*

 4 = 1388 *గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ*

 5 = 1389 *అబూబకర్ షా*

 6 = 1389 *ముహమ్మద్ తుగ్లక్ మూడవ*

 7 = 1394 *సికందర్ షా మొదటి*

 8 = 1394 *నాసిరుదిన్ షా దుస్రా*

 9 = 1395 *నస్రత్ షా*

 10 = 1399 *నాసిరుద్దీన్ మహమ్మద్ షా*

వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు

 11 = 1413 *డోలత్ షా*

 1414 *తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)


 *సయ్యిద్ రాజవంశం*

 1 = 1414 *ఖిజ్ర్ ఖాన్*

 2 = 1421 *ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ*

 3 = 1434 *ముహమ్మద్ షా నాల్గవ*

 4 = 1445 *అల్లావుద్దీన్ ఆలం షా*

 1451 *సయీద్* *రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)


 *అలోడి రాజవంశం*

 1 = 1451 *బహ్లోల్ లోడి*

 2 = 1489 *అలెగ్జాండర్ లోడి రెండవది*

 3 = 1517 *ఇబ్రహీం లోడి*

 1526 *లోడి రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)


 *మొఘల్ రాజవంశం*

 1 = 1526 *జహ్రుదిన్ బాబర్*

 2 = 1530 *హుమయూన్*

 1539 *మొఘల్ రాజవంశం సమయం ముగిసింది*


 *సూరి రాజవంశం*

 1 = 1539 *షేర్ షా సూరి*

 2 = 1545 *ఇస్లాం షా సూరి*

 3 = 1552 *మహమూద్ షా సూరి*

 4 = 1553 *ఇబ్రహీం సూరి*

 5 = 1554 *ఫిరుజ్ షా సూరి*

 6 = 1554 *ముబారక్ ఖాన్ సూరి*

 7 = 1555 *అలెగ్జాండర్ సూరి*

 *సూరి రాజవంశం ముగుస్తుంది,*

(పాలన -16 సంవత్సరాలు సుమారు)


 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*

 1 = 1555 *హుమాయున్ మళ్ళీ సింహాసనం పైన* 

 2 = 1556 *జలాలుద్దీన్ అక్బర్*

 3 = 1605 *జహంగీర్ సలీం*

 4 = 1628 *షాజహాన్*

 5 = 1659 u *రంగజేబు*

 6 = 1707 *షా ఆలం మొదట*

 7 = 1712 *జహదర్ షా*

 8 = 1713 *ఫరూఖ్సియార్*

 9 = 1719 *రైఫుడు రజత్*

 10 = 1719 *రైఫుడ్ దౌలా*

 11 = 1719 *నెకుషియార్*

 12 = 1719 *మహమూద్ షా*

 13 = 1748 *అహ్మద్ షా*

 14 = 1754 *అలమ్‌గీర్*

 15 = 1759 *షా ఆలం*

 16 = 1806 *అక్బర్ షా*

 17 = 1837 *బహదూర్ షా జాఫర్*

 1857 *మొఘల్ రాజవంశం ముగుస్తుంది*

 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)


 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*

 1 = 1858 *లార్డ్ క్యానింగ్*

 2 = 1862 *లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్*

 3 = 1864 *లార్డ్ జాహోన్ లోరెన్ష్*

 4 = 1869 *లార్డ్ రిచర్డ్ మాయో*

 5 = 1872 *లార్డ్ నార్త్‌బుక్*

 6 = 1876 *లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్*

 7 = 1880 *లార్డ్ జార్జ్ రిపోన్*

 8 = 1884 *లార్డ్ డఫెరిన్*

 9 = 1888 *లార్డ్ హన్నీ లాన్స్‌డన్*

 10 = 1894 *లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్*

 11 = 1899 *లార్డ్ జార్జ్ కర్జన్*

 12 = 1905 *లార్డ్ టివి గిల్బర్ట్ మింటో*

 13 = 1910 *లార్డ్ చార్లెస్ హార్డింగ్*

 14 = 1916 *లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్*

 15 = 1921 *లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్*

 16 = 1926 *లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్*

 17 = 1931 *లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్*

 18 = 1936 *లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో*

 19 = 1943 *లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్*

 20 = 1947 *లార్డ్ మౌంట్ బాటన్*


*బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.*


 *ఆజాద్ ఇండియా, ప్రధాని*

 1 = 1947 *జవహర్‌లాల్ నెహ్రూ*

 2 = 1964 *గుల్జారిలాల్ నందా*

 3 = 1964 *లాల్ బహదూర్ శాస్త్రి*

 4 = 1966 *గుల్జారిలాల్ నందా*

 5 = 1966 *ఇందిరా గాంధీ*

 6 = 1977 *మొరార్జీ దేశాయ్*

 7 = 1979 *చరణ్ సింగ్*

 8 = 1980 *ఇందిరా గాంధీ*

 9 = 1984 *రాజీవ్ గాంధీ*

 10 = 1989 *విశ్వనాథ్ ప్రతాప్సింగ్*

 11 = 1990 *చంద్రశేఖర్*

 12 = 1991 *పివి నరసింహారావు*

 13 = *అటల్ బిహారీ వాజ్‌పేయి*

 14 = 1996 *H.D. దేవగౌడ*

 15 = 1997 *ఐకె గుజ్రాల్*

 16 = 1998 AB *వాజ్‌పేయి*

 17 =2004 Dr. *మన్మోహన్ సింగ్*

*18 = 2014 నుండి నరేంద్ర మోడీ*

*764 సంవత్సరాల తరువాత,పరదేశీ మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.* *సుమారు "800" సంవత్సరాలు భారతదశాన్ని మహమ్మదీయలు పరిపాలించారు.*

 

*ఇప్పుడు చెప్పండి ఎవరు మైనారిటీలు ?.*


*ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి...*


*మనం "1000" సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా దేశంగా మనుగడలో ఉన్నది.*

*మన భారతీయ సంస్కృతిని,ధర్మాన్ని అనుసరించి, కులమత బేదాలను విడనాడి ఐక్యఅతను, సమరసతను కాపాడుకోవాలి, స్థిరంగా, దృఢంగా అభివృద్ధి సాధించాలి.*

 *

శంఖం

 *శంఖం అంటే ఏమిటి?*

                 ➖➖➖✍️


*శంఖం అనేది రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం.* 


*క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒక్కటిగా మన పురాణాలు చెబుతున్నాయి.* 


*భారతదేశ హిందూ సంస్కృతిలో 'శంఖం'నకు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీలక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది.* 


*పురాణాల ప్రకారం క్షీరసాగర మధన సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన 14 రత్నాలలో శంఖం ఒకటి.*


*శంఖం ఆధ్యాత్మికంగా చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. దక్షిణావృత శంఖం ఎంతో శ్రేష్ఠమైంది. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో ‘పాంచజన్యం’ అనే శంఖాన్ని పూరించాడు. అదే విధంగా అర్జునుడి శంఖాన్ని ‘దేవదత్తం’గానూ, భీముని శంఖం ‘పౌండ్రకం’ అనీ, యుధిష్ఠరుని శంఖాన్ని ‘అనంత విజయ’మనీ, నకులుని శంఖాన్ని ‘సుఘోష’నామంతో, సహదేవుని శంఖాన్ని ‘మణిపుష్ప’ అన్న పేర్లతో పిలుస్తారని మహాభారతకథ చెబుతుంది.*


*శత్రు వర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖాన్ని పూరించడమన్నది యుద్ధ నియమాలలో ఒకటి. విజయ సూచికంగా కూడా శంఖాన్ని పూరించడమన్నది ఓ ఆచారం.* 


*శంఖం నేపథ్యం .. లక్ష్మీ, శంఖం సముద్ర తనయలని విష్ణు పురాణం చెబుతోంది. వరుణుడు, చంద్రుడు, సూర్యుడు శంఖం యొక్క పీఠభాగంలోనూ, ప్రజాపతి ఉపరితలం మీద, గంగా సరస్వతులు ముందు భాగంలో ఉంటారు. విష్ణు మూర్తి దుష్ట శక్తులను పారద్రోలడంలో శంఖాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి ఆయుధాలలో శంఖం ఒకటిగా మారింది.*


*పవిత్రకు చిహ్నాం నిజానికి శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగాను భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు.* 


*’శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు!’ అనే నానుడి మనకు తెలిసినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక, ధార్మిక ఉత్సవాలు, యఙ్ఞాలు, శివరాత్రి పర్వదినాలలో శంఖాన్ని స్థాపించి పూజ చేస్తారు. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు. శంఖాన్ని పూజిస్తారు.*


*శంఖాలు .. రకాలు:*


*శంఖాలలో వివిధ రకాలున్నాయి.*

*దీని ఆకారాన్ని బట్టి దక్షిణావర్త శంఖం, మధ్యమావర్త శంఖంగా చెప్తారు. వీటిలోనూ లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖాలు ఉన్నాయి. భారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయ శంఖాన్ని, భీముడు పౌండ్ర శంఖాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పక శంఖాలను, విరాటుడు సాత్విక శంఖాన్ని పూరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.*


*పూజ గదిలో దక్షిణావర్త శంఖం సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఉన్న చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి. ఫలితాలు శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది.*


*శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుతనం వృద్ధి చెందుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది. శంఖం ఊదడం వల్ల గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. క్రిమి, కీటనాలు నశిస్తాయి దీనిని పూరించేటప్పుడు వెలువడే కంపనాలతో వాతావరణంలో ఉండే రోగకారకాలైన క్రిములు నశిస్తాయి.* *శంఖారావం వల్ల మనిషిలో తమో, రజో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందంటారు. అందువలనే శంఖాన్ని పూరించడం వల్ల గాని, ఆ ధ్వనిని వినడంవలన గాని ఆరు నెలల పురాణ శ్రవణం విన్న ఫలం, వేదఘోష విన్న ఫలం దక్కుతుంది .*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

హనుమాన్ చాలీసా

 హనుమాన్ చాలీసా ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? 

ప్రతి ఒక్కరూ పవన్‌పుత్ర హనుమాన్ జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు, అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది, ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.

విషయం 1600 AD నాటిది, ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ జీ కాలంలో జరిగింది.

ఒకసారి తులసీదాస్ జీ మధురకు వెళుతుండగా, రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు, తులసీదాస్ జీ ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది. ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే, ఈ తులసీదాసు ఎవరు అని బీర్బల్‌ని అడిగాడు.


అప్పుడు బీర్బల్ చెప్పాడు, అతను రామచరిత్ మానస్ అనువదించాడు, ఇతను గొప్ప రామభక్తుడు, నేను కూడా అతనిని చూసి వచ్చాను. అక్బర్ కూడా ఆయన్ను చూడాలనే కోరికను వ్యక్తం చేస్తూ, నాకు కూడా ఆయన్ను చూడాలని ఉందని చెప్పాడు.

అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందాన్ని తులసీదాస్ జీ వద్దకు పంపి, మీరు ఎర్రకోటకు హాజరుకావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్ జీకి తెలియజేశాడు. ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ జీ నేను శ్రీరాముని భక్తుడిని, చక్రవర్తికి మరియు ఎర్రకోటతో నేను ఏమి చేయాలి అని చెప్పాడు మరియు ఎర్రకోటకు వెళ్లడానికి స్పష్టంగా నిరాకరించాడు. ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరినప్పుడు, అతను చాలా బాధపడ్డాడు మరియు కోపంతో ఎర్రబడ్డాడు, తులసీదాస్ జీని గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని ఆదేశించాడు.

తులసీదాస్ జీ గొలుసులతో కట్టబడిన ఎర్రకోటకు చేరుకున్నప్పుడు, అక్బర్ మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు, కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు. నేను శ్రీరాముడి భక్తుడిని మాత్రమేనని, మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసీ దాస్ అన్నారు. అది విన్న అక్బర్ ఆగ్రహించి, వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు.

రెండవ రోజు, లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి.

భయాందోళనలు కలిగాయి, అప్పుడు అక్బర్ బీర్బల్‌ని పిలిచి, ఏమి జరుగుతోందని అడిగాడు, అప్పుడు బీర్బల్ అన్నాడు, హుజూర్, మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా, చూడండి. అక్బర్ వెంటనే తులసీదాస్ జీని చెరసాల నుండి బయటకు రప్పించాడు. మరియు గొలుసులు తెరవబడ్డాయి. తులసీదాస్ జీ బీర్బల్‌తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను.


నేను చెరసాలలో ఉన్న శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తుచేసుకున్నాను, నేను ఏడుస్తున్నాను. మరియు ఏడుస్తూ, నా చేతులు వాటంతటవే ఏదో రాసుకుంటున్నాయి. ఈ 40 చౌపాయ్‌లు హనుమాన్ జీ స్ఫూర్తితో వ్రాయబడ్డాయి.

జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ జీ మాట్లాడుతూ, నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో, అదే విధంగా, ఎవరు కష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నారో, ఇలా పారాయణం చేసినా అతని బాధలు, కష్టాలు అన్నీ తీరిపోతాయి. దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు.

అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసీదాస్ జీకి క్షమాపణలు చెప్పాడు మరియు అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో, మధురకు పంపాడు.

ఈరోజు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. మరియు హనుమంతుని దయ వారందరిపై ఉంది.

మరియు అందరి కష్టాలు తొలగిపోతాయి. అందుకే హనుమాన్ జీని "సంకట్ మోచన్" అని కూడా అంటారు.


* దయచేసి ఈ సంస్కారవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, దయచేసి వీలైనంత ఎక్కువ షేర్ చేయండి.*



మంచి రోజు

🙏🏻🙏🏻🙏🏻

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.13.02.2024 

మంగళ వారం (భౌమ వాసరే) 

***************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

శుక్ల పక్షే చతుర్ధ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.33

సూ.అ.5.57

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం*

*శిశిర ఋతువు*

*మాఘ మాసం* 

*శుక్ల పక్షం* 

*చవితి రా. 8.24 వరకు*. 

*మంగళ వారం*. 

*నక్షత్రం ఉత్తరాభాద్ర సా. 6.06 వరకు*. 

అమృతం ప.1.38 ల 3.08 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.49 ల 9.35 వరకు. 

దుర్ముహూర్తం రా.10.59 ల 11.49 వరకు. 

వర్జ్యం తె.5.21 ల మరునాడు ఉ.6.51 వరకు. 

యోగం సిధ్ధం ఉ. 7.23 వరకు.   

యోగం సాధ్యం తె. 4.17 వరకు. 

కరణం వనజి ఉ.9.34 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ.3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ప.9.00 ల 10.30 వరకు. 

************ 

పుణ్యతిధి మాఘ శుధ్ధ చవితి. 

************

*గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*

*12/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏

.

నీ ధర్మాన్ని

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లో𝕝𝕝 నాహారం చిన్తయేత్ ప్రాఙ్ఞో*

 *ధర్మమేకం హి చిన్తయేత్।*

*ఆహరో హి మనుష్యాణాం*

 *జన్మనా సహ జాయతే॥*


*తా𝕝𝕝 "రేపటిరోజున ఆహరం దొరుకుతుందా లేదా అనే విచారణ వద్దు. నిన్ను పుట్టించిన పైవాడే చూసుకుంటాడు. బుద్ధిమంతుడవై నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా ఆచరిస్తే చాలు!"*

🧘‍♂️🙏🪷 ✍️🙏

మంగళవారం, ఫిబ్రవరి 13,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, ఫిబ్రవరి 13,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - శుక్ల పక్షం

తిథి:చవితి రా8.27 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే) 

నక్షత్రం:ఉత్తరాభాద్ర రా6.07 వరకు 

యోగం:సిద్ధం ఉ7.42 వరకు తదుపరి సాధ్యం తె4.40 వరకు

కరణం:వణిజ ఉ9.34 వరకు తదుపరి భద్ర రా8.27 వరకు

వర్జ్యం:తె5.23నుండి

దుర్ముహూర్తము:ఉ8.49 - 9.35 &

రా10.58 - 11.49

అమృతకాలం:మ1.37 - 3.07

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: మకరం

చంద్రరాశి :మీనం 

సూర్యోదయం:6.33

సూర్యాస్తమయం:5.56


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

మనసే ప్రధానమ్*

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*



*#మనసే ప్రధానమ్*


*మనం ఎన్ని పూజలు /మంచి పనులు చేసినా - మన మనస్సులో మార్పురాక పోతే అంతా వృథా*


పూర్వం దీని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది


1) ఒక ఊరిలోని వీధిలో ఒక వేశ్య & ఒక బ్రాహ్మణుడు ఎదురుగా ఉన్న ఇళ్లలో ఉండేవారు


2) బ్రాహ్మణుడి ఇంటికి నిరంతరం వేద పండితులు వస్తూ పోతూ ఉండేవారు

3) ఎంతో మంది వచ్చి పూజలు/యజ్ఞాలు/హోమాలు చేసుకొని వెళుతూ ఉండేవారు

4) ఆ వేశ్య నిరంతరం వీటి మీద ధ్యాస పెడుతూ ,ఆలోచిస్తూ ఉండేది

5) బ్రాహ్మణుడు ఎంత చక్కగా పూజలు చేస్తున్నాడు , నేను కూడా అలా చేస్తే బాగుండేది అని


6) ఆ వేశ్య ఇంటికి నిరంతరం ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు

7) ప్రతీ రోజూ ఏదో ఒక వినోద కార్యక్రమం జరుగుతూ ఎంతో ఆహ్లాదంగా /సందడిగా ఆ వేశ్య ఇల్లు ఉండేది

8) ఆ బ్రాహ్మణుడు నిరంతరం వీటి మీద ధ్యాస పెడుతూ ,ఆలోచిస్తూ ఉండేవాడు

9) ఆ వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు , ఏం జరుగుతోంది అని మనసులో అనుకుంటూ ఉండే వాడు


10) ఒక రోజు ఇద్దరూ ఒకే రోజు మరణించారు

11) యమభటులు వచ్చి బ్రాహ్మణుడిని తీసుకువెళుతున్నారు

12) విష్ణుభటులు వచ్చి ఆ వేశ్యను స్వర్గానికి తీసుకువెళుతున్నారు


13) ఆ బ్రాహ్మణుడు పొరపాటున తారు మారు అయ్యింది - నేను స్వర్గానికి వెళ్ళాలి & ఆ వేశ్య నరకానికి వెళ్ళాలి అని అంటాడు

14) అప్పుడు ఆ యమభటులు అంటారు - నీ మనస్సు నిరంతరం ఆ వేశ్య ఇంటి పై ఉన్నది కాబట్టి నీకు నరకలోకం 

15) ఆ వేశ్య మనసు నిరంతరం పూజలు /యజ్ఞాల మీద ఉన్నది కనుక ఆమెకు స్వర్గలోకం అని వివరణ ఇచ్చారు


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸