29, నవంబర్ 2024, శుక్రవారం

అర్చకుడు కావలి

  పిల్లర్ నెంబరు 54 పుష్పగిరి పీఠం దేవాలయము మహిదిపట్నం నందు ప్రధాన అర్చకుడు కావలిట 15000 జీతం సింగిల్ బెడ్రూం ఇల్లు ఇస్తారు ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి వారికి పంచ సూక్తాలు వచ్చి ఉంటే చాలుట ఎందుకంటే పంచసూక్తల లో నమకం చమకం కూడా ఉంటుంది కనుక దానితోటి అభిషేకం శివునికి చేసుకోగలిగితే చాలు అని అంటున్నారు లేదు మహాన్యాసం చేయగలిగిన వారు చేయించగలిగే వారు ఉన్నా వారికి ప్రత్యేకత ఉంటుంది ప్రతి సోమవారం మాత్రమే వారికి ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ వచ్చేటువంటి ప్లేట్ కలెక్షన్ కూడా అర్చకులకే ఫోన్ నెంబర్ పెడుతున్నాను దయచేసి వారితో మాట్లాడుకోగలరు ఆసక్తి ఉన్నవారు094400 66717

తిరుమల సర్వస్వం -73*

 **తిరుమల సర్వస్వం -73* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 12*

స్వర్ణ రథోత్సవం* 

ఆరవరోజు సాయంసంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు ప్రసరిస్తుండగా, దివ్యకాంతులీనుతున్న స్వర్ణరథంలో ఇరువురు దేవేరులతో కలిసి మలయప్పస్వామి వారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు నేత్రానందం కలిగిస్తారు. పోయిన బ్రహ్మోత్సవాల్లో తన ప్రియభక్తుడు వాయిపుత్రునిపై, ధనుర్బాణాలు ధరించి, అయోధ్యాదీశునిగా, కటి-వరద హస్తాలతో, కలియుగ దైవంగా స్వామి దర్శనమిచ్చారు. 

‌ బ్రహ్మదేవుని శూన్యరథం, గజ-అశ్వ-వృషభాదులు యధావిధిగా స్వర్ణరథోత్సవంలో కూడా పాల్గొంటాయి. దాసభక్తులనృత్యాలతో, భజనబృందాల కోలాహలంతో మాడవీధులు కడురమణీయతను సంతరించుకుంటాయి.

స్వర్ణం అంటే, "మిక్కిలి ప్రకాశించేది" అని వ్యుత్పత్తి. బంగారం మహా శక్తివంతమైన లోహం. ఈలోహం శరీరాన్ని తాకుతుంటే దేహంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. అనేకానేక ఔషధోత్పత్తుల్లో స్వర్ణం వినియోగించ బడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంలో యుగయుగాల నుంచి ఈనాటివరకూ, స్వర్ణం పాత్ర వెలకట్టలేనిది. బంగారాన్ని తాకట్టు పెట్టో లేదా తెగనమ్మో, కష్టాల కడలి నుండి గట్టెక్కడం సత్యహరిశ్చంద్రునికాలం నుండి, ఆధునిక జగత్తులో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వర్తక, వాణిజ్య, వినిమయాలకు సువర్ణ నాణాలను వినియోగించే సాంప్రదాయం, కలియుగారంభం నుండి, ఈ మధ్యకాలం వరకూ ఉండేది. పద్మావతీ పరిణయం సందర్భంగా శ్రీనివాసుడు కుబేరుణ్ణించి అప్పుగా తీసుకుంది సువర్ణముద్రికలే! 

స్వర్ణం లభ్యమయ్యేది భూమి నుంచే! భూదేవి సాక్షాత్తు శ్రీవారిలో భాగం. శ్రీవారి ఇల్లు బంగారం. ఆనందనిలయ గోపురం బంగారుమయం. ధ్వజస్తంభం బంగారు తాపడం చేయబడింది. ఇంటిలోని పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. ధరించేది మేలిమి బంగారు నగలు. రాజాధిరాజుల నుండి సామాన్యుల వరకూ భక్తులందరూ స్వామివారికి హుండీలో సమర్పించుకునేది కనకమే! 

సకల సంపదలకు, ధనకనకాదులకు ఆధిపత్యం వహించేది శ్రీదేవిగా పిలువబడే లక్ష్మీదేవి. ఆమె కూడా శ్రీవారిలో భాగమే. బంగారంతో ఇంత ప్రగాఢమైన అనుబంధం కలిగిన శ్రీవారు ఇరువురు దేవేరులతో కలసి స్వర్ణరథంలో ఊరేగుతుండగా చూచి తరించటం ఓ అలౌకిక, ఆధ్యాత్మికానుభూతి. 

దేవేరులతో స్వామివారు స్వర్ణరథంపై ఊరేగే ఈ స్వర్ణరథోత్సవం శ్రీవారి మహోన్నతిని, సార్వభౌమత్వాన్ని, శ్రీపతిత్వాన్ని, భూదేవీనాథత్వాన్ని సూచిస్తుంది. 

స్వర్ణరథోత్సవంలో, కళ్యాణకట్ట సంఘంవారు సమర్పించిన బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు. కేవలం మహిళా భక్తులు మాత్రమే తేరును లాగటం ఈ స్వర్ణరథోత్సవ ప్రత్యేకత. 

ఈ రథోత్సవాన్ని *"సువర్ణరంగ డోలోత్సవం"* అని కూడా వ్యవహరిస్తారు. 

ఉయ్యాలసేవ ఈ రథోత్సవంలో అంతర్భాగం కావడం వల్ల, బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఉయ్యాల సేవ స్వర్ణరథవాహనం నాడు జరగదు. 

స్వర్ణరథోత్సవ దర్శనం ద్వారా శ్రీదేవి కరుణతో సమస్త భోగభాగ్యాలు, అప్లైశ్వర్యాలు; భూదేవి కరుణతో భూసంపద, కనక, మణిమయాదులు, నవరత్నాలు, ధాన్యసంపద, పశుసంపద; శ్రీవారి కరుణతో సర్వ సుఖాలూ, శుభాలు చేకూరుతాయి.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*210 వ రోజు*

*సంజయుని రాయబారం*

సంజయుడు ఉపప్లావ్యం చేరి అర్జునినితో కూడి ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. మరునాడు సభలో ధర్మజునితో " ధర్మజా ! నిన్ను కలుసుకోవడం నా అదృష్టం. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నందుకు ఆనందించాడు. మీ యోగ క్షేమం కనుక్కు రమ్మని నన్ను పంపాడు " అన్నాడు. ధర్మరాజు " మా పెదనాన్న దయ వలన మేము క్షేమంగా ఉన్నాము. మా క్షేమం కొరకు పెదనాన్న మిమ్ము పంపడం మా అదృష్టం. నిన్ను చూస్తూ వుంటే సాక్షాత్తూ మా పెదనాన్నను చుసినట్లున్నది. వారు క్షేమమా , వారి పుత్రులు క్షేమమా, మనుమలు క్షేమమా, భీష్మ ద్రోణ, కృప అశ్వథామలు క్షేమమా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? బ్రాహ్మణులను కౌరవులు ఆదరిస్తున్నారా? వారికి మేమిచ్చిన గ్రామాలను దుర్యోధనుడు లాగుకొన లేదు గదా ? గురు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మా విషయంగా దోషములను ఎంచడం లేదు కదా! ఒక్కసారిగా పిడుగులవంటి అరవై తీష్ణ బాణములను ప్రయోగింప గల అర్జునుడి బాహుబలమును స్మరిస్తున్నారా! గద చేత ధరించి దట్టమైన అడవులలో సంచరించే మదపుటేనుగులాగా యుద్ధరంగంలో సంచరించే భీమసేనుడిని స్మరిస్తున్నారు గదా! మునుపు రాజసుయయాగ సందర్భంగా తన కెదురైన కళింగ రాజును జయించిన సహదేవుని, శిబిని, త్రిగర్త రాజులను జయించిన నకులుడిని స్మరిస్తున్నారా! దురాలోచనతో ద్వైత వనంలోకి ఘోషయాత్రకు వచ్చి బందీలైన ధృతరాష్ట్ర కుమారులను బంధ విముక్తి చేసిన భీమార్జునులను, ఆ సంగతిని స్మరిస్తున్నారా!" అన్నాడు. సంజయుడు దానిలోని అంతరార్ధం అర్ధం చేసుకుని తన వాదన వినిపించడం మొదలు పెట్టాడు " ధర్మజా! నీవు అడిగినట్లే అందరు కుశలంగా వున్నారు. సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, దూరంహంకారులు, నీతి మంతులు, సత్వసంపన్నులు ఇలా అనేక ప్రవృత్తులు కలవారు ఉన్నారు.వారు ఒకరి మాట ఒకరు వినరు. కౌరవులు యుద్ధ ప్రసంగంలో మీ గురుంచి, వీరాగ్రేసరులైన భీమార్జునుల గురుంచి స్మరిస్తున్నారు. ధర్మజా! నీవు మంచి మనసుతో సంధి ప్రయత్నం చేసావు కాని వృద్ధుడైన దృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు. కొడుకుల మాట కాదన లేక పోతున్నాడు. మనసులో మధన పడుతున్నాడు. కనుక అజాత శత్రువైన నీవు పెద్ద మనసు వహిస్తే బాగుంటుంది. ఇచ్చిన దానం తిరిగి స్వీకరించడం ధర్మమా? హస్థినాపుర ప్రజలు శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మిమ్ములను తలచుకుంటున్నారు. పగవారికి కూడా హాని తలపెట్టరని మిమ్ము కీర్తిస్తున్నారు. ధర్మజా! శ్రీకృష్ణుని సమక్షంలో నిండు సభలో నీతమ్ములు వింటుండగా నాకు తోచినది చెప్తాను " అనగానే ధర్మరాజు " సంజయా నీవు చెప్పదలచినది చెప్పవచ్చు " అన్నాడు.


*సంజయుడి దౌత్యం*

సంజయుడు అందరిని ఒక్క సారి పరికించి " మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేశంతో నన్ను పంపాడు. ఇది పాండవులకు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది. ఇది సంయమనం పాటించ వలసిన సమయం. మీరు ధర్మస్వరూపులు, శాంత స్వభావులూ. మీరు ఓ చిన్న దోషం చేసినా అది తెల్లని వస్త్రం మీద నల్లని మరకలా స్పష్టంగా కనినిపిస్తుంది. మీకు సుయోధనుని వలన కష్టం కలిగింది.. దానిని నీవు తుడిచి వేయాలి. యుద్ధం వలన జన నష్టం జరుగుతుంది. జయాపజయములు సుఖాన్ని ఇవ్వవు. బంధువులు, మిత్రులు, బాలలు, వృద్ధులు నశిస్తారు. అందరిని పోగొట్టుకుని ఎవరు మాత్రం సుఖ పడతారు. మీకు శ్రీకృష్ణుడు పెట్టనికోట, దృపదుడు, సాత్యకి మేరు పర్వతాలు. భీమార్జునులు అరివీర భయంకరులు ఇక నిన్ను గురించి చెప్పనవసరం లేదు. మిమ్ము దేవతలైనా జయించ లేరు. సుయోధనుని పక్షాన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, శల్యులు అతని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. సుయోధనుని తమ్ములూ, కుమారులు అజేయులు. సోమదత్త, బాహ్లికులను శివుడు కూడా జయించ లేరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడితే వినాశనం కాక ఇంకేమి మిగులుతుంది. కృష్ణార్జునలారా! మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మిగిలిన పాండవులు వారి బంధు మిత్రులందరికి సవినయంగా మనవి చేస్తున్నాను. పాండవులారా! శాంతించండి. ఆగ్రహమును వీడండి. మిమ్ము శరణు వేడుతున్నాను. ఇది సర్వలోక సమ్మతం. ఇందుకు భీష్మాదులు సంతసిస్తారు " అని పలికి కూర్చున్నాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మగవాడు

 ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి.


ఒకటి తనని నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లికి,


రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి, కని, పెంచి, ఇచ్చే భార్యకి.


ఇద్దరు చేసింది ఓకే పని,

ఇద్దరు పడింది ఓకే కష్టం,

ఇద్దరు చూపించేది ఓకే ప్రేమ.


ఒకరు తను కళ్ళు తెరవగానే మొదటిగా చూసినవారు. 


మరొకరు కళ్ళు మూసేటప్పుడు చివరిగా చూడాలి అనుకునేవారు.


ఎవరు ఎక్కువ కాదు,ఎవరు తక్కువ కాదు.


కాకపోతే


తల్లి అనే బంధం ఎవరెస్ట్ శిఖరం లాంటిది,


ప్రతి భార్య చేరుకోవాలి అనుకునే గమ్యం కూడా అదే ......


అయితే భార్య ప్రయాణం కొత్తలో భర్త యొక్క తల్లి స్థానం అందనంత ఎత్తులో ఉన్నట్టు ఉంటుంది.


కానీ


ఒకసారి భార్య కూడా తల్లి అయ్యి ఆ శిఖరం అధిరోహించాక 


అప్పుడు


తల్లి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది,


ముందు తల్లికి కొడుకు అయ్యాకే,

తనకి భర్త కాగలిగాడు అనే నిజం భార్యకి అర్థమవుతుంది....


ఒక మగవాడి జీవితంలో తల్లి భార్య ఇద్దరు ముఖ్యమే.ఇద్దరిలో ఎవరు వారిది వారిలో ఏ  స్థానం తగ్గిన మగవాడి జీవితం తలకిందులు అవ్వుతుంది.... ❤️

.

దుర్గ మాయమ్మ*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ముగురమ్మల మూలపుటమ్మ*

          *దుర్గ మాయమ్మ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*'దుర్గా' నామానికి అర్థం:~*


*'దుర్గా' నామాన్ని ఒక మహా మంత్రంగా వేదవాఙ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్థశక్తితో పాటు, మహిమాన్వితమైన శబ్దశక్తీ ఉంది. ఆ అర్థాలను సంభావించి, ఈ నామాన్ని ఉచ్చరిస్తే దివ్యఫలితాలను పొందవచ్చని మంత్ర శాస్త్రం స్పష్టం చేస్తోంది.*


*'దుర్గా' నామమే ఒక మహామంత్రం.*


*దుర్గమమైనది దుర్గ. మనసుకీ, మాటకీ అందని పరతత్త్వమే దుర్గమం (అందరూ తేలిగ్గా ప్రవేశించలేనిది). ఎంతో సాధనతో, యోగంతో పొందవలసిన తత్త్వమది. అందుకే 'దుర్గ' అంటే 'పరతత్త్వం' (పరబ్రహ్మ) అని ప్రధానార్ధం.*


*యస్యాః పరతరం నాస్తి*

*స్చైషా దుర్గా ప్రకీర్తితా*


*'దేన్ని మించి మరో తత్త్వం లేదో అదే 'దుర్గ', అని వైదిక నిర్వచనం.*


*దుః అనే శబ్దానికి వీలుకానిది. భరించలేనిది అని అర్ధం. దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దుఃఖం, దుఃస్థితి... ఇవన్నీ 'దుః' శబ్దంతో కుడిన పదాలు. వీటన్నింటిని సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గ.*


*"రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి" - అని శాస్త్రం వివరించింది.*


*వేద ధర్మానికి విఘాతం కలిగించి, దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత 'దుర్గా' నామం వచ్చినట్లు దేవీ భాగవతం చెబుతోంది.*


*దుర్గమాసురహంత్రీ త్వాత్*

*దుగ్గేరి మమ నామయః ౹౹*


*దుర్గము అంటే 'కోట' అని కూడా అర్ధం. పరుల బాధలేకుండా, మనలను రక్షించే ఆశ్రయం దుర్గం. అదేవిధంగా ఆశ్రయించిన భక్తులను అన్నివిధాల ఆదుకునే తల్లి దుర్గ.*


*త్వామాశ్రితానాం న విపన్నరాణాం*

*త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి ||*


*"నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు. నిన్ను ఆశ్రయించినవాడే, సరియైన దాన్ని ఆశ్రయించినవాడు" (దేవీ మాహాత్మ్యం - మార్కండేయపురాణం).*


*ఈ భావనలో 'దుర్గా' అంటే 'ఆశ్రయశక్తి' అని అర్ధం.*


*వేదం దుర్గను 'తారిణీ శక్తి'గా పేర్కొంది. దాటించే శక్తి - దుర్గ. కష్టాల కడలినుండి తన భక్తులను దాటించి, ఒడ్డున చేర్చే నావగా వేదం దేవీని వర్ణించింది.*


*“నావేవ సింధుం దురితాత్యగ్నిః"*

*“దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే*

*సుతరసి తరసే నమః"* - 

*వంటి వేదమంత్రాలు ఈ భావనను చెబుతున్నాయి.*


*తాం దుర్గాం దుర్గమాం దేవీం*

*దురాచార విఘాతినీం |* 

*నమామి భవభీతోహం*

*సంసారార్ణవతారిణీమ్ ౹౹*


*"అంతుపట్టని తత్త్వంగల దుర్గాదేవి, దురాచారాలను నశింపజేసే తల్లి.*


*సంసార సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవభీతుడనైన (సంసారం వల్ల భయపడే) నేను నమస్కరిస్తున్నాను" అని దేవ్యథర్వశీర్షం 'దుర్గ' నామానికి నిర్వచనాలిచ్చింది.*


*ఓం దుం దుర్గాయై నమః॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీ మహాలక్ష్మి కటాక్షం*

 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

     *శ్రీ మహాలక్ష్మి కటాక్షం*  

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి  హృదయం లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం. అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి.అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకం.


అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటిస్తాము. అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం..


*ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి.*


*అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.*


*లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం. ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.*


*పూజ అంతా అయ్యాక ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం,అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం చాలా ప్రీతికరం,*


*ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకురసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఈవిధంగా  చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు.*


*అదేవిధంగా నైవేద్యం పెట్టిన చెరుకురసం మొత్తం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం సమసి పోతాయి.*


*ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ॥*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - ఇరవయ్యో భాగం - భగవంతునితో బంధుత్వము


ఒక ప్రవచనములో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు, "సన్యసించడానికి కర్మను వదులుకోనవసరం లేదు, భగవంతుని దగ్గరకు వెళ్లే కొద్దీ కర్మ దానిఅంతట అదే వదిలిపోతుంది"  అని. నిజమే చాలా చక్కని ధర్మ సూక్ష్మం అది. మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర చుస్తే ఇది అక్షర సత్యం అని తెలుస్తుంది. శ్రీ స్వామి వారు చిన్ననాటి నుండి ఆ భగవంతునిలో లీనమయ్యేందుకు దానికి  అవసరమైన సాధన మరియు జ్ఞానాన్ని సంపాదించుకునే పనిలో వ్యాసాశ్రమంలో చేరడం అటుపైన మాలకొండ ఆ తరువాత మొగిలిచెర్ల చేరుకున్నారు. ఎప్పుడూ కానీ వారంతట వారు ఏ ఒక్క బంధాన్ని వదులుకోలేదు, వారి జీవన క్రమంలో వాటి అంతట అవే తొలగిపోయాయి. వారి మోక్ష సాధనలో ఆగిన ప్రతీ చోట ఒక మజిలీ మాత్రమే అనుకున్నారు కానీ, అదే వారి గమ్యము అనుకొని నిలిచిపోలేదు. అలానే, ఆయా మజిలీలలో వారికి ఎదురుపడిన వారందరినీ పరిచయస్తుల గానే చూసారు కానీ బంధువులలా కాదు.  శ్రీ స్వామి వారు, వారి జీవితముతో ముడిపడిన అన్ని రక్త సంబంధీకులతో సైతం తామరాకు మీద నీటిబొట్టు లాగా వ్యవహరించారే కానీ, ఎన్నడూ కూడా ఏ ఒక్క మనిషితో కూడా వారు చూపించే ధనము వలన కానీ, కలిగించిన సౌకర్యాల వలన కానీ, కరుణ లేదా ప్రేమ వలన కానీ, ఆశపడి, ఋణపడి మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల మధ్యలో ఇరుక్కుపోలేదు. 


ఆది శంకరాచార్యలు వారు చెప్పినట్టుగా : 


పునరపి జననం పునరపి మరణం ,

పునరపి జననీ జఠరే శయనం|

ఇహ సంసారే బహుదుస్తారే ,

కృపయాపారే పాహి మురారే ||


ఏ బంధుత్వాల మధ్యలో బిగుసుకుపోకుండా నిరంతరం ఆ భగవన్నామం స్మరిస్తూ, ఆ పరమాత్మలో లీనమవ్వటమే మార్గముగా భావిస్తూ మరియు వారి చుట్టువున్నవారికి మార్గదర్శకం చేస్తూ ముందుకు నడిచారు.


దానికి ఒక, శ్రీధరరావు దంపతులు ఒక దశలో వారి కుటుంబ సమస్యల వలన ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయములో, వారి బంధుత్వాలని ఆ పరమాత్మ ఒక్కొక్కటిని తీసేస్తూ, ఆ పరమాత్మ సేవకు ఆ దంపతులను వినియోగించుకోబోతున్నారని తెలిపి వారిని ఆ బాధలో నుంచి బయటకు లాగివేసి ఆనందాన్ని పంచారు. 


శ్రీ స్వామి వారు వారి జన్మజన్మాంతరాలలో నిలుపుకొని, పెంపొందించుకొని చివరికి వారికి ఆ గమ్యానికి అభేద్యమైన స్థితికి చేరుకుంది కేవలం ఆ పరమాత్మ అనే నిత్యబంధువు మరియు దీనబాంధవుడితోనే.


సర్వం,

శ్రీ దత్త కృప

ధన్యోస్మి

పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు : 

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699

----

ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


---

మానవుడు పాపి ఎందుకు

 *మానవుడు పాపి ఎందుకు అవుతాడు...?!* 

 *शरदिंदु विकास मंदहासं* 

 *स्फुरदिंदीवर* *लोचनाभिरामां |* 

 *अरविंद समान सुंदराश्यां* 

 *अरविंदासन सुंदरीमुपासीं* ||

శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు. వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు. ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే, భగవంతా! నా చెంత తమరుని స్తుతించే ప్రార్ధనలు అనేకం ఉన్నాయి. వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు. ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి. చేయతగినవి.

*ఎందుకు మనిషికి ఇంత అహంకారం? ఐశ్వర్యాన్ని* చూసుకుని కావచ్చు.* ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కదూ? ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? మన సామర్థ్యం వల్ల మనం ఏ ఒక్కటీ సంపాదించలేం. ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. దాన్ని సద్వినియోగం చెయ్యాలి. తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు పాపి అని వేదం చెబుతోంది.

 *मोघमन्नं विंदते अप्रतीकाः* 

 *सत्यं ब्रवीमि रधति* *स्स्रतस्या |* 

 *नार्यमणं पुष्यति नो सखायं* 

 *केवलाघो भवति केवलादि* ||

ఐశ్వర్యం ఉన్నది కేవలం నా పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే అనుకున్నవాడు పాపిగానే మిగులుతాడు అని పురాణాలు, వేదాలు, శాస్త్రాలు మనల్ని హెచ్చరించాయి. మీ ఐశ్వర్యం మూడు రకాలుగా మీ నుంచి వెళ్లిపోతుంది. మొదటిది దానం చేయడం, రెండోది అనుభవించడం, కాగా మూడోపద్దతిలో దొంగలు దోచుకోవడం వల్ల, రాజులు వేసే పన్నులు, అగ్ని మొదలైన ప్రమాదాల

కారణంగా ఐశ్వర్యం మీ నుంచి దూరమవుతుంది. దొంగతనానికి గురైనది, ఇతరులకు చెల్లించింది మీది కాదు. మీరు అనుభవిస్తున్న ఐశ్వర్యమూ మీది కాదు. ఏదైతే మీరు దానం చేశారో అదే పై జన్మదాకా మీ వెంట వస్తుంది.


 --- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*

అరుదైన అమావాస్య

 *అరుదైన అమావాస్య వస్తోంది!*


అమావాస్య యదా మైత్ర  విశాఖా  స్వాతి యోగినీ|

శ్రాద్ధైః పితృగణస్తృప్తిం తదాప్నోత్యష్టవార్షికీమ్||

స్వాతి విశాఖ అనూరాధ నక్షత్రాలు అమావాస్యతో కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు ఎనిమిది సంవత్సరాలు సంతోషిస్తారని విష్ణుపురాణంలోని మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం అంటోంది.

ఇటువంటి అరుదైన సంగమం డిసెంబర్ 1వ తేదీన వస్తోంది. ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి. అమావాస్య 10.43 వరకూ ఉంటోంది. అనూరాధ మధ్యాహ్నం 2.10 వరకూ ఉంటుంది. నిజానికి ఈ సంగమం శనివారమే ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 9.16 తరువాత అమావాస్య ప్రవేశిస్తుంది. మధ్యాహ్నపరివ్యాప్తమై ఉంటుంది. విశాఖ 12.17 వరకూ ఉంటుంది. తదుపరి అనూరాధ ప్రవేశిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం విశాఖ, అనూరాధలతో అమావాస్య కలిసి రావడం మహత్తరం కనుక ఈ దివ్యమైన సంయోగం శనివారం ఉదయం 9.16 నుంచీ ప్రారంభమై ఆదివారం ఉదయం 10.43 వరకూ ఉంటుంది. ఇది మహదవకాశంగా అందరూ భావించాలి. కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చనను ఇస్తోంది. 

ఎవరైతే భయంకరమైన జన్మదోష, గ్రహదోష, నక్షత్రదోష, జాతకదోషాదులతో బాధపడుతున్నారో వారు వీటి అన్నింటికీ కారణమైన పితరుల శాపం నుంచీ విముక్తిపొందడానికి అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా కంటితో చూస్తుండగానే ధనం, ఆస్తులు, బంగారం, సంపదలు, వాహనాలు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నష్టమైపోతున్నాయో వారు శనివారం, ఆదివారం పెద్దలను అర్చించడం మంచిది.

ఆధ్యాత్మిక సాధకులకు బ్రహ్మమే

 *యోగీ హృత్పద్మనిలయం నత్జీవహితే రతమ్*

*శ్రుతినాం జన్మభూమి త్వాం చతుర్ముఖమహాన్ శ్రయే ।*

ఆధ్యాత్మిక సాధకులకు బ్రహ్మమే గొప్ప ఆశ్రయం.  బ్రహ్మ  అత్యున్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందిన యోగుల హృదయాలలో సదా నివసిస్తాడు, తనను గాఢంగా కోరుకునే వారికి తన ప్రాప్యతను సూచిస్తారు. బ్రహ్మ ప్రగాఢమైన దయగలవాడు. వినయంగా తనకు వినమ్రుడైన తన భక్తుల శ్రేయస్సును నిర్ధారించడంలో  ఆయనే ఎంతో ఆనందాన్ని పొందుతాడు.  బ్రహ్మ వేదాలకు జన్మస్థలం,  జ్ఞానం, విజ్ఞానానికి మూలం.  బ్రహ్మ యొక్క అత్యున్నత శక్తి ఏమిటంటే..?ఆయనలోని దయాగుణం. పరిపూర్ణ శరణాగతి అందరికీ అవసరమే. దానికోసం  అందరమూ  చతుర్ముఖుడు లేదా సర్వజ్ఞుడైన ఆయనని ఆశ్రయిస్తాము. బ్రహ్మను ఆశ్రయించడం అనేది ఆధ్యాత్మిక జ్ఞానోదయం. అదే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలనే భక్తుని ఆకాంక్షను సూచిస్తుంది.

*-శృంగేరీ జగద్గురువులు*

మరిచిపో గుర్తుంచుకో

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏           🏵️నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో... కానీ నిన్ను ప్రతిరోజూ ప్రేమించేవారిని గుర్తుంచుకో.. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో.. కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న  వార్తమానం పై దృష్టి సారించు.. నీ బాధని మరిచిపో కానీ ఆది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు గుర్తుంచుకో🏵️ఎవరూ ఏదీ ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి.. ఇచ్చిన దానిని దాచుకోండి.. ఎప్పటి కయినా వారికీ వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి  కదా.. ఇది సహాయమైన, సహకారమైనా, బాధ అయినా, నమ్మకద్రోహం అయినా, ప్రేమ అయినా ఏదీ ఉంచుకోవద్దు🏵️ప్రియమైన మాటలు మాట్లాడటం.. ధైర్యం కలిగి ఉండటం.. ఏదీ మంచి, ఏదీ చెడు అని తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటం ఈ నాలుగు పుట్టుకతో రావాల్సిందే కానీ నేర్చుకుంటే వచ్చేవి కాదు... డబ్బుని ఎంత నలిపినా దాని విలువ తగ్గదు.. మనం మంచి ఆలోచనతో, మంచి మంచి మాటలతో ఉన్నట్లు అయితే ఎవరూ ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు🏵️🏵️మీ  * అల్లoరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510* 🙏🙏🙏

కార్తిక పురాణం* *29

 *కార్తిక పురాణం*

*29 వ అధ్యాయము*


*అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారాయణము*


అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తిక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి5 ప్రీతీకరమగు కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తిక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తికమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.*

మత్తుల్ కొందరు

 శా.మత్తుల్ కొందరు స్వార్థపూరిత మతిన్ మాత్సర్య హీనాత్మ దు

ర్వృత్తుల్ జూపి చరింప నెంచెద రిలన్ వేధించుచున్,శిష్ట ధ

ర్మోత్తంస ప్రతి నిర్ణయాత్మక విధిన్ మోదమ్ము చేకూర్చు ధీ

వృత్త జ్ఞాన వదాన్య నిత్య  హితులన్ విద్వాంసులన్ సర్వదా౹౹  47


ఉ.విత్తుకు నాశన మ్మొదవ వృక్షము లెట్లు జనించు భూమిపై

నెత్తరి కర్షకోత్తముల కెప్పుడ నర్థము లెంచి చేయగా

నత్తరి భూమిపై జనుల ఆకలి దప్పులు తీరగల్గు నా

ఉత్తమ ధార్మికోన్నతుల కూరట గల్గ జగమ్ము వర్ధిలున్౹౹ 48

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - త్రయోదశి  - స్వాతి -‌‌ భృగు వాసరే* (29.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*