*మానవుడు పాపి ఎందుకు అవుతాడు...?!*
*शरदिंदु विकास मंदहासं*
*स्फुरदिंदीवर* *लोचनाभिरामां |*
*अरविंद समान सुंदराश्यां*
*अरविंदासन सुंदरीमुपासीं* ||
శంకర భాగవత్పాదులవారు అనేక విధాలుగా జనులకు సన్మార్గాలను ఉపదేశించారు. వారు రచించిన స్తోత్రాల్లో కేవలం దేవతా గుణగణానువర్ణనలే కాకుండా, మనం గ్రహించాల్సిన అనేకానేక విషయాలను పొందుపరిచారు. ఒకచోట ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏం చెప్పారంటే, భగవంతా! నా చెంత తమరుని స్తుతించే ప్రార్ధనలు అనేకం ఉన్నాయి. వాటిని నువ్వు అనుగ్రహించాలని ప్రార్ధించారు. ఆ ప్రార్ధనలు మనందరం ప్రతినిత్యం భగవంతుని ఎదుట చేయాల్సినవి. చేయతగినవి.
*ఎందుకు మనిషికి ఇంత అహంకారం? ఐశ్వర్యాన్ని* చూసుకుని కావచ్చు.* ఈ ఐశ్వర్యం అంతా మనకు ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా భగవంతుడి కృప వల్ల వచ్చింది కదూ? ఆయన దయలేనిదే ఇదంతా ఎక్కడుంది? మన సామర్థ్యం వల్ల మనం ఏ ఒక్కటీ సంపాదించలేం. ఆయన కృప లేనిదే మన సామర్థ్యం దేనికీ పనికి రాదు కాబట్టి మనకు వచ్చిన సంపాదన అంతా భగవంతుడి కృప వల్ల వచ్చిందే. దాన్ని సద్వినియోగం చెయ్యాలి. తప్పు పనులకు ఐశ్వర్యాన్ని ఉపయోగించకూడదు. ఎవడైతే తన ఐశ్వర్యాన్ని భగవంతుని సేవకు కానీ, సమాజ సేవకు గానీ ఉపయోగించకుండా కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో అలాంటి వాడు పాపి అని వేదం చెబుతోంది.
*मोघमन्नं विंदते अप्रतीकाः*
*सत्यं ब्रवीमि रधति* *स्स्रतस्या |*
*नार्यमणं पुष्यति नो सखायं*
*केवलाघो भवति केवलादि* ||
ఐశ్వర్యం ఉన్నది కేవలం నా పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే అనుకున్నవాడు పాపిగానే మిగులుతాడు అని పురాణాలు, వేదాలు, శాస్త్రాలు మనల్ని హెచ్చరించాయి. మీ ఐశ్వర్యం మూడు రకాలుగా మీ నుంచి వెళ్లిపోతుంది. మొదటిది దానం చేయడం, రెండోది అనుభవించడం, కాగా మూడోపద్దతిలో దొంగలు దోచుకోవడం వల్ల, రాజులు వేసే పన్నులు, అగ్ని మొదలైన ప్రమాదాల
కారణంగా ఐశ్వర్యం మీ నుంచి దూరమవుతుంది. దొంగతనానికి గురైనది, ఇతరులకు చెల్లించింది మీది కాదు. మీరు అనుభవిస్తున్న ఐశ్వర్యమూ మీది కాదు. ఏదైతే మీరు దానం చేశారో అదే పై జన్మదాకా మీ వెంట వస్తుంది.
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి