17, అక్టోబర్ 2020, శనివారం

వేంకటేశ్వరస్వామి

 



ఈ చిత్రంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టుకు, ప్రతినిత్యం అలంకరణలో వుండే సహస్రనామహారమును చూడవచ్చు. శ్రీవారికి వున్న అనేక ఆభరణములలో ఈ సహస్రనామహారం ఒకటి. ఈ హారం 5 వరుసలుగా సుమారు 1008 కాసులతో తయారు చేయబడినది. ఈ హారంలోని ఒక్కొక్క కాసులో బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ వేంకటేశ సహస్రనామావళి మరియూ వరుస సంఖ్య ముద్రించబడి వుండడం...


ఏటా అత్యంత వైభవంగా జరుపబడే, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో, 5వ రోజున, సాయంత్రం జరిగే, గరుడ వాహన సేవకు మాత్రమే, ఈ హారమును, శ్రీవారి ఉత్సవముర్తి అయిన , శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరిస్తారు. (ఈ హారంతో బాటుగా, 108 కాసుల, చతుర్భుజ లక్ష్మీహారం, మకర కంటి, అనే మూలవిరాట్టు ఆభరణములను, గరుడ సేవ నాడు, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే శ్రీవారికి అలంకరించే సంప్రదాయం వున్నది). 


*|| ఓం నమో వేంకటేశాయ ||*

రామాయణం

 A V B SUBBARA రామాయణం గురించి నాలుగు విషయాలు 😛 తెల్సుకోండి🙏


 👇👇👇👇👇

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..🏹


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

=24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

=కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

=సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

=కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

=సుమంత్రుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

=కౌసల్య, సుమిత్ర, కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

=పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

=జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

=హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

=శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

=కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

=వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

=12 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

=మారీచ, సుబాహులు.


21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

=బల-అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

=సిద్ధాశ్రమం.


23. తాటక భర్త పేరేమిటి?

=సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

=అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

=భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

=గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

=శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

=నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

=దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

=విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

=మాండవి, శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

=జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

=కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

=వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

=యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

=మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

=గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

=శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

=గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

=భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

=మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

=తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

=జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

=నందిగ్రామము.


46. అత్రిమహాముని భార్య ఎవరు?

=అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

=విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

=అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

=గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

=శూర్ఫణఖ.


51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?

=జనస్థానము.


52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?

=మారీచుడు.


53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?

=బంగారులేడి.


54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?

=జటాయువు.


55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?

=దక్షిణపు దిక్కు.


56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?

=కబంధుని.


57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?

=మతంగ వనం, పంపానదీ.


58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?

=ఋష్యమూక పర్వతం.


59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్ర


ీవుడు ఎవరిని పంపెను?

=హనుమంతుడు.


60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?

=అగ్ని సాక్షిగా.


61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?

=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.


62. సుగ్రీవుని భార్య పేరు?

=రుమ.


63. వాలి భార్యపేరు?

=తార.


64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?

=కిష్కింధ.


65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?

=మాయావి.


66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?

=దుందుభి.


67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?

=మతంగముని.


68. వాలి కుమారుని పేరేమిటి?

=అంగదుడు.


69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?

=ఏడు.


70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?

=ప్రసవణగిరి.


71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=వినతుడు.


72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=అంగదుడు.


73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?

=మామగారు, తార తండ్రి.


74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?

=శతబలుడు.


75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 

=మాసం (ఒక నెల).


76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?

=దక్షిణ దిక్కు.


77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?

=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.


78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?

=స్వయంప్రభ.


79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?

=సంపాతి.


80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?

=పుంజికస్థల.


81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?

=మహేంద్రపర్వతము.


82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?

=మైనాకుడు.


83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?

=సురస.


84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?

=సింహిక.


85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?

=నూరు యోజనములు.


86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?

=లంబ పర్వతం.


87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?

=అశోక వనం.


88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?

=రెండు.


89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?

=త్రిజట.


90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?

=రామ కథ.


91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?

=చూడామణి.


92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?

=ఎనభై వేలమంది.


93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?

=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.


94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?

=విభీషణుడు.


95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?

=మధువనం.


96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?

=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.


97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?

=ఆలింగన సౌభాగ్యం.


98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?

=నీలుడు.


99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?

=నికుంభిల.


100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?

=అగస్త్యుడు.


101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?

=ఇంద్రుడు.


102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?

=మాతలి.


103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?

=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!


104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?

=హనుమంతుడు.


105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?

=శత్రుంజయం.


106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?

=స్వయంగా తన భవనమునే యిచ్చెను.


107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?

=బ్రహ్మ.


108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?

=తన మెడలోని. ముత్యాలహారం. 


*శ్రీ రామ జయం!*🙏

గాయత్రి

 *గాయత్రి అంటే…*


ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.


గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.

గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:


01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.

04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.

06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.

07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.

09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.

10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.

13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.

14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.

17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.

18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.

19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.

20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.

24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మూర్ఖుడు

 మూర్ఖుడు


🍁🍁🍁🍁


“మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనీ తథా 

క్రోధశ్చ దృఢవాదశ్చ పరవాక్యేష్వనాదరః "


“గర్వము, చెడుమాటలు మాట్లాడుట, కోపము, పిడివాదము, ఇతరుల భాషణమునందు అనాదర భావము అను ఐదు మూర్ఖుల లక్షణములు"అని ఈశ్లోకానికి భావం.


“వాడికి తోచదు, ఒకరు చెప్తే వినడు",“ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్ట్దె దొకదారి.." ఇలాంటి మాటలు మూర్ఖులను గూర్చి చెప్పేటప్పుడు వింటూ ఉంటాం. భర్తృహరి“మూర్ఖపద్ధతి " అనే శీర్షికతో అద్భుతమైన శ్లోకాలు వ్రాశాడు.


 ఇసుకనుంచి తైలం తీయటం, ఎండమావిలో దాహం తీర్చుకోవటం, కుందేటికొమ్మును సంపాదించటం వంటి అసాధ్యాలను సాధ్యం చేసుకున్నా, మూర్ఖుని మనసు మాత్రం రంజింపరానిదన్నాడు.


అస్థిరమనస్కుడైన మూర్ఖుడు ఒకసారి దుష్టునిగా, మరోసారి సంతుష్టునిగా, మరుక్షణంలో కోపిష్టివానిగా ప్రవర్తిస్తూఉంటాడు.

 ఒకవేళ ఎప్పుడైనా అతడు ప్రసన్నుడై కనిపించినా, ఆ ప్రసన్నతకూడా భయం కల్గిస్తుంది.( “అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకరః" ) అంటుందొక సూక్తి.


విజ్ఞ లక్షణమైన వినయం - మూర్ఖునియందు ఏకోశానా ఉండదు. గర్వంతో మిడిసిపడుతూ ఉంటాడు. పలుక రాని మాటలు పలుకుతాడు. కోపస్వభావుడై కలహేచ్ఛ కలిగి ఉంటాడు. తానుపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు తన అభిప్రాయం దోషయుక్తమని తెలిసికూడా పిడివాదనలు చేస్తాడు. వాదనలో విజయాన్నే కాంక్షిస్తాడుగానీ సత్యాన్నీ, సామంజస్యాన్నీ లెక్కచేయడు.


దుర్యోధనుడు –“జానామి ధర్మం నచ మే ప్రవృత్తిః, జానామ్యధర్మం న చ మే నివృత్తిః" ( నాకు ధర్మం తెలుసు కానీ దానిని ఆచరించను. అధర్మమూ నాకు తెలుసు దానిని వదలలేను) అంటాడు.అలాగే రావణుడు “నాతలను రెండుగా విభజించినా, నాస్వభావం మారదు" అంటాడు. ఈ ఇద్దరూహితవు చెప్పినవారి మాటలను అనాదరించారు. తమ మూర్ఖతతో తాము నశించిపోయారు.


“మూర్ఖులు-పిడివాదం చేయటంలో దశముఖులు! ఇతరుల లోపలేశాన్ని చూడటంలో సహస్రాక్షులు! సజ్జన సంపదలను అపహరించటంలో సహస్రబాహులు! " అని అనుభవజ్ఞుల మాట.


🍁🍁🍁🍁

 




తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలి ప్రాముఖ్యత*



*తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలిలో ఎంత మంది దేవుళ్లు ఉన్నారో తెలుసా...!*


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారం బంగారు వాకిలి. పచ్చని పసిడి కాంతులతో మెరుస్తూ ఉండే ఈ బంగారు వాకిలి నుండే నేరుగా శ్రీ స్వామి వారి దర్శనం భక్తావళికి లభిస్తున్నది.


సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంలో జయవిజయులు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠమని ప్రసిద్ధి చెందిన వేంకటాచలంలోని ఈ బంగారు వాకిళ్ళు అన్న ప్రశక్తిని పొందిన ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రాహ్మ ముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీనకాలం నుంచి కొనసాగుతూ, అత్యంత విశిష్టతను సంతరించుకుంది. 


బంగారు వాకిలి ప్రవేశమార్గంలో గల 6అడుగుల వెడల్పు గల చెక్కడపు రాతి ద్వార బంధానికి రెండు పెద్ద చెక్కవాకిళ్లు బిగింపబడ్డాయి. ఈ రాతి ద్వారబంధానికి, వాకిళ్లకు, పక్కన జయ, విజయుల కటాంజన మందిరాలకు కలిపి బంగారు పూతరేకు తాపబడింది. అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే సార్థక నామధేయం అనాదిగా వ్యవహారంలో ఉన్నది. ఈ బంగారు వాకిలి ద్వారబంధానికి క్రిందా, పైనా, పక్కలా తీగలు, లతలు చెక్కబడ్డాయి. 


పై గడపకు మధ్యలో క్రింది వైపుగా విచ్చుకొన్న పద్మం, అలాగే పై గడపకు వెలుపలివైపు ఏనుగులచే అర్పింపబడుతున్న పద్మాసనస్థ అయిన శ్రీ మహాలక్ష్మి దేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి. 


ఇక ఈ ద్వార బంధానికి రెండు చెక్క వాకిళ్ళు బిగింపబడ్డాయి. రెండు వాకిళ్ళ మీద చెక్కదిమ్మెలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పాటు చేయబడి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణుశిల్పం మలచబడి ఉంది. ఈ రెండు వాకిళ్లు మూసి ఉంచినపుడు వరుసగా నాలుగు గదులు ఏర్పడతాయి. ఇలా వరుసకు నాలుగుగళ్ళ వంతున వాకిలి పై నుంచి కింది వరకు అటువంటి ఎనిమిది వరుసలు ఉన్నాయి. అంటే ఈ రెండు వాకిళ్ల మీద వెరసి 32 గళ్ళు ఉన్నాయన్నమాట. 


పై నుండి మొదటి వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో, మొదటి గడిలో చక్రం, రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వేంకటేశ్వరుడు, ఇక మూడో గడిలో వైకుంఠవాసుడైన మహావిష్ణువు కూర్చొన్న భంగిమలోను, నాల్గవ గడిలో శంఖం చెక్కబడి ఉన్నాయి. రెండవ వరుసలో ఉన్న నాలుగు గళ్ళలో వరుసగా వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి. ఆగమ శాస్త్రానుసారంగా వీటిని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహ రూపాలుగా పేర్కొంటారు. 3,4,5వ వరుసల్లో గల 12 గళ్ళల్లో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను ఈ క్రింది క్రమంలో నెలకొల్పారు.


3వ వరుస 

1.కేశవుడు 2.నారాయణుడు 3.మాధవుడు 4.గోవిందుడు


4వ వరుస 

1.విష్ణువు 2.మధుసూదనుడు 3.త్రివిక్రముడు 4.వామనుడు


5వ వరుస

  1.శ్రీధరుడు 2.హృషీకేశుడు 3. పద్మనాభుడు, 4.దామోదరుడు


విష్ణువు యొక్క ఈ ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి. ఇక చివరి మూడు వరుసల్లో అంటే 6,7వరుసల్లోని ఎనిమిది గడుల్లోను 8వ వరుసలోని ఒకటవ, నాలుగవ గడుల్లోను వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవమూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. 8వ వరుసలోని రెండవ, మూడవ గడుల్లో తలుపులు తీయటానికి వీలుగా చిలుకులు (గొలుసులు) బిగింపబడ్డాయి. 


ఈ ఇసుప గొలుసులను క్రింది గడపకు గల ఇనుప కొక్కికి తగిలించి పెద్దతాళం వేస్తారు. ఇదికాకుండా ఈ వాకిళ్లకు మధ్య భాగంలో మూడుచోట్ల మూడు గడియలున్నాయి. ఈ మూడు గడియల్లో, పై దానికి కిందిదానికి దేవస్థానం వారి పెద్ద తాళాలను వేస్తారు.


మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి, తాళం చెవులను తమ వెంట తీసుకొని వెళతారు. ఇంతే కాకుండా ఈ వాకిళ్ళకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపలి నుండే అర్చకులు, కొడవలి వలె వంకరగా ఉండే కడ్డీ అనబడే పరికరంతో వాకిళ్లకు లోపలి వైపున ఉన్న గడియను వేస్తారు. అలాగే బయటి నుండే బంగారువాకిలికి లోపలివైపు గడియను తీస్తారు. ఇలాబయటి నుండే లోపలి గడివేయటం, తీయటం వంశపారపర్యంగా అర్చక స్వాములకు మాత్రమే తెలిసిన పరంపరాగతమైన రహస్య ప్రక్రియ.



1884లో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడుగు వేయించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 1958 సంవత్సరంలో ఆనంద నిలయ విమాన మహాసంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి బంగారు మలాము వెయ్యబడింది.


అనాదిగా ఈ బంగారు వాకిళ్ళలో బ్రహ్మేందాది దేవతలు ఎందరు నడిచారో.. ఎన్నిసార్లు నడిచారో.. సనకసనందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్నిమార్లు పడిగాపులు కాచారో.. ఆళ్వారులు, కర్ణాటక హరిదాసులు, అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజాధిరాజులు, చక్రవర్తులు ఇలా అనంతకాల ప్రవాహంలో ఎందరో మహాభక్తులు ఎందరెందరో భాగవతులు ఈ బంగారువాకిలి ముందు నిలిచి తరించారో.. ప్రవేశించి పరవశించారో.. ఏ జన్మలో చేసి ఉన్న ఏ భాగ్యలేశం చేతనో మనకూ ఆ మహనీయులు ప్రవేశించి తరించిన బంగారు వాకిళ్ళలో ప్రవేశించే మహదవకాశం ఇప్పుడు లభించింది కదా... అది బంగారు వాకిలి ప్రాముఖ్యత..


*||ఓం నమో వేంకటేశాయనమః||* 

అమ్మా










 

ప్రపంచం

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


    _*👌*ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోవడం లేదు, జరిగిన చెడుని చూస్తూ కూడా సరిచేయగల సమర్థత ఉండి కూడా ప్రశ్నించకుండా చేతులు కట్టుకొని కూర్చున్న మంచివారి వల్ల చెడిపోతున్నది..*_👌


      _**నిజానికి ఈ సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, చెడు కార్యక్రమాలు పెరిగి పోతున్నాయి అంటే దానికి కారణం కేవలం చెడ్డ పనులు, మోసాలు చేసేవారి వల్లే కాదు. మన కళ్ళముందు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించలేని అసమర్థులు, భయస్థుల వల్ల కూడా, సరిచేయగల సమర్థత, ప్రతిభ, అధికారం ఉండి కూడా మనకెందుకులే, జరిగింది మనకు కాదుకదా అనుకుంటూ పట్టిపట్టనట్లు, అంటిఅంటనట్లు చోద్యం చూస్తున్న అధికారుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల కూడా ఈ సమాజం చెడిపోతున్నది.. ఇది అన్యాయాలకు పాల్పడుతున్న వారికి ఒకరకంగా ఊతమిచ్చినట్లే అవుతుంది..*_


      _**పూర్వము దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎక్కువగా గుర్రాలపైనే ఆధారపడేవారు. అందుకే ప్రతి నగరంలోనూ గుర్రాలను అమ్మడం మరియు కొనే వ్యాపారులు చాలా ఎక్కువ మందే ఉండేవారు. అమరావతి నగర సమీపంలో రామవరం అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి గుర్రాలను అమ్మడంలోనూ, కొనడంలోనూ ప్రజలను మోసం చేస్తూ, ధరలలో, బేరాలలో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ గుర్రాలను ఎక్కువ ధరలకు అమ్మేవాడు, తక్కువ ధరలకు కొనేవాడు. అలా బాగా ధనాన్ని సంపాదించే వాడు. ఒకసారి ఇదంతా గమనించిన మంత్రిగారి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి బుద్ధి చెప్పాలని, గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకొని వేషం మార్చుకొని మారు వేషంలో ఒకరోజు ఒక మేలుజాతి అరేబియా గుర్రం మీద స్వారీ చేసుకొంటూ రామవరం పట్టణానికి చేరాడు.*_ 


     _**అప్పుడు అక్కడ ఆ పట్టణంలో అశ్వప్రదర్శన జరుగుతూ ఉంది. ఆ మోసపూరిత గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారుడు స్వారీ చేసుకొంటూ వచ్చిన ఆ అందమైన గుర్రాన్నీ చూశాడు. దానిపై మోజుపడి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి కుమారుడి దగ్గరకు వెళ్ళి ఆ గుర్రాన్ని నేను కొంటానని చెప్పి దానిని తక్కువ ధరకు అడిగాడు. మంత్రి కుమారుడు అందుకు అంగీకరించలేదు. దాంతో కొంచెం కొంచెం ధరను పెంచుతూ తన ఆఖరి ధరను చెప్పాడు వ్యాపారి. ఇంతటి విలివైన ఈ మేలుజాతి గురాన్ని అంత తక్కువ ధరకు అడగటం అతడి దుర్బుద్ధి అతడికి అర్థమైంది. ఇది నిజంగా మోసం చెయ్యటమే అవుతుంది. ఇతడికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని..*_


      _**పోనీ నువ్వు దీన్ని ఆశపడి కొనాలని అనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని నీకు అమ్ముతాను సరేనా? అన్నాడు మంత్రి కొడుకు. ఆ గుర్రం మీద మోజుతో ఉన్న ఆ దొంగ వ్యాపారి అందుకు అంగీకరించి, ఆ షరతు ఏమిటో చెప్పమన్నాడు. "ఏమీలేదు, నీవు నా చేత్తో మూడు కొరడా దెబ్బలు తింటే ఈ అందమైన గుర్రాన్ని నీవు అడిగిన ధరకు యిస్తాను అన్నాడు. అందుకు ఆ దొంగ వ్యాపారికి కోపం వచ్చినా, తాను అనుకున్న ధరకే గుర్రం వస్తున్నందుకు లోలోపల సంతోష పడ్డాడు. తాను దెబ్బలు తిన్నా దాన్ని తక్కువ ధరకు కొట్టేయాలని, తర్వాత దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చుననే పేరాశకు లొంగిపోయి దెబ్బలకు ఒప్పుకొన్నాడు.*_


      _**మంత్రి కుమారుడు తన కొరడాతో మొదటి దెబ్బను 'చెళ్ళు' మని కొట్టాడు ఆ దొంగ వ్యాపారిని. ఆ దెబ్బకు "అబ్బా"... అంటూ ప్రాణం పోయేటట్లు మూల్గినా ధనాశతో ఇంకా రెండు దెబ్బలే కదా కానీలే అనుకున్నాడు. ఈ సారి మళ్ళీ కొరడా 'చెళ్ళు' మంది. ఆ దెబ్బకు చెర్మం తెగి రక్తం కారింది. అయినా కూడా డబ్బాశతో నొప్పిని భరిస్తూనే ఆ తర్వాత మూడోది కూడా కానీ అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను మడిచి లోపల పెట్టేసుకుని, మూడో దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు నేను నీకిచ్చేది. మూడోదెబ్బ కొట్టను నీకు గుర్రాన్ని ఇవ్వను. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో, ఇకనుండైనా న్యాయ బద్దంగా వ్యాపారం చేస్తూ అందరి ఆదరాభి మానాలను పొందు లేదంటే ఈసారి ఏకంగా జైలుకే పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.*_


      _**ఆ వ్యాపారి ఊరి జనం ముందు సిగ్గుతో తలదించు కున్నాడు. ఆ దొంగ వ్యాపారికి తగిన శాస్తి జరిగిందని అక్కడి ప్రజలందరూ సంబరపడి పోయారు.. కాబట్టి మిత్రులారా ! అన్యాయం జరిగింది నాకు కాదు కదా, సమస్య నాది కాదు కదా అని నిర్లక్ష్యం చేయకండి. రేపు నీకు కూడా జరుగవచ్చు. అప్పుడైనా నువ్వు సమస్యను ఎదుర్కోక తప్పదు కదా. మామూలు ప్రజలు భవిష్యత్తులో నాకేమౌతుందోనని భయపడి ముందుకు రాకపోవచ్చు, కనీసం ఈ కథలోని మంత్రి కొడుకు లాగనైన తమ చేతిలో అధికారం ఉన్న అధికారులు తన అధికారంతోనైనా అన్యాయాలను ఎదుర్కొని న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించి ప్రజల మన్ననలు పొందుదురని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


       _**For Every Action Equal &*_   

             _*Opposite Reaction**_        


    _**రామభక్త గురూజీ ప్రొద్దుటూరు**_                                          

           _**సెల్ - 8328170075.**_

వివేకానంద స్ఫూర్తి..

 🕉🌞🌎🌙🌟🚩


*_Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 17._*


*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 17._*


*Ignorance is the cause of egoism, attachment, aversion, and clinging to life.* 


*అహంకారానికి, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి ( ప్రాణంపై  తీపికి)  అవిద్యయే కారణం.*


🕉🌞🌎🌙🌟🚩


*Inspiring Sayings of Swami Vivekananda  /స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.*


*How long is this life for? As you have come into this world, leave some mark behind. You the descendants of the most glorious Rishis the world ever saw." In every one of you lies that Eternal Power", and try to wake It up.*


*పుట్టిన ప్రతీ మనిషి గిట్టక తప్పదు కనుక ఈ ప్రపంచం మీద మీదంటూ ఒక గుర్తు ముద్రించి పొండి! మీరందరూ మహాత్ములైన ఋషుల సంతతికి చెందినవారు. మీరు ఘనకార్యాలు సాధించడానికి జన్మించారని నమ్మండి.*


🕉🌞🌎🌙🌟🚩

Hyderabad rain


 

  దశిక రాము*&


**మన సంస్కృతి సాంప్రదాయాలు**


క్షేత్ర సందర్శనం:-


**మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం**:-

భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం.


శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీమహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీమహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా, విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని, శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు.


ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ - కుంభకర్ణులు, కంస - శిశుపాలురు. హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో, రావణ, కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా, కంస, శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు. ఈ దశావతారాల్లో ఒక్కరైన భూ వరాహ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం..


మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం:


మైసూర్ సమీపంలోని భువరాహస్వామి ఆలయం విష్ణు యొక్క మూడవ అవతారం. కర్నాటకలోని మైసూర్ సమీపంలోని కల్లహల్లి అనే చిన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం హేమవతి నది ఒడ్డున ఉంది.


విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి:-


విష్ణువు యొక్క మూడవ అవతారం వరాహ స్వామి అనే అడవి పంది రూపం. విగ్రహం 18 అడుగుల ఎత్తు మరియు బూడిద రాయితో తయారు చేయబడింది. ఈ విగ్రహంలో భూదేవి వరాహస్వామి ఎడమ తొడ మీద కొలువుదీరి దర్శనమిస్తున్నది. దేవత విగ్రహం 3.5 అడుగుల పొడవు ఉంది. హనుమంతుడి విగ్రహం కూడా ప్రధాన విగ్రహం క్రింద చెక్కబడింది.


విగ్రహం యొక్క కుడివైపు, కుడి చేతిలో సుదర్శన్ చక్రం, ఎడమవైపు తొడమీద భూదేవీ ఆసీనులై కూర్చొని దర్శనమిస్తున్నది. ఇక్కడ స్థానికులకు భువరాహస్వామి ఆలయం చాలా ప్రసిద్ది చెందింది.ఈ స్వామి వారి దర్శనం కోరి వచ్చే వారు ఈ దేవుడు మర్మమైన శక్తులు కలిగి ఉన్నాయని నమ్ముతారు.


భువరాహస్వామి ఆలయంలో పక్కన హెమావతి నది:-


భువరాజస్వామి ఆలయంలో పక్కన హెమావతి నది ఉంది. ఈ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నదిలో ఈత కొట్టడం, పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉండదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడకు చేరుకుంటుంది. ఏప్రిల్ మరియు మేలో నీరు తగ్గిన తరువాత వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు సమీప ప్రాంతాల నుండి పండుగలలో పాల్గొంటారు.


భువరాహస్వామి ఆలయం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. ఈ ఆలయంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని చెపుతారు. ఈ దేవాలయానికి రాజ వీర్ బాలాల గురించి ఒక పురాణ కథ ఉంది. వేట కోసం రాజు అడవికి వెళ్ళిన సమయంలో విశ్రాంతి కొరకు ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో అక్కడ ఒక వింత దృశ్యాన్ని గమనించాడు. ఒక కుక్క చిన్న కుందేలును తరుముకుని రావడం చూశాడు. మరి కొద్ది సేపటికి కుందేలు కుక్కను తరుముకునిపోవడం గమనించాడు.


అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలో కొన్ని మాంత్రిక శక్తులను కలిగి ఉందని విశ్వసించాడు మరియు ఈ ప్రదేశంలో 16 అడుగుల లోతు తవ్వి చూడగా అక్కడ వరాహస్వామి విగ్రహం దాగి ఉండటాన్ని కనుగొన్నాడు. ఈ సంఘటన తరువాత, ఈ రాజు అక్కడ వరహాస్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతీ రోజు పూజలు చేయడం ప్రారంభించాడు.


ఎలా వెళ్లాలి?


బెంగళూరు -మైసూర్ రహదారిలో కల్హల్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం మాండ్య జిల్లాలోని పాండవుర్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప బస్సు స్టేషన్ 2 km దూరంలో ఉంది. ఈ ప్రదేశం చేరుకోవడం చాలా సులభం. మాండ్య జిల్లాలోని కల్హల్లి అనే చిన్న గ్రామం చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. అయితే బస్సులు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే నిలుస్తాయి. అక్కడి నుండి నడక లేదా మీ సొంత వాహనాల ద్వారా ప్రయాణించవచ్చు .

ఓం నమో శ్రీ శ్వేత వరాహ స్వామినే నమ:

ఓం నమో నారసింహాయ..

ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళం. .


సర్వే జనా సుఖినో భవంతు 

లోకాస్సమస్తా సుఖినో భవంతు ...

🙏🙏🙏

సేకరణ

*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏 

  *🤩దూర్వాసమహర్షి🤩* మహాభారతంలో ఇతరపురాణాలలో రామాయణంలో కూడా వీరి యొక్క ప్రస్తావన ఉన్నది. మహాభారతంలో కృష్ణ పరమాత్మ దుర్వాస మహామునియొక్క మహిమను తాను స్వయంగా పేర్కొంటాడు. అంతేకాదు హస్తినకు *దూర్వాసుల* వారు వచ్చినప్పుడు తాను సత్యభామాసహితుడై రథంపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తాడు. *దూర్వాస మహర్షి* యొక్క మహిమ అంపశయ్య దగ్గర భీష్ముడి సన్నిధిలోనే వివరిస్తాడు మొత్తం. దుర్వాసమహర్షి గురించి చెప్తూ అలా శివసహస్రంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే శివాంశ సంభూతుడు *దూర్వాస మహర్షి.*


దూర్వాసుల వారు ఎవరి పుత్రుడు అంటే *దత్తాత్రేయుల వారితో పాటే అత్రి అనసూయలకు తనయుడిగా కలిగినటువంటి మహానుభావుడాయన.* అత్రి అనసూయలకు త్రిమూర్తులూ కూడా తనయులుగా కలిగారు. అందులో బ్రహ్మాంశ చంద్రుడిగానూ, విష్ణ్వంశ దత్తాత్రేయుల గానూ, *రుద్రాంశ దూర్వాస మహర్షిగానూ*, వచ్చినది. మూడూ కలిసి ఒకే పరబ్రహ్మ వస్తువు. అందులో సందేహమేమీ లేదు. అయితే దత్తాత్రేయ ఉపాసన, దత్తాత్రేయ పరంపర ఒకటున్నది. దుర్వాస మహర్షికి కూడా పరంపర ఉండి ఉండాలా? చరిత్ర ఏమిటి? అని పరిశీలిస్తే ఆశ్చర్యకర అంశములు మనకు ఎన్నోఎన్నో తెలుస్తూ ఉంటాయి. దుర్వాస మహర్షికి శ్రీవిద్యలో ఒక పేరున్నది. క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి. *భట్టారకుడు అంటే పూజ్యుడు, గౌరవనీయుడు* అని. అమ్మవారిని కూడా పరాభట్టారికా అని అంటున్నాం కదా! క్రోధం అనే దానిని సుగుణం జేసి కీర్తిస్తున్నారట. గొప్ప కోపిష్టిగారొచ్చారండి అని అంటారా? కానీ క్రోధభట్టారక అనడం కూడా సంతోషమే. అలా అంటే ఆయనకి క్రోధం రాదట. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశమే. పురాణాలు పరిశీలిస్తే అనేకచోట్ల దుర్వాస మహర్షి శపించడాలు కనపడుతూ ఉంటాయి. లోకవ్యవహారంలో కూడా ఎవరైనా కోపిష్టి కనపడితే వాడు దుర్వాసుడండీ అంటారు.

*అప్పటికి ఏదో వీళ్ళకి దుర్వాసుడు తెలిసినట్లు.* కానీ మహర్షుల శాపాలు అనుగ్రహం యొక్క మరొక రూపాలు. అయితే మన్యుశక్తి అని ఒకటుంది పరమేశ్వరుడికి. *“నమస్తే రుద్ర మన్వవా”* అని మన్యు సూక్తంలో చెప్పబడుతూ ఉంటుంది. మన్యుసూక్తంలో చెప్పబడుతున్న మన్యుశక్తి యేదో ఈశ్వర స్వరూపమే గనుక *తదంశ దూర్వాసుల* వారిగా వచ్చిఉండవచ్చు. త్రిపురా రహస్యంలో దత్తాత్రేయ స్వామివారే స్వయంగా జీవన్ముక్తుల గురించి చెప్తూ జీవన్ముక్తులైనవారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు అన్నప్పుడు కొన్ని విశేషణాలు వివరిస్తూ *దూర్వాసుడి* గురించి ప్రస్తావన చేస్తారు పరశురాముల వారితో. త్రిపురారహస్యమే శ్రీవిద్యా గ్రంథం. అందులోకూడా *దూర్వాసుల ప్రస్తావన* మనకు కనపడుతున్నది. మహాభారతంలో దూర్వాసుడి ఉత్పత్తి కథ కనపడుతున్నది. అదేవిధంగా *అత్రి అనసూయల పుత్రుడు* అని కూడా కనపడుతున్నది. పురాణాలలో రెండుచోట్ల కనపడే సరికల్లా పరస్పర విరుద్ధం అంటారు వెంటనే సమన్వయం చేతకాక. భారతంలో యేం కనపడుతోందంటే దుర్వాసమహర్షి యొక్క ఆవిర్భావఘట్టం. పరమేశ్వరుడు ఒక మార్గడము(బాణం)తో త్రిపురాసురసంహార సమయంలో త్రిపురాలను దగ్ధం చేశాడు. ఆ బాణంయొక్క కొనయందు అగ్ని ఉన్నాడట. మొత్తం స్వరూపం విష్ణు స్వరూపం, కొనయందు అగ్ని ఉన్నాడు. అది జ్వలిస్తోంది. విష్ణువే అగ్నిగా జ్వలిస్తున్నాడు అనుకోవచ్చు. మొత్తంమీద బాణశక్తి విష్ణువే. విష్ణువే అయిన బాణశక్తి త్రిపురాలని దహించిన తర్వాత తిరిగి పరమాత్మ వద్దకు వచ్చిందట. పరమేశ్వరుడు దానిని తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాడట.


ప్రకాశమైనటువంటి ఆ బాణం ఒళ్ళో పెట్టుకోగానే మహర్షులందరూ చూసి నమస్కరిస్తూ ఉంటే ఆ బాణం కాస్తా ఒక శిశువు(ఋషి) ఆకృతిగా మారిందిట. ఏమిటి ఈ స్వరూపం అంటే ఇతడే నా అంశయైనటువంటి *దూర్వాసుడు* అని సాక్షాత్ శివుడు చెప్పినట్లుగా మనకు మహాభారతంలో కనపడుతున్నది. అంటే బాణం ఎవరు? నిజానికి విష్ణువు కనబడుతోంది. కానీ అది రుద్రప్రయోగం గనుక రుద్రశక్తి లేకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ మనకి హరిహరాత్మక తత్త్వం కనపడుతున్నది. అతడే *దూర్వాసుడు అని శివుడు చెప్పాడు* అంటే *దూర్వాసునిలో హరిహరాత్మక తత్త్వం* ఒకటి ఉన్నదని ప్రస్తావన. పురాణములు మనకు ఆ తత్త్వసంకేతాలు ఇస్తూ ఉంటాయి. తర్వాత మనకు కనబడే మరొక కథ అత్రి అనసూయల పుత్రుడయ్యాడని.


యేది ఇందులో స్వీకరించాలి? అంటే రెండూ స్వీకరించాలి. ఏ అంశ అయితే అక్కడ ఉన్నదో అదియే అత్రిఅనసూయలకు పుత్రుడుగా ఉద్భవించినది అని గ్రహించుకోవలసినటువంటి అంశం. కనుక రెండూ స్వీకరించవలసినదే. ఎందుకంటే ఒక దివ్యత్వం భువికి అవతరించింది. అవతరించింది అంటే అంతకు ముందు లేదు అని కాదు కదా! అంతకు ముందున్నది వచ్చినది. కనుక అంతకు ముందున్న దుర్వాస రూపమైనటు వంటి ఆ దేవర్షి స్వరూపమేదైతే ఉన్నదో అది ఈరూపంగా వచ్చింది అని అన్వయించుకోవలసి ఉన్నది. అయితే అత్రి అనసూయల పుత్రుడైన దత్తులవారికి కూడా ఒక పరంపర మనం చెప్పుకుంటూంటాం. సంప్రదాయబద్ధమైన దత్త పరంపర ఒకటున్నది. ఇప్పుడు దత్తపరంపరలో అసంప్రదాయ ధోరణులు కొందరు వాడుతూన్నారు. కలి ప్రభావం చేత. కానీ దత్తపరంపర అని సంప్రదాయ ధోరణి ఉన్నది మనకి. అది వైదికమైన పద్ధతిలో ఉన్నటువంటిది. అవధూత సంప్రదాయానికి చెందినది. దత్తోపాసన. దత్తోపాసన అని ఒక పరంపర ఎలా ఉన్నదో *దుర్వాస మహర్షియొక్క ఉపాసనా పరంపర* కూడా ఒకటి ఉండవచ్చు అని సూచనలు మనకు అనేకం కనపడుతున్నాయి. చిత్రమేమంటే *దూర్వాస మహర్షికి* సంబంధించినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం పొంది *వేదాంతవిద్యలో, శ్రీవిద్యలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి ఘట్టాలు మనకి కొన్ని కనపడుతూ ఉన్నాయి.* దుర్వాస మహర్షికూడా ఒక ఉపాస్యమైనటువంటి ఈశ్వర స్వరూపమే కేవలం మహర్షితేజమే కాకుండా.


*దూర్వాసుల* వారి చరిత్ర మనం చూస్తే ఆయన సర్వలోక సంచారం యథేచ్ఛగా చేసినట్లుగా మనకు అనేకచోట్ల కనపడుతున్నది. అంబరీష చరిత్రలో కూడా ఆయన ఈలోకానికి వెళ్ళాడు, ఆలోకానికి వెళ్ళాడు అనేటప్పుడు ఆయన పరుగెడుతున్నాడనడం చూశాంగానీ ఇన్ని లోకాలకి ఎలా వెళ్ళగలిగాడు అని ఆలోచించామా? *అంబరీష చరిత్రలో దూర్వాసుడు తగ్గినట్లు కనపడతారు. కానీ దాని పరమార్థం దానికున్నది. అక్కడ దూర్వాసుడేమీ తగ్గలేదు. అంబరీషుని గొప్పదనం బయటపడింది.* అది ఒక సందర్భం. అంతమాత్రం చేత మహర్షిని మనం తక్కువ చేయరాదు.

స్వస్తి

  **దశిక రాము**


శ్రీమద్భాగవతము


****




 తృతీయ స్కంధం -37




ప్రకృతి పురుష వివేకంబు  




జనులచే స్తుతింపబడేదానా! సత్త్వరజస్తమో గుణాలతో నిండి, ప్రకృతి వల్ల ఏర్పడిన శరీరాన్ని ఆశ్రయించి కూడ పురుషుడు ప్రకృతి సంబంధమైన సుఖదుఃఖ మోహాలకు లోనుగాడు. ఎటువంటి వికారాలు లేకుండా, త్రిగుణాలకు అతీతుడై, తేటనీటిలో ప్రతిబింబించిన సూర్యబింబాన్ని ఆ జలం అంటని విధంగా సత్త్వరజస్తమో గుణాలు పురుషుణ్ణి స్పృశింపలేవు. అలా కాకుండా జీవుడు ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే ఈ జరుగుతున్న అన్ని సన్నివేశాలకు నేనే కర్తనని అహంకారంతో వ్యామోహంతో ప్రవర్తిస్తాడు. అతిశయమైన సంగం వల్ల అతడు ప్రకృతి దోషాలు పొంది....సుర నర పశు పక్షి వృక్షాది నానావిధ యోనులందు జన్మించి కర్మవాసనలను విస్తరింపజేసికొని సంసార బంధాలలో చిక్కుపడి...చరిస్తూ, విషయసుఖాలను స్మరిస్తూ, కలలో కనిపించే ఐశ్వర్యాల వంటి సుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అతని మనస్సు చెడుమార్గాలలో ప్రవర్తిసుంది. అతడు చంచలబుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు.అందుచేత మోక్షంపై ఆసక్తి కలవాడు అఖండమైన భక్తియోగాన్ని అవలంబించాలి. విషయసుఖాలమీద విరక్తుడు కావాలి. యమం నియమం మొదలైన యోగమార్గాలను అభ్యసించి మనస్సును వశపరచుకొని...చలించని శ్రద్ధాశక్తులతో నాయొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలి. నా పాదాలు సేవించాలి. నా కథలను ఆకర్ణించాలి. సర్వజీవులయందు సమబుద్ధితో ప్రవర్తిందాలి. ఎవ్వరితోను వైరం లేకుండా ఉండాలి. బ్రహ్మచర్యం, మౌనం మొదలైన ఆత్మధర్మాలను అవలంబించాలి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. మితంగా భుజించాలి. ఏకాంతంగా ఉండాలి. మననశీలుడై ఉండాలి. మాత్సర్యాన్ని దూరం చేసుకోవాలి. మైత్రి, కరుణ అభ్యసించాలి. ఆత్మజ్ఞానం అలవరచుకోవాలి. తన శరీరం మీద, ఆత్మీయులైనవారి మీద ఆసక్తి తగ్గించుకోవాలి. అవి బంధనానికి హేతువు లవుతాయి. ఇంకా...జీవేశ్వరుల యథార్థస్వరూపం (త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకొన్నవాడు జీవుడనీ, త్రిగుణాలకు అతీతుడై వానిని నడిపించేవాడు ఈశ్వరుడనీ) తెలుసుకొనడంవల్ల బుద్ధి అంతర్ముఖ మౌతుంది. అందువల్ల బుద్ధియందలి సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుంది. అప్పుడు ఇతర పదార్థాలేవీ కన్పించవు. జీవాత్మజ్ఞానంతో కంటితో సూర్యుణ్ణి చూచినంత సూటిగా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం లభిస్తుంది. అప్పుడు అహంకారానికి తావుండదు. అది మిథ్యాభూతమై తొలగిపోతుంది. సత్యం ప్రకాశమాన మవుతుంది. అందువల్ల ప్రధానకారణమైన మూలప్రకృతికి ఆధారమూ, సమస్త సృష్టినీ దృష్టివలె ప్రకాశింప చేసేదీ, విశ్వంలోని సమస్త కార్యకారణాలకూ మూలభూతమూ, పరిపూర్ణమూ, సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. అమ్మా! విను. ఆత్మస్వరూపం తెలిసినవానికి పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. ఎలాగంటే ఆకాశంలోని సూర్యుని కిరణాలు నీళ్ళలోనూ, ఇంటిగోడలలోని కిటికీసందులలోను ప్రసరించటం వల్ల సూర్యుడున్నట్లు మనం తెలుసుకుంటాము. మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడింటిలో ప్రసారమయ్యే ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. ఇంకా..జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా 


అన్నది.పుణ్యాత్మా! పంచభూతాలలో పృథివికి, గంధానికి, జలానికి, రసానికి అన్యోన్యమైన అవినాభావ సంబంధం ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడు పరస్పర సంబంధం ఉంది కదా! అటువంటప్పుడు ప్రకృతి ఆత్మను ఎలా విడిచి పెట్టగలుగుతుంది? ఒక్కసారి కలిగిన తత్త్వజ్ఞానంవల్ల సంసారభయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఏది? ఇవన్నీ నాకు బాగా తెలిసేటట్లు చెప్పు. దేవతలచే సేవింపబడేవాడా! భక్తజన శరణ్యా! పరమపురుషా! దయతో ఈ జ్ఞానం నాకు కటాక్షించు. నన్ను రక్షించు.”


దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. “సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు” అని చెప్పి (ఇంకా ఇలా అన్నాడు). అమ్మా! విను. ప్రకృతి తన సహజ ప్రభావం వల్ల తనకు అధీశ్వరుడై తనలో ప్రవర్తించే పురుషునకు అమంగళాన్నీ, అనర్థాన్నీ ఆచరించలేదు. ఓ ఉత్తమనారీ! మానవుడు నిద్రపోతున్నపుడు పీడకలలలో పొందే కష్టనష్టాలు మేలుకొనగానే అసత్యాలని తెలుసుకుంటాడు. అదే విధంగా ఆత్మనాథుడూ, కర్మసాక్షీ అయిన పరమేశ్వరునకు ప్రకృతికి సంబంధించిన దోషాలు ఎన్నటికీ అంటవు”అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు..పుణ్యాత్మురాలా! ఆత్మజ్ఞాన సంపన్నుడైనవాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటాడు. వాని వైరాగ్యం చెక్కు చెదరదు. నా భక్తులు ఉపదేశించిన విజ్ఞాన సంపదవల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు నా అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. తాను పొందిన ఆత్మజ్ఞానంతో తన సందేహా లన్నింటినీ పోగొట్టుకుంటాడు. లింగదేహాన్ని విడిచిపెట్టి యోగిపుంగవుల అంతరంగాలకు సంభావ్యమైన నా దివ్యధామాన్ని తేజస్వియై చేరుకొంటాడు.ఇంకా అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందువల్ల వాటిమీద మమకారాన్ని వదలిపెట్టి నా పాదపద్మాలను హృదయంలో పదిలపరచుకున్నవాడు మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు” అని చెప్పి “ఇక యోగలక్షణాల విధానాలను వివరిస్తాను. విను’” అని భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు. బుద్ధిమంతులై ఏ యోగమార్గంవల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసికొని మాననీయమైన నా సన్నిధిని చేరుకుంటారో ఆ యోగధర్మాలను చెప్తాను విను. అది ఎలాగంటే తన శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించడం, శాస్త్రాలలో నిషేధింపబడిన కర్మలను మానడం, దైవికంగా అనగా తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించడం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్యపాదపద్మాలను సేవించడం, ఇతరులకు ఏవగింపు కలిగించే పనులను మానుకొనడం, మోక్షధర్మాలైన శాంతి అహింస మొదలైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తినడం, ప్రశాంతమై ఇబ్బందిలేని ఏకాంతప్రదేశంలో నివాసం చేయడం, హింస చేయకుండా ఉండడం, సత్యమార్గాన్ని తప్పక పోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనం గ్రహించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, తపశ్శౌచాలు కలిగి ఉండడం, సద్గ్రంధాలు చదవడం, సర్వేశ్వరుణ్ణి పూజించడం, మౌనంగా ఉండడం, ఎక్కువకాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసనవిజయం వల్ల స్థిరత్వం సంపాదించడం, ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం, ఇంద్రియాలను విషయాలనుండి నిగ్రహించడం, ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు హృదయాన్ని నిల్పడం, దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో కూడా ప్రాణధారణ చేయడం, శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించడం, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవడం, పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడని విశ్వసించడం ఇత్యాదులు యోగధర్మాలు. ఇవే కాకుండా ఇతర వ్రతాలను, దానాలను ఆచరించాలి. మనోమాలిన్యంతో కూడిన చెడుమార్గాలను విడిచిపెట్టాలి. ప్రాణాయామపరుడై చక్కగా ఆలోచించి శుచియైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా దర్భాసనంపై ఒక జింకచర్మాన్ని, దానిపైన వస్త్రాన్ని పరచి సుఖాసనంపై కూర్చోవాలి. శరీరాన్ని నిటారుగా నిలుపుకొని కుంభక పూరక రేచక రూపమైన ప్రాణాయామంతో అన్నమయ ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని చంచలమైన చిత్రాన్ని సుస్థిరం చేసుకొని, తీవ్రమైన సాధనతో బాగా కాచి కరిగించి మాలిన్యం పోగొట్టిన బంగారాన్ని వలె మనస్సును స్వచ్ఛం చేసుకోవాలి. ఈ విధంగా వాయువును వశం చేసుకొన్న యోగికి ప్రాణాయామం అనే అగ్ని చేత వాతపీత్తశ్లేష్మాలనే దోషాలు నశిస్తాయి. ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోతాయి. మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోతాయి. అటువంటి యోగి ధ్యానంవల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన దృష్టిని కేంద్రీకరించాలి.


🙏🙏🙏


సేకరణ


**ధర్మము-సంస్కృతి*


🙏🙏🙏




**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**


*మన ధర్మాన్ని రక్షిద్దాం**




**ధర్మో రక్షతి రక్షితః**


🙏🙏🙏

  

సౌందర్య లహరి శ్లోకము - 15

**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


**శరజ్జ్యోత్స్నా శుద్ధాం** 


**శశియుత జటాజూటమకుటాం**


**వరత్రా సత్రాణస్ఫటిక ఘుటికా పుస్తక కరామ్,**


**సకృన్నత్వా న త్వా**


**కథమివ సతాం సన్నిదధతే**


**మధుక్షీర ద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః !!**


జననీ ! శరశ్చంద్రిక మాదిరి శుద్ధ మైన దానవూ, శశియుత మైన జటాజూటమే కిరీటముగా గలదానవూ , వరాభయ ముద్రలు, అక్షమాలా పుస్తకాల ను ధరించిన దానవూ ఐన నిన్ను ఒక్కమారైనా నమస్కరించి న కవీశ్వరులకు పూదేనియతో

గోక్షీరంతో, ద్రాక్షా ఫలాలతో సాటివచ్చే మాధుర్యాన్ని

వహించిన మధుర వాక్కులు ఎలా ప్రాపించకుండా వుంటాయి ?

(అలాంటి వాక్కులు ప్రాపిస్తవనిభావం).


**ఓం గంగాధర కుటుంబిన్యైనమః**


**ఓం మృడాన్యైనమః**


**ఓం మునిసంసేవ్యాయైనమః**


🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

  సర్దార్_వల్లభాయ్_పటేల్

46 మంది దోషులను మరణశిక్ష (ఉరి) నుండి రక్షించాలని సీనియర్ న్యాయవాది వాదించారు. అప్పుడు అతని సహాయకుడు వచ్చి అతనికి ఒక చిన్న కాగితం ఇచ్చాడు. న్యాయవాది దాన్ని చదివి జేబులో పెట్టుకుని తన వాదనను కొనసాగించాడు


భోజన విరామ సమయంలో, న్యాయమూర్తి అతనిని "స్లిప్‌లో మీకు ఏ సమాచారం వచ్చింది" అని అడిగారు. న్యాయవాది "నా భార్య చనిపోయింది" అని అన్నారు. న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు మరియు "అప్పుడు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు?" ఎందుకు మీరు మీ ఇంటికి వెళ్ళలేదు?


న్యాయవాది ఇలా అన్నారు…. "నేను నా భార్య జీవితాన్ని తిరిగి తీసుకురాలేను, కాని ఈ 46 స్వాతంత్య్ర సమరయోధులకు జీవితాన్ని ఇవ్వడానికి మరియు వారు చనిపోకుండా నిరోధించడంలో నేను సహాయపడగలను". దీంతో ఆంగ్లేయుడైన న్యాయమూర్తి మొత్తం 46 మందిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయవాది మరెవరో కాదు, #సర్దార్_వల్లభాయ్_పటేల్.....🙏🙏👏👏

  *శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం.* 


మార్కండేయ ఉవాచ.


నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం..


ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ..


సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు..


ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతుమే హరిః..


ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు..


దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః..


సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః..


పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు..


య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః..


సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః..


ఇతి మార్కండేయకృత వేంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం


🍁🍁🍁.


☘️☘️☘️☘️☘️☘️

  **


పరిక్షితు జననంబు




1-289-వ.వచనము


అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకంబును నైన శుభలగ్నంబునం బాండవ వంశోద్ధారకుం డయిన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి జాతకర్మంబులు సేయించి కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచిసంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్తులై ధర్మపుత్రున కిట్లనిరి.


అంతన్ = అంతట; అనుకూల = అనుకూలమైన; శుభ = శుభప్రదమైన; గ్రహ = గ్రహములు; ఉదయంబును = కలుగుటయును; సర్వ = సమస్త; గుణ = మంచిగుణములకు; ఉత్తర = భవిష్యత్తులోని; ఫల = ఫలములను; సూచకంబునున్ = సూచించునవియును; ఐన = అయినట్టి; శుభ = శుభకరమైన; లగ్నంబునన్ = లగ్నములో; పాండవ = పాండురాజు పుత్రులకు; వంశ = వంశమును; ఉద్ధారకుండు = ఉద్ధరించువాడు; అయిన = అయినట్టి; కుమారుండు = పుత్రుడు; జన్మించినన్ = పుట్టగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; ధౌమ్య = ధౌమ్యుడు; ఆది = మొదలగు; భూసుర = బ్రాహ్మణుల {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; వర్గంబున్ = సమూహమును; రప్పించి = పిలిపించి; పుణ్యాహంబు = పుణ్యాహము అను శుద్ధి మంత్రములు; సదివించి = చదివించి; జాతకర్మంబులు = పిల్లలు పుట్టినప్పుడు చేయు కార్యక్రమము; చేయించి = చేయించి; కుమారు = పుత్రుని; జన్మ = పుట్టిన సందర్భపు; మహా = గొప్ప; ఉత్సవ = పండుగ; కాలంబునన్ = సమయమున; భూసురులు = బ్రాహ్మణులు {భూసురులు భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కున్ = కి; విభవ = వైభవముతో; అభిరామంబులు = మనోజ్ఞములు; అయిన = అయినట్టి; గో = గోవులను; భూ = భూములను; హిరణ్య = బంగారము; హయ = గుఱ్ఱములను; అనేక = అనేకమైన; గ్రామంబులును = గ్రామములను; స్వాదు = చక్కని; రుచి = రుచితో; సంపన్నంబులు = సమృద్ధములు; అయిన = అయినట్టి; అన్నంబులు = ఆహారములును; ఇడిన = ఇచ్చిన; వారలు = వారు; తృప్తులు = తృప్తి చెందిన వారు; ఐ = అయి; ధర్మపుత్రున = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.


అనంతరం శుభగ్రహాలన్నీ ఉచ్చస్థానాల్లో ఉండగా, సర్వసౌభాగ్య సముద్తాతమైన ఉత్తమ ముహూర్తంలో, ఉత్తరకు పాండవ వంశోద్ధారకుడైన బాలుడు ఉద్భవించాడు. ధర్మరాజు ధౌమ్యుడు మొదలైన పురోహితులను పిలిపించి పుణ్యాహవాచనం, జాతకర్మాదులు జరిపించాడు. పుత్రోదయ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వర్తించి, భూసురోత్తములకు షడ్రసోపేత భోజనాలు పెట్టించి, గోవులూ భూములూ సువర్ణాలూ అశ్వాలూ అగ్రహారాలూ దానం చేసాడు. సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి...


1-290-చ.చంపకమాల




"ప్రకటిత దైవయోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా


వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా


బకుఁ బ్రతికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం


తకుఁ డగు; విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై"


ప్రకటిత = వ్యక్తమైన; దైవ = దైవముచే నిర్దేశించబడిన; యోగమునన్ = యోగము వలన; పౌరవ = పురువు; సంతతి = వంశము; అంతరింపఁగా = అంతరించుచుండగా; వికలత = చెదిరిపోవుట; ఒందనీక = సంభవించకుండగ; ప్రభవిష్ణుఁడు = కృష్ణుడు {ప్రభవిష్ణుడు - అవతరించు శీలము కలవాడు, విష్ణువు}; విష్ణుఁడు = కృష్ణుడు {విష్ణుడు - వ్యాపించు శీలము కలవాడు, విష్ణువు}; అనుగ్రహించి = అనుగ్రహించి; శాబకున్ = పిల్లవాడిని; బ్రతికించెన్ = బ్రతుకునట్లు కాపాడెను; కావునన్ = అందువలన; నృపాలక = రాజా {నృపాలకుడు - నరులను ఏలు వాడు, రాజు}; శాబకుడు = పిల్లవాడు; ఇంక = ఇక; శాత్రవ = శత్రువులను; అంతకుఁడు = అంతముచేయువాడు; అగున్ = అగును; విష్ణురాతుడు = విష్ణురాతుడు; అనన్ = అని; ధాత్రిన్ = భూమిమీద; ప్రసిద్ధి = మంచిపేరు; కిన్ = ను; ఎక్కున్ = పొందును; పూజ్యుఁడు = పూజింప తగువాడు; ఐ = అయి.


"మహారాజా! దాటరాని దైవనియోగం వల్ల భారతవంశం అంతరించి పోకుండా ప్రభవిష్ణువైన శ్రీమహావిష్ణువు పరమానుగ్రహంతో ఈ పసిపాపను బ్రతికించాడు. ఈ బాలుడు, పగవారిపాలిటి లయకాలుడై విష్ణువుచేత రక్షించబడినందున విష్ణురాతు డనే నామంతో విఖ్యాతుడై, జగన్మాన్యుడౌతాడు."


1-291-వ.వచనము


అనిన విని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె.


అనినన్ = అని పలుకగా; విని = విన్నవాడై; భూదేవ = బ్రాహ్మణులలో {భూదేవులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తములు = ఉత్తములు; కున్ = కు; నరదేవ = రాజులలో {నరదేవులు - నరులలో దేవతలు, రాజులు}; ఉత్తముండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.


అనిన వినిన భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె.


1-292-శా.శార్దూల విక్రీడితము




"ఓ పుణ్యాత్మకులార! నాపలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్


మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై


యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా యెల్లప్పుడున్ మాధవ


శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే."


ఓ = ఓ; పుణ్య = పుణ్యవంతమైన; ఆత్మకులార = ఆత్మకలవారలు; నా = నాయొక్క; పలుకులు = మాటలు; మీరు = మీరు; ఊహింపుఁడా = ఆలోచించండి; మ్రొక్కెదన్ = వేడెదను; మా = మాయొక్క; పెద్ధల్ = పెద్దలు, పూర్వీకులు; శ్రుత = వినపడుతున్న; కీర్తులు = కీర్తి కలవారు; ఐ = అయి; సదయులు = మంచి దయ కల వారు; ఐ = అయి; మన్నారు = బ్రతికితిరి; రాజర్షులు = రాజులలో ఋషులు; ఐ = అయి; ఈ = ఈ; పిన్న = చిన్న; అతఁడు = వాడు; వారిన్ = వారిని; పోలెడిన్ = పోల్చుటకు తగి ఉంటాడు; కదా = కదా; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; మాధవ = కృషుని {మాధవ – 1. మా (లక్ష్మీదేవి) ధవ (భర్త ఐనవాడు) , 2. యదువు తరువాతి తరపు మధువు యొక్క వంశము వాడు, శ్రీకృషుడు}; శ్రీ = శుభకరమైన; పాద = పాదములనెడి; అంబుజ = పద్మములయందు; భక్తి = భక్తి; యుక్తుఁడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; జీవించునే = బ్రతుకునా; చూడరే = చూడండి.


"ఓ మహాత్ములారా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా పలుకులు ఆలకించి నా సందేహం తీర్చండి. మా పెద్దలంతా దిగంత విశ్రాంత కీర్తులై, కారుణ్యమూర్తులై, రాజర్షులై విరాజిల్లారు. ఈ చిన్నారి బాలుడు సైతం తన తాతముత్తాల అడుగుజాడల్లో నడుస్తూ వారిలాగనే ఎల్లప్పుడూ శ్రీ వల్లభుని పాద పద్మాలను భక్తితో సేవిస్తూ జీవిస్తాడు గదా దయచేసి కొంచెము సెలవీయండి."


1-293-వ.వచనము


అనిన విని ”నరేంద్రా! భవదీయపౌత్రుండు మనుపుత్రుం డయిన యిక్ష్వాకుని చందంబున బ్రజల రక్షించు; శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండు నగు; డేగ వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుఁ గాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణఖనియు నగు; దుష్యంతసూనుం డైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి విస్తరించు; ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుం డగుఁ; గీలి పోలిక దుర్ధర్షుం డగు; సముద్రుని తెఱంగున దుస్తరుం డగు; మృగేంద్రంబు కైవడి విక్రమశాలి యగు; వసుమతివోలె నక్షయక్షాంతియుక్తుం డగు; భానుని లాగున ప్రతాపవంతుం డగు; వాసుదేవు వడువున సర్వభూతహితుం డగు; దల్లిదండ్రులమాడ్కి సహిష్ణుం డగు; మఱియును.


అనినన్ = అని పలికిన; విని = విన్నవారై; నరేంద్రా = నరులలో ఉత్తముడా; భవదీయ = నీయొక్క; పౌత్రుండు = మనుమడు; మను = మనువు యొక్క; పుత్రుండు = పుత్రుడు; అయిన = అయిన; ఇక్ష్వాకుని = ఇక్ష్వాకుని; చందంబునన్ = వలె; ప్రజలన్ = ప్రజలను; రక్షించు = కాపాడును; శ్రీరామచంద్రుని = శ్రీరామచంద్రుని; భంగిన్ = వలె; బ్రహ్మణ్యుండు = బ్రాహ్మణహితుడు; సత్య = సత్యమును; ప్రతిజ్ఞుండున్ = ప్రతిజ్ఞలు కలవాడును; అగున్ = అగును; డేగ = డేగ; వెంటనంటిన = వెంట తరుమగా; బిట్టు = మిక్కిలి; భీతంబు = భయము చెందినది; ఐ = అయి; వెనుకకు = వెనుకకు; వచ్చిన = మరలి వచ్చిన; కపోతంబున్ = పావురమును; కాచిన = కాపాడిన; శిబి = శిబి అను; చక్రవర్తి = రారాజు; రీతి = వలె; శరణ్యుండును = శరణ మిచ్చువాడును; వితరణ = దాన మిచ్చుటలో; ఖనియున్ = గని వంటివాడును; అగున్ = అగును; దుష్యంత = దుష్యంతుని; సూనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; భరతు = భరతుని; పగిదిన్ = వలె; సోమ = చంద్ర; అన్వయ = వంశపు; జ్ఞాతి = బంధువుల; వర్గంబులు = సమూహములు; కున్ = కు; యజ్వలు = యజ్ఞముచేయువారి; కున్ = కు; అనర్గళ = అడ్డులేని; కీర్తిన్ = కీర్తిని; విస్తరించున్ = విస్తరింపజేయును; ధనంజయ = అర్జునుడు; కార్తవీర్యుల = కార్తవీర్యార్జనుడుల; కరణిన్ = వలె; ధనుస్ = ధనుస్సును; ధర = ధరించువారిలో; అగ్రేసరుడు = మిక్కిలి గొప్పవాడు; అగున్ = అగును; కీలి = అగ్ని {కీలి - కీలలు కలవాడు, అగ్ని}; పోలికన్ = వలె; దుర్ధర్షుండు = తిరస్కరింపదగనివాడు; అగున్ = అగును; సముద్రుని = సాగరుని; తెఱంగునన్ = వలె; దుస్తరుండు = దాటుటకు వీలుకానివాడు; అగున్ = అగును; మృగేంద్రంబు = సింహము {మృగేంద్రము - మృగములలో గొప్పది, సింహము}; కైవడిన్ = వలె; విక్రమశాలి = పరాక్రమవంతుడు; అగున్ = అగును; వసుమతి = భూదేవి; వోలెన్ = వలె; అక్షయ = తరుగని; క్షాంతి = ఓర్పు; యుక్తుండు = కలవాడు; అగున్ = అగును; భానుని = భానుని; లాగునన్ = వలె; ప్రతాపవంతుండు = ప్రతాపముకలవాడు; అగున్ = అగును; వాసుదేవు = కృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; వడువునన్ = వలె; సర్వ = సమస్త; భూత = జీవులకు; హితుండు = హితవుచేయువాడు; అగున్ = అగును; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; మాడ్కిన్ = వలె; సహిష్ణుండు = సహనము కలవాడు, ఓర్పు కల వాడు; అగున్ = అగును; మఱియును = ఇంకా.


అప్పుడు అజాతశత్రునితో విప్రులు ఈ విధంగా అన్నాను-ధర్మపుత్రా ఈ నీ పౌత్రుడు మనువు కుమారుడైన ఇక్ష్వాకు నరేంద్రునిలాగా ప్రజలను పాలిస్తాడు. కారుణ్యసాంద్రుడైన శ్రీరామచంద్రునిలాగా సత్యసంధుడూ సౌజన్యసింధుడూ ఔతాడు. ఆకలిగొన్న డేగ వెన్నంటి తరమగా, అత్యంత భయసమేతమైన కపోతానిక అభయ మిచ్చిన శిబిచక్రవర్తిలాగా ఆర్తశరణ్యుడై వదాన్యులలో అగ్రగణ్యు డౌతాడు. దుష్యంతుని కుమారుడైన భరతునిలాగా యజన క్రియానిరతుడై. అఖండయశోభరితుడై చంద్రవంశానికి పేరు తెస్తాడు. అర్జునుని వలె, కార్తవీర్యార్జునునివలే విలుకాండ్రలో మేలుంబంతి అవుతాడు. అగ్నిహోత్రుడులా చెనకరాని వాడూ, సముద్రునిలా అతిక్రమింపరాని వాడూ, సింహంవంటి పరాక్రమశాలీ, వసుంధరవంటి క్షమాశీలీ అవుతాడు. దినకరునిలా తేజో మహితుడూ, దేవకీనందనునిలా సకలభూత హితుడూ, జననీ జనకులులా సహన సహితుడూ అవుతాడు. అంతేకాదు...


1-294-సీ.సీస పద్యము




సమదర్శనంబున జలజాతభవుఁడనఁ;


బరమప్రసన్నత భర్గుఁ డనగ


నెల్లగుణంబుల నిందిరావిభుఁడన;


నధికధర్మమున యయాతి యనఁగ


ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁడన;


నచ్యుతభక్తి బ్రహ్లాదుఁ డనఁగ


రాజితోదారత రంతిదేవుండన;


నాశ్రితమహిమ హేమాద్రి యనఁగ


1-294.1-తే.


యశము నార్జించుఁ, బెద్దల నాదరించు,


నశ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల


ఘనులఁ బుట్టించు, దండించు ఖలులఁ బట్టి,


మానధనుడు నీ మనుమఁడు మానవేంద్ర!


సమదర్శనంబునన్ = సమస్తమును సమానముగా చూచుటయందు; జలజాతభవుఁడు = బ్రహ్మ {జలజాతాక్షుడు - (నీటిలో పుట్టునది) పద్మము నందు పుట్టిన వాడు / బ్రహ్మ}; అనన్ = అనగా; పరమ = మిక్కిలి; ప్రసన్నతన్ = ప్రసన్నముగ ఉండుటలో; భర్గుఁడు = శివుడు; అనగన్ = అనగా; ఎల్ల = సమస్త; గుణములన్ = మంచి గుణములలోను; ఇందిరావిభుఁడు = లక్ష్మీపతి / విష్ణువు; అనన్ = అనగా; అధిక = అధికమైన; ధర్మమున = ధర్మపాలనలో; యయాతి = యయాతి; అనఁగన్ = అనగా; ధైర్య = ధైర్యము అనే; సంపద = సంపద కలిగి ఉండుటలో; బలి = బలి అను; దైత్య = రాక్షసులకు; వల్లభుఁడు = ప్రభువు; అనన్ = అనగా; అచ్యుత = హరి మీది; భక్తిన్ = భక్తిలో; ప్రహ్లాదుఁడు = ప్రహ్లాదుడు; అనఁగన్ = అనగా; రాజిత = ప్రకాశించు; ఉదారతన్ = దానగుణములో; రంతిదేవుండు = రంతిదేవుడు; అనన్ = అనగా; ఆశ్రిత = ఆశ్రయింపదగిన; మహిమన్ = గొప్పదనములో; హేమాద్రి = హిమాలయము; అనఁగ = అనగా;


యశమున్ = కీర్తిని; ఆర్జించున్ = సంపాదించును; పెద్ధలన్ = పెద్దవారిని; ఆదరించున్ = ఆదరించును; అశ్వమేంధబులు = అశ్వమేధయజ్ఞములు; ఒనరించు = చేయును; ఆత్మ = తన; సుతులన్ = పుత్రులను; ఘనులన్ = గొప్పవారిని; పుట్టించు = కనును; దండించున్ = శిక్షించును; ఖలులన్ = దుష్టులను; పట్టి = పట్టుకొని; మాన = మానము అను; ధనుడు = ధనము కలవాడు; నీ = నీ; మనుమఁడు = మనుమడు; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}.


ఇతడు సమదృష్టిలో జలజభవుడు-ప్రసాదంలో పరమశివుడు. రమణీయ గుణసంపదలో రమాధవుడు-అనిపించుకొంటాడు. ధర్మాతిశయంలో యయాతిగా, ధైర్యంలో బలిచక్రవర్తిగా, భక్తిద్రఢిమలో ప్రహ్లాదుడుగా, దాతృత్వగరిమలో రంతిదేవుడుగా, ఆశ్రయమహిమలో హిమగిరిగా ఖ్యాతి గాంచుతాడు. కీర్తిపై అనురక్తీ, పెద్దలపై భక్తీ, కలిగి అశ్వమేధాలు ఆచరిస్తాడు. తనవంచి తనయులకు తండ్రియై వంశాన్ని పండిస్తారు. దుర్మార్గులను దండిస్తాడు. నీ మనుమడ మానధనులో మాననీయు డౌతాడు.


1-295-భు.భుజంగ ప్రయాతము




హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్


భరించున్ ధరన్ రామభద్రుండుఁ బోలెన్


జరించున్ సదా వేదశాస్త్రానువృత్తిన్


వరించున్ విశేషించి వైకుంఠుభక్తిన్.


హరించున్ = పోగొట్టును; కలి = కలిచేత; ప్రేరిత = ప్రేరింపబడిన; అఘంబులు = పాపములు; ఎల్లన్ = అన్నిటిని; భరించున్ = పోషించును; ధరన్ = భూమిని; రామభధ్రుండున్ = రామచంద్రుడు; పోలెన్ = వలె; చరించున్ = మెలగును; సదా = ఎల్లప్పుడు; వేద = వేదమును; శాస్త్ర = శాస్త్రమును; అనువృత్తిన్ = అనుసరించి; వరించున్ = కోరి స్వీకరించును; విశేషించి = ప్రత్యేకించి; వైకుంఠు = విష్ణుమూర్తి మీది {వైకుంఠుడు - వైకుంఠములో ఉండువాని, విష్ణుమూర్తి}; భక్తిన్ = భక్తితో.


ఇతడు కలికల్మషాలను హరిస్తాడు. శ్రీరామచంద్రుడులాగా భూభారాన్ని భరిస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి సదా చరిస్తాడు విశిష్టమైన విష్ణుభక్తిని వరిస్తాడు.


1-296-వ.వచనము


ఇట్లు పెక్కేండ్లు జీవించి భూసుర కుమార ప్రేరితం బయిన తక్షకసర్ప విషానలంబునం దనకు మరణం బని యెఱింగి, సంగవర్జితుం డయి, ముకుంద పదారవింద భజనంబు సేయుచు, శుకయోగీంద్రుని వలన నాత్మవిజ్ఞాన సంపన్నుం డై, గంగాతటంబున శరీరంబు విడిచి, నిర్గత భయశోకం బయిన లోకంబుఁ బ్రవేశించు" నని, జాతకఫలంబు సెప్పి లబ్దకాము లయి భూసురులు సని రంత.


ఇట్లు = ఈ విధముగ; పెక్రు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; జీవించి = బ్రతికి; భూసుర = బ్రాహ్మణ {భూసురుడు - భూమికి దేవత, విప్రుడు}; కుమార = పుత్రునిచేత; ప్రేరితంబు = ప్రేరేపించబడినది; అయిన = అయినట్టి; తక్షక = తక్షకుడు అను; సర్ప = పాముయొక్క; విష = విషము అను; అనలంబునన్ = అగ్నివలన; తన = తన; కున్ = కు; మరణంబు = చావు కలుగును; అని = అని; ఎఱింగి = తెలిసికొన్నవాడై; సంగ = బంధములను; వర్జితుండు = విడిచిపెట్టిన వాడు; అయి = అయి; ముకుంద = హరియొక్క; పద = పాదములు అను; అరవింద = పద్మములమీద; భజనంబు = భక్తి; చేయుచు = చేయుచు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుని = శ్రేష్ఠుని; వలనన్ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మల గురించిన; విజ్ఞాన = విశిష్ట జ్ఞానము అను; సంపన్నుండు = సంపద కలవాడు; ఐ = అయి; గంగా = గంగ యొక్క; తటంబునన్ = ఒడ్డున; శరీరంబు = శరీరమును; విడిచి = విడిచిపెట్టి; నిర్గత = తొలగింపబడిన; భయ = భయము; శోకంబు = శోకము కలది; అయిన = అయినట్టి; లోకంబున్ = లోకమును; ప్రవేశించును = చేరును; అని = అని; జాతక = జాతకము గణన చేయగా వచ్చిన; ఫలంబు = ఫలితమును; చెప్పి = చెప్పి; లబ్ద = పొంద బడిన; కాములు = కామములు కలవారు; అయి = అయిన; భూసురులు = బ్రాహ్మణులు; సనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అంతట.


ఈ బాలుడు ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపి, మునికుమారునివల్ల ప్రేరేపించబడిన తక్షకుని విషాగ్నిజ్వాలలచే తాను చనిపోతానని తెలుసుకొని సర్వసంగ పరిత్యాగియై, గోవింద చరణారవింద భజనానురాగియై, శుకయోగీంద్రులవల్ల బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గంగానదీతీరంలో శరీరాన్ని పరిత్యజించి భయశోకాలు లేని పుణ్య లోకానికి చేరుకుంటాడు-అని ఈ ప్రకారంగా బాలకుని భవిష్యత్తు ప్రకటించి, ధర్మరాజు ఇచ్చిన కానుకలు అందుకొని, భూసురోత్తములు సంతుష్టచిత్తులై వెళ్లిపోయారు.


1-297-క.కంద పద్యము




తన తల్లి కడుపులోపల


మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం


డనుచుఁ బరీక్షింపఁగ జను


లనఘుఁ బరీక్షన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా!


తన = తనయొక్క; తల్లి = తల్లి; కడుపు = కడుపు; లోపలన్ = లోపల; మును = ఇంతకు ముందు; సూచిన = చూచిన; విభుఁడు = ప్రభువు; విశ్వమున = లోకమునకు; ఎల్లన్ = ఎల్లెడల; కలండు = ఉన్నాడు; అనుచున్ = అని; పరీక్షింపఁగన్ = పరీక్షంచుండుటచేత; జనులు = ప్రజలు; అనఘున్ = పాపములేని వానిని; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రుడు = రాజు; అండ్రు = అందురు; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.


శౌనక మునీంద్రా తన కన్నతల్లిగర్భంలో మున్ను తాను సందర్శించిన భగవంతుడు విశ్వమంతటా విరాజిల్లుతున్నాడేమో నని పరీక్షించినందువల్ల ఆ బాలుణ్ణి లోకులు పరీక్షిత్తు అని పిలిచారు.


1-298-ఆ.ఆటవెలది




కళలచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణు


డయిన భంగిఁ దాత లనుదినంబుఁ


బోషణంబు సేయఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ


పటలపాలకుండు బాలకుండు


కళల = చంద్ర కళల; చేతన్ = వలన; రాజు = చంద్రుడు; క్రమమునన్ = క్రమముగ; పరిపూర్ణుడు = పూర్ణ చంద్రుడు; అయిన = అయిన; భంగిన్ = విధముగ; తాతలు = పితామహులు; అనుదినంబున్ = ప్రతిరోజు; పోషణంబు = పోషణ; చేయన్ = చేయుచుండగ; పూర్ణుండు = పరిపూర్ణుండు; అయ్యెను = ఆయెను; ధర్మ = ధర్మముల; పటల = సమూహమునకు; పాలకుండు = పరిపాలకుడు; బాలకుండు = బాలుడు.


తాతలు దినదినమూ అనురాగంతో పెంచి పెద్దచేయగా ఆ బాలకుడు, షోడశకళలచేత పరిపూర్ణుడైన చంద్రునివలే క్రమంగా వృద్ధిపొందసాగాడు.


1-299-వ.వచనము


మఱియు ధర్మనందనుండు బంధు సంహారదోషంబు వాయుకొఱకు నశ్వమేధయాగంబు సేయం దలఁచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్జితం బయిన విత్తంబు సాలక చిత్తంబునఁ జింతించు నెడ; నచ్యుతప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరుత్తుండను రాజు మఖంబు సేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తం బుత్తరదిగ్భాగంబువలన బలవంతులై తెచ్చిన; నా రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకలబంధు సమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు సేసి, పురుషోత్తము నుద్దేశించి మూడు జన్నంబులు గావించెఁ; దదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొఱకుఁ గరి నగరంబునఁ గొన్ని నెల లుండి ధర్మపుత్రాదులచే నామంత్రణంబు పడసి యాదవ సమేతుం డయి ధనుంజయుడు దోడరా నిజనగరంబునకుం జనియె; నంతకు మున్ను విదురుండు తీర్థయాత్ర సని మైత్రేయు ముందటఁ గర్మయోగవ్రతాది విషయంబు లయిన ప్రశ్నంబులఁ కొన్నింటిం జేసి, యతనివలన నాత్మవిజ్ఞానంబు దెలిసి, కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన.


మఱియు = ఇంకా; ధర్మనందనుండు = ధర్మరాజు; బంధు = బంధువులను; సంహార = సంహరించిన; దోషంబు = దోషము; పాయు = పోగొట్టుకొనుట; కొఱకున్ = కోసము; అశ్వమేధ = అశ్వమేధ; యాగంబు = యజ్ఞము; చేయన్ = చేయ వలనని; తలఁచి = నిశ్చయించుకొని; ప్రజల = ప్రజల; వలనన్ = వలన; కరదండంబులు = కానుకలు కప్పములు రూపములో; ఉపార్జితంబు = ఆర్జింపబడినది; అయిన = అయినట్టి; విత్తంబు = ధనము; చాలక = చాలక; చిత్తంబునన్ = మనసులో; చింతించు = విచారించు; ఎడన్ = సమయమున; అచ్యుత = కృష్ణునిచే; ప్రేరితులు = ప్రేరింపబడిన వారు; ఐ = అయి; భీమ = భీముడు; అర్జున = అర్జునుడు; ఆదులు = మొదలగు వారు; తొల్లి = పూర్వము; మరుత్తుండు = మరుత్తుడు; అను = అని పేరు కల; రాజు = రాజు; మఖంబు = యజ్ఞము; చేసి = చేసి; పరిత్యజించి = వదిలివేసి; నిక్షేపించిన = భూమిలో దాచిన, నిధి; సువర్ణ = బంగారు; పాత్ర = పాత్రలు; ఆదికంబు = మొదలైనవి; ఐన = అయిన; విత్తంబున్ = ధనము; ఉత్తర = ఉత్తరపు; దిక్ = దిక్కు; భాగంబు = వైపు భూభాగము; వలనన్ = నుండి; బలవంతులు = బలము కలవారు; ఐ = అయి; తెచ్చినన్ = తీసుకొని వచ్చిన; ఆ = ఆ; రాజ = రాజులలో; సత్తముండు = శ్రేష్ఠుడు; సమాయత్త = కూర్చుకొనబడిన; యజ్ఞ = యజ్ఞమునకు కావలసిన; ఉపకరణుండు = పరికరములు కలవాడు; ఐ = అయి; సకల = సమస్త; బంధు = బంధువులతో; సమేతంబుగన్ = కలుపుకొని; కృష్ణుని = కృష్ణుని; ఆహ్వానంబు = ఆహ్వానము; చేసి = చేసి; పురుషోత్తమున్ = పురుషోత్తముని; ఉద్దేశించి = కొఱకు; మూడు = మూడు; జన్నంబులు = యజ్ఞములు; కావించెన్ = నిర్వహించెను; తత్ = ఆ; అనంతరంబ = తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; బంధు = బంధువులకు; ప్రియంబు = ప్రీతి కలిగించుట; కొఱకున్ = కోసము; కరినగరంబునన్ = హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఉండి; ధర్మపుత్ర = ధర్మరాజు {ధర్మపుత్రుడు - యముని పుత్రుడు, ధర్మరాజు}; ఆదుల = మొదలగువారు; చేన్ = చేత; ఆమంత్రణంబు = అనుమతి; పడసి = పొంది; యాదవ = యాదవులతో; సమేతుండు = కూడిన వాడు; అయి = అయి; ధనుంజయుడు = అర్జునుడు; తోడ = తోడు; రాన్ = రాగా; నిజ = తనయొక్క; నగరంబు = నగరము; కున్ = కు; చనియెన్ = వెళ్లెను; అంతకు = అంతకన్న; మున్ను = ముందు; విదురుండు = విదురుడు; తీర్థయాత్ర = పుణ్యస్థలములను సేవించుటకు; చని = వెళ్ళి; మైత్రేయు = మైత్రేయుని; ముందటన్ = ఎదురుగ; కర్మయోగ = కర్మయోగమును; వ్రత = వ్రతములును; ఆది = మొదలగు; విషయంబులు = విషయములను గురించినవి; అయిన = అయినట్టి; ప్రశ్నంబులన్ = ప్రశ్నలను; కొన్నింటిన్ = కొన్నిటిని; చేసి = వేసి; అతని = అతని; వలనన్ = వలన; ఆత్మ = ఆత్మ పరమాత్మ ల గురించిన; విజ్ఞానంబున్ = విజ్ఞానమును; తెలిసి = తెలిసికొని; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయి; హస్తినాపురంబు = హస్తినాపురము; కున్ = కు; వచ్చిన = రాగా.


తర్వాత ధర్మనందనుడు చుట్టాలను చంపిన పాపం పోగొట్టుకోవటం కోసం అశ్వమేధయజ్ఞం చేయాలనుకొన్నాడు. పన్నుల పూరంలోనూ, శిక్షలరూపంలోనూ ప్రజలనుంచి రాబట్టిన ధనం సరిపోదే అని అదడు విచారించసాగాడు. అప్పుడు పూర్వం మరుత్త మహారాజు యజ్ఞంచేసి మిగిలిన ధనాన్ని భూమిలో నిక్షేపించాడని విని శ్రీకృష్ణభగవానునిచే ప్రేరితులైన భీమార్జునులు ఉత్తరానికి వెళ్లి సువర్ణరాసులు కొని తెచ్చారు. అనంతరం రాజవరేణ్యుడైన ధర్మనందనుడు యజ్ఞానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధంచేసుకొన్నాడు. శ్రీకృష్ణుణ్ణి బంధుసమేతంగా ఆహ్వానించాడు. పురుషోత్తముణ్ణి యజ్ఞపురుషుడుగా భావించి మూడు అశ్వమేధాలు కావించాడు. ఆ తర్వాత గోవిందుడు బంధువులైన పాండవుల సంతోషంకోసం హస్తినానగరంలో కొన్ని మాసాలపాటు ఉన్నాడు. అనంతరం ఆయన పాండవులను వీడ్కొని సకలబంధు సమేతుడై, అర్జునుణ్ణి వెంటబెట్టుకొని ద్వారకా నగరానికి వెళ్లిపోయాడు. కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకొన్నాడు. కర్మాలు, యోగాలు, వ్రతాలు మొదలైన అంశాలపై ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి కావించుకొన్నాడు. పరమార్థజ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థుడై తిరిగి హస్తినకు అరుదెంచాడు.

  సేకరణ 👇


క్రియా యోగం అంటే 



?




ప్రపంచమంతా సంచలనం కలిగించి,అనేక భాషలోకి అనువదించబడి,పలు ప్రచురణలు పొంది– లక్షలాది మంది జీవితాలను మార్చిన గ్రంధాలలో “Autobiography of a Yogi” ఒకటి. దీనిని వ్రాసిన పరమహంస యోగానందగారు, యుక్తేస్వర్ గిరిగారి శిష్యుడు. ఆయన లాహిరీ మహాశయుల శిష్యుడు. లాహిరీ మహాశయుడు బాబాజీగారి శిష్యుడు.బాబాజీ అనే మహనీయుడు రెండువేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నాడంటారు.ఈయన నివాసస్థలం హిమాలయాలలోని తెహ్రీ ఘర్వాల్ ప్రాంతం. ఈయన ఈనాటికీ అదృష్టవంతులకు కనిపిస్తూ ఉంటాడు అని అంటారు.. ఈయనకు కాలం, దూరంతో సంబంధం లేదు. కాంతి శరీరంతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడని వారి అనుచరుల నమ్మకం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి బాబాజీ గారి దర్శనభాగ్యం అయినట్లు ఆయనే చెప్పటమే కాకుండా,బాబా’అనే పేరుతొ ఒక సినిమాను కూడా నిర్మించాడు.




భగవానుడు సూర్యునికి నేర్పిన యోగం కాల క్రమేణా క్షయమై పోగా, నవీన కాలంలో దీనిని తిరిగి ఉద్ధరించిన మహాత్ముడు బాబాజీ. దీనినే ‘క్రియాయోగం’ అని అంటారు. దీనిని గురు ముఖతః నేర్చుకోవాలి. దీనిని బాగా అభ్యాసం చేస్తే 12 సంవత్సరాలలో భగవత్(సత్య) దర్శనం పొందటానికి అనువుగా శరీరాన్ని తయారు చేస్తుంది. క్రియా యోగంలో ముఖ్య మైన అంశం క్రియాకుండలినీ ప్రాణాయామం. దీనిని అభ్యాసం చెయ్యటం ద్వారా వెన్నెముకలో గల నాడులు, చక్రములు ఉత్తేజితములై సాధకునికి ఓంకార నాదం వినబడుతుంది. భ్రూమద్యంలో వెలుగు కనిపిస్తుంది. శరీరంలోగల అన్ని ప్రాణనాడులు ఉత్తేజాన్ని పొందుతాయి.        




    క్రియా యోగంలో అయిదు మెట్లు ఉన్నాయి. మొదటి క్రియాదీక్షతోనే చాలా వరకు సాధన జరుగుతుంది. సాధకుని పురోగతిని బట్టి తరువాతి దీక్షలు ఇవ్వ బడుతాయి. కొందరికి పరమ గురువుల దర్శనం కలుగుతుంది. వారి ద్వారానే తరువాతి దీక్షలు ఇవ్వబడవచ్చు.క్రియాయోగమన్నది,మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింప చేసి,ప్రాణ వాయువుతో నింపే ఒకానొక మానసిక-శరీరక ప్రక్రియ.ఎలిజా,ఏసు,కబీరు,మొదలైన వారు ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలితాలను సాధించారని అంటారు .భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ఈ క్రియాయోగాన్ని గురించి రెండు చోట్ల ప్రస్థావించారు.నాల్గవ అధ్యాయం,29 వ శ్లోకమిలా చెబుతుంది–




అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణేపానాం తథాపరే


ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణ:


అర్ధాన్ని వివరిస్తాను–యోగి,ఊపిరితిత్తులు ,గుండె చేసే పనిని నెమ్మదిచేసి, దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయేటట్లు చేసుకొని,శరీరంలో జీవకణ క్షయాన్ని అరికడతాడు.




అంతే కాకుండా,అతను,అపానాన్ని(విసర్జక ప్రవాహం) అదుపు చేసుకొని శరీరంలో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు.ఈ ప్రకారంగా యోగి తన శరీరంలో అరుగుదల,పెరుగుదలలను నిలిపివేసి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు.మరో రెండు శ్లోకాలలో ఇలా ఉంది (అయిదవ అధ్యాయం,27 ,28 శ్లోకములలో).అర్ధం మాత్రం వివరిస్తాను.


కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్లా,ముక్కుల్లోను ఊపిరితిత్తుల్లోనూ (ఆడే) ప్రాణ,అపాన వాయువుల సమ ప్రవాహాలని తటస్థీకరించటం వల్లా సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి,బాహ్య విషయాలనుంచి వెనక్కి తగ్గగలుగుతాడు. 




మనస్సునూ, బుద్దినీ అదుపు చెయ్యగలుగుతాడు. కోరికనూ,భయాన్నీ,కోపాన్నీ పారదోలగలుగుతాడు. శాశ్వతంగా విముక్తుడౌతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని,వెనకటి ఒక అవతారంలో,ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి తనే ఉపదేశించానని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు. ఆ వివస్వతుడు


మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా శ్రీ కృష్ణుడు చెబుతాడు.యోగవిద్యకు ప్రధమ శాస్త్రకారుడని చెప్పబడే పతంజలి మహర్షి ,క్రియా యోగాన్ని రెండు సార్లు పేర్కొంటూ,ఇలా చెబుతాడు–శరీర వ్యాయామం,మనోనిగ్రహం,ఓంకారం మీద ధ్యానం కలిస్తే క్రియాయోగం అవుతుంది. రెండవ సారి పతంజలి ఇలా చెబుతాడు–శ్వాస,నిశ్వాసాల గతిని విచ్ఛేదించటం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తిని సాధించవచ్చు.




“క్రియాయోగం, మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యటానికి ఉపకరించే సాధనం” అని అన్నారు శ్రీ యుక్తేస్వర్ గిరిగారు.తన శరీరం మీదా,మనస్సు మీదా తానే ఆధిపత్యం వహించిన వాడై,క్రియాయోగి చివరకు,”చివరి శత్రువు” అయిన మృత్యువును జయిస్తాడు.




క్రియా యోగంలోని మొదటి దీక్షలో ముఖ్యమైన అంశాలు. తాలవ్యక్రియ,ఖేచరీముద్ర, చక్రజపం, క్రియాకుండలినీ ప్రాణాయామం, నాభిక్రియ మరియు శంముఖీ ముద్ర. వీనికి సోహం జపం మరియు అజ్ఞాచక్రధారణ అనేవి సహాయ కారులు. మహాముద్ర మరియు శాంభవీముద్ర అనేవి ముఖ్యమైన అంగములు.       




 ఈ క్రియలను చక్కగా అభ్యాసం చేయడం వల్ల మనిషి ముఖంలో తేజస్సు పెరుగుతుంది. కళ్ళలో కాంతి కలుగుతుంది. స్వభావంలో నిర్మలత్వం కలుగుతుంది. సాధనా క్రమంలో ఓంకార నాదం వినవచ్చు. అయిదు అంచులు గల నక్షత్రాన్ని దాని మధ్యలో తెల్లని చుక్కను భ్రూమద్యంలో చూడవచ్చు. 




ఆ చుక్క ద్వారా ఆవలికి ప్రయాణిస్తే అతీత లోకాల లోనికి ప్రయాణం చెయ్యవచ్చు. మహనీయుల దర్శనాలు, పూర్వ జన్మజ్ఞానం, దూరశ్రవణం, దూరదర్శనం వంటి సిద్ధులు దారిలో వాటంతట అవే కలుగుతాయి.ఈ క్రియాయోగాన్ని శ్రద్ధగా ఆచరించిన కొందరు తమ రక్తపు గ్రూపు కూడా మార్చుకున్నారట.(అంటే,B+ వారు, B- కు మార్చుకున్నారు).ఈ క్రియా యోగాన్ని విశేషంగా ప్రచారం చేసిన శ్రీ పరమహంస యోగానంద ,మరణించే చివరి నిముషంలో కూడా చిరునవ్వుతోనే మరణించాడు.ఓ మనిషి మరణించబోయే ముందు నవ్వుతాడా? నవ్వితే అతని ఆఖరి చిరునవ్వు ఎలా ఉంటుంది? మార్చి 7, 1952న లాస్ ఏంజిల్స్‌లో పరమహంస యోగానంద మరణించే ముందర ఆనాటి భారత రాయబారి హెచ్.ఇ.వినయ్ ఆర్ సేన్ గౌరవార్థం జరిగిన విందుకి 59 ఏళ్ల యోగానంద హాజరయ్యారు. తన ప్రసంగాన్ని ముగించి కుర్చీలో కూర్చున్న కొద్దిసేపటికి ఆయన ఆ కుర్చీలోనే మహాసమాధి పొందారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సునాయాసంగా చిటికెలో దేహత్యాగం చేసిన ఆయన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.     




  అంతేకాదు. ఆయన మరణించిన తర్వాత 20 రోజుల పాటు యోగానంద దేహాన్ని ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్కులో ఉంచితే అది వాసన రాలేదు. కుళ్లలేదు. మరణించిన వారి శరీరాల్లో కలిగే ఎలాంటి మార్పులు కలగలేదని, బాడీ టిష్యూలు ఎండిపోలేదని, చర్మంలో కూడా ఎలాంటి మార్పు లేదని నాటి లాస్ ఏంజిల్స్ మార్చురీ డెరైక్టర్ హేరీ.టి.రోవె గ్రహించి, మార్చి 27న ఆ సంగతిని లోకానికి తెలియజేశారు. మరణించడానికి మునుపు ఆయన ఎంత తాజాగా ఉన్నారో మరణించిన ఇరవయ్యవ రోజు కూడా అంతే తాజాగా ఉన్నారని రికార్డ్ చేశారు.




పరమహంస యోగానంద గారు,పాశ్చాత్య ప్రపంచంలో దీర్ఘ కాలం(౩౦ ఏళ్ళకు పైగా)నివసించిన భారతీయ మహా గురువులలో ప్రప్రధములు.వీరు వ్రాసిన’ఒక యోగి ఆత్మకథ’పదునెనిమిది భాషల్లోకి అనువదించబడినది.




వీరిని గురించి,’నడిచే దైవం’అయిన శ్రీ కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఇలా అన్నారు”నేను పరమహంస యోగానంద గారిని 1935 లో కలకత్తాలో కలుసుకున్నాను.అప్పటినుండి అమెరికాలో వారు నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాను.ఈ లోకంలో యోగానంద గారి ఉనికి ,చిమ్మ చీకట్లలో ఉజ్వలంగా వెలిగే జ్యోతి లాంటిది.అలాంటి మహాత్ములు భూమి మీద చాలా అరుదుగా అవతరిస్తారు;మనుషులకు అవసరం నిజంగా ఉన్నప్పుడు.”




ఈ బంధాలన్ని తెంచుకొని సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసినైన నాకు,”ఈశ్వరా! ఈ సన్యాసికి పెద్ద సంసార మిచ్చావు కదయ్యా!”ఈ వాక్యమే ‘ఒకయోగి ఆత్మకథ ‘లోని చివరి వాక్యం.            




యోగం అనేది మన శరీరం ద్వారానే,మన సాధన వల్లనే మోక్ష స్థితికి చేర్చే అత్యుత్తమ సాధనం.ఈయోగసాధనలో ,సాధకుడు అంతర్ముఖుడై, తన శరీరంలోనే దివ్యశక్తిని సందర్శించి,దేహాన్ని,’తనను’ చైతన్యము చేసుకొనగలడు.




సర్వే జనా సుఖినోభవంతు🙏

  యాకుందేందు*


*తుషార హార ధవళా**




**యా శుభ్ర వస్త్రావృతా*




*యా వీణావరదండ మండితకరా*




*యా శ్వేత పద్మాసనా*




*యాబ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా*




*సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహా.*




*తా:-* పద్మము,చంద్రుడు,ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;వీణని చేత ధరించి,తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;బ్రహ్మా,విష్ణు,మహేశ్వరులతో పాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది అయినటువంటి సరస్వతీ!ఓ తల్లీ!నా మానసిక జడత్వాన్ని తొలగించు. 

శ్రీసరస్వత్యష్టకం

  


1) శరచ్చంద్రధవళవర్ణాంబరధరవీణాపుస్తకధారిణీం 


    వేదవేదాంతవేద్యఅక్షమాలాధరసూక్ష్మశరీరిణీం


    మేధాస్మృతిప్రదవిద్యాప్రదాయకహంసవాహినీం 


    మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||




2) యాజ్ఞ్యవల్క్యాదిమునిపుంగవసేవితపల్లవపదాంబుజాం 


   మృదుమధురసంగీతామృతాస్వాదనరసమాధుర్యఝరీం


   శుభమంగళపరంపరాప్రదసకలభక్తమనోరథప్రదాయినీం


    మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||










 3) జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థాతీతనాదబ్రహ్మస్వరూపిణీం 


    శ్రోత్రత్వక్చక్షురసనాఘ్రాణపంచేంద్రియస్వరూపిణీం  


    జాజీమాలత్యాదిపుష్పాలంకారశోభితతేజోమయీం 


    మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||




4) భావనాపరంపరదాయకవాక్యనిర్మాణస్ఫూర్తిదాయినీం  


   వారిజాసనరసనాగ్రస్థితశృతిస్మృతిపురాణస్వరూపిణీం 


   యజ్ఞహవ్యకవ్యఫలదాయకస్వాహాస్వధాస్వరూపిణీం  


   మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||














5) స్వాధ్యాయానుష్ఠానతత్పరహృదయకమలమధ్యగాం 


   సతతస్వాత్మానందమగ్ననిర్మలహృదయారవిందాం  


   బ్రాహ్మీభూతసమయయోగీంద్రహృత్కమలవాసినీం 


   మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||




6) భయాందోళనభ్రాంతమానసదుఃఖతప్తభక్తపాపనాశినీం


    సనకసనందనాదిమునీశ్వరపూజితబ్రహ్మజ్ఞానరూపిణీం


    రత్నమణిమాణిక్యకేయూరాభరణభూషితప్రభాభాసురాం  


    మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||














7) శుంభాసురాదిదానవభంజనవిశ్వశాంతిప్రదాయినీం 


    మహాదారిద్ర్యనాశనమృష్టాన్నభోజనప్రదకారుణ్యాం 


    వేదవేదాంగప్రవీణశ్రీవ్యాససేవితవాసరక్షేత్రవాసినీం 


    మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||




8) శ్రీఆదిశంకారాచార్యార్చితకాశ్మీరపురవాసినీం 


   స్నేహసౌశీల్యసుహృద్భావనామానసదాయినీం  


   సుమంగళ్యర్చనాప్రీతసౌమాంగళ్యభాగ్యదాయినీం   


   మాతృకావర్ణరూపిణీం భగవతీం శ్రీసరస్వత్యంబికాం ||




        సర్వం శ్రీమహాసరస్వతిదివ్యచరణారవిందార్పణమస్తు

*ధార్మికగీత - 24*

 

                                        *****


             *శ్లో:- ఆహార నిద్రా భయ మైథునం చ ౹*


                    *సమాన మేతత్ పశుభి ర్నరాణాం ౹*


                    *జ్ఞానో హి తేషా మధికో విశేష: ౹*


                    *జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః*


అరయన్ ధాత్రిని మైథునంబును , భ 


         యాహార , నిద్రాదులున్ ,


యిరవున్ మర్త్యునకున్ మరిన్ పశువు 


        కున్ యేకంబుగా నుండెడున్


ష్టిరమౌజ్ఞానము నొక్కటే మనుజు


          కాధిక్యంబుగా నుండెడిన్ ,  


కరమౌ జ్ఞానములేనిచో నరుడు 


          నిక్కంబున్ భువిన్ జంతువే




✍️ గోపాలుని మధుసూదన రావు

 

         పురుషోత్తమప్రాప్తియోగము


       


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.




అవతారిక - భూమియందు ప్రవేశించి సస్యాదుల నభివృద్ధిపఱచునది తానే యని భగవానుడు పలుకుచున్నారు -




గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా | 


పుష్ణామి చౌషధీస్సర్వాః


సోమో భూత్వా రసాత్మకః || 




తాత్పర్యము:- మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నింటిని పోషించుచున్నాను. 




వ్యాఖ్య:- 'ధారయామి ఓజసా’ - అని చెప్పుటవలన జగత్తునందలి సమస్త పదార్థములకును, ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును ఒసంగునది ఆ పరాత్పరుడే యని తెలియుచున్నది. పైవాక్యమువలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్నఉపాధి మాత్రమే కాదనియు, విశ్వవ్యాపి, జగద్భర్తకూడ యనియు స్పష్టమగుచున్నది. మఱియు సస్యములను అభివృద్ధిపఱచునది తానేయని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మవలననే సంభవించుచున్నదని తెలియుచున్నది. కావున, ఆహారమును భుజించునపుడు ఈ అన్నమెవరివలన మనకు వచ్చినది? అని ఆలోచించి అన్నస్రష్ట, అన్నదాత యగు ఆ సర్వేశ్వరునకు సర్వులును కృతజ్ఞత చూపవలసియున్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకుముందు అద్దానిని ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలెను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొఱకదు; సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై యుండును. కాబట్టి ఎన్నియో అనుకూలములుచేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలెను. సర్వకాలములందును. వారిని స్మరించుచు, కీర్తించుచు నుండవలెను.




ప్రశ్న:- భగవాను డే యేప్రకారములుగ ప్రజలకు మేలొనర్చుచున్నారు?


ఉత్తరము:- (1) భూమియందు ప్రవేశించి బలముచే సమస్తప్రాణులను భరించుచున్నారు. (2) చంద్రుడయి సస్యములన్నిటిని పోషించుచున్నారు.


ప్రశ్న2:- కావున జీవు లేమి చేయవలెను?


ఉత్తరము: - అతనికి కృతజ్ఞులై వర్తించుచు, సంకీర్తన, జప, పూజాదులచే నిరంతర మాతనిని స్మరించుచుండవలెను.

  *మన కోసం-మంచి మాటలు*




_*దు:ఖం నుండి శాంతి వైపుకు...*_




*విక్రమాదిత్య మహారాజు...* ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :




 ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.




 కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,




 నేనే ఎందుకయ్యాను ?


 ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 




' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 




అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 




ఆయనను కలవండి. 


జవాబు దొరుకుతుంది ''అన్నాడు. 




రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు




అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...


 తన ప్రశ్న ఆయన ముందు పెడితే....




 ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.




 అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''




 నిరాశపడినా , 


రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 




రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు




రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.




 కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.




 కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు




 రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 




వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,




 అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'




 రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. 




చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 




అపుడు ఆ అబ్బాయి అన్నాడు




 '' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. 




ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.




 తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 




*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*




*రెండవ వ్యక్తిని అడిగితే..*


 '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''




 అని వెటకారంగా అంటాడు.




 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? 




''అని నీచంగా మాట్లాడాడు. 




కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.




 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. 




 రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. 




రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు...🙏🏻


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*👌🏻ఓ మంచిమాట దానం వంటిది...అందరికీ పంచండి...ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది...*


*ఓ చెడ్డ మాట అప్పులాంటిది...ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది...🙏🏻*




రసజ్ఞభారతి సౌజన్యంతో-

  తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


భాగవతాదారితం 🕉🕉

  🔥🔥🔥🔥🔥


కల్పాలు పద్దెనిమిది ఉన్నాయని భవిష్య పురాణం చెబుతోంది. ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులు. ఒక్కో కల్పంలో నాలుగు పాదాలు ఉంటాయి. అవన్నీ సమానమైన కాలావధి లో ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం లోని వైవస్వత మన్వంతరం. అందుకే సంకల్పం చెప్పుకునే టప్పుడు తిధి చెబుతూ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అంటూ చెప్పుకుంటాం. ఇక ఈ కల్పాల పేర్లు విషయానికి వస్తే అవి 


కూర్మ కల్పం 


మత్స్య కల్పం 


శ్వేతవరాహ కల్పం 


నృసింహ కల్పం 


వామన కల్పం 


స్కంద కల్పం 


రామ కల్పం 


భాగవత కల్పం 


మార్కండేయ కల్పం 


భవిష్య కల్పం 


లింగ కల్పం 


బ్రహ్మాండ కల్పం 


అగ్ని కల్పం 


వాయు కల్పం 


పద్మ కల్పం 


శివ కల్పం 


విష్ణు కల్పం 


బ్రహ్మి కల్పం






ప్రస్తుతం నడుస్తున్నది శ్వేతవరాహ కల్పం. 




అంటే భవిష్య పురాణం ప్రకారం వరుసలో మూడో కల్పం దీని తరువాత 15 కల్పాలు ఉన్నాయి అందులోని ప్రతి దానిలో మన్వంతరాలు ఉన్నాయి. ప్రతి మన్వంతరం లోనూ నాలుగు యుగాలు ఉంటాయి. ఈ చక్రం అంతా పూర్తయిన తర్వాతనే సంపూర్తి లయం. ఈలోగా ప్రతి కలియుగాంతంలో జల ప్రళయం వచ్చి లో దుష్ట ప్రకృతి కి చెందిన వారినందరిని అంతం చేస్తుంది. మిగిలిన కొద్ది మంది మంచివాళ్ళతో మరో మన్వంతరంలోని సత్య యుగం ఆరంభం అవుతుంది.


🔥🔥🔥🔥🔥

  🔥🔥🔥🔥🔥




హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము" నడుస్తున్నదని, ఈ మన్వతంతరానికి అధిపతి వైవస్వత మనువు అని పురాణాల కథనం. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.






ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది. వివస్వంతుని భార్య సంజ్ఞ. వారి పుత్రుడు సత్యవ్రతుడు లేదా వైవస్వతుడు. అతడే వైవస్వత మనువు అయ్యాడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.






ఈ మన్వంతరంలో భగవంతుడు కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఇంద్రుడు - పురందరుడు. సురలు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు






వైవస్వత మనువు భార్య శ్రద్ధ. వారికి తొమ్మండుగురు పుత్రులు - ఇక్ష్వాకుడు, శిబి, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. అయితే ఆ పుత్రులు జన్మించడానికి ముందే వైవస్వతుడు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. ఆయజ్ఞంలో హోత మంత్రాలలో చేసిన పొరపాటు వన వారికి "ఇల" అనే కుమార్తె కలిగింది. వశిష్ఠుని వరం వలన ఆ కుమారి "సుద్యుమ్నుడు" అనే పురుషునిగా మారి, ప్రభువయ్యాడు. (కనుక వైవస్వత మనువునకు 10 మంది పుత్రులు అనవచ్చును). కాని పార్వతీదేవి చేత శాపగ్రస్తమైన ఒక వనంలో ప్రవేశించినపుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారి, బుధునితో సంగమించి "పురూరవుడు" అనే కుమారుని కన్నది. తండ్రి (తల్లి) అనంతరం పురూరవుడు రాజయ్యాడు.








వైవస్వత మనువు మరొక పుత్రుడైన పృషధ్రుడు తమ కులగురువైన వశిష్ఠుని వద్ద ఆలమందల కాపరిగా ఉన్నాడు. ఒకమారు చీకటిలో చేసిన పొరపాటువలన గోవు మరణించగా శాపగ్రస్తుడయ్యాడు. అయినా గాని భగవధ్యానం వదలకుండా సాగించి మోక్షం పొందాడు. కలి అనే మనుపుత్రుడు కూడా వైరాగ్యంతో రాజ్యవిరక్తుడై ధ్యానతత్పరుడై భగవత్సాన్నిధ్యం పొందగలిగాడు. మనువు మరొక పుత్రుడు కారూశుని వంశంవారు "కారూశులు" అనే క్షత్రియులుగా ఉత్తర భారతదేశపు ఏలికలయ్యారు. దృష్టుని సంతానం "భార్యట వంశం"గా బ్రాహ్మణ వ్రతం పాలించి బ్రాహ్మణులయ్యారు. వీరిలో అగ్నివేశుడు అనే అతని పేరుమీద అగ్నివేశ్యాయనం అనే బ్రాహ్మణవంశం కలిగింది.






దిష్టుని పుత్రుడు నాభాగుడు కృషి, గోరక్షణాది వ్యాపారాలను చేబట్టి వైశ్యుడయ్యాడు. అతని వంశంలోని వాడే అయిన మరుత్తుడు క్షత్రియ కర్మలు చేబట్టి క్షత్రియుడయ్యాడు. మరుత్తుని వంశంలో తృణబిందువు, ఐలబిలుడు వంటి ప్రసిద్ధులున్నారు. ఐలబిలుడు "కుబేరుడు" అనే పేరుమీద ఉత్తరదిక్కుకు పాలకుడయ్యాడు. మనువు మరొక పుత్రిక శర్యాతికి సుకన్య అనే కుమార్తె జనించింది. ఆమె చ్యవనమహర్షిని పెండ్లాడింది. మరొక మనుపుత్రుడు నభగుని కొడుకు నాభాగుడు ఉత్తమధర్మమూర్తి, పండితుడు. అతనికి పుత్రుడు అంబరీషుడు ఉత్తమ విష్ణుభక్తుడు.






వైవస్వత మనువుకు ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు ఇక్ష్వాకు వంశమునకు మూలపురుషుడయ్యాడు. ఇక్ష్వాకు కులతిలకుడే ధర్మమూర్తియైన శ్రీరామచంద్రుడు.


🔥🔥🔥🔥🔥

  చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించారు


అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!


చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.




అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.




రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!


రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.




"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.




మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!


ఒక గడిలో ఒక గింజ -


రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -


మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -


నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -


.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.




రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.




ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.




తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..


‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’




‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’




‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.




‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’




‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు




ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.




‘అలాగా.. ఏమిటా పద్యం..?’




‘ఇదుగో.. వినండి మహారాజా !’




శర శశి షట్క చంద్ర శర


  సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ


ధర గగనాబ్ధి వేద గిరి


    తర్క పయోనిధి పద్మజాస్య కుం     


జర తుహినాంశు సంఖ్యకు ని


 జంబగు తచ్చతురంగ గేహ వి      


స్తర మగు రెట్టికగు


            సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్




పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’




‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’




‘సరే… సరే.. విప్పి చెప్పు..’




 ‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..




ఈ పద్యంలో




శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 




గగన, వియత్ - 0


(ఆకాశం గగనం శూన్యం)




శశి, చంద్ర, తుహినాంశు -1 


(చంద్రుడొకడే భూమికి )




షట్కము - 6 




రంధ్ర - 9  




(నవరంధ్రాలు)


నగ, గిరి, భూధర - 7 




అగ్ని - 3 


(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)




అబ్ధి, పయోనిధి - 4 




వేద -4


(చతుర్వేదములు)




తర్క - 6


( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)




పద్మజాస్య - 4 


(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)




కుంజర - 8


(అష్ట దిగ్గజములు)




ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’


శర శశి షట్క చంద్ర శర


5 1 6 1 5


            సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ


                  5 9 0 7 3


ధర గగనాబ్ధి వేద గిరి


  7 0 4 4 7


            తర్క పయోనిధి పద్మజాస్య కుం


               6 4 4     


జర తుహినాంశు సంఖ్యకు ని


8 1


            జంబగు తచ్చతురంగ గేహ వి


స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్




అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -


కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..




అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.




1,84,46,74,40,73,70,95,51,615




ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615




ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,


ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,


4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..




పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.




పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే


సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..


అదీ సంగతి…




వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .




అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. 




ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .




ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.




పద్యం ::పాత గ్రంధాలనుండి 




                                     స్వస్తి




       ( ఓపికగా చదివిన వారికి)




                                    ధన్యవాదములతో




        గురుమంచి రాజేంద్రశర్మ