🚩🚩సుభాషితం .🚩🚩
🚩ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జ పై,
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,
బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ్ఖంబున్ సుఖంబున్ మదిన్!!🔻
✍️కార్యసాధకుడి దృష్టి ఎంతసేపు లక్ష్యం మీదే ఉంటుంది కానీ.. తన చుట్టూ ఎలాంటి వసతులు ఉన్నాయా అని ఆలోచించుకోడు.
అతను ఒకసారి పూలపాన్పు మీద పవళించినా అనసరం అయితే కటిక నేల మీద కూడా నిదురిస్తాడు. ఒక సందర్భంలో పంచభక్ష్య పరమాన్నాలు ఆరగించినా అవసరం అయితే ఆకుకూరలతో సరిపెట్టుకుంటాడు.
పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉన్నా, బొంతను కప్పుకుని తిరిగేందుకు
కూడా సిద్దపడతాడు.🙏🏿
🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి