17, అక్టోబర్ 2020, శనివారం

శ్రీరామదూతం

 శ్రీరామదూతం శిరసా నమామి ........


ఆంజనేయం మహావీరం

బ్రహ్మం విష్ణు శివాత్మకమ్ ! 

తరుణార్క ప్రభాం శాస్త్రం 

రామదూతం నమామ్యహమ్ !!........


హనుమంతుడు పేరు చెప్పగానే  

ఆబాలగోపాలానికీ ఎంతో భక్తిప్రపత్తులు,   

కొండంత. ధైర్యం. శ్రీరాముడు కష్టంలో ఉన్నప్పుడు

అండదండలు అందించి సుందరకాండకు తానే

నాయకుడై ఆ. కాండను సౌందర్యభరితం చేసిన

హనుమంతుడికి ఎన్నోపేర్లు ........

హనుమంతుడు పవనసుతుడు ఆంజనేయుడు 

కపివీరుడు ఇలా ఎన్నో ఎన్ని పేర్లు ఉన్నా

శ్రీరాముడికి బంటుగా మాత్రమే ఉండడానికి

ఇష్టపడే దాసాంజనేయస్వామి రామసేవా

తత్పరులలో మిన్న. అందుకే పంచవిధ --

భక్తులలో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం

అయ్యాడు ఆంజనేయుడు ...........


హనుమంతుడు ధైర్యానికి మారు పేరు

ఎలాంటి కష్ట సమయంలో అయినా ఆంజనేయుణ్ణి

తలచుకుంటే చాలు కొండంత అండగా ఉంటాడు

ఆఖరికి దెయ్యాలు భూతాలు లాంటి భయాలు

భ్రమలూ హనుమంతుడి నామస్మరణతో 

పటాపంచలై పోతాయి హనుమంతుడి 

గుడి లేని ప్రాంతం ఉండదు ..........

పిల్లలు పెద్దలు ఆడ. మగ. అనే బేధం 

లేకుండా హనుమంతుణ్ణి పూజిస్తారు

విద్యార్థులకు బుద్ధి శక్తి ప్రసాదించే దైవం

ఆంజనేయుడు ఆంజనేయుణ్ణి స్మరిస్తే 

మనకు ఏ చింతలు సమస్యలు ఉండవు 


  🙏 శ్రీ అంజనేయం🙏

కామెంట్‌లు లేవు: