17, అక్టోబర్ 2020, శనివారం

సన్యాసం_నాలుగు_రకములు

 #సన్యాసం_నాలుగు_రకములు 

 

1. వైరాగ్య సన్యాసి

2. జ్ఞాన సన్యాసి

3. జ్ఞాన వైరాగ్య సన్యాసి

4. కర్మ సన్యాసి


#వైరాగ్యసన్యాసి --- చూడటం వలన వినడం వలన ఆసక్తి పోయి, ప్రాప్తించిన పుణ్యకర్మ విశేషముల వలన సన్యాసించువాడు వైరాగ్య సన్యాసి 


#జ్ఞానసన్యాసి ---జ్ఞానము వలన పుణ్య లోకానుభవ శ్రవణం వల్ల లౌకిక వాంఛలు పోయి, దేహవాసన శాస్త్ర వాసన లోక వాసనలను వదలి, అవమానమును మానముగా తలచి, ప్రవృత్తినంతటినీ హేయముగా తలచి, సాధనా చతుష్టయ సంపన్నుడై సన్యాసించువాడు జ్ఞాన సన్యాసి. 


#జ్ఞానవైరాగ్యసన్యాసి --- అన్నింటినీ క్రమముగా అభ్యసించి, సర్వము అనుభవించి, జ్ఞాన వైరాగ్యముల తోడనూ స్వరూపానుసంధానముతోడనూ దేహమాత్ర వశిష్ఠుడై సన్యాసించువాడు జ్ఞాన వైరాగ్య సన్యాసి. 


#కర్మసన్యాసి --- బ్రహ్మ చర్యము పూర్తి చేసి, గృహస్థాశ్రమం స్వీకరించి, వానప్రస్థుడై వైరాగ్యం లేకపోయినప్పటికినీ ఆశ్రమాల కాలక్రమం ప్రకారం సన్యాసం స్వీకరించువాడు కర్మ సన్యాసి.

కామెంట్‌లు లేవు: