*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 1930 (౧౯౩౦)*
*10.1-922-వ.*
*10.1-923-*
*మ. హరిదోర్దండము గామ, గుబ్బశిఖరం, బాలంబి ముక్తావళుల్*
*పరఁగం జారెడు తోయబిందువులు, గోపాలాంగ నాపాంగ హా*
*సరుచుల్ రత్నచయంబు గాఁగ, నచలచ్ఛత్రంబు శోభిల్లెఁ ద*
*ద్గిరిభిద్దుర్మదభంజి యై జలధరాఖిన్న ప్రజారంజి యై.* 🌺
*_భావము: అలా శ్రీకృష్ణుడు చెప్పిన ఆశ్వాసపూర్వకవాక్యములను గోపాలకులు విని అంతఃకరణసాక్షి గా విశ్వసించి తమ భార్యలు, పిల్లలు, స్నేహితులు మొదలైన వారితో, వారి వారి గోవులతో సహా ఆ కొండ క్రింద తమకు నచ్చిన ప్రదేశములో స్థిమితపడ్డారు. బాల కృష్ణుని కరుణా దృష్టి అనే అమృత ధారల ప్రభావము వలన ఆకలి దప్పులు ఎరుగని వారై, కృష్ణ కథా వినోదములతో కాలం గడుపుతున్నారు. ఆ కొండ అనే గొడుగునకు కృష్ణుని భుజాదండమే కర్ర, శిఖరమే గుబ్బ, ఆ గుబ్బ నుండి ప్రక్కకు కారుచున్న నీటి బిందువులు ముత్యాలసరములు, గోపికా స్త్రీల కడగంటి చూపులనుండి విరిసి చిరునవ్వులే రత్న కాంతులు గా ఆ గోవర్ధనగిరి శోభిల్లెను. ఇంద్రునికి గర్వభంగము కావిస్తూ, రాళ్లవానకు ఖేదమునొంది దుఃఖిస్తున్న గోపాలకులకు ఆనందము కలిగిస్తూ శ్రీకృష్ణుడు ఆ కొండను ఎత్తి ఛత్రముగా పట్టుకున్నాడు._* 🙏
*_Meaning: The Yadava folk listened to reassuring words of Sri Krishna attentively and with profound faith in him, moved underneath the Goverdhana hill along with their kith and kin and herd of cows. There they settled down happily and as a result of the kindness of Sri Krishna, they did not even feel hunger or thirst and were spending their time singing in His praise and reciting His Great SuperHuman Deeds. The Goverdhana hill appeared magnificient with Krishna's shoulders as the shaft, the top end peak as the stud, the water (fall) drops falling from the outer canopy of the hill slopes looked like the pearl garlands and the pleasant smiles emanating from the elated faces of the womenfolk shone like precious stones and gems. Indra's pride and haughtiness were destroyed and agony of the yadava folk abated as Sri Krishna held the mountain high like an umbrella, spreading happiness and cheer among his people and the cattle._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి