🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 52*
*****
*శ్లో:- వేదవిదే కిల దత్తం దత్తం ౹*
*బంధుజనై స్సహ భుక్తం భుక్తం ౹*
*ప్రియతమయా సహ సుప్తం సుప్తం ౹*
*అన్య మదత్త మభుక్త మసుప్తమ్ ౹౹*
*****
*భా:- 1.శ్రద్ధాసక్తులు,వినయవిధేయతలు, దీక్షాదక్షతలు,నియమనిష్ఠలు, గురుశుశ్రూషలతో అభ్యసించి, భారతీయసంస్కృతికి ప్రతీకలైన వేదవేదాంగ పారంగతులకు భక్తిప్రపత్తులతో ఇచ్చిన దక్షిణే నిజమైన దక్షిణ. 2. ఆత్మీయులైన బంధుమిత్రులకు సహపంక్తిలో తృప్తిగా వడ్డించి, తిన్న రుచి,శుచి షడ్రసోపేతమైన పసందైన విందుభోజనమే నిజమైన భోజనము. 3. మనసున మనసై, మాటలో మాటై, తనువున తనువై, అనుకూలవతియై, సుగుణవతియై ఆరోప్రాణంగా భావించే భార్యామణితో పోయిన నిద్రయే నిజమైన నిద్ర. 4. మిగిలిన వారికి ఇచ్చే దక్షిణ దక్షిణ కాదు. ఎవరికి పెట్టకుండ తినే తిండి తిండి కాదు. అన్యప్రాంతాలలో నిద్రించే నిద్ర నిద్ర కాదని భావన. వేదవిదులను సన్మానిస్తూ వేద పరిరక్షణకు పూనుకోవాలని, ఆప్తులకైనా సరే పెట్టిన తరువాత తినడమే మన సాంప్రదాయమని, సంసారానికి జీవితాన్ని అంకితం చేస్తున్న భార్యతో కలలో కూడ అవినాభావసాహచర్యం,అన్యోన్యప్రేమ విడనాడరాదని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి