17, అక్టోబర్ 2020, శనివారం

భర్తృహరి సుభాషితం

 🌹

(భర్తృహరి సుభాషితం)

కొందరు ప్రతిభ లేకుండానే రాణిస్తారు.

కొందరు ప్రతిభకు మించి ప్రకాశించుతారు

కొందరు అప్రతిహతమైన ప్రతిభ కలిగి కూడా విధి అన్న అగ్నికి ఆహుతియైపోతారు.

భర్తృహరి ఈ విషయాన్ని బహు చక్కగా వివరించినాడు. గమనించండి .

.

సంతప్తాయసి సంస్తితస్య పయసో నామాపి న శ్రూయతే

ముక్తాకారతయా తదేవ నళినీ పత్రస్థితందృశ్యతే

అంతస్సాగర శుక్తిమధ్య పతితం తన్మౌక్తికం జాయతే

ప్రాయేణాధమ మధ్యమోత్తమజుషా మేవంవిదా వృత్తయః


👉🏿దీనికి ఏనుగు లక్ష్మణకవి వారి తెలుగు సేత


నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా

నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై దనర్చు నా

నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచితప్రభన్

పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్


💥💥💥💥💥💥💥💥💥

కామెంట్‌లు లేవు: