17, అక్టోబర్ 2020, శనివారం

బతుకమ్మ

 కట్ల పూవులు ..

గోరింట పూవులు ..

చేమంతి పూవులు ..

బంతి పూవులు ..

తంగేడి పూవులు ..

గునుగు పూలు ..

సన్నజాజులు ..

గుమ్మెడి పూవులు ..

పువ్వు పువ్వు కో వర్ణం ..

ప్రతి వర్ణం .. సువర్ణం 


కలగలిసి వెలిసిన బతుకమ్మ సంబురం ..

తెలంగాణ కొంగు బంగారం !!

బతుకమ్మ తెలంగాణా అస్తిత్వం ..

తర తరా లు గా అందిన సంస్కృతి, సంప్రదాయం !


'100 మంది కొడుకులు' చనిపోతే,

తపస్సు చేసిన 'ధర్మాంగుడను రాజుకు ..

స్వయంగా లక్ష్మి దేవి జన్మించిన కథ ..


“నువ్వన్న బ్రతుకమ్మ” అని ..

“బతుకమ్మ” అని పేరు పెట్టిన కథ !!


ఎడారి లో పూసే తంగేడి పూవు లా ...

ఈ కష్టాలకు "నిలదొక్కుకొమ్మని" చెప్పాలి...

ఆ గౌరమ్మ పార్వతి దేవి రూపమై ...

వరద బాధితులకు కరోనా పీడితులకు ధైర్యాన్ని ఇవ్వాలి"...

...


బతుకమ్మ శుభాకాంక్షలు !!

( ఒక స్నేహితుడు వ్రాసింది)

కామెంట్‌లు లేవు: