17, అక్టోబర్ 2020, శనివారం

యదేవి సర్వ భూతేషు శక్తి

 :🕉️యదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత 🕉️ అందరికి నమస్కారం ఇవాళ నుంచి ఈ 9 రోజులు అమ్మవరి 9 రూపాల విశిష్టత ను తెలుసుకుందాం మొదట గ బాల త్రిపుర సుందరి గురించి 👉1. బాలా త్రిపురసుందరి (పాడ్యమి)

శ్లో|| పారాంకుశౌ పుస్తకాక్ష సూత్రేచ దధతీకరైః|

రక్తాత్ర్య క్షా చంద్ర బాలా ధ్యేయాబాలాసురార్చితా||

 శారదా నవరాత్ర పూజావిధానం ప్రకారం మొదటి రోజైన పాడ్యమి నాడు శ్రీ బాలా

త్రిపురసుందరిని పూజిస్తారు. బాల లలితాకామేశ్వరుల పుత్రిక, తొమ్మిది సంవత్సరముల

ప్రాయం కలది. ఈమె లలితాపరమేశ్వరి యొక్క బంగారు కవచం నుండి ఉద్భవించినది.

ఈమె ఎల్లప్పుడూ లలితా అమ్మవారి చెంతనే వుంటుంది. ఈమె లలిత ఉచ్ఛ్వాస

నిశ్వాసములు మరియు నాలుగవ విలోచనము.ఈ బాల సమస్తశక్తిమండలములకు

పూజ్యురాలు, పరాక్రమశాలి, లలితతోసమానమైన ఆకారము కలది. ఆమె నవవర్షవలె

సర్వవిద్యలకు మహాఖని. బాలసూర్యుని వలె ఎఱ్ఱని, గుండ్రని రూపం, ఎఱ్ఱని తీగవంటి

శరీరము కలది. మహారాజ్ఞియొక్క పాదపీఠమున నిత్యము సన్నిధానము కలది. లలితాదేవి భండాసుర యుద్ధసమయమున, భండాసురుడు తన సమస్త సైన్యం

ధ్వంసమగుటతో ఖిన్నుడై, తన మహాబలులైన ముప్పది మంది పుత్రులను ఒకే గుంపుగా

చేసియుద్ధము చేయదలచెను.

 ఇది తెలిసిన బాల ఉత్సాహముకలదై, భండాసుర పుత్రులకు ఎదురుగా యుద్ధము

చేయ నిశ్చయించి మహారాజ్ఞికి విన్నవించెను. లలితాంబ మొదట నిరాకరించిన, ఆమె

దృఢనిశ్చయము చూచి, సమ్మతించి తన ఆయుధములలోని కొన్ని ఆలయుధములనిచ్చి

యుద్ధమునకు పంపెను.

 బాల భండాసురిని ముప్పది పుత్రులతోను ఘోరముగా యుద్ధము చేసెను. ఆఖరున

ఒకేసారి ముప్పది అర్ధచంద్ర బాణములను వదిలి భండాసురుని ముప్పది మంది పుత్రుల

తలలను నరికెను.

 ఈ బాలాత్రిపురసుందరి పూజించుట వలన జ్ఞానవృద్ధి కలుగును.

 ఈ రోజు దేవికి పులగము నివేదన చేయవలయును 🙏స్వస్తి🙏శ్రీ దత్త శర్మ 8277246156

కామెంట్‌లు లేవు: