2, ఫిబ్రవరి 2022, బుధవారం

కాలినడకన

 మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.

వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది. 

దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.


''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. 


 *వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట. 


అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, 


నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట. 


అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట. 


కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె, 


'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది. 


వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. 


ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....

అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు. 


వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. 


 *అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.* 


 *ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.* 


తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరి మహోన్నతమైన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శం. 


ఇది కదా మన దేశపు ఔన్నత్యం.                      ఆదిరాజు వెంకట్ రావు

షడ్రసముల గురించి

 షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 2 . 


     

  కటు( కారము ) రసము గుణము - 


   కటు రసము నాలుకకు తగిలినంత మాత్రమే ముక్కును కార్చును . యావత్ శరీరం కంపించును . దీనిని స్వల్పమోతాదులో ఉపయోగించినచో కొన్ని సద్గుణాలు కలవు . ముఖశుద్ధి చేయును . జఠరాగ్ని పెంపొందించును . ఆహారమును శుష్కిoపచేయును . కన్నీరు వచ్చునట్లు చేయును . కఫ సంబంధ జిగురు పోగొట్టును . శరీరవృద్ధి ( శరీరపు లావు ) తగ్గించును . క్రిములను హరించును . వ్రణములు పగులునట్లు చేయును . శ్రోతో నిరోధము ( శరీరం నుండి బయటకి వ్యర్ధాలు వెడలు మార్గములు ) పొగొట్టి విశాలము చేయును .  


         అధికంగా సేవించిన శుక్రము నశించును . మైకము కమ్మును . తల తిరుగును . కంఠము నందు , శరీరము నందు మంటలు పుట్టును . దప్పిక పుట్టి బలము నశించును . వాతరోగములు పుట్టుటకు కారణం అగును . 


 *  తిక్త ( చేదు ) రసము గుణము - 


       తిక్తరసము నాలుకకు తగిలినవెంటనే కంఠము నందు లాగుచున్నట్లు అనిపించును . ముఖము నందలి ( నోటియందలి ) జిగురు పోగొట్టి రోమాంచనం ( వెంట్రుకలు నిక్కబొడుచుకొనునట్లు ) కలుగచేయును . చేదు నాలుకకు రుచిగా అనిపించకున్నను నోటి యందలి అరుచిని పోగొట్టి ద్రవ్యములను రుచిగా ఉండునట్లు చేయును . శారీరక విషాలను హరించును . జ్వరములను హరించును . కుష్ఠు రోగము నందు ఉపయుక్తము . క్రిమి నాశకము , స్తన్యమును శుద్ధిచేయును . మాంసమును దృఢపరచును . జీర్ణకారి . శరీరం నందు ఎచ్చటి  నుండి ఐనా జలం వంటి పదార్థము వెడలుచున్న దానిని ఆపును . శరీరపు కొవ్వు , మజ్జి , వ్రణములు నుండి కారు రసి , చీము , మూత్రము వంటి జల సంబంధమైన వాటిని ఎండించును . 


        దీనిని అతిగా ఉపయోగించిన ధాతువులన్నినింటిని నాశనం చేయును , శరీరం నందు గరుకుతనం కలిగించును . బలం తగ్గును   శరీరం కృశించును . వాతరోగములు పెరుగును . 


  *  కషాయ( వగరు )  రసము గుణము - 


  

         కషాయ రసము నాలుకకు తగిలింత వెంటనే నోరు ఎండిపోయి నాలిక స్థంభించును . కంఠమును బంధించును . హృదయమును పట్టి లాగి సంకోచింపచేయును . గుండెని ఒత్తునట్టు బాధ కలుగచేయును . 


          ఈ వగరు రసము స్వల్పప్రమాణములో భుజించిన సద్గుణములు కలవు . కఫ, రక్త , పిత్త వికారముల యందు ఉపయుక్తము . శరీరద్రవాలను ఆర్చును . వ్రణములను పగలగొట్టును . 

      

            దీనిని అతిగా సేవించుట వలన నోటి రోగములు కలుగును . హృదయము నందు బాధ కలిగించును . ఉదరము ఉబ్బునట్లు చేయును . మలమూత్రములు వంటి వ్యర్ధాలను బయటకు పంపు మార్గాలను బంధించి శరీరముకు నలుపు తెచ్చును . శుక్రమును నాశనం చేయును ఆర్థిత వాతము , పక్షవాతము వంటి వాతరోగములను కలుగచేయును . 



       కావున ప్రతి రసమును మన ఆహారములో భాగము అయ్యేలా చూసుకొన్నచో మన శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. 


             మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

ఆలోచించాలా? వద్దా?

 ॐ   ఇప్పటికైనా ఆలోచించాలా? వద్దా? 


"మన జాతీయత - విద్యాభ్యాసం/అక్షరాస్యత" 


ఈరోజ ఫిబ్రవరి 2వతేదీ ప్రత్యేకత తెలుసా? 


    మెకాలే మన ప్రాచీన విద్యావిధాన, సంస్కృతులను నాశనం చేసేందుకుగాను, తను ఆ కారణాలను ధైర్యంగా చూపుతూ, తన విద్యావిధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టే ప్రతిపాదనపై, బ్రిటిష్ పార్లమెంటునుద్దేశించి 2/2/1835నాడు చేసిన ప్రసంగం యథాతథంగా. 


    (Lord Mecauley's address to the Brirish Parliament on 2nd February 1835) 


    "I have travelled across the length and breadth of India and I have not seen one person who is a begger, who is a thief. 

    Such wealth I have seen in the country, 

    such high moral values, 

    people of such caliber, 


    that I do not think we would ever conquer this country, 

    unless we break the very backbone of the nation, which is her spiritual and cultural heritage and therefore, 


    I propose that we replace 

  - her old and ancient education system, 

  - her culture for if the Indians think that all that is foreign and English is good and 

    greater than their own, 

    they will lose 

  - their selfesteem, 

  - their native culture and 

    they will become that we want them, 

    a truely dominated nation." 


                    అనువాదం 


    "భారత దేశంలో, అటునుంచి ఇటు, ఇటునుంచి అటు మొత్తం ప్రయాణం చేశాను. 

    నాకు భిక్షుకుడుగానీ,  దొంగగానీ ఒక్కడంటే ఒక్కడైనా కనిపించలేదు. 

    అంత గొప్ప సంపద, నైతికపు విలువలు కలిగిన దేశం అది. ప్రజలు ఎంతో తెలివిగలవారై ఉన్నారు. 

    ఆ దేశాన్ని మనం ఎప్పటికీ ఆరోహించలేము. 

    దాని బలమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని ఛిన్నాభిన్నంచేసి, దాని నడ్డి విరవాలంటే, ఆ దేశపు ప్రాచీన విద్యావిధానాన్నీ, వాళ్ళ సంస్కృతినీ మార్చాలని ప్రతిపాదిస్తున్నా. 

    అపుడే హిందువులు విదేశీయత మరియు ఆంగ్లము గొప్పవని భావించి, వారి స్వాభిమానాన్నీ, స్వదేశీయ సంస్కృతినీ కోల్పోతారు. 

    అప్పుడు ఆ దేశం మనమీద ఆధారపడే మనం కోరుకున్న జాతి అవుతుంది." 


దీని పర్యవసానానికి ముందు వాస్తవాలు


I. ఈ విధానం ప్రకటింపబడి, బ్రిటిష్ పార్లమెంటు అనుమతించిన ఆంగ్ల విద్యాబోధన, మన దేశంలో "మెకాలే విద్యావిధానం"గా 1853లో ప్రవేశపెట్టబడడానికి 18 సంవత్సరాలు పట్టింది. 

    ఆ విషబీజ వృక్ష ఫలాలే, ఇప్పుడు దేశంలో మనం చూస్తున్న దుష్పరిణామాలు. 


II. మెకాలే ఈ ప్రతిపాదనకి ముందు, 1823 సంవత్సరం భారతదేశంలో అక్షరాస్యతపై రెండు సర్వేలు జరిగాయి. 


1. ఉత్తర భారతదేశంలో Dr. Leitner నాయకత్వంలో చేసినది. 

    దాని ప్రకారం ఉత్తర భారతదేశంలో అక్షరాస్యత 97%. 

2. దక్షిణ భారతదేశంలో Sir Munro నాయకత్వంలో జరిగిన సర్వే. 

    దాని ప్రకారం దక్షిణ భారతదేశంలో అక్షరాస్యత 100%. 


III. 1853 సంవత్సరం మెకాలే ఆంగ్ల విద్యావిధానం ప్రారంభించక ముందు 1850 సంవత్సరం భారతదేశంలో 


- గురుకులాలు 7.32 లక్షలు, 

  అన్నిచోట్ల ఉచిత విద్య. 


- గ్రామాలు 7.5 లక్షలు. 


మనముందున్న ప్రశ్నలు 


1. మనదేశ ప్రస్తుత దుఃస్థితికి మూలకారణంపై ఇంతకన్నా ఋజువు కావాలా?

2. మనకి స్వాతంత్ర్యం దేనికి వచ్చింది? 

3. స్వతంత్ర భారతంలో భారతీయత నేతిబీరకాయలో నేయిలాగా లేదూ? 

4. మన దేశ సంస్కృతి సంప్రదాయాలనూ స్వాభిమానాన్నీ పునరుద్ధరించుకోవాలా? వద్దా? 

5. దీనినుంచీ మారి, స్వదీశీయతకు మార్గం కనుక్కోవాలా? వద్దా? 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

మాఘమాస స్నాన సంకల్పము*_

 _*మాఘమాస స్నాన సంకల్పము*_



శ్లో.  శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

      ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

      సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతుయత్ కృతం |

      నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||

      మకరస్ధేరవౌ మాఘే మాఘేవాయే శుభేక్షణే |

      ప్రయాగస్నాన మాత్రేణ ప్రయాంతి హరిమందిరం ||

      ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం |

      సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం ||



ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే  శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్(ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్తి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, శశిరఋతౌ, మాఘమాసే, ...పక్షే , ....తిధౌ  ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మకరంగతేరవౌ మహాపవిత్ర మాఘమాస ప్రాతః స్నానం కరిష్యే.



*సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము*


గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశ తైరపి

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||

పిప్పలాదాత్సముత్సన్నే కృతే లోకాభయంకరి

మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||

అంబత్వద్దర్శనామ్మక్తిరజానే స్నానజంఫలం

స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||

విశ్వేశం మాధవందుంఢిం దండపాణీం చ భైరవం

వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||

అతితీక్షమహాకాయ కల్సాంత దహనోపమ

భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా

యాచి తోదేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||

యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః

సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||

నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||

భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే

స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||

సమస్త జగదాధార శంఖచక్ర గదాధర

దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే

నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||



స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ, ప రవాహానికి యెదురుగా, వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి, తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / దేవాలయాన దైవమును అర్చించాలి.



*దానమంత్రం*


ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం(దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్సయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.



*దాన పరిగ్రహణ మంత్రం*



ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.



*పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు*



శ్లో. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం

     విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||

     యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః

     తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||

     లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః

     యేషా విందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

     అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చమహాబలౌ

     ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్షణౌ ||

     సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా

     గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||

శ్లో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్

     విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

     లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్

     వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ ||

శ్లో. ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం

     శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||



*పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు*



శ్లో. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్

     అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

     వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం

     తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||

     బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం

     ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||

     కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ

     విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

శ్లో. కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ

     దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

శ్లో. సర్వేద సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః

     సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

శ్లో. అపుత్రాః పుత్రిణస్సంతు పౌత్రిణః

     అధనస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||



*పురాణ ప్రారంభమున శివ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు*



శ్లో. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

     అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||


శ్లో. వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం

     వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాంపతిం ||

     వందే సూర్యశశంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

     వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||


శ్లో. తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా

     నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||

     దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ

     నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయానాపూర్ణేశ్వరీ ||


శ్లో. భవానీ శంకరానందే శ్రద్దా విశ్వాసరూపిణి

     యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||

     ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం

     ఋగ్వేదాది చతుష్ట్యంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||

     నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం

     అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||



*పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు*




శ్లో. సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం

     సాంబం స్తామిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంబస్యామ చరోస్మ్యహం మమరతిహ్ సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యావకేళి కలకంఠీం

     ఆగమవిపిన మయారీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||

     సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

     సాంభస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||


శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

     మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||

     వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం

     ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం

     సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||


శ్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః

     గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నితంలోకా స్స్మస్తాస్సుఖినోభవంతు ||


🙏