28, సెప్టెంబర్ 2024, శనివారం

29-09-2024) రాశి ఫలితాలు

 రేపు (29-09-2024) రాశి ఫలితాలు



గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

 29-09-2024

చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో  కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.


వృషభం

 29-09-2024

ఉద్యోగ వాతావరణం  సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి  ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు  అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది.


మిధునం

 29-09-2024

ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో    పాల్గొంటారు. నూతన రుణయత్నాలు కలసిరావు. 


కర్కాటకం

 29-09-2024

ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో  ఆత్మవిశ్వాసంతో  ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు  నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన  పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక  ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.


సింహం

 29-09-2024

వృత్తి వ్యాపారాలలో  మీ కష్టానికి  తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం  కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.


కన్య

 29-09-2024

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి.  వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.


తుల

 29-09-2024

ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి  ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన  ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు   తీర్చగలుగుతారు.


వృశ్చికం

 29-09-2024

సంతాన  విషయాలకు సంభందించి  కీలక  నిర్ణయాలు  అమలుచేస్తారు. కుటుంబ సభ్యులతో  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  నిర్ణయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల  ప్రయత్నాలు ఫలిస్తాయి.


ధనస్సు

 29-09-2024

ఇతరులపై మీ అభిప్రాయం  మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు  పూర్తికావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.  వృత్తి ఉద్యోగాలలో మీ   కష్టం వృధాగా మిగులుతుంది.


మకరం

 29-09-2024

గృహమునకు బంధుమిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో  అప్పగించిన బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన  పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.


కుంభం

 29-09-2024

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల  సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట  మీ  మాటకు విలువ  పెరుగుతుంది.  చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.


మీనం

 29-09-2024

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక  విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన   మానసిక ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

కళ కోసం త్యాగం

 ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.


రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పెయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.


బజారులో పెయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.


ఆ యువతి ఆశ్చర్యంగా పెయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది.


మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది.


ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది.

 

రవివర్మని కలిసి ఇలా అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.


నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.


రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ...! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  


నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు.


ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.


    ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.


తల్లి తండ్రులు మనకు చెప్పే మాటల వెనుక కూడా, మన ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.*


అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా మనం కొన్ని నిముషాలు కూర్చుంటే, మన జీవితమే మారిపోతుంది....


     ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా మన ఊహకు కూడా అందని విలువైనవి....


            *లోకాసమస్తాసుఖినోభవంతు*

veg క్యాటరింగ్

 [28/09, 7:46 am] Radha: ✳️R.K Herbals ✳️


Henna

Hair oil 

Shampoo powder 

Amruthanjan (for ,pain relief and cold and cough)

Skin cream (All chronic skin Problems)

Both powder (for skin problems and freshness)

   దోమలు రాకుండా & వైరస్ లు తగ్గడానికి దూప్ స్టిక్స్

[28/09, 7:46 am] Radha: ✳️R.K Food products✳️

*** అన్ని రకాల అకేషన్సేకు veg క్యాటరింగ్ **

** అన్ని రకాల స్వీట్స్ & పిండి వంటలు **

** అన్ని రకాల **టిఫిన్స్ ఆర్డర్ పై చేసి ఇవ్వబడును *****R.K వారి పచ్చళ్ళు

** టమాట

** గోంగూర

** మామిడికాయ

** కాకరకాయ

** దోసకాయ

** చింతకాయ

** ఉసిరికాయ

** పండు మిరపకాయ పచ్చడి

[28/09, 8:07 am] Radha: ✳️ RK వారి *** ఆహార ఉత్పత్తులు **✳️

**మునగ ఆకు కారంపొడి

** కర్వేపాకు కారం

** అవిసెల కారంపొడి

** నువ్వుల కారం

** పల్లీల కారం

** కొబ్బరికారం

** ధనియాల పొడి

** మెంతులపోడి

** జిలకర పోడి

** ఆవాల పొడి

***call for 965296 9494

నారి నిరసన ర్యాలీ"*

 *"నారి నిరసన ర్యాలీ"*


🙏 *శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులుగా "రండి.. కదలి రండి..."*🙏


*సమయం: నేటి సాయంత్రం 5 గంటలకు*


*గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుండి బ్రాడిపేట మెయిన్ రోడ్డు రామాలయం వరకు..*


*శ్రీవారి ప్రసాదం అపచారం చేసిన వ్యక్తులకు ఎంతటి వారైనా సరే శిక్ష పడాలని ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది...*


*హిందువుల భక్తి ప్రపత్తులను, విశ్వాసాలను ఘోరంగా అవమానానికి గురి చేసి, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మూర్ఖ శిఖామణి, పాలన చేతకాని జగన్ రెడ్డి బృందానికి బుద్ధి చెప్పే వరకు ప్రతి హిందువు పార్టీలకు, వర్గాలకు అతీతంగా బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం...🙏*


*నిరసన ర్యాలి కార్యక్రమం:*


*తేది: 28th సెప్టెంబర్ 2024,*


*సమయం: నేటి సాయంత్రం 5 గంటలకు*


*గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుండి బ్రాడిపేట మెయిన్ రోడ్డు రామాలయం వరకు..*


*ప్రతి ఒక్క భక్తులు బయటకు రండి... సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన భాద్యత మన అందరికీ ఉంది.*


*ఇప్పటికీ బయటకు రాకపోతే మన సనాతన హిందూ ధర్మాన్ని, మన శ్రీవారిని,దేవుళ్లను ఎలా కాపాడుకుంటాం..*


*నిరసన కార్యక్రమానికి ప్రతి హిందువు, భక్తులు కదలిరండి. ఈ నిరసన కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము..🙏* 



*"నారీ గళం టీమ్"...*


*సనాతన 🕉️ ధర్మ పరిరక్షణ జేఏసీ*


*హిందూ ధర్మ పరిరక్షకులు..*

కష్టాల నుండి బయట పడేందుకు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మీ కష్టాల నుండి బయట పడేందుకు దారి చూపే అద్భుత మంత్రం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒక నాడు హనుమంతులవారు సీత దేవి కోసం లంకకు వెళ్లారు. అక్కడ ఆ తల్లి సీత దేవి యొక్క జాడ దొరకని సమయంలో. శ్రీ రామున్ని ఉద్దేశించి హనుమంతులవారు ఒక శ్లోకంతో శ్రీ రామున్ని స్తుతిస్తారు. వెనువెంటనే హనుమంతునికి తను వచ్చిన కార్యం సఫలం అవుతుంది. అంతటి మహిమాన్మితమైన శ్లోకం అని దీని గురించి సుందరాకాండలో ప్రస్తావించారట.*


*అప్పటినుండి ఎవరైతే వారి యొక్క సమస్యకు దారి (పరిష్కారం) తెలియక సతమతమవుతున్నారో వారెల్లరూ కూడా శ్రీ రామున్ని ఈ శ్లోకంతో వేడుకొంటే వెంటనే వారికి మార్గం దొరికి, వారి కష్టాలు తీరతాయని ప్రతీతి. అటువంటి ఈ అద్భుతమైన శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించండి. 


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ,*


*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,*


*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో,*


*నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ॥*


*జై శ్రీ రామ్।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

తులసి దళములు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *తులసి దళములు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనం తులసి మొక్కను దేవతగా కొలుస్తాం. లక్ష్మి దేవి రూపంగా విశ్వసిస్తూ.. నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. మరి ఎంతో పవిత్రమైన తులసి మొక్కను ఇంట్లో ఎప్పుడు నాటాలి? తులసి కోటను పెట్టేందుకు ఏది శుభ సమయం..?*


*దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే ఒక్కోసారి తులసి మొక్క ఎండిపోతుంటుంది. కొత్తగా తులసి మొక్కను ఏర్పాటు చేయాలనుకువారు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మొక్కను నాటడానికి ఏ రోజు మంచిది? పండితులు ఏం చెబుతున్నారు?*


*పురాణ, ఇతిహాసాల ప్రకారం.. తులసి మొక్కను నాటడానికి ఉత్తమమైన సమయం 'కార్తీక మాసం'. సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కార్తీక మాసం వస్తుంది. మీ ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలంటే.. ఇంతకంటే పవిత్రమైన సమయం మరొకటి ఉండదు.*


*కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడానికి గురువారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం రోజు శ్రీ హరివిష్ణువుకు పూజలు చేస్తుంటారు. తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. ఆయన విష్ణువు యొక్క అవతారం. అందువల్ల మీరు గురువారం ఇంట్లో తులసి మొక్కను నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.*


*చైత్రమాసంలో వచ్చే నవరాత్రులలో కూడా మీ ఇంట్లో తులసి మొక్కను నాటవచ్చు. గురు, శుక్రవారాల్లో తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటండి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైది. అందువల్ల శుక్రవారం తులసి మొక్కను నాటి పూజ చేస్తే మంచి జరుగుతుందని అంటారు.*


*శనివారం నాడు మీ ఇంట్లో తులసి మొక్కను కూడా నాటవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చినా లేదా ఇంటి ఆవరణలో నాటినా ఆర్థిక కష్టాలు తొలగుతాయట.*


*ఇక శాస్త్రీయ దృక్కోణం ప్రకారం... తులసి మొక్కను ఏప్రిల్ నుంచి జూన్ నెలలో నాటవచ్చు. ఆ సమయంలో తులసి మొక్క బాగా పెరుగుతుంది.*


*ఇంట్లో తులసి మొక్కను నాటితే.. అభిజిత్ ముహూర్తంలో ఎప్పుడూ నాటాలి. అభిజీత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది.*


*తులసి మొక్కను సోమ, బుధ, ఆది, ఏకాదశి తిథి, సూర్య, చంద్ర గ్రహణం రోజున అస్సలు నాటకండి. ఈ రోజుల్లో తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఇక సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు.*


*మీ ఇంట్లో ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలో తులసిని నాటవచ్చు. ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే, ఇంట్లో సూర్యుడిలా శక్తి వస్తుంది. ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ, నైరుతి దిశలో ఉంచవద్దు.*


*తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి, నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి. శాంతి కలుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచవద్దు. అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించాలి. బూట్లు ,చెప్పులు ఉంచకూడదు.*


*తులసీదళము నుండి పడిన ఉదకమును శిరమున ధరించినచో గంగాస్నానము చేసినట్లగును. దశధేనుదాన ఫలము నిచ్చును.*

                        _ పద్మపురాణం


*ఓం శ్రీ తులసీ దేవ్యై నమః।*

*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

ఇందిరా ఏకాదశి*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

         *ఇందిరా ఏకాదశి*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఈ ఏకాదశి వర్ణించబడింది.*


*ఒకసారి ధర్మరాజు దేవదేవునితో *"ఓ కృష్ణా ! మధుసూదనా ! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ? ఆ ఏకాదశి వ్రతపాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి ? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి ?"* అని ప్రశ్నించాడు.*


*ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. *"ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి."*


*"రాజా ! సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరియైన ఆ రాజు మహీష్మతీ పురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపౌత్రులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవారు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతరము లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినొసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు."*


*"ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి , చేతులు జోడించి వినమ్రంగా వందనము కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనము కావింపజేసాడు. అపుడు నారదుడు ఇంద్రసేనునితో "రాజా ! నీ రాజ్యంలో సుఖసమృద్ధులతో ఉన్నారా ? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా ? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా ?"* అని ప్రశ్నించాడు." దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో  *"ఓ మునివర్యా ! మీ దయ వలన అంతా బాగానే ఉన్నది. మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది , నాకు యజ్ఞఫలం లభించింది. ఏ దేవర్షీ ! మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది" అని అన్నాడు.రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశార్దూలమా ! నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను , ఓ రాజేంద్రా ! నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూసాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా ! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు - *"మహిష్మతీ పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిపుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను." "కనుక ఓ రాజా ! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు" అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు.*


*అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపమని నారదుని అర్థించాడు.*


*వ్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు *"ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుఝామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారు ఝామునే మేల్కొని దంతధావనము , హస్తముఖప్రక్షాళనము చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని ప్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా ! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను" అని పలికి భగవంతుని స్తుతించాలి.*


*"తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరము బ్రహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీ కృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో ,  స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరము అతడు సోదరులు , పుత్రపౌత్రులు , బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణము చేస్తూ భోజనం చేయాలి. రాజా ! ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు."* 


*నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము , బంధువులు , మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూధుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి , చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు.*


*ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు , వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

*ఓం నమః శివాయ।*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

సంస్కృత వాక్యాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

  *విద్వాన్ సర్వత్ర పూజ్యతే*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*స్వగృహే పూజ్యతే మూర్ఖ*

*స్వగ్రామే పూజ్యతే ప్రభుః|*


*స్వదేశే పూజ్యతే రాజా*

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే||*


*తాత్పర్యము:~*


*స్వగృహములోనే గౌరవమును పొందుతాడు మూర్ఖుడు. స్వగ్రామములోనే గౌరవింపబడతాడు గ్రామాధికారి. రాజు స్వదేశములోనే గౌరవింపబడుతాడు. విద్వాంసుడు సర్వత్రా గౌరవింపబడుతాడు.*


*మరో శ్లోకం :~*


*విద్వత్వం చ నృపత్వం చ*

*నైవ తుల్యం కదాచన|*


*స్వదేశే పూజ్యతే రాజా*

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే||*


*భావము :~*


*విద్వత్తును అధికారమును పోల్చి చూడలేము. రాజు స్వదేశములోనే పూజింపబడుతాడు. విద్వాంసుడు అన్నిచోట్ల పూజింపబడుతాడు.*


*వ్యాఖ్య:~*


*విద్యావంతుడు కానప్పటికీ, తెలివితేటలు తక్కువ ఉన్నప్పటికీ తన స్వంత ఇంటిలో వ్యక్తి గౌరవింప బడతాడు, గత్యంతరము ఉండదు కావున. తన స్వగ్రామములో ఉండే అధికారిని కూడా అదే విధంగా గౌరవింపక తప్పదు ఎందుచేతనంటే అతనికి ఉన్న అధికారము చేత. అదే విధంగా రాజు గారిని, అనగా వర్తమాన ప్రపంచములో ఒక MLA ని, ఒక MP ని, ఒక మంత్రిని అతడు విద్యాధికుడు కానప్పటికీ, చాలా సందర్భాలలో కడు దుర్మార్గుడైనప్పటికీ అతనికి ఉన్న అసాధారణమైన పలుకుబడి, అధికార దర్పముచేత గౌరవింప బడతాడు, గత్యంతరము లేదు. అతడు మంచి వాడైనచో ప్రజలు అదృష్టవంతులౌతారు.*


*కానీ, విద్యాధికుడైన వ్యక్తిని, విద్వాంసుడైన వ్యక్తిని మాత్రం సమాజము ఎక్కడికి వెళ్ళిననూ గౌరవిస్తుంది, ఏ రకమైన అధికార డాంబికాలు లేనప్పటికీ. అది విద్య యొక్క ప్రాసస్థ్యము. ప్రజలలో విద్వాంసుని పట్ల ఉన్న గౌరవాదరణలు.*


*ప్రజలందరికీ మంచి సామాజిక విలువలనీ, కుటుంబ విలువలనీ, విద్యా విలువలనీ, సంస్కృతీ సాంప్రదాయాలనీ తెలియ పరుచుతూ మార్గదర్శకుడై, జన బాహుళ్యానికి దిశా నిర్దేశము చేసిన స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద , చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహా రావు గారు, జగ్గి వాసుదేవ గారు వంటి వారు ఈ కోవకి చెందిన మంచి విద్వాంసులు గా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శనీశ్వరుడి అనుగ్రహం:*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *శనీశ్వరుడి అనుగ్రహం:*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శని..శని..శని అని పిలువకూడదు. శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు?*


*శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శని ప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే?*


 *''నీలాంజన సమాభాసం*

*రవిపుత్రం యమాగ్రజం।*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం''* *అంటారు.*


*నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని,*

 

*రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని,*


*యమాగ్రజం- యమునికి సోదరుడని,*


*ఛాయా మార్తాండ సంభూతం-* *ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనికి నమస్కరిస్తున్నానని అర్థం.*


*ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు.* 


*శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. "శనీశ్వరుడు" అని మాత్రమే అనాలి.*


*ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది*. 


*శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.*


*నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు.* 


*ఓం శం శనీశ్వరాయ నమో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*


*శుభమస్తు. అవిఘ్నమస్తు.*

*శుభోదయం. శుభదినం.*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

29. " మహాదర్శనము

 29. " మహాదర్శనము " --ఇరవై తొమ్మిదవ భాగము --వారు వీరేమన్నారు ?


29. ఇరవై తొమ్మిదవ భాగము - వారు వీరేమన్నారు ? 



         మధ్యాహ్నము సుమారు ఒక ఘడియ గడచి యుండవచ్చును .  పక్షులు ఇంకా నీడను వదలి బయటకు రాలేదు . ఆవు-దూడలు తాము తిన్నదానిని నెమరు వేస్తూ ఇంకా చెట్ల నీడలలో పడుకుని ఉన్నాయి . కాలువ పక్కన ఆశ్రమపు ఆడవారందరూ చేరినారు . పిల్ల తల్లులు , పిల్లలను ఇంటిలో నిద్రపుచ్చి , వారు నిద్రలేచులోపల మరలి వెళ్లవలెనని , బిందెలూ , చెంబులు , ఇత్తడి ఉపకరణములను కడుగుకొని , బట్టలు ఉతుక్కొని వెళ్లవలెనని , వచ్చినారు . 


        వచ్చినవారిలో అంత త్వరగా వెనక్కు తిరిగి పోవలసిన అవసరము లేని వారుకూడా ఉన్నారు . అటువంటి వారు , నీటిలో కాళ్ళు ఆడిస్తూ , ఎండకు ఒళ్ళు కాచుకుంటూ నిదానముగా , ఆటవిడుపుగా , ఏదో పొద్దు గడవనీ యని మాట్లాడుచున్నారు . ఎండకు కాగిన ఒళ్ళు ఆ కబుర్లకు  ఏదో ఉత్తేజనము నిచ్చునట్లుంది . మాటలు అక్కడ కూర్చొని , ఇక్కడ ఆగి , ఇటుతిరిగి అటుతిరిగి చివరికి యాజ్ఞవల్క్యుని వైపుకు మరలినాయి . నిదానముగా కూర్చున్నవారిలో చాలామంది మధ్య వయస్కులు  ఇంటిలోని మగవారి భయము అను ముసుగును కొద్దోగొప్పో తీసివేసినవారు . 


ఒకామె అన్నది , " ఆశ్రమానికి వచ్చిన ఇంతమంది పిల్లలలో యాజ్ఞవల్క్యుని తరహాలో ఒక్కరూ లేరు కదా ? "


       " ఔనే ! నేనపుడే చెప్పాలనుకున్నాను . వాడు దినమూ భిక్షకు వస్తాడు కదా ? అందరిళ్ళకూ వెళ్లడట . నేను విచారించినాను . తనకు ఎంత కావలెనో , దానికి రెట్టింపు దొరకు వరకూ మాత్రమేనట , వాడు భిక్షాటన చేసేది . ! " 


" శాస్త్రమున్నది అలాగే  అన్నపుడు ?  అది వదలి , ఒక మూట ఎత్తుకొని వచ్చి వారు వీరికి వేయవలెను? దుకాణము పెట్టవలెను అని ఎక్కడుంది ? "


        " అయితే ఇది వినండి , ఆశ్రమపు వారికి భిక్షాన్నము వేయువారు చాలామంది ఉన్నారు , ఎవరి ఇంటికి పోకుంటే ఏమగునో అని బెదరి ఇంటింటికీ వెళ్ళువారు కొందరు . " 


         " ఇంకో సంగతి విన్నారా ? ఒక్కొక్క దినము , కులపతుల భార్య కదంబిని అమ్మగారు ఉన్నారు కదా , వారు , ’ యాజ్ఞవల్క్యా , ఈ పొద్దు భోజనానికి ఇక్కడికే రా ’ అంటారట. ఆ దినము వాడు ఎక్కడికీ పోవుటే లేదంట ! అందరూ అనేదేమో తెలుసా ? ఈ మధ్య కదంబిని అమ్మగారు యాజ్ఞవల్క్యుని భోజనానికి పిలువవలెనని , ఇంటిలో దానికి చాలినంత ఉండాలని మూడునూర్ల వ్రతాలు చేస్తారంట ! " 


        " అదేమి విశేషమమ్మా ? నేను వాడిని పిలిచేలా ఉంటే , వాడిని మా ఇంటిలోనే ఉంచేసుకుంటాను . ఆ పిల్లవాడి వర్ఛస్సు ఎంతటివారైనా గౌరవించతగినది . "


        " ఇంకొక విశేషము ! మీరు గమనించే ఉంటారు , అయినా చెబుతాను , వినండి . వాడు వచ్చి వాకిట్లో నిలుచొని ’ భవతీ భిక్షామ్ దేహి ’ అంటుంటేనే ఎంత ఠీవి గా ఉంటాడే ! దాన్ని చూచుటకైనా వాడు మా ఇంటికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది . మీరేమైనా అనుకోండి . " 


         " వీరు ’ భవతీ భిక్షామ్ దేహి ’ మాత్రమే చెప్పినారు . ఆ బాలుడు నిలుచోవడము , నడక , ఎత్తు , మాట  అన్నీ కొత్తగా ఉంటాయి . ఎవడో దేవకుమారుడు దారి తప్పి ఆశ్రమమునకు వచ్చినాడే అనిపిస్తుంది . " 


        " ఇంకొకటి చూచినారా ? కావాలని , ’ ఈ దినము ఏమీ లేదయ్యా , మా భోజనమైపోయింది ’ అనో , ఇంకేదైనా  అని గానీ చూడండి , వాడు పెదవి కూడా కదపడే ? "


        " ఇవన్నీ బయటి సంగతులు . వాడు ఏకసంతగ్రాహి యంట ? వేదమైనా , శాస్త్రమైనా , పురాణమైనా , ఒకసారి ఇలాగ చెప్పితే చాలు , అలాగే అప్పచెప్పేస్తాడట. " 


" అందుకే వాడికి వీణ వాయించుటకు అంత సమయము దొరకుతుంది .! "


" వాడి వీణా వాదనము మీరెక్కడ విన్నారు ? "


        " మొన్న సాయంకాలము ఆవుదూడలను చూడాలని అటువైపుకు వెళ్ళినాను . అక్కడేదో సద్దగుచుండినది . ఇదెవరు ? వీణ వాయిస్తున్నారు ? అని విచారించితిని . వీడే అని తెలిసింది "  


        " నాకు ముందే తెలుసు. ఆ దినము వారి తల్లిదండ్రులు వచ్చినారు కదా , అప్పుడు వాడి తల్లి దగ్గర కూర్చొని వాయించినాడు . ఆ దినము మమ్మల్ని , నలుగురైదుగురు ఆడవారిని పిలచి పసుపు-కుంకుమలిచ్చినారు ఆమె . అప్పుడే మాకు తెలిసింది . " 


" మీరైతే భట్టు గారి ఇంటివారు . మాకా అదృష్టము ఎలా కలుగుతుంది ? " 


         " అది ఉండనివ్వండి , ఈ రోజు ఇంకొక విశేషము . మీకు తెలుసో లేదో , వారంతా ఒకటిగా చేరి వేదాధ్యయనము చేస్తారు కదా , అప్పుడు చూడండి ,  వాడి కంఠము అందరినీ మించి , మంచి కంచు కంఠము వలె , గంట కొట్టినట్లు వినిపిస్తుంది . ఇంకెవరి గొంతూ దానిని మించునట్లు లేదు కదా ? "


" ఔను , మిగిలినవారు వాడిని అనుసరించవలసినదే తప్ప , వాడు మిగిలినవారిని అనుసరించుట అన్నదే లేదు . "


        " ముఖ్యముగా అడిగి పుట్టినవాడిలాగా పుట్టినాడు , అంతటి కొడుకును పొందుటకు కూడా అడుక్కొని వచ్చి ఉండాలి . సరే , ఇంక ఇంటికి పోదామా లేదా ? "


" పోకేమి చేస్తాం ? పశువులు వచ్చే వేళయ్యింది. ఇప్పుడు వెళ్ళి పాలు పిండి స్నానము చేసి అగ్ని హోత్రానికి సర్వమూ సిద్ధము చేయాలి "


       " ఔనే , పొద్దయిపోయింది .  "  అని అందరూ త్వర త్వరగా పాత్రలు కడుగుకున్నారు . బట్టలు తెచ్చినవారు మరి కాసేపట్లోనే అన్నీ ఉతికేశారు . అందరూ , నీరు , పాత్రలూ , బట్టలూ తీసుకొని ఆశ్రమాభిముఖముగా వెళ్ళినారు . 


         దారిలో మరలా యాజ్ఞవల్క్యుని మాట వచ్చింది . 

" ఇంకో విషయము చూడండి , వాడు ఋగ్వేద పాఠమునంతా ముగించుకొని , సామవేదమునకు వచ్చినాడు . ఆ సామములనే వాడు వీణలో పలికిస్తున్నది . "


" నిజంగానా ? "


" ఔను , నేనింకేమి చెప్పేది ? కావాలంటే మీరు విని చూడండి . "


" వాడి గుడిసె నుండీ వీణ వినిపిస్తుంది . కానీ అది సామము అనేది మనసుకు రాలేదు . నేను ఏదో పాట అనుకున్నాను "


" సరే , అలాగైతే , ఈ చిన్న వయసులోనే వాడు త్రివేది అయినాడు " 


" సందేహమే లేదు . వాడు ఇక్కడ ఇంకొక వర్షముంటే బ్రహ్మ వేదమును కూడా నేర్చి చతుర్వేది యవుతాడు , సందేహమే లేదు " 


" ఆ తండ్రి కొడుకు చతుర్వేదియగుటలో సందేహమేమున్నది ? "


" అది నిజము ... ఇక ఆశ్రమము వచ్చింది . మా ఇంటికి మేమూ , మీ ఇంటికి మీరూ . యాజ్ఞవల్క్యుడు ఎక్కడున్నా , సుఖంగా ఉండనీ ..పదండి పోదాము "  

Janardhana Sharma

పార్వతి ప్రణయ నివేదన!



పార్వతి ప్రణయ నివేదన!


"అందముచిందుచుండ, చెవియందలి చెందొవ జారుచుండ, పూ/

లందుకొనుండటంచు సుమనోంజలి ముందుకుసాచి,శైలరా/

ణ్ణందనవంగె, కుసుమాస్త్రుని చాపమువంగె, బా/

లేందుధరుండు కాన్కలుగ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై:


పూలదోసిలితో అందిస్తూ పార్వతి వంగింది. మన్మధబాణంవంగింది.అందుకోవటానికి పరమశివుడూ వంగేడు.

ఎంతమనోహరమైనదృశ్యం! ఎంత అద్భుతపదజాలం!


   సతీ వియోగం తరువాత పరమేశ్వరుడు మహోగ్రమైన తపోదీక్షలోనున్నాడు.పార్వతి యతని పెండ్లియాడగోరి తానునుగ్ర తపమాచరించుచుండెను.తారకాసుర సంహారముకొరకై వీరిరువురకు వివాహము జరుపుటకు దేవతలునిర్ణయించి,మన్మధుని సపరివారముగా తపోవనమునకుబంపిరి.అతడు అదనుకై వేచియుండ నొకనాడీ సుందర దృశ్యము జరిగినది.

లలిత మనోజ్ఙమంజుల పద ములతో కడుసొగసుగా చిత్రించిన యీకవితాచిత్రమును

పాపయ్యశాస్త్రిగారి(కరుణశ్రీ) పద్యంలో మీరిప్పుడు దర్శింపగలరు.

                స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷🌷

హైందవం వర్ధిల్లాలి 14*

 *హైందవం వర్ధిల్లాలి 14*




*సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి* 

vi):- *నేటి సుగుణాల బాలికలే రేపటి ఆదర్శ మహిళలు అను భావనచే ఈ అంశము అవసరమగుచున్నది*. భారత దేశంలో అధికులు సనాతన ధర్మాలను, సంప్రదాయాలను పాటిస్తున్నారు. మహిళల పట్ల హైందవంలో అధికుల ప్రకృతి (గుణము, అలవాటు) జ్ఞప్తికి తెచ్చుకుందాము. 

*యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా* ప్రత్యేకంగా అర్థము చెప్పుకోవలసిన అవసరము లేని మనుస్మృతి వాక్యము. రెండవది *ప్రణమ్యా మాతృ దేవతా*. తల్లీ నీకు వందనములు. *మాతృ దేవోభవ* అని ఎంతో ఉన్నతంగా తల్లి కి దేవతా స్థానాన్ని ఇచ్చినది మన సనాతన ధర్మం. 


ప్రత్యేకంగా ఒక *రోజు మదర్స్ డే* అని నిర్వహిస్తూ, ఇతరులు ఆ దినము మాత్రమే తల్లిని, ఇతర మాతృ సమానులను గౌరవించు సంప్రదాయము గాకుండా *అనుక్షణం తల్లినీ ఇతర మహిళలను జీవితాంతం గౌరవించే ఏకైక సమాజం భారత దేశ సమాజమే*. (మినహాయింపులు ఉంటే ఉండవచ్చును, త్రోసిపుచ్చలేము).


ఎల్లపుడు స్త్రీలు తండ్రి, భర్త లేదా కొడుకుల సంరక్షణలోనే ఉండాలా అను ప్రశ్నకు వింశతి (20) సంవత్సరముల క్రితమే

 *ఆ సంరక్షణ అత్యంత అవసరమైనదికాదు, లేదు అని* సమాధానము చెప్పబడినది.


ఈ మధ్యకాలంలో మహిళలు ఒకటేమిటి పురుషులతో బాటు *అన్ని రంగాలలో* అగ్రగాములుగా ఉన్నారు. యావత్ ప్రపంచం *నమ్ముతున్న సత్యమొకటి* తెలుసుకుందాము ఆసియా దేశాలలో *హిందూ సాంస్కృతిక నేపథ్యంలో ఉన్న మహిళలకే' అధిక గౌరవం లభిస్తున్నదని*, ఇది పరమ సత్యము. ఉన్నత విద్య మరియు ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా నాయకుల అభిప్రాయం మరియు సూచనలను గూడా...... *మహిళలు భారత కుటుంబ వ్యవస్థ విలువలు పాటిస్తూ, బలపరుస్తూ, ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి ఉంటూ గూడా తమ కెరీర్ ను అభివృద్ధి చేసుకోవచ్చు* అని. చాలా రంగాలలో మహిళలు నాయకత్వ (Head/top) స్థానాలలో ఉండడం వలన భారత దేశంలో ముందంజలో ఉన్నది. *ఇదీ* వాస్తవమే. వేదేతిహాస పురాణాలు కూడా స్త్రీని అత్యంత శక్తివంతమైన *శక్తి* స్వరూపిణి గా సమున్నత స్థానం ఇచ్చాయి.


ఈనాటి అధునాతన జీవితం ఎలా ఉందంటే అబ్బాయిలు, అమ్మాయిలు అను తేడాలేకుండా, *నాగరికత పేరుతో అడ్డూ ఆపు లేని స్నేహాలు మరియు అలవాట్లు. ఇల్లు దాటిన తర్వాత పిల్లలేమి చేస్తున్నారో పెద్దలకు తెలువని పరిస్థితి. కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వస్తున్నారు నిజమే. కాని, ఈ మధ్య కాలంలో హిందూ సంప్రదాయం అనుమతివ్వని ఎన్ని ఘటనలో, సంఘటనలో , అంతా అజ్ఞాతమే, సుఖాల ఇంద్రియ లోలత్వమే* కారణం కావచ్చును. మరింత విపులీకరణ అవసరం లేదనిపిస్తున్నది.


 *సమాజంలో అందరు ఆడపిల్లలు ఆలా ఉన్నారా అంటే కానే కాదు అని బల్లగుద్ది చెప్పవచ్చును*

అవుతే తల్లి, తండ్రి మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు *పిల్లల వ్యవహార శైలిపై దృష్టి పెట్టి, మన సంప్రదాయాలు పాటించేలా జాగృత పరచాలి. సంప్రదాయాల విలువలు మరియు ఔన్నత్యం తెలుపాలి* ఇన్ని జాగ్రతలు పాటిస్తే నేటి బాలికలు, యువతులు పెద్దయ్యాక పైన ఉదహరించబడిన మహిళామణులంత గౌరవం పొందుట తథ్యము. హిందూ ధర్మాలకు, సంస్కృతికి *కట్టుబడి ఉండకుంటే* ఎదురయ్యే సమస్యలు, హిందూ సంప్రదాయాలు *కట్టుబడి ఉంటే* తొలగిపోయే ఆరోగ్య నైతిక ఇబ్బందులను పెద్దలందరూ గమనించాలి. పిల్లల్ని అనుసరింపజేయాలి.

*కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు

*(సశేషం)*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం  - ఏకాదశి - ఆశ్రేష -‌‌ స్థిర వాసరే* (28.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భక్త పోతన

 🌼భక్త పోతన 🌼


సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి నుర్విపై

               భక్తి పంచిన యట్టి  భాగవతుడు

    పద్యముల్  సేద్యమున్ పరవశంబున జేసి

               సన్నుతుండైనట్టి  సవ్యసాచి

    మకరంద సాహిత్య మాధుర్య గరిమను

               తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ

    భక్తి సాహిత్యంబు పంచియు మేనున

               పులక లెత్తించిన పుణ్యమూర్తి

తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ 

     భక్తితో రామవిభునకు ముక్తి గోరి

     కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె

     భక్త పోతన పావన భాగవతము



 సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'

                పరికించి చూచిన భక్త వరుడు

     'ఎవనిచే జనియించు నీ జగమ'నుచును 

               'కరిచేత' తెల్పిన పరమ బుధుడు

     'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !

               యవనిలో  నుండిరే!' యనిన ఘనుడు

      కన్నీరు నింపిన కమలాసనునిపత్ని

                నోదార్చి పొగడిన యోగివరుడు

తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము

      రచన జేసియు నత్యంత రమ్యముగను 

      తెలుగు వారికి నిచ్చిన  దివ్య సుకవి

      పోతనకు మించి నెవ్వరు పుడమి గలరు ?


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

పంచాంగం 28.09.2024 Saturday

 ఈ రోజు పంచాంగం 28.09.2024 Saturday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష ఏకాదశి తిధి స్థిర వాసర: ఆశ్రేషా నక్షత్రం సిద్ధ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 02:52 వరకు.

ఆశ్రేష రాత్రి 03:38 వరకు.


సూర్యోదయం : 06:09

సూర్యాస్తమయం : 06:04


వర్జ్యం : మధ్యాహ్నం 03:22 నుండి సాయంత్రం 05:07 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 06:09 నుండి 07:44  వరకు.


అమృతఘడియలు : రాత్రి 01:52 నుండి 03:38 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00  వరకు.



శుభోదయ:, నమస్కార:

ఆకాశంలో ఈ అద్భుతాన్ని

 ఈ నెల 28న ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూడటం మర్చిపోకండి.

""""""''''''''''''''"""""""""""""""""""""""""""""""


ఈ నెల 28న మనం ఒక అరుదైన ఖగోళ సంఘటనకు సాక్ష్యం కానున్నాం. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క మళ్లీ భూమికి దగ్గరగా రానుంది. ఈ తోక చుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు "Tsuchinshan-ATLAS" అని పిలుస్తున్నారు. ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 


ఈ తోక చుక్కను మన కళ్లతోనే చూడవచ్చు, ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. అయితే, బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తోక చుక్కను చూడటం మన జీవితకాలంలో ఒక అరుదైన అవకాశం. 


ఈ తోక చుక్కను చూడటానికి ఉత్తమ సమయం తెల్లవారుజామున ఉంటుంది. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే, ఈ తోక చుక్కను స్పష్టంగా చూడవచ్చు. ఈ సంఘటనను మిస్ అయితే, మళ్లీ చూడటానికి 80 వేల సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. 


ఈ తోక చుక్కను చూడటం ఖగోళ శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. ఈ అరుదైన సంఘటనను మనం మిస్ కాకుండా చూడటం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 


ఈ తోక చుక్కను చూడటం ద్వారా మనం ఖగోళ శాస్త్రంలో ఉన్న అద్భుతాలను అనుభవించవచ్చు. ఇది మనకు ప్రకృతి యొక్క మహిమను గుర్తు చేస్తుంది. 

Venu Perumalla