28, సెప్టెంబర్ 2024, శనివారం

పార్వతి ప్రణయ నివేదన!



పార్వతి ప్రణయ నివేదన!


"అందముచిందుచుండ, చెవియందలి చెందొవ జారుచుండ, పూ/

లందుకొనుండటంచు సుమనోంజలి ముందుకుసాచి,శైలరా/

ణ్ణందనవంగె, కుసుమాస్త్రుని చాపమువంగె, బా/

లేందుధరుండు కాన్కలుగ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై:


పూలదోసిలితో అందిస్తూ పార్వతి వంగింది. మన్మధబాణంవంగింది.అందుకోవటానికి పరమశివుడూ వంగేడు.

ఎంతమనోహరమైనదృశ్యం! ఎంత అద్భుతపదజాలం!


   సతీ వియోగం తరువాత పరమేశ్వరుడు మహోగ్రమైన తపోదీక్షలోనున్నాడు.పార్వతి యతని పెండ్లియాడగోరి తానునుగ్ర తపమాచరించుచుండెను.తారకాసుర సంహారముకొరకై వీరిరువురకు వివాహము జరుపుటకు దేవతలునిర్ణయించి,మన్మధుని సపరివారముగా తపోవనమునకుబంపిరి.అతడు అదనుకై వేచియుండ నొకనాడీ సుందర దృశ్యము జరిగినది.

లలిత మనోజ్ఙమంజుల పద ములతో కడుసొగసుగా చిత్రించిన యీకవితాచిత్రమును

పాపయ్యశాస్త్రిగారి(కరుణశ్రీ) పద్యంలో మీరిప్పుడు దర్శింపగలరు.

                స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: