*హైందవం వర్ధిల్లాలి 14*
*సముచిత జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి, జీవన వ్యవస్థను మెరుగు పర్చుకోవాలి*
vi):- *నేటి సుగుణాల బాలికలే రేపటి ఆదర్శ మహిళలు అను భావనచే ఈ అంశము అవసరమగుచున్నది*. భారత దేశంలో అధికులు సనాతన ధర్మాలను, సంప్రదాయాలను పాటిస్తున్నారు. మహిళల పట్ల హైందవంలో అధికుల ప్రకృతి (గుణము, అలవాటు) జ్ఞప్తికి తెచ్చుకుందాము.
*యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా* ప్రత్యేకంగా అర్థము చెప్పుకోవలసిన అవసరము లేని మనుస్మృతి వాక్యము. రెండవది *ప్రణమ్యా మాతృ దేవతా*. తల్లీ నీకు వందనములు. *మాతృ దేవోభవ* అని ఎంతో ఉన్నతంగా తల్లి కి దేవతా స్థానాన్ని ఇచ్చినది మన సనాతన ధర్మం.
ప్రత్యేకంగా ఒక *రోజు మదర్స్ డే* అని నిర్వహిస్తూ, ఇతరులు ఆ దినము మాత్రమే తల్లిని, ఇతర మాతృ సమానులను గౌరవించు సంప్రదాయము గాకుండా *అనుక్షణం తల్లినీ ఇతర మహిళలను జీవితాంతం గౌరవించే ఏకైక సమాజం భారత దేశ సమాజమే*. (మినహాయింపులు ఉంటే ఉండవచ్చును, త్రోసిపుచ్చలేము).
ఎల్లపుడు స్త్రీలు తండ్రి, భర్త లేదా కొడుకుల సంరక్షణలోనే ఉండాలా అను ప్రశ్నకు వింశతి (20) సంవత్సరముల క్రితమే
*ఆ సంరక్షణ అత్యంత అవసరమైనదికాదు, లేదు అని* సమాధానము చెప్పబడినది.
ఈ మధ్యకాలంలో మహిళలు ఒకటేమిటి పురుషులతో బాటు *అన్ని రంగాలలో* అగ్రగాములుగా ఉన్నారు. యావత్ ప్రపంచం *నమ్ముతున్న సత్యమొకటి* తెలుసుకుందాము ఆసియా దేశాలలో *హిందూ సాంస్కృతిక నేపథ్యంలో ఉన్న మహిళలకే' అధిక గౌరవం లభిస్తున్నదని*, ఇది పరమ సత్యము. ఉన్నత విద్య మరియు ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా నాయకుల అభిప్రాయం మరియు సూచనలను గూడా...... *మహిళలు భారత కుటుంబ వ్యవస్థ విలువలు పాటిస్తూ, బలపరుస్తూ, ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి ఉంటూ గూడా తమ కెరీర్ ను అభివృద్ధి చేసుకోవచ్చు* అని. చాలా రంగాలలో మహిళలు నాయకత్వ (Head/top) స్థానాలలో ఉండడం వలన భారత దేశంలో ముందంజలో ఉన్నది. *ఇదీ* వాస్తవమే. వేదేతిహాస పురాణాలు కూడా స్త్రీని అత్యంత శక్తివంతమైన *శక్తి* స్వరూపిణి గా సమున్నత స్థానం ఇచ్చాయి.
ఈనాటి అధునాతన జీవితం ఎలా ఉందంటే అబ్బాయిలు, అమ్మాయిలు అను తేడాలేకుండా, *నాగరికత పేరుతో అడ్డూ ఆపు లేని స్నేహాలు మరియు అలవాట్లు. ఇల్లు దాటిన తర్వాత పిల్లలేమి చేస్తున్నారో పెద్దలకు తెలువని పరిస్థితి. కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వస్తున్నారు నిజమే. కాని, ఈ మధ్య కాలంలో హిందూ సంప్రదాయం అనుమతివ్వని ఎన్ని ఘటనలో, సంఘటనలో , అంతా అజ్ఞాతమే, సుఖాల ఇంద్రియ లోలత్వమే* కారణం కావచ్చును. మరింత విపులీకరణ అవసరం లేదనిపిస్తున్నది.
*సమాజంలో అందరు ఆడపిల్లలు ఆలా ఉన్నారా అంటే కానే కాదు అని బల్లగుద్ది చెప్పవచ్చును*
అవుతే తల్లి, తండ్రి మరియు కుటుంబంలోని ఇతర పెద్దలు *పిల్లల వ్యవహార శైలిపై దృష్టి పెట్టి, మన సంప్రదాయాలు పాటించేలా జాగృత పరచాలి. సంప్రదాయాల విలువలు మరియు ఔన్నత్యం తెలుపాలి* ఇన్ని జాగ్రతలు పాటిస్తే నేటి బాలికలు, యువతులు పెద్దయ్యాక పైన ఉదహరించబడిన మహిళామణులంత గౌరవం పొందుట తథ్యము. హిందూ ధర్మాలకు, సంస్కృతికి *కట్టుబడి ఉండకుంటే* ఎదురయ్యే సమస్యలు, హిందూ సంప్రదాయాలు *కట్టుబడి ఉంటే* తొలగిపోయే ఆరోగ్య నైతిక ఇబ్బందులను పెద్దలందరూ గమనించాలి. పిల్లల్ని అనుసరింపజేయాలి.
*కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*.
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి