28, సెప్టెంబర్ 2024, శనివారం

తులసి దళములు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *తులసి దళములు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనం తులసి మొక్కను దేవతగా కొలుస్తాం. లక్ష్మి దేవి రూపంగా విశ్వసిస్తూ.. నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. మరి ఎంతో పవిత్రమైన తులసి మొక్కను ఇంట్లో ఎప్పుడు నాటాలి? తులసి కోటను పెట్టేందుకు ఏది శుభ సమయం..?*


*దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే ఒక్కోసారి తులసి మొక్క ఎండిపోతుంటుంది. కొత్తగా తులసి మొక్కను ఏర్పాటు చేయాలనుకువారు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మొక్కను నాటడానికి ఏ రోజు మంచిది? పండితులు ఏం చెబుతున్నారు?*


*పురాణ, ఇతిహాసాల ప్రకారం.. తులసి మొక్కను నాటడానికి ఉత్తమమైన సమయం 'కార్తీక మాసం'. సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కార్తీక మాసం వస్తుంది. మీ ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలంటే.. ఇంతకంటే పవిత్రమైన సమయం మరొకటి ఉండదు.*


*కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడానికి గురువారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం రోజు శ్రీ హరివిష్ణువుకు పూజలు చేస్తుంటారు. తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. ఆయన విష్ణువు యొక్క అవతారం. అందువల్ల మీరు గురువారం ఇంట్లో తులసి మొక్కను నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.*


*చైత్రమాసంలో వచ్చే నవరాత్రులలో కూడా మీ ఇంట్లో తులసి మొక్కను నాటవచ్చు. గురు, శుక్రవారాల్లో తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటండి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైది. అందువల్ల శుక్రవారం తులసి మొక్కను నాటి పూజ చేస్తే మంచి జరుగుతుందని అంటారు.*


*శనివారం నాడు మీ ఇంట్లో తులసి మొక్కను కూడా నాటవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చినా లేదా ఇంటి ఆవరణలో నాటినా ఆర్థిక కష్టాలు తొలగుతాయట.*


*ఇక శాస్త్రీయ దృక్కోణం ప్రకారం... తులసి మొక్కను ఏప్రిల్ నుంచి జూన్ నెలలో నాటవచ్చు. ఆ సమయంలో తులసి మొక్క బాగా పెరుగుతుంది.*


*ఇంట్లో తులసి మొక్కను నాటితే.. అభిజిత్ ముహూర్తంలో ఎప్పుడూ నాటాలి. అభిజీత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది.*


*తులసి మొక్కను సోమ, బుధ, ఆది, ఏకాదశి తిథి, సూర్య, చంద్ర గ్రహణం రోజున అస్సలు నాటకండి. ఈ రోజుల్లో తులసి మొక్కను ముట్టుకోకూడదు. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఇక సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు.*


*మీ ఇంట్లో ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలో తులసిని నాటవచ్చు. ఉత్తర దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే, ఇంట్లో సూర్యుడిలా శక్తి వస్తుంది. ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ, నైరుతి దిశలో ఉంచవద్దు.*


*తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి, నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి. శాంతి కలుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచవద్దు. అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించాలి. బూట్లు ,చెప్పులు ఉంచకూడదు.*


*తులసీదళము నుండి పడిన ఉదకమును శిరమున ధరించినచో గంగాస్నానము చేసినట్లగును. దశధేనుదాన ఫలము నిచ్చును.*

                        _ పద్మపురాణం


*ఓం శ్రీ తులసీ దేవ్యై నమః।*

*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: