6, సెప్టెంబర్ 2022, మంగళవారం

పంచ పాత్ర

 🎻🌹🙏పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.

🌷మొదటిది అర్ఘ్య పాత్ర :🌷

🌸భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో  కూడిన పాత్ర

🌷రెండవది పాద్య పాత్ర : 🌷

🌿ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర

🌷మూడవది ఆచమనీయ పాత్ర : 🌷

🌸ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 

🌷నాలుగవది స్నాన పాత్ర : 🌷

🌿ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర

🌸ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర

🌿ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,

🌸మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.

🌿ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి 

🌸మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర. హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం...స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పరమేష్టి గురువులు -

 ధర్మాకృతి : ధర్మాకృతి : పరమేష్టి గురువులు - 3

23.9.1885 – భాద్రపద శుద్ధ బుధవారము శ్రీ పూజ్య పాదులకు శ్రీమహారాజా వారు భిక్షమొనర్ప సంకల్పించుటచే నీ యుదయమున బ్రహ్మశ్రీ ద్వారకా భమిడిపాటి పెదసూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీవారికి భిక్షావందన మొనర్చిరి. పిమ్మట శ్రీచరణులను స్వాగతదినోత్సవ తుల్యమగు నుత్సవముతో కోటకు తీసుకొని వచ్చిరి. శ్రీ భగవత్పాదులాందోళికా నిహిత దేవ పురస్కృతులై తమ ఏనుగుపై కట్టిన అంబారీపై గూర్చుండి సపరివారముగ కోటకు విజయము చేయు సమయమున దివాన్ జీ సాహేబు వారును, రాజ పరివారమును కోటయొద్ద శ్రీవారి నెదుర్కొని లోనికి దీసికొని వెళ్ళిరి. కోటలో శ్రీ మహాలక్ష్మీ సన్నిధానము యొద్ద శ్రీవారేనుగునుండి దిగి, శ్రీమహాలక్ష్మీ సన్నిధి నెదురుగ బీఠముంచిన స్థలమున శ్రీవారు కూర్చుంది, రాజ పరివార మొనర్చు సాష్టాంగ నమస్కారాముల నందుకొనిరి. స్నాన జప పూజాద్యనుష్ఠానములు పూర్తియైన పిమ్మట రాత్రి 7గంటలకు శ్రీవారికి భిక్ష జరిగినది. మహా బ్రాహ్మణ సమారాధనమును జరిగెను. ఈ రాత్రి 10గంటలకు శ్రీ మహారాజా వారు శ్రీ మహారాజు కుటుంబము వారును శ్రీమహాలక్ష్మీ సన్నిధికి విజయము చేసి శ్రీమహాలక్ష్మీ గణేశుల సందర్శించుకొనిన పిమ్మట శ్రీపీఠసన్నిధిని శ్రీ శ్రీ శ్రీ పెదమహారాణి సాహెబా వారొక మొహరును, శ్రీరీనా మహారాణీ వారును, శ్రీ మహారాజా వారును, శ్రీ చిన మహారాణీ వారును, ప్రత్యేకముగా నొక్కొక్క గిన్నీ కాసు నిమిత్తము రూ.13/ను సమర్పించిరి. శ్రీ మహారాజా వారు పెదసూర్యనారాయణ శాస్త్రిగారిచే శ్రీపాదుకలకు పాదపూజ జరిపించి అష్టోత్తర సహస్ర నామార్చనకై రూ.1116/- సమర్పించిరి. పీతాంబరముల నిచ్చిరి. శ్రీమహాలక్ష్మీ మందిరము నెదుట సాని మేళములు రెండాడు చుండెను. శ్రీ స్వాముల వారికిని శ్రీ పీఠస్థ దేవునికిని మధ్యను పరదా కట్టబడెను. శ్రీ స్వాముల వారి సన్నిధిని పెద సూర్యనారాయణ శాస్త్రి గారుండిరి. శ్రీ స్వాముల వారి సన్నిధిని పరదాలోను చిత్రాసనము వేయబడెను. శ్రీ మహారాజ కుటుంబమునాకును శ్రీ భగవత్పాదులకును బరదాలోనుండి సంభాషణము జరిగెను. శ్రీ చరణుల సన్నిధిని శ్రీ మహారాజా వారు సాలువుల జోడును రూ.116/-సమర్పించి అచటనున్న చిత్రాసనమున ఉపవసించిరి. శ్రీజగద్గురువులు శ్రీ మహారాజ కుటుంబమునకు ప్రత్యేకముగ నోక్కోక్కరికిని సాలువుల జతను, వెండి గలాసులు, వెండి కుంభ కోణము, గుల్లీలు, మంత్రాశ్రీతలును మున్నగు ప్రసాదముల ననుగ్రహించిరి. శ్రీ బాబు సాహేబు వారి కుటుంబమునకును ప్రత్యేకముగ పీతాంబరాది ప్రసాదముల నిచ్చిరి. శ్రీపీఠాధీశుల యాజ్ఞను పొంది శ్రీ మహారాజ కుటుంబము రాత్రి 1.30గంటలకు నగరులోనికి విజయము చేసిరి”.  

కోటలో శ్రీవారు రెండుమూడు రోజులుండి తమ విడిదికి వేంచేశారు. శ్రీవారు కోటనుండి వెళ్ళిపోయే సమయంలో కీంఖాపు జూవాలుతో అలంకరించిన ఏనుగును శ్రీవారి సేవార్థము సమర్పించారు. 23.10.1985న కన్యాశుల్క విషయకమైన నిషిద్ధ పత్రికను శ్రీవారు దయచేశారు. 29.10.85న మహారాజుగారికి స్వామివారు పంచ సూత్రా స్ఫటిక లింగాన్ని దయచేశారు. మహారాజా వారు స్వయముగా మాధ్యాహ్నిక పూజ చేశారు. స్వామివారు ఈ ఊరిలో ఉన్నంత కాలము మహారాజు గారి కుటుంబానికి చందన కుంకుమాది ప్రసాదములు, భోజనమును శ్రీపీఠమునుండే అనుగ్రహింపబడినది.

విజయనగర విజయానంతరము స్వామివారు బొబ్బిలిరాజా వారి ప్రార్థనపై బొబ్బిలి విజయం చేసి బరంపురం మీదుగా ఒరిస్సాలో ప్రవేశించారు. పూరీ మహోదధిలో స్నానం చేసి జగన్నాథుని దర్శనం చేసి విమలా మఠాధిపతులచే సన్మానింపబడినారు. ఇక్కడనుండి వారణాసి పోవడమా, తిరిగి మరలడమా అనే విషయం మీద దీర్ఘకాలం యోచించారు. ప్రజలందరూ మత్స్య భుక్కులుగా ఉండడమూ, ఆచారము కొరతగా ఉండడమూ చూసి కుంభకోణము తిరుగు ముఖము పట్టారు. 

తిరుగుముఖంలో తాము ముందు విజయం చేసిన సంస్థానాలకు వెళ్ళక క్రొత్తదారిలో క్రొత్త క్రొత్త గ్రామములలో ప్రజలకు ధర్మబోధ చేస్తూ వేంకటగిరి సంస్థానాధీశుల పూజలు స్వీకరించి కాళహస్తి సంస్థానం విజయం చేశారు. కాళహస్తి రాజా శ్రీవారికి దంతము నగిషీ చేయబడిన సింహాసనాన్ని సమర్పించి పాదపూజ చేశారు. (ఈ సింహాసనం మహాస్వామివారు కలవైలో ఉండగా కాళహస్తి రాజా కుటుంబసభ్యులచే మహాస్వామివారికి స్వాధీనం చేయబడింది). అక్కడ నుండి తిరుమల విజయం చేసి ఆలయ మర్యాదలతో వేంకటేశ్వరుని దర్శించి తిరువేంగాడు చేరారు. తిరువేంగాడులో కామకోటి పూర్వ పీఠాధిపటులయిన సర్వజ్ఞ శివేంద్రుల అధిష్ఠానం ఉంది. అధిష్ఠానాన్ని పూజించి మళ్ళీ మహామఖానికి కుంభకోణం చేరారు. ఎంతోకాలం తరువాత కుంభకోణం చేరిన స్వామివారి దర్శనానికి ఊరు ఊరు తిరగబడింది. మళ్ళీ మఠంలో యధావిధి పూజలు, హోమాలు, సంతర్పణాదులు మొదలైనాయి.

(సశేషం)

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం - 3

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం