6, సెప్టెంబర్ 2022, మంగళవారం

పంచ పాత్ర

 🎻🌹🙏పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.


🌷మొదటిది అర్ఘ్య పాత్ర :🌷


🌸భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో  కూడిన పాత్ర


🌷రెండవది పాద్య పాత్ర : 🌷


🌿ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర


🌷మూడవది ఆచమనీయ పాత్ర : 🌷


🌸ఇది భగవంతుని కి పుక్కిలించడానికి సమర్పించే శుద్దోదకం నింపిన పాత్ర. 


🌷నాలుగవది స్నాన పాత్ర : 🌷


🌿ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర


🌸ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర


🌿ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,


🌸మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.


🌿ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి 


🌸మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర. హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం...స్వస్తి...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: