23, నవంబర్ 2021, మంగళవారం

భస్మాల ఉపయోగాలు - 1

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 1


   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 


      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 


 * స్వర్ణ భస్మం - 


    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 


 * వెండి భస్మము - 


      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 


 * తామ్ర భస్మం - 


      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 


 * లోహ భస్మము - 


      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను . దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 


 * కాంత భస్మము - 


      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 


 * మండూర భస్మము - 


    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 


    పైన చెప్పిన పద్దతుల్లో మా కుటుంబము వారు తయారు చేసేవారు. ఇది లివర్ మీద అద్భుతముగా పనిచేయును . పాండురోగము మీద , కామెర్ల మీద శరీరం వాపు మీద బ్రహ్మస్తం వలే పనిచేయును . 


       మరికొన్ని భస్మాల గురించి తరువాతి పోస్టు నందు వివరిస్తాను .

వ్యమైన సున్నిపిండి

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి - 


 కావలసిన పదార్దాలు - 


  * పచ్చ పెసలు - 1 కిలొ .


  * బావంచాలు - 100 గ్రాములు .


   * వట్టి వేళ్లు - 100 గ్రాములు . 


   * కచ్చురాలు - 100 గ్రాములు . 


   * మంజిష్ట - 100 గ్రాములు .


   * మంచి పసుపు - 100 గ్రాములు .


   * కస్తూరి పసుపు - 100 గ్రాములు .


   * ఉలవలు - 100 గ్రాములు .


   * బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .


   * కరక్కాయ బెరడు - 100 గ్రాములు .


   * ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .


   * తానికాయ బెరడు - 100 గ్రాములు .


   * ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .


   * కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 


    * సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .


    * తుంగ గడ్డలు - 100 గ్రాములు .


    * దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .


    * ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . 


    * మరువము - 100 గ్రాములు . 


     * ధవనము - 100 గ్రాములు .


     * జాపత్రి - 100 గ్రాములు . 


     * యాలుకలు - 100 గ్రాములు . 


     * కురువేరు - 100 గ్రాములు . 


     * తులసి ఆకులు - 100 గ్రాములు . 


  తయారీ విధానం - 


    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 


 

  వాడేవిధానం - 


     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


  ఉపయోగాలు - 


 

 * ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 


 * శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 


 * చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 


 * మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .


 * చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .


 * శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 


 * శరీరానికి మంచి తేజస్సు కలుగును. 


 * సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .


  గమనిక -  


         పైన చెప్పిన విధానం మీరు చేసుకోలేనిచో చేసి ఇవ్వబడును . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

సత్యం.

 నగ్న సత్యం. 


*ఆకులు తింటేనే* 

*బ్రహ్మజ్ఞానం వస్తే*

*అందరి కన్నా* 

*ముందు మేకలే* 

  *జ్ఞానులు*

   *కావాలి,*⤵️


*స్నానాలతోనే* 

*పాపాలు పోతే* 

    *ముందు*

*చేపలే పాప* 

*విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా ,*

 *తపస్సు చేస్తేనే*

     *పరమాత్మ* 

   *ప్రత్యక్షమైతే*

    *ముందు*

   *గబ్బిలాలకే* 

 *ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా,*

 *ఆత్మలో ఉంది*

*నీలో ఉన్న,*

 *ఆత్మను వదిలి,*

 *పరమాత్మ అంటూ*

*పరుగులు పెడితే*

*ప్రయోజనమే లేదు*👇,


👉 *నీలో లేనిది,*

 ❗ *బయటేమీ లేదు* 

 ❗ *బయటఉన్నదంతా* 

 ❗ *నీలోనూ ఉంది*👈


*❕తెలిసి మసులుకో* 👈

  ❕ *కలిసి జీవించు.....*.       


మానస సరోవరం 🙏

తక్కువగా చూడకూడదు

 సోషల్ రూల్స్...

నిజంగా...ఎవరైనా...పాటిస్తున్నారా...


 1. ఏవరికైన  రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం. (కోంతమంది ఫోను ఏత్తేవరకూ   

     మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోనులు చేస్తూనే 

     ఉంటారు)


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ 

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. 

      అవి వారి సమస్యలు. 

      మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. 

      అమ్మాయి,అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిపట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా/సరదాగా 

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ 

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. 

       కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!!


చివరిది , అతి ముఖ్యమైనది 


15.  ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే , 

        వీడేంటి ఉచిత సలహాలు ఇస్తున్నాడు 

        వీడికి  పనిపాటా లేదా అనుకోవడం కాకుండా,           

        వారికి కాస్త సమయం కేటాయించి వారు చెప్పేది 

        విని , నచ్చితే పాటించడం నచ్చకపోతే        

        వదిలెయ్యడం


అంతేకానీ వారిని తక్కువగా చూడకూడదు 

వారు ఎవరైనా సరే పేద్దవారైనా, చిన్నవారైనా...  .


సేకరించిన పోస్టు.