15, డిసెంబర్ 2024, ఆదివారం

అనంతమైన అజ్ఞానం

 🚩🛕🛕🛕🛕🛕🛕🛕🛕🚩


 *అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!*🙏👇

 *ఇది మన అనంతమైన అజ్ఞానం!*🙏

 

1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*

👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*


2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*

👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*


3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*

👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*


4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*

👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*


5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*


6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*


7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 శుభ్రంగా, స్వచ్ఛంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  

తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*


8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*


9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం


10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం


11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*


12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.


13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 

మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*


14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*

 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*


🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*


జై సనాతన ధర్మ✊

భారతీయ సంస్కృతిని రక్షిద్దాం.

భారతీయ ఆచార సంప్రదాయాలను  అనుసరించుదాం.


🚩🚩🇮🇳💐

Panchang


 

శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం

 🚩 💥 ఓం నమో గురుదేవ దత్తాయ నమః 💥 🚩

🚩 శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం 🔱🔱🔱...☘️☘️☘️


💁 మూడు శిరస్సులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు

💁 నాలుగు కుక్కలు - నాలుగు వేదములు


💁 ఆవు - మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


💁 మాల - అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు, సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


💁 త్రిశూలము - ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


💁 చక్రము - అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


💁 డమరుకం - సర్వవేదములు దీని నుంచి ప్రాదుర్భవించినవి.


💁 కమండలము - సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.


 ఓం నమో దత్తాత్రేయాయ నమః 🔱🔱🔱


దత్తాత్రేయ 

దత్తజయంతి 

దత్తపూర్ణిమ 

గురుదేవదత్త 

దత్తగురుదేవ దత్తాత్రేయజయంతి



           ధర్మో రక్షతి రక్షితః

కురుపురము

 #కురుపురము ( దత్త జయంతి సందర్భంగా)                


కురుపురం, కురువాపురం, కురుంగడ్డ మొదలైన పేర్లతో పిలువబడే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో వుంది. 


హైదరాబాద్ నుంచి మంత్రాలయం , కాని రాయచూర్ వెళ్ళే బస్సులో మెహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్ళాలి. 


ఆతరువాత అనుగొండ వెళ్ళే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గరలోనే కురుపురం చేరుకోవచ్చు. 

కర్ణాటక రాష్ట్రం లోని రాయ్ చూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్ళచ్చు. 

ఇటైనా, అటైనా కృష్ణానది దాటాలి. -


కురుపురం ఒక ద్వీపంలో వుంది. 

చుట్టూ కృష్ణానది. 

ఆనది దాటితే ఆలయం. 

శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. 

ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లితండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. 


ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమ లెన్నిటినో చూపారు. 

ఇప్పటికీ ఇక్కడే సుక్ష్మరూపులై ఉంటారని భక్తుల నమ్మకం. 


ఆశ్వీయుజ..మాస..కృష్ణద్వాదశి..హస్తా నక్షత్రం..రోజున కృష్ణానదిలో వారు అంతర్దానమయ్యారు. 

శ్రీగురుచరిత్ర, 


శ్రీవల్లభుల చరిత్ర, 

శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చరిత్ర, 

మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివే వారికి ఈ క్షేత్రం గురించి బాగా తెలుస్తుంది. 

ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటు వేపు సూర్యనమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని తెలుస్తోంది. 

అటు కర్నాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తోంది. 

అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. :


శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం వున్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం వుంది. 

అదే కురుపురం (కురువాపురం). శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురాన్ని బుట్టీల (పుట్టీలు) ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు.

ఇది చాలా మహిమగల శ్రేత్రం. 

వెయ్యి సంవత్సరాల పైనే వయసు వున్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రివల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి వుంది. 

దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దాని పైన వున్న శివాలయం దర్శించుకోవచ్చు. 

కురు మహరాజుకు ఙ్ఞానోపదేశం అయిన ప్రాంతం కాబట్టి కురువపురమనే పేరు వచ్చింది. 


కురువపురం ఆలయంలో ప్రతిరోజూ అభిషేకం, పల్లకీసేవ జరుగుతాయి. 

శ్రీపాదశ్రీవల్లభుల జయంతి, దత్తజయంతి, వంటి ఉత్సవాలు జరుగుతాయి. 

అలాగే కృష్ణానదిలో అంతర్థానమైన శ్రీపాదవల్లభుల గుప్తదినం (ఆశ్వీయుజ బహుళ ద్వాదశి), 

గురుద్వాదశి, (మాఘ బహుళ పాడ్యమి) శ్రీనృసింహ సరస్వతి గుప్తదినాలు కూడా ఉత్సవాలు జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపురం లో విశేష పూజలు జరుగుతాయి. 

ఆ రోజు భక్తుల కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. 


ఇక్కడ చూడవలసిన ఆలయాలు:💐

పంచదేవపహాడ్ ఇవి కృష్ణా నది కి ఇవతలే వున్నాయి. 

ఈ ఆలయం పంచదేవ్ పహాడ్ గ్రామంలో మఖ్తల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లాలో వుంది. 

ఇది తెలంగాణా ప్రాంతంలోకి వస్తుంది. 

కృష్ణానదిలో ఇక్కడి నుంచే కురుపురం చేరాలి. 

ఈ ప్రాంతంలో ఐదుగురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతం ఇది. 

పాండురంగస్వామి, 

శ్రీలక్ష్మీనరసింహస్వామి, 

ఆంజనేయస్వామి, 

రాఘవేంద్రస్వామి, 

విఘ్నేశ్వరుడు. 

ఇంకా అనఘ దత్త దేవాలయం, 

ఒకే చోట వున్నాయి.


శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయస్వామి మహాసంస్థానపీఠము:💐

ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. 

శ్రీపాద శ్రీ వల్లభుల దర్బార్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిగే ప్రాంతం ఉంది. 

ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు.. చేసుకునేటప్పడు తన కమండలం ఆన్చిన రాయి (త్రిశూలం) కూడా వుంది. 


ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 

కురుపురంలోను , రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. 

ఉచిత రూములు వున్నాయి. 

ఇవి పురాతన ఆలయాలైనా మళ్ళీ కొత్తగా రంగులు వేసి వాతావరణం పరిశుభ్రంగా వుంచుతూ ఆధునీకరించారు. 


పంచదేవతాపహాడ్ దగ్గరలో లార్డ్ దత్తాత్రేయ స్పిరిచ్యువల్ సొసైటీ, శ్రీ పాద దత్తసాయి సొసైటీవారి అధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. 

అన్ని వసతులు, ఆధునిక కట్టడాలతో రూములు లక్ష్యమవుతున్నాయి. చాలా మటుకు పూర్తి అయింది. 

ఈ ఛాయ ఆశ్ర్రమంలో విశ్వ కుండలిని జాగరణకై నిత్యాన్నదాన శాంతి మహా యఙ్ఞాలు, గోశాల పరిరక్షణ, 

ప్రతి రోజూ దత్త యఙ్ఞం,

గాయత్రీ యఙ్ఞం, అనఘా వ్రతం, గో పూజలు 

నిర్వహిస్తుంటారు. 

కొంచం ముందుగా వారికి ఫోన్ చేసి రూముల గురించి అడిగి బయలు దేరవచ్చు. 

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తక్కువ.

 ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళటం మంచిది.

కాని ఈ ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. భక్తులు కూడా ఎక్కువగానే వస్తున్నారు.


🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హెమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  - పూర్ణిమ - మృగశిర -‌‌ భాను వాసరే* (15.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

గొప్పలు చెప్పినంత

 ఉ.గొప్పలు చెప్పినంత గుణ కోవిదులంచు జనమ్ము మెచ్చరే

తప్పు లొనర్పకుండ పటు ధార్మిక వృత్తి చరింప నిష్ఠతో

నొప్పగ, సజ్జనాత్ముడని ఉత్తమ కీర్తి వహింప,గొప్ప పే

రొప్పును లోకమందున మహోత్తమ కీర్తి పథమ్ము దక్కినన్౹౹ 75


ఉ.కుప్పలుగా నదే పనిగ కూర్మి హితమ్ముల చెప్పనేమి ఆ

చెప్పెడు నీతి శాస్త్రములు చేతలలో కనిపింపఁ జేయగా

నెప్పటికిన్ ఫలమ్మిడు మహిన్ వినుతింప జనమ్ము మెచ్చగా

నొప్పు మహాత్ములై వెలుగ నుత్తమ జీవన మందగాఁ దగున్౹౹ 76

జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు

 జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు


అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు


టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి


తిరుమల, 2024 డిసెంబరు 14: శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.


ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.


భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.


వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు


•⁠ ⁠దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.


•⁠ ⁠చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు.


•⁠ ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు.


•⁠ ⁠భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.


•⁠ ⁠గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.


•⁠ ⁠భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.


•⁠ ⁠మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించబడరు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.


•⁠ ⁠3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది.


టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.