8, అక్టోబర్ 2026, గురువారం

*ॐ ఆరు సుఖాలు*

  *ॐ ఆరు సుఖాలు*


*అర్థాగమో నిత్య మరోగితా చ* 

*ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ I* 

*వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా* 

*షడ్జీవ లోకస్య సుఖాని రాజన్ ॥*

                *- విదురనీతి*


*1.సంపదలు ఆగమ రూపంగా వస్తూ ఉండాలి. అవి ఉన్నదాన్ని నాశనం చేసి రాకూడదు.*

*2.వాటిని అనుభవించడానికి మనం నిత్యమూ ఆరోగ్యంగా ఉండాలి.* 

   *రోగిష్ఠి వారికి సంపదలున్నా అనుభవించే యోగ్యత ఉండదు.* 

*3.మనకు నచ్చిన ప్రియురాలైన భార్య ఉండాలి.*

    *ప్రియురాలు అంటే పరలోక సుఖాన్ని అందించేది అని అర్థం.* 

    *అందఱు భార్యలూ ప్రియురాండ్రు కాలేరు*. 

    *ఇది ఈ లోకంలో భర్తచేసే ధార్మిక కార్యక్రమాలన్నిటికీ భార్యగా సహకరించడం వలన, వాటి ధర్మఫలం భర్తకి లభిస్తుంది.* 

    *(భర్తకు లభించే పుణ్యంలో సగం భార్యకి చెందుతుంది)*

*4.ఆమె ఎప్పుడూ భర్తకి ఇష్టమైన విధంగా పలికే హృదయజ్ఞురాలైనది కావాలి. అప్పుడే అర్థాంగి (better half) అవుతుంది.*

    *(కుమ్మరి పురుగులా, కందిరీగలా అస్తమానూ దొలిచేదీ, గొణిగేదీ కాకూడదు*

        *- ధూళిపాల వారి వ్యాఖ్య).*

*5.తన మాట విని, తనకు అనుకూలంగా నడుచుకునే వశ్యుడైన పుత్రుడు మరొక గొప్ప సౌఖ్యం.*

    *మన సంపదకు ముఖ్య వారసుడూ, అనుభోక్తా, ఆహ్లాద కారుడూ అయిన కుమారుడు కలిగి ఉంటే, అది ఉన్నతమైన సంపద.*

*6.విద్యావంతులమై, ఆ విద్య మనకు ప్రయోజనకారి ఐనప్పుడు అది అసలైన సంపద. అది సౌఖ్యకారిణి అవుతుంది.*

   *ఎంతటి వేదశాస్త్ర పండితుడైనా, మునిగిపోతున్న నావనుండి ఉరికి ఈతతో రక్షించుకో గలిగినప్పుడే ప్రయోజనం. మన జీవనాన్ని సురక్షితం చెయ్యాలి విద్య.*


    *మనకు ఎన్ని సంపదలున్నా, మన పనులు మనమే చేసుకోవలసివస్తే, అది సంపదలోకి లెఖ్ఖరాదు. దాసదాసీ జనులవల్ల మన సంపద అనుభవంలోకి వస్తుంది.*

    *కొన్ని దేశాలలో ఈ విధానం లేక, వాటిననుసరించే మన దేశంలోనూ అది ప్రవేశించింది. తద్వారా ఇతరుల ఉపాధికి గండిపడుతోంది.*


                   *=x=x=x=*


  *— రామాయణం శర్మ*

           *భద్రాచలం*

కుటుంబ వ్యవస్థ

  🪷Enlightenment Story🪷

🍁🦚🍁 🦚

*🤝కుటుంబ వ్యవస్థ*🤝


ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో... అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది...!!


అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతికుటుంబంలో పెద్దలు ఉండేవారు...!!ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు...!!


అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా ఉన్నదాంట్లో పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు...!!


అమ్మమ్మ - తాతయ్య

నానమ్మ - తాతయ్య

పెద్దనాన్న - పెద్దమ్మ

చిన్నాన్న - చిన్నమ్మ

అత్త - మామ

అక్క - బావ

మరదలు - తమ్ముడు

వదిన - అన్నయ్య

చెల్లి - బావ గారు

మేనమామ - మేనత్త

మేనకోడలు - మేనల్లుడు

అని ఓ బంధాల అల్లికలు ఉండేవి...!!


పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది...

పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి...!!


కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ

ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు...అల్లుడికి తగిన మర్యాద

కోడలికి తగిన బాధ్యత, ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది...!!


ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం...అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది...!!


అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి...!!ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు...!!


ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు...ఇంటికి మనవారు ఎవరైనా ప్రేమతో వచ్చిన వారికి లెక్క చేయకుండా, ఒంటరిగా వారే మిగిలిపోతున్నారు ...కాలం వెళ్లదీస్తున్నారు...!!



కానీ...డబ్బు కోసం పరుగులు తీసే భర్త,

బాధ్యతలు మరిచిపోయిన భార్య, తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు


బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు

దుమ్మెత్తి పొసే బంధువులు, సెల్ ఫోన్ లో పలకరించే దిక్కుమాలిన బతుకులు


ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, చెప్పినా అర్ధం చేసుకొని వినేవారు లేరు...!!భయం లేదు

భక్తి లేదు, ప్రేమ ఒక నాటకం, అభిమానం ఒక భూటకం


నవ్వునీ నటిస్తూ బ్రతుకుతున్నారు...

అవసరంలేని బంధాలని పట్టుకుని,

అవసరమైన బంధాలని విడిచి,

బంధీలుగా బ్రతుకుతున్నారు...!!



బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి,

మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం...!


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకాస్సమస్తాః సుఖినోభవంతు*

*సమస్త సన్మంగళాని భవంతు*

 *శుభం భూయాత్*

 *శుభమస్తు*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

పంచాంగం 08.10.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 08.10.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష త్రయోదశి తిథి బృహస్పతి వాసర పూర్వఫల్గుని నక్షత్రం శుక్ల యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : త్రయోదశి.


 

నమస్కారః , శుభోదయం

హనుమాన్ బాహుక్*🙏

  *🪷సౌమ్యవారం 7 అక్టోబరు 2026🪷*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

           *🌷ఇరవై ఆరవ రోజు🌷*


భాలకీ కి కాలకీ కి రోషకీ త్రిదోషకీ హై 

బేదన బిషమ పాప తాప ఛలఛాఁహకీı 

కరమన కూటకీ కి జంత్రమంత్ర బూటకీ, 

పరాహి జాహి పాపినీ మలీన మనమాఁహకీ ॥ 

పైహమి సజాయ, నత కహత బజాయ తోహి, 

బావరీ న హోహి బాని జాని కపినాఁహకీ I 

ఆన హనుమానకీ దోహ ఈ బలవానకీ, 

సపథ మహాబీరకీ జో రహై పీర బాఁహకీ ॥


                    **వివరణ**


ఈ కఠోర పీడ నా నొసట వ్రాసిన వ్రాతయా? లేక కాలపరిణామమా? క్రోధము లేదా త్రిదోషపరిణామమా? అథవా నా భయంకర పాపముల పరిణామమా? దుఃఖము, మోసముల ఛాయయా? ఇది మారణాది ప్రయోగమా? లేక యంత్రమంత్ర రూప వృక్షమునకు ఫలమా? శత్రు మనఃకల్మషపు పూతనా! తొలగిపోలేదా? నేను ఢంకా కొట్టి చెప్తాను. నీవు ఆ కపిరాజు శక్తి స్వభావములు తెలిసికొని పిచ్చిదానివి కాక. నా ఈ బాహుపీడ తొలగకున్నచో మహావీరుడు, బలవంతుడు అగు హనుమంతునిపై ఒట్టు పెట్టెదను. అప్పుడు ఆతడు ఊరక ఉండజాలడు. భరింపరాని బాహుపీడ తులసీదాసును బహుభంగుల ఆలోచింపజేయుచున్నది.


      **ప్రతి పాదానికి అర్థం**


**1. భాలకీ కి కాలకీ కి రోషకీ త్రిదోషకీ హై, 

బేదన బిషమ పాప తాప ఛలఛాఁహకీı**


 **అర్థం:** నా శరీరంలో ఉన్న ఈ భయంకరమైన వేదన (నొప్పి)... లలాట లిఖితం (నుదుటి రాత) వల్ల వచ్చినదా? కాలం తెచ్చినదా? గ్రహాల కోపం వల్ల కలిగినదా? లేదా వాత, పిత్త, కఫాలనే 'త్రిదోషాల' అసమతుల్యత వల్ల ఏర్పడినదా? ఇది ఏదైనా పాపపు వేదనా? లేక ఏవైనా దుష్ట శక్తులు, మంత్ర తంత్రాల వంటి ఛాయల (ఛలఛాఁహ) వల్ల వచ్చినదా?


**2. కరమన కూటకీ కి జంత్రమంత్ర బూటకీ, 

పరాహి జాహి పాపినీ మలీన మనమాఁహకీ ॥**


 **అర్థం:** ఇది నా పూర్వ కర్మల మోసం (కూటకీ) వల్లనా? లేక ఎవరైనా చేసిన తంత్ర-మంత్రాల కపటం వలనా? ఓ పాపిష్టి, మలినమైన మనసు కలిగిన రోగమా/పీడా! నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెంటనే పారిపో (పరాహి జాహి).


**3. పైహమి సజాయ, నత కహత బజాయ తోహి, 

బావరీ న హోహి బాని జాని కపినాఁహకీ I**


**అర్థం:** నేను నీకు ముందే డప్పు కొట్టి మరీ (బాహాటంగా) హెచ్చరిస్తున్నాను, వినకపోతే నువ్వు కఠినమైన శిక్షను అనుభవిస్తావు (పైహమి సజాయ). పిచ్చిదానిలా (బావరీ) ప్రవర్తించకు. వానర రాజు, నా ప్రభువు అయిన హనుమంతుని యొక్క వాక్కు (ఆజ్ఞ) ఎలాంటిదో తెలుసుకో.


**4. ఆన హనుమానకీ దోహ ఈ బలవానకీ, 

సపథ మహాబీరకీ జో రహై పీర బాఁహకీ ॥**


**అర్థం:** నీకు ఆ పరమ బలవంతుడైన హనుమంతుని ఆజ్ఞ ఉంది. ఆ మహావీరుని రక్షణ ఉంది. ఒకవేళ ఈ బాహువు (చేతి) లో ఇంకా ఏమాత్రం నొప్పి (పీర) మిగిలి ఉన్నా... అది ఆ మహావీరుడైన ఆంజనేయుని శపథం (సపథ) పై ఒట్టు! (అంటే హనుమంతుని శపథం తోడుగా ఈ రోగం ఇక్కడ నిలువలేదు, నిలువకూడదు).


                 **సారాంశం**


ఈ శ్లోకం లో తులసీదాస్ గారు తన చేతి నొప్పికి కారణం ఏదైనా కావచ్చు—అది నుదుటి రాత కావచ్చు, శారీరక త్రిదోషాలు కావచ్చు, లేదా ఎవరైనా చేసిన మంత్ర తంత్రాలు, దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు—వాటన్నింటినీ "పాపిష్టి పీడ" గా సంబోధిస్తూ హెచ్చరిస్తున్నారు.


ఆయన రోగాన్ని హెచ్చరిస్తూ—"ఓ పిచ్చి రోగమా! నువ్వు నా శరీరాన్ని వదిలి పారిపో. లేదంటే నువ్వు శిక్షకు గురవుతావు. నా ప్రభువు, వానర రాజైన హనుమంతుని శక్తి మరియు వాక్కు ఎలాంటిదో నీకు తెలియదు. నా చేతిలో ఉన్న ఈ నొప్పిని హరింపజేయడానికి ఆ మహాబలవంతుడైన హనుమంతుని ఆజ్ఞ మరియు శపథం ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ నిలువలేవు" అని పూర్తి ఆత్మవిశ్వాసంతో, భక్తితో హనుమంతుని శరణు వేడారు. ఇలాంటి దైర్యం, నమ్మకం భక్తునికి ఉండాలి కష్టాలు వచ్చినపుడు అని అర్థం 


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🪷సేకరణ🪷*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

08-10-2026 గురువారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

08-10-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.     

--------------------------------------- 


వృషభం


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.   

---------------------------------------


మిధునం


వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.       

---------------------------------------


కర్కాటకం


దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.   

---------------------------------------


కన్య


మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.   

---------------------------------------


తుల


దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.    

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో అధిక శ్రమతో ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.      

---------------------------------------


ధనస్సు


ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.         

---------------------------------------


మకరం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.        

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.           

---------------------------------------


మీనం

 

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.     

---------------------------------------

08అక్టోబరు26🌷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 🌹బృహస్పతివారం🌹       

 *🌷08అక్టోబరు26🌷*  

 *దృగ్గణిత పంచాంగం*       

                

       *ఈనాటి పర్వం*

  🕉️*మాస శివరాత్రి🕉️* 

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష రుతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం*


*తిథి : త్రయోదశి* రా 10.15 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం  : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పుబ్బ* రా 09.20 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : శుక్ల* రా 12.58 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : గరజి* ప 10.43 *వణజి* రా 10.15 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ11.00-12.00 సా03.30-05.30*

అమృత కాలం  :*మ 03.01 - 04.36*

అభిజిత్ కాలం  : *ప 11.31 - 12.19*

*వర్జ్యం  : శేషం ఉ 07.08 వరకు & రా.తె 04.32 - 06.08*

*దుర్ముహూర్తం  : ఉ 09.56 - 10.44 మ 02.41 - 03.29*

*రాహు కాలం  : మ 01.24- 02.53*

గుళికకాళం      : *ఉ 08.57 - 10.26*

యమగండం    :*ఉ 05.58 - 07.28*

సూర్యరాశి : *కన్య                          

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.08* 

సూర్యాస్తమయం :*సా 06.00*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు;*

ప్రాతః కాలం    :*ఉ 05.58 - 08.21*

సంగవ కాలం   :*08.21 - 10.44*

మధ్యాహ్న కాలం    : *10.44 - 01.06*

అపరాహ్న కాలం : *మ 01.06-03.29*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ త్రయోదశి*

సాయంకాలం    : *సా 03.29 -05.52*

ప్రదోష కాలం      : *సా 05.51 - 08.17*

రాత్రి కాలం        : *రా 08.17 - 11.31*

నిశీధి కాలం       : *రా 11.31 - 12.19*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.10*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

       *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మహనీయుని మాట*🍁

 *శుభ గురువారం 🪷Happy Thursday 

-------------------

🍁*మహనీయుని మాట*🍁

        -------------------------

"లక్ష్యం ఉన్నపుడు శరీరం

సహకరిస్తుంది.

స్వార్థం లేనపుడు మనసు శాంతిస్తుంది.

సేవ చేసినపుడు ఆత్మ వికసిస్తుంది."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"దేనినైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు.

 అది విలువైన బంధాలను దూరం చేస్తుంది."