25, ఫిబ్రవరి 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 ఫిబ్రవరి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*               

                   *8వ భాగం*    


     *భూగోళ ఆవిర్భావం*


 బ్రహ్మోపదేశం - చతుర్వేద సంపుటి 

```

శ్రీ మహావిష్ణువు మధుకైటభుల విన్నపం మన్నించి వారికి సదా చరితార్థులై బ్రహ్మాండంలో ఉంటారు అని వరమిచ్చి,  తన ఊరువులపైకి తీసుకుని చక్రంతో శిరస్సులు ఖండించాడు. 


శిరస్సులు తెగిన మధుకైటభుల మొండాల నుండి రక్తం పొంగి ప్రవహించింది. కొంతసేపటి తరువాత ఖండించబడిన ఇరువురి శిరస్సుల నుండి నల్లని పదార్ధం వెలువడి నీటిలోకి పొంగి ప్రవహించి ఒక్కటై గుండ్రటి పదార్థంగా మారసాగింది.


విష్ణువు వెంటనే తన ఊరువుల పరిమాణము కుదించి మాములుగా చేసాడు. ముధు కైటభుల మేధస్సు నల్లని పదార్ధముగా  ఒక్కటై బంతి ఆకృతిలో గుండటి ముద్దగా మారింది. నారాయణుని వక్షస్సులో నివసిస్తున్న లక్ష్మీదేవి చూసి "నాథా! ఏమిటీ నల్లని గోళ పదార్థము? ఎందుకు మధు కైటభుల శిరస్సుల నుండి ప్రవహించి నల్లని గోళంగా మారింది" అని విస్మయంగా అడిగింది.


విష్ణువు "లక్ష్మీ! మధు కైటభుల మేధస్సు అది. నారాయణ నామ స్మరణతో పవిత్రమై "మేధిని" గా మారి భూగ్రహం అవుతుంది. పద్నాలుగు లోకాలకు మూలమైన భూలోకంగా మారి నవగ్రహాలలో ఒకటవుతోంది. 

నా జగత్ సృష్టికి,  జగత్ లీలలకు ఈ భూమి మూలం కాబోతుంది. ముల్లోకాలకు పుణ్యభూమిగా, కర్మ భూమిగా ఈ భూగ్రహము తయారవుతుంది" అని పలికాడు.


లక్ష్మీదేవి ఆశ్చర్యపడి "మధుకైటభుల మేధతో ఏర్పడిన నల్లటి మట్టిముద్దకు ఇంతటి గౌరవం, ఆదరం లభిస్తోందా!" అని ప్రశ్నించింది.  


నారాయణుడు నవ్వుతూ "లక్ష్మీ! ఇది సాధారణ మట్టి ముద్ద కాదు. మహామాయ నన్ను ఆవహించినప్పుడు, నా స్పర్శతో ఋతు స్నాత అయ్యింది. ఆ మలినమే నా సంకల్పంతో మధు కైట భులుగా మారారు. వారు మరణించాక వారి మేధ మేధినిగా మారి భూమి రూపం పొందింది.


మహామాయ మేధినిగా మారి ప్రకృతిగా అవతరించి సృష్టికి క్షేత్రము అవుతుంది. అష్టాక్షరి మహామంత్రం పుణ్య ఫలం ఈవిధంగా సృష్టికి కేంద్రం అవుతుంది. నిజానికి ఇదంతా మాయ. ఈ మహామాయ ప్రభావంతో మహాశూన్యంలో అండపిండ బ్రహ్మాండాలు,లోకాలు,లోకాధిపతులు, జీవరాశులు ఆవిర్భవిస్తాయి. 

ఇదే శాశ్వతం, సర్వస్వం అనే మాయలో సకల చరాచర ప్రాణులు ఉంటారు. జనన మరణ చక్రంలో బంధీలు అవుతారు. స్వర్గ నరక భూలోకాల మధ్య తిరుగాడుతుంటారు. 


జ్ఞానము పొంది ఇది అంతా మిధ్య, మాయ,అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను శాశత్వుడని గ్రహిస్తారు. అప్పుడు నన్ను చేరుకుని నాలో లీనమవుతారు. దీనినే మోక్షం అంటారు. పరబ్రహ్మ లీలగా నా చేత ఈ మాయా ప్రపంచం కల్పించబడుతుంది, రక్షించబడు తుంది. చివరికి లయం చెంది నాలో లీనమై పోతుంది. ఇదే నేనాడే లీలావినోద జగన్నాటకం" అనడంతో లక్ష్మీదేవి సంతృప్తురాలైంది.


మధుకైటభుల మరణంతో భయం తొలగిన బ్రహ్మదేవుడు కనపడని శ్రీమన్నారాయణునికి నమస్కరించి "తండ్రీ! నా కర్తవ్యం ఉపదేశించండి" అని అడిగాడు. 


"సృష్టి చేయి! సృష్టి చేయి!" అన్న శబ్దం వినిపించింది.  


చుట్టూపరికించిచూశాడు.అంతా నీరు, నీటి మధ్యలో ఒక మట్టి గోళం కనిపించింది. ఆ మట్టిగోళం నీటితో తడిగానే ఉంది. గట్టి పడలేదు. ఈ మృత్తికాగోళం నీటిపై ఎంత సేపు నిలబడుతుంది? మునిగిపోతుందేమో?  నేను ఏమి సృష్టించాలి? ఎక్కడ సృష్టించాలి? ఎలా సృష్టించాలి?


ఈ ప్రశ్నలకు సమాధానం బ్రహ్మదేవుడికి తట్టలేదు. మనస్సులో నారాయణుని తలచి "నీ ఆదేశం పాటించి సృష్టి ఏమి చేయాలో తెలియడం లేదు. నాకు సృష్టించడానికి శక్తి ప్రసాదించండి" అని ప్రార్థించాడు. 


ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై "చతుర్ముఖా! నీకు మొదట ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తాను" అని సంకల్పం చేశాడు.


వేదమంత్రాలు వేదబ్రహ్మ ఆదేశంతో ప్రతిధ్వనించ సాగాయి. లక్ష్మీదేవి సువర్ణ యజ్ఞోపవీతం సృష్టించి విష్ణువుకి ఇచ్చింది. బ్రహ్మ మెడలో యజ్ఞోపవీతం వేసి ఉపనయనం పూర్తి చేశాడు. విష్ణు సంకల్పంతో మహాసరస్వతి అక్కడకు వచ్చింది. బ్రహ్మకు పరిచయం చేస్తూ "ఈమె పరబ్రహ్మమైన కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. సమస్త జ్ఞాన స్వరూపిణి, జ్ఞానానికి అధిదేవత. ఈ సరస్వతి అంశరూపంగా గాయత్రీదేవి ఇక్కడ ఉద్భవిస్తుంది" అనగానే సరస్వతి నుండి అంశారూపంగా గాయత్రీదేవి ఉద్భవించింది.


“బ్రహ్మదేవా! నాలుగు ముఖాలతో నీవు పలికిన ఓంకారానికి అధిష్ఠాన దేవత ఈ గాయత్రీదేవి. సమస్త మంత్రాలకు ఈమె మూలము అవుతుంది. ఈ గాయత్రీదేవిని నియమ నిష్టలతో త్రి (మూడు) కాలములలో ఆచరిస్తే సకల శుభాలు కలుగు తాయి" అని బ్రహ్మదేవుడి కుడి చెవిలో మూడు పాదాలు, ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రీ మంత్రం ఉపదేశం చేశాడు.


బ్రహ్మదేవుడు స్వీకరించి తన నాలుగు ముఖాల ద్వారా    ఆరేసి అక్షరాల చొప్పున గాయత్రి మంత్ర జపం చేశాడు. ఫలితంగా గాయత్రీదేవి వచ్చి బ్రహ్మ వాక్కు లో స్థిర నివాసం ఏర్పర చుకుంది. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రి జప ఫలంగా వేదము నాలుగు భాగాలై బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడింది.  నాలుగు వేదాలు చతుర్వేద సంపుటిగా మారి బ్రహ్మదేవుని హస్తాన్ని అలంకరించాయి. గాయత్రీదేవి వాక్కులో స్థిర నివాసం ఉండటం, వేదాలలోని సమస్త జ్ఞానం లభించడం వలన బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము పొందాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు.

 

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*

 ``

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం

 


వివాహాల్లో రకాలు -

 వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 

 

* బ్రాహ్మము - 

     

మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.

 

 * దైవ వివాహం - 

  

  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .

 

 * ఆర్షం - 

    

ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.

 

* ప్రాజాపత్యం - 

      

 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .


 * రాక్షసం - 

     

 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .

 

 * అసురం - 

        

 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,

కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.

 

 * గాంధర్వం - 

      

 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .

 

* పైశాచికం - 

   

దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.

 

అష్టవిద నాయకలు -

 

* ప్రోషిత భర్త - 

 

    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.

 

* ఖండిత - 

 

ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 

 

 * కలహంతరత - 

   

    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.

 

 * విప్రలబ్ద -

    

ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.

  

* వాసవ సజ్జిక - 

  

భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .

  

* స్వాధీన పతిక - 

    

భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.

 

 * అభిసారిక -

  

బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.

 

 * వరిహోత్కంటిక - 

      

ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.


 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.


 వివాహం - 

 

స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .


 వివాహానికి శుభమైన వారములు. - 

 

 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.

 

వివాహానికి తిధులు - 


 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.


 వివాహానికి సరైన నక్షత్రాలు. - 

 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .


 వివాహ యోగములు - 

 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.


 వివాహ కరణములు -


 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.


 వివాహ లగ్నం -

  

వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.

 

వివాహనికి మాసములు - 


 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .

    

  

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 24 ఫిబ్రవరి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

                    *7వ భాగం*


*మధుకైటభ సంహారం:```

విష్ణమాయను ఆవాహింప చేసుకున్న శ్రీమహావిష్ణువు అనేక వేల సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్లి పోయాడు. కొన్ని వేల సంవత్సరాల నిద్ర తరువాత శ్రీమహావిష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి ఒక శబ్దం ఉత్పన్నమైంది. ఆ శబ్దం క్రమక్రమంగా ఓంకారంగా మారి ప్రణవ నాదమయ్యింది. ప్రణవనాద శబ్దానికి సృష్టికర్త, అయ్యాడు కనుక విష్ణువు "శబ్దబ్రహ్మ". అయ్యాడు. ఈ ఓంకార శబ్దం నుండి శబ్దరూప మైన వేదము ఆవిర్భవించింది. కనుక మహావిష్ణువు వేదమూల మైన "వేద బ్రహ్మ" గా ప్రసిద్ది పొందాడు.


వేదము ఉచ్ఛ్వాస నిశ్వాసగా చేసుకుని నిద్రిస్తున్న విష్ణువు నాభి నుంచి ఒక పుష్పకాండము జనించి పెరగసాగింది. ఆ కాండము పైన ఒక మొగ్గ ఏర్పడి పుష్పించి మహా పద్మము అయ్యింది. పదహారు రేకులు గల ఆ మహా పద్మము ప్రకృతికి ప్రతిరూపమైనది. యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు మాయా మోహితుడై ఉండడం వలన అతని శరీరం నుండి ఒక భ్రమరం జనించింది. తుమ్మెద రూపం దాల్చిన మహావిష్ణువు మహా పద్మము వాలి ప్రణవనాదము చేస్తూ పద్మముతో సంపర్కమయాడు. పురుషుడు ప్రకృతి సంపర్కం వలన పద్మము నుండి విష్ణు తేజస్సుతో చతుర్ముఖుడు, చతుర్భుజుడు బంగారు ఛాయ శరీరంతో పద్మసంభవుడు జన్మించాడు. ఉదరములో పుట్టుకతోనే హిరణ్యము కలిగి ఉండటం వలన హిరణ్యగర్భుడు అయ్యాడు. పరబ్రహ్మము తేజస్సు నుండి పుట్టిన పరబ్రహ్మ పుత్రుడు "బ్రహ్మ" అయ్యాడు.


జన్మించిన బ్రహ్మదేవుడు నాలుగువైపుల నాలుగు ముఖాలతో చూశాడు. అన్ని వైపుల నీరే కనిపించింది. పదహారు రేకులు గలిగి మహాపద్మములో ఆసీనుడైన బ్రహ్మ పద్మము యొక్క కాండము వైపు చూశాడు. నూరుయోజనాల వరకు దూరం కాండము కింద వైపు కలిగివుంది. "చుట్టూ జలం ఉన్నప్పుడు తను ఎలాజన్మించాడు" అనే సందేహం బ్రహ్మకు కలిగింది.

సమాధానంగా ఓంకారనాదము వినిపించ సాగింది. ఈఓంకారము జపిస్తే తన జన్మరహస్యం తెలియవచ్చు అని అనిపించి ఓంకారము జపిస్తూ ధ్యాన నిష్టలో మునిగి పోయాడు.. అనేక సంవత్సరాల జపం తరువాత బ్రహ్మదేవునికి దివ్య దృష్టి లభించింది. దివ్యదృష్టితో తన జన్మకు కారకుడైన శ్రీమహావిష్ణువు అనంత జలరాశి పై యోగనిద్రలో కనపడ్డాడు.


అశరీరవాణి శయనిస్తున్న నారాయణుడే నీ తండ్రి అని పలికింది. తన తండ్రిని చూసిన ఆనందంతో బ్రహ్మదేవుడు చేతులు జోడించి భక్తి శ్రద్థలతో నమస్కరించాడు. ఆయన ముఖం వెంట "ఓం నమో నారాయణాయ" అని అష్టాక్షరి మంత్రం పుట్టుకు వచ్చింది. వెంటనే ఆ మంత్రంతో తపస్సు చేయి" అన్నట్టు "తపః తపః" అనే ఆదేశం వినిపించింది.


హిరణ్యగర్భుడు నారాయణమంత్రం జపిస్తూ వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా తన జన్మకారణం, తనకర్తవ్యం తెలియరాలేదు. చుట్టూ మహాజలథి మాత్రమే కన్పిస్తోంది. దివ్యదృష్టితో కనిపించిన తన తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను కలసే మార్గం ఏది?" అనుకుంటూ చింతాక్రాంతుడైనాడు.


అదే సమయంలో చాలా కాలము యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు చెవులలో ఏర్పడిన గుబిలి జలప్రవాహము తాకిడి వలన చెవుల నుండి బయటకు వచ్చింది. విష్ణువుని ఆవరించిన యోగమాయ స్పర్శతో ఆ గుబిలి రూపాలు పొంది మధు కైటభులు అనే కవల రాక్షస సోదరులుగా జన్మించారు. గుబిలి మాలిన్యంతో నల్లని శరీరము పొందిన వారు "మేము ఎవరం? మా నామధేయాలు ఏమిటి?" అని గట్టిగా అరవసాగారు.


అశరీరవాణి వారితో "మీరు పరబ్రహ్మ చెవి గుబిలి నుండి జన్మించారు. మీ నామధేయాలు మధు కైటభులు. మీకు స్వేచ్ఛా మరణం వరంగా లభించింది" అని పలికింది. 

వారు అహంకారం పొంది "మమ్మలి ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా!" అంటూ సవాలు చేస్తూ నీటిలో ఈదుతూ ముందుకెళ్ళారు. వంద యోజనాల దూరం వెళ్లగా ఒక మహాపద్మం కనిపించింది. ఆ పద్మము నుండి "ఓం నమో నారాయణాయ" అని జపము చేస్తున్న శబ్దం వినిపించ సాగింది.


మధు కైటభులు కాండము పట్టుకుని పైకెక్కి బ్రహ్మ ఎదుట నిలుచున్నారు. ధ్యానభంగం కలిగిన బ్రహ్మ కన్నులు తెరచి మధుకైటభులను చూసి ఆశ్చర్యపడ్డాడు. జన్మించిన పిమ్మట తండ్రి మహావిష్ణువు తరువాత చూసినది ఈ ఇరువురు దేహధారులనే. బ్రహ్మ సంశయం తీరుస్తూ "మేము మధుకైటభులము. స్వేచ్ఛామరణం వరంగా పొందాము. నీతో యుద్దం చేసి మా బలం నిరూపించుకుంటాము. ఇంతకీ నీవెవరు?" అని అడిగారు.


బ్రహ్మ "నేను చతుర్ముఖ బ్రహ్మను. పరబ్రహ్మమైన నారాయణుడు నా తండ్రి. నా జన్మకి కారణం, నా కర్తవ్యం తెలుసుకోవాలని తపస్సు చేస్తున్నాను. కనుక మీతో యుద్దం చేయలేను" అనడంతో మధుకైటభులు "అయితే మీ తండ్రి ఎక్కడో చెప్పు! ఆయనతోనే యుద్దం చేస్తాం" అన్నారు. 


బ్రహ్మ నిట్టూర్చి "నా తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నారాయణ మంత్రం జపించడం వలన లభించిన దివ్యదృష్టితో ఒక్కసారి మాత్రమే చూడగలిగాను" అని సమాధాన మిచ్చాడు.


"అయితే మంత్రం మాకు ఉపదేశించు! మేము ఆయన దర్శనం పొంది యుద్దం చేస్తాము" అని మధుకైటభులు అనడంతో బ్రహ్మ "తాను సృష్టించిన నారాయణ మంత్రం మరొకరికి ఉపదేశం చేసి గురు స్థానం పొందుతున్నాడు" అని సంతోషపడ్డాడు.  


అష్టాక్షరి మంత్రాన్ని మధుకైటభులకు ఉపదేశించాడు. నారాయణ మంత్రం జపం చేస్తూ వేల సంవత్సరాలు గడిపారు. తాము జపించేది ముక్తి ప్రసాదించే దివ్య మంత్రం అని వారికి తెలియదు.


మంత్రసిద్ధి లభించడంతో వారు బ్రహ్మను వదలి నారాయణుడు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. నారాయణుడు నిద్ర లేచి వీరిని చూశాడు. "మేము నీతో యుద్దం చేయాలని మంత్రం జపం చేసాము. మాతో యుద్దం చేయి" అని మధుకైటభులు కోరిన కోరికకు అంగీకరించి విష్ణువు యుద్దానికే సిద్దమయ్యాడు. 


యుద్ధం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు గడిచాయి. ఎవరికీ విజయం లభించలేదు.


మహావిష్ణువు "నారాయణ మంత్రం జపంతో అజేయులైన వీరిని జయించడం సాధ్యం కాదు. ఉపాయంతోనే వీరి సంహారం చేయాలి" అని తలచి వారితో "నాతో ఇంతకాలం పోరాడిన మీ శౌర్యం నాకు నచ్చింది. మీ వీరత్వానికి మెచ్చి వరం ఇస్తాను. కోరుకోండి" అన్నాడు. మధుకైటభులకు విష్ణువు తమ శౌర్యాన్ని పొగిడేసరికే గర్వం కలిగి "మమ్మల్ని జయించ లేని నీవు వరము ఇవ్వటం మేమిటి? మేమే నీకు వరం ఇస్తాము. కోరుకో" అని అహంకారంతో పలికారు.


వెంటనే విష్ణువు "మీరు వరం ఇచ్చేది నిజమైతే, మీరిరువురు నాచేతిలో మరణించేట్టు వరము ఇవ్వండి" అని వరం కోరాడు. 


మధుకైటభులు ఉలిక్కిపడ్డారు. తమ అహంకారమే తమ చావు తెచ్చింది అని గ్రహించారు. తప్పించుకునే ఉపాయం ఆలోచించి "నారాయణా! నీవు కోరిన వరం ఇస్తున్నాము. ఆడిన మాట తప్పం. కానీ ఒక నియమము పాటించాలి. నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని నీవు సంహరించ గలవు" అన్నారు.  


సమస్తం నీటితో నిండి ఉంది కనుక విష్ణువు తమని చంపలేడు అని ధైర్యం వారిది.


విష్ణువు దుర్గాదేవిని మనస్సులో తలచుకుని "దేవీ! మధుకైటభులను సంహరించే శక్తి నాకు ప్రసాదించు!" అని అడిగాడు.  


దుర్గాదేవి వెంటనే ఆ మాయాశక్తి ప్రసాదించింది.  


విష్ణువు వెంటనే తన ఊరువులను (తొడలను) పెంచి వాటితో మొత్తం నీరు కనపడకుండా ఆక్రమించాడు. మధుకైటభులకు విష్ణువు చేతిలో తమ మరణం తప్పదని అర్థమైంది.


చక్రం ధరించిన విష్ణువు "మీరు కోరుకున్నట్లే నీటిచుక్క లేని నా ఊరువుల పై మిమ్మల్ని చక్రాయుధంతో సంహరిస్తాను" అన్నాడు. 


మధుకైటభులని అహంకార మద గర్వాలు వదలి పోయాయి. భక్తితో చేతులు జోడించి "నారాయణా! నీ అష్టాక్షరి మంత్ర జపంతో మేము ధన్యులమయ్యాము. మాకు ఇస్తామన్న వరం ఇచ్చి మమ్మల్ని చరితార్థులని చేయుము" అని కోరారు. 


తథాస్తు అని శ్రీమహావిష్ణువు వారిని తన ఊరువులపై తీసుకుని చక్రంతో సంహరించాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

25ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷25ఫిబ్రవరి2026🪷*    

  *దృగ్గణిత పంచాంగం*                  

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి      : నవమి* ‌రా 02.40 వరకు ఉపరి *దశమి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : రోహిణి* మ 01.38 వరకు ఉపరి *మృగశిర*

*యోగం  : విష్కుంబ* రా 01.28 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : బాలువ* మ 03.45 *కౌలువ* రా 02.40 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 10.38 - 12.08 & రా 03.55 - 05.25*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం            : శేషం ఉ 07.38 & సా 06.54 - 08.24*

*దుర్ముహూర్తం  :ప 11.57- 12.44*

*రాహు కాలం  :మ12.21 - 01.49*

గుళికకాళం      : *ఉ 10.52 - 12.21*

యమగండం    : *ఉ 07.56 - 09.24*

సూర్యరాశి : *కుంభం*                                

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.38*  

సూర్యాస్తమయం :*సా 06.21*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*:

ప్రాతః కాలం      :*ఉ 06.28- 08.49*

సంగవ కాలం       :*08.49 - 11.10*

మధ్యాహ్న కాలం   :*11.10 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31- 03.52*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ శుద్ధ నవమి*

సాయంకాలం   :*సా 03.52 - 06.13*

ప్రదోష కాలం      :*సా 06.13- 08.40*

రాత్రి కాలం         :*రా 08.40- 11.56*

నిశీధి కాలం       :*రా 11.56- 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.49 - 05.38*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్*


*చారువీణాధరా చారు పద్మాసనా*

*శారదా పాతుమాం లోకమాతా సదా*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

(శంకర విజయము

  ,


☘️(శంకర విజయము)🙏,


"""శ్రీ శంకర భగవత్పాదులవారు శ్రీశారదామాత అందించిన స్వాగతపూర్వక ఆశీస్సులు స్వీకరించి "" సర్వజ్ఞ పీఠం"" మీద జయ జయ ధ్వనులమధ్య విద్యభద్రాసనాన్ని అలంకరించారు.

శ్రీ శంకరాచార్యుల వారు నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలు స్థాపించారు.

1.తూర్పున "" పూరీలో "" గోవర్థన మఠం.హస్తామలకుడు ప్రధమాధితి, "" ప్రజ్ఞానం బ్రహ్మ" మహావాక్యం అనుష్టాన మంత్రం, ఋగ్వేదము.

2. దక్షిణాన """" శృంగేరి""లో శారదా మఠం. సురేశ్వరుడు ప్రధమాధిపతి, "" అహం బ్రహ్మాస్మి "" మహావాక్యం అనుష్టాన మంత్రము,యజుర్వేదము.

3.పశ్చిమాన "" ద్వారక""లో కాళికా పీఠం.పద్మపాదుడు ప్రధమాధిపతి,""తత్వమసి""మహావాక్యం అనుష్టాన మంత్రము, సామవేదము.

4.ఉత్తరాన """" బదరి""లో శ్రీమఠం.తోటకాచార్యడు ప్రధమాధిపతి,""అయ మాత్మా బ్రహ్మ"" మహావాక్యం అనుష్టాన మంత్రము.అధర్వవేదము.

శ్రీ శంకరులు తమ అద్వైతమత సిధ్దాంతానికి ఊతముగ నాలుగు దిక్కులలో నాలుగు మహావాక్యాలను ప్రచారము గావిస్తు "" వేదమాత"" కి నీరాజనాలు అందించారు.


""" ప్రాణాయామం ప్రత్యాహారం,

    నిత్యానిత్య వివేకవిచారం,

    జాప్యసమేత సమాధివిధానం,

    కుర్వవధానం మహాదవధానం""


శ్రీ శంకరులు ముందు శ్లోకాలలో శరీరపరంగ బహిరంగ సాధనల ద్వార ఆత్మజ్ఞానాన్ని సాధించమన్న వారు ప్రస్తుతము మానసికపరమైన సాధనాలు వివరిస్తున్నారు.

అవి వరుసగా ప్రణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్యవస్తు వివేక విచారము, జపముతో కూడిన ధ్యానము, సమాధి విధానాలు ఉపయోగించుకుంటు ఈ ప్రక్రియలు అవధానము అనగా జాగురూకత తో మరియు మహావధానము అనగా మిక్కిలి జాగురూకతతో చేయమని శంకరులు తొందరపాటు లేక శ్రధ్దతో యుండమని హెచ్చరిస్తున్నారు.


హర హర మహాదేవ శంభో శంకర.

జీవితాన్ని సజావుగా

శుభ సౌమ్య వారే 🔔Happy Wednesday. 


        *_ఋతువులు మారినపుడు శరీరాన్ని, పరిస్థితులు మారినప్పుడు మనస్సుని, దృఢపరచుకోవాలి._*

       *_అప్పుడే జీవితాన్ని సజావుగా కొనసాగించగలం._*

మనస్సును నిగ్రహించటానికి

  శ్రీరామ (94)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


మనస్సును ప్రాపంచిక విషయముల మీదికి పోకుండా నిగ్రహించి, భగవంతుని మీద లగ్నం చేయటం మనం అనుకున్నంత సులభం కాదు.

మనస్సును నిగ్రహించడం చాలా కష్టం.

సన్యాసం తీసుకుని, విజన ప్రదేశాలకు వెళ్లి, కఠిన నియమాలు పాటిస్తున్నా, 

ప్రాపంచిక విషయములపైకి మనస్సు పరుగులు తీస్తూనే ఉంటుంది అంటున్నారు,

 శ్రీ భర్తృహరి మహాయోగి:


శ్లో// భిక్షాశ౽నం,తదపి నీరస మేకవారం/

శయ్యా చ భూః,పరిజనో నిజ దేహమాత్రమ్/

వస్త్రం సుజీర్ణ శతఖండమయీ చ కన్థా/

హా!హా! తథా౽పి విషయాన్న జహాతి చేతః//


(అడుక్కుని తెచ్చుకున్న భిక్షాన్నమే ఆహారం. 

అదీ నీరసం, అంటే ఏ రసము (రుచులు) లేనిది.

పరుపులు,దిండ్లూ ఏవీ లేకుండా కేవలం కటిక నేలమీదనే శయనించడం.

దాహం వేస్తే మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చే వారు కూడా లేరు. 

నా కాళ్ళు, చేతులే నాసేవకులు.

చిరిగిపోయిన గుడ్డ పీలికలతో కూర్చిన బొంతయే నేను కట్టుకున్న వస్త్రము. 

హా!హా! మనస్సును నిగ్రహించి, భగవంతుని మీద లగ్నం చెయ్యాలని కఠిన నియమములు పాటిస్తూ ఉన్న ఈ స్థితిలో కూడా,

 నా మనస్సు, భగవంతుని గురించి ఆలోచించకుండా,

వదిలేసి వచ్చిన భార్యాపిల్లలు, ఆస్తిపాస్తులు, బంధు మిత్రులు, మొదలైన విషయములపైకే పరుగులు తీస్తోంది కదా! 

ఇటువంటి ఈ మనస్సును నిగ్రహించడం ఎలా? ).


మనస్సును నిగ్రహించటానికి గొప్ప ప్రయత్నం చేసి మానవజన్మను సార్థకం చేసుకోవాలని సారాంశం.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-2-'26.


.

శమీకుడు

శమీకుడు ఒక ముని. పరీక్షిత్ మహారాజు వేటాడి అలసి జలమునకై వెదకుకొనుచు ఇతని ఆశ్రమమును చేరి జలమును ఇయ్యమని ఇతనిని అడిగెను. ఇతడు సమాధి యందుండుటచే ఆ మాటలు వినలేదు.కనులు తెరచి చూడ లేదు. రాజునకు మిక్కిలి కోపము వచ్చినది. ఆ ప్రక్కన చచ్చిపడి యున్న సర్పమును తెచ్చి ఇతని మెడలో పడవేసి చనియెను. రాజు ఇట్లు చేసెనని శమీకుని కుమారుడైన శృంగి విని తండ్రి మెడలో నుండి సర్పమును తీసివేసి ఆ సర్పమును వేసినవాడు ఏడు దినములలో సర్పహతుడగునని శపించి తండ్రి కన్నులు తెరచిన పిమ్మట అతనితో ఈ వృత్తాంతమును చెప్పెను. రాజును శపించినందులకు శమీకుడు మిక్కిలి చింతనొందెను.తమను కాపాడుచుండు భూపాలకుని శపింపరాదని చెప్పెను. కానీ శాపము మరలించుటకు సాధ్యము కాదు కావున ముందు జాగరూకతకై పరీక్షిత్తునకు శాపవృత్తాంతమును తెలుపుమని తన శిష్యు నొక్కని

పంపెను.