2, నవంబర్ 2020, సోమవారం

కిడ్నీలలో నొప్పిని

 

కిడ్నీలలో నొప్పిని 5 నిమిషాలలో హరించు సిద్ధయోగం  - 


      మూసామ్బరం అని ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో ఉంటుంది. ఇది కలబంద గుజ్జుతో తయారుచేస్తారు. కొంచం నల్లగా , బంకలా ఉంటుంది. కందిగింజ అంత మూసాంబరాన్ని ద్రాక్షా పండుని నిలువుగా చీల్చి దాంట్లో పెట్టి మింగి నీరు తాగాలి. 5 నిమిషాల్లో తీవ్రమైన కిడ్నీ నొప్పి మాయం అవుతుంది.


  గమనిక  - కిడ్నిలో రాళ్లు ఉన్నవారు ఇది కొంచం అందుబాటులో ఉంచుకోండి. ద్రాక్షపండు దొరకనప్పుడు ఎండుద్రాక్ష కూడా వాడవచ్చు. 


       ఇది నా అనుభవపూర్వకం ........




    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

: శరీరములో ముల్లుగుచ్చుకొని రానప్పుడు ప్రయోగించవలసిన సిద్ధ యోగం  - 


     శరీరము నందు యే భాగము నందైనా ముల్లు లోపలిదాకా దిగి బయటకి రాకుండా ఉన్న సమయములో ఆపరేషన్ అవసరం లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న యోగం పాటించండి. 


         ఉమ్మెత్తాకు తీసుకుని బాగుగా శుభ్రపరచి బెల్లము నందు పెట్టి తినిపించవలెను . ఎంతటి ప్రమాదకరమైన ముల్లు అయినా శరీరము నుంచి బయటకి వచ్చును. అదేవిధముగా ఉమ్మెత్త ఆకును శుభ్రపరచి ఆముదంలో వేయుంచి పసుపు కలిపి నూరి ముద్దలా చేసి కట్టినను శరీరంలోపల విరిగిన ఎముకల ముక్కలు , ముళ్లు బయటకి వచ్చును . 


             ఇది నా అనుభవపూర్వకం ........


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

చేసిన కర్మము చెడని పదార్థము..

 సేకరణ 👇


చేసిన కర్మము చెడని పదార్థము..


“అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం

కృత కర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి"


“చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా దాని ఫలం తప్పక అనుభవించి తీరాలి. చేసిన కర్మ వందకోట్ల కల్పాల కైనా (కల్పం అంటే 432కోట్ల సంవత్సరాలు) అనుభవించనిదే నశించదు " అని ఈ శ్లోకానికి భావం.


ధ్వనికి ప్రతిధ్వని, బింబానికి ప్రతిబింబం, చర్యకు ప్రతి చర్య అన్నట్టుగా మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయమనేది మన ఆధ్యాత్మిక విశ్వాసం.“శుభేన కర్మణా సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణా " (సత్కర్మల వలన సౌఖ్యం, పాప కర్మల వలన దుఃఖము కలుగుతాయి)అంటుంది శాస్త్రం. దీనితో మానవులకు పాపభీతి ఏర్పడి, చెడు పనులకు దూరంగా ఉండాలన్న ఆలోచన కలుగుతుంది. మంచి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది వ్యక్తికీ, వ్యవస్థకూ కూడా భద్రమైన మార్గం.


పురాణగాథల్లో శాపాలు, వరాలు, పూర్వజన్మ వృత్తాంతాలు, తదనంతర జన్మలు ఈ కర్మల వల్లనే సంభవించినట్లు తెలుస్తుంది.“యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వ కృతం కర్మ కర్తార మను గచ్ఛతి " ( వేల సంఖ్యలో ఉన్న ఆవుల్లో సైతం లేగదూడ తన తల్లిని ఏవిధంగా వెదకి పట్టు కుంటుందో, అలాగే గతంలో చేయబడిన కర్మలు కర్తను అనుసరిస్తూ ఉంటాయి) అనేది సత్యం.


“యాదృశంవపతే బీజం తాదృశం లభతే ఫలమ్"

(ఎట్టి బీజాన్ని నాటితే అట్టి ఫలం లభిస్తుంది),

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే"

( పూర్వజన్మలో చేసిన పాపం ప్రకృత జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది), “అక్షరద్వయమభ్యస్తం నాస్తి నాస్తీతి యత్పురా, తదిదం దేహి దేహీతి విపరీత ముప స్థితమ్"

(గతంలో నాస్తి, నాస్తి అనే రెండు అక్షరాలు నేర్చిన ఫలం ఇపుడు దేహి, దేహి అనటంగా పరిణమించింది ) మొదలైన సందేశాలు ఈ కర్మసూత్రాన్ని బలపరుస్తాయి.


నిత్యవ్యవహారంలో కూడా“చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ"అనే వాడుక ఉంది.మన కర్మ ఫలం- మనం నడిస్తే, తానూ నడిచి, మనం కూర్చుంటే తానూ కూర్చొని, మన నీడయే తానై ఉంటుందట. ఎప్పటికైనా తత్ఫలం స్వీకరించక తప్పదు. ఈ స్పృహతో మనం కర్మలను ఆచరించాలి.

Doctor's Prescription

 *How to follow a Doctor's Prescription,*

Taken so Many Years to Know these Abbreviations...???


> Rx = Treatment.

> Hx = History

> Dx = Diagnosis

> qd = Every day

> qod = Every other day

> qh = Every Hour

> SOS = If needed

> AC = Before Meals

> PC = After meals

> BID = Twice a Day

> TID = Thrice a Day

> QID = Four times a day

> OD = Once a Day

> BT = Bed Time

> BBF = Before Breakfast

> BD = Before Dinner

> Tw = Twice a week

> SQ = sub cutaneous

> IM = Intramuscular 

> ID = Intradermal

> IV = Intravenous

> QAM = (every morning)

> QPM (every night)

> Q4H = (every 4 hours)

> HS = (at bedtime)

> PRN = (as needed)

> Mg = (milligrams)

> Mcg/ug = (micrograms)

> G or Gm = (grams)

> 1TSF ( Teaspoon) = 5 ml

> 1 Tablespoonful =15ml


*Kindly Share this Useful Information With* *Everyone.*

156 ఏళ్ళ క్రితం... బందరు

 156 ఏళ్ళ క్రితం...  బందరు అంతా శవాల గుట్టలు !!

---------------------------------------------------------------------

నౌకా వ్యాపారంలో నాడు  అగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు ఆ భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు  సముద్రతీరంలో  భారీ ఇసుకమేటలు వేయడంతో నాటి నుండి బందరు నౌకాయానంకు చరమగీతం పాడినట్లైంది..ఓడల రాకపోకలు మహా కష్టమైంది..నేటికీ ఆ ఇసుకమేటలు బందరు పోర్టుకి శాపం అయిందని తద్వారా బందరు అభివృద్ధి కుంటుపడిందని చెప్పవచ్చు.

సరిగ్గా  156 సంవత్సరాల కిందటి నాటి బందరు ఉప్పెన గురించి మనలో చాలా మందికి తెలియదు. రక్తాక్షి నామ సంవత్సరం1864 నవంబర్ 1 వ తేదీన బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి ,  780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన ప్రాణ..ఆస్తి తీవ్ర నష్టం కల్గించింది .నాడు బందరు పట్టణంలో 65 వేల మంది జనాభా ఉండగా  అందులో  30 వేల మంది తమకేమి జరుగుతుందో తెలిసేలోపు  ఆ కాళరాత్రి  జలసమాధి అయ్యారు. సముద్రం తీరాన్ని దాటి, 17 మైళ్ళు ఊళ్ళపై   చొచ్చుకొచ్చి, జనావాసాలని ముంచివేసింది. నేటి కాలేఖాన్ పేట ప్రాంతంలోని  శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలోని 700 మంది ప్రజలు నివసించేవారని ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలేరని చరిత్రలో లిఖితమైంది. . ఇక చింతగుంటపాలెంలో పురుషోత్త సోమయాజి శర్మ అనే ఒకాయన సముద్ర కెరటాలకు ఎక్కడికో  కొట్టుకొనిపోయి తాటిచెట్టుపై  మొవ్వలో చిక్కుకొని తర్వాత రోజున తాడిచెట్టు దిగివచ్చి వచ్చినట్లు నాడు ప్రజలు చెప్పుకొనేవారు.   బందరులో కోటావారితుళ్ళా సెంటర్  పాత దుర్గామహల్  ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ ( డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా కొనసాగింది. దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఈ భవనానికి కొందరు నిప్పు పెట్టి తగలబెట్టారు )  లో

ఆ ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు  ఆ భవనంలో తల దాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారు.

నాటి జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు చిరస్మరణీయం.  ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు పొలిసు సిబ్బందితో కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న శవాల గుట్టలను ..పశువుల కళేబరాలను భూమిలో పూడ్చిపెట్టారు...ఎడ్మన్డ్ షార్కి తమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సముద్రంలో మునిగిచనిపోగా.. వారినందరిని  ఆ సమీపంలో ఖననం చేశారు. ( అది ప్రస్తుతం రైలుపేట ఎలిమెంటరీ పాఠశాల సమీపంలో వైస్సార్  మునిసిపల్ పార్కుగా నేడు అక్కడ ఉంది ) అలాగే పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకోని అనేక శవాలను పీక్కుతినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో చలించిపోయారు. ..ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం శవాహారంకు అలవాటుపడ్డాయట ...  నేడు ఆనందపేట సమీపంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అక్కడ సముద్రపు నీరు చర్చి గోడలు ఎనిమిది అడుగుల మేర ప్రవహించిందని నాటి తరం చెప్పుకొన్నారు.. సున్నం ఎంత వేసినప్పటికీ ఇప్పటికి అక్కడవరకు ఒక ఉప్పునీటి చార కనబడుతూనే ఉంటుందని కొందరు అంటుంటారు.

ఉప్పెన అనంతరం బందరు పరిసర ప్రాంతాలపై  సముద్రపు నీరు ప్రవహించిన  కారణంగా వ్యవసాయ భూములు చౌడు బారిపోయాయి. నూతులలో తీయని నీరు ఉప్పునీరుగా మారిపోయాయి. ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. నాడు కొందరు వ్యాపారవర్గాలు తాగునీటికోసం 17 వేల రూపాయలు విరాళంగా సేకరించి జిల్లా కలెక్టర్  థారన్ హిల్ కు అందించారు. ఆయన మరో 30 వేల రూపాయలను సమీకరించి నాటి నాగులేరు ( ఖాలేఖాన్ పేట  మంచినీటి కాలువ ) నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ పైప్ లైన్  నిర్మించారు. అప్పట్లో మొత్తం టౌన్ ప్రజానీకామ్ మొత్తం  తాగునీటి అవసరాలను తీర్చింది నాటి కోనేరు.

ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా,అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో నిమగ్నమైయ్యారంట . వీరు బస్తాల కొద్ది బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి ఆ తర్వాత పట్టణంలోనే అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో చెప్పుకొన్నారు , అయితే , చనిపోయినవారి శాపం తగిలిన కారణంగా  ఆ కుటుంబంలో మూడు తరాల వరకు  ఒక వ్యక్తికి భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగులుగా మాదిరిగా లుకలుకలాడుతూ  కనిపించేదని దాంతో కళ్ళకు గంతలు కట్టుకొని ఆహరం తీసుకొనేవారని వృద్ధతరం వారు తమ పిల్లలకు చెప్పేవారు.

ఈ ఉప్పెన అనంతరం ఎందరో బందరు ను విడిచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై భ్రమలు వదులుకొన్నారు. తమ స్థావరాలలో  ప్రాణ ఆస్తి నష్టం అధికంగా కావడంతో తమ మకాన్ని మద్రాస్ కు తరలించారు.  బందరులో ఆనాటి  విషాదం ఏ ఒక్కరు గుర్తు చేసుకోకపోవడం విచారకరం. పరాయి పాలకులైన నాటి ఉప్పెనలో మృతి చెందిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని బందరు కోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ లో ఒక భారీ స్థూపం నిర్మించారు. నేటికీ ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపం గుర్తు చేస్తూనే ఉంటుంది. కనీసం  పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి 30 వేలమంది ఆత్మలకు ఒక నివాళి ప్రకటించడమో  లేక  ఒక్క పుష్పగుచ్ఛమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం ఎంతో బాధాకరమో కదూ ?

------ అబ్బూరి సునీల్ కుమార్ రిపోర్టర్ A1న్యూస్

కాశ్మీరు ఎవరిది

 _*కాశ్మీరు ఎవరిది ?*_ 


_-{ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన చరిత్ర}-_


_ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము. "మైరా" అనే సంస్కృత పదానికి అర్థము "సరోవరము"._


_ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేశాడు. కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడి నుండే ! వీరి సంతానములో, దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు._ 


_నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’సతీసరము’ అనే అతిపెద్ద సరోవరము వుండేది. శివుడు, సతీదేవి - ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చాడు. అయితే ఆ సరోవరములో  ’జలోద్భవుడు’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానాన్ని వేధించేవాడు. అప్పుడు, కశ్యపుడు, తన కొడుకైన ’అనంత నాగుడి’తో కలసి, ఒక వరాహ ముఖము [ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేశాడు. ఈ విధముగా ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు._


_ఆ తరువాత సరోవరము నుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరించాడు. ఇలాగ  నిండుకున్న సరోవరపు ప్రక్కన ’వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మించారు. దానిని "కశ్యప మైరా" అని పిలిచేవారు. అదే కాలక్రమేణా *’కశ్యమైరా’* అనీ, *"కశ్మీర"* అనీ నామాంతరము చెందింది._ 


_ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీదేవి, గణపతితో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని "గౌరీ మార్గ" అని పిలిచేవారు. అదే నేటి *గుల్మార్గ్*._


_’నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు._ 


_పన్నెండవ శతాబ్దములో "కల్హణుడు" అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల, విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి. భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే, మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. *కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...!*_


_*ఇది ఎవరి కాశ్మీరము ?*_ 


_ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము._ 

_|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|_

_త్వామహం ప్రార్థయే నిత్యం  విద్యాదానం చ దేహి మే ||_

_ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది’ కాశ్మీర పురవాసిని’ అనే !కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ? అది ’శారదా లిపి’ > అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ... *"శారదా పీఠము"*._


_ఇదంతా ఎందుకు ? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే "శారదా దేశము" అని పిలిచేవారు. కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ..? అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరిలో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే !శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట._ 


_కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరి కొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట. దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెట్టారు. ఏమనగా, ’నా వంట నేనే చేసుకుంటాను ’ అని._ 


_ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే, కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోయారు. మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రించారు._ 


_మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి  మాట్లాడిస్తుండగా,  వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్నిలేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమిచ్చారు._ 


_తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభించాయి. ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది- -అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశించారు._ 


_వారు నిలచిన ఆ ప్రదేశము -ఒక గుట్ట -ను ఈనాటికీ శంకరాచార్య గుట్ట అనే పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన *’దాల్ ’* సరోవరము ప్రక్కనే ఉంది._ 


_*ఆనాటి శారదాపీఠము, దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు.*_ 

_[ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు]_ 

_ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది._ 


_"విశిష్టాద్వైతము" అనే సిద్ధాంతము, "నాథ ముని" ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు. మరియూ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, "శ్రీ భాష్యము" అనే మేరు గ్రంధాన్ని సృష్టించారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము. ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’కురుత్తాళ్వార్' [ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు !_

_ఇది మన కాశ్మీరు చరిత్ర !_

           _-సశేషం-_


🙏🇮🇳

దొంగలైనా వీరికి శిక్ష లేదుట

 దొంగలైనా వీరికి శిక్ష లేదుట 

(ప్రాచీన శ్లోకాల వెనుక దాగిఉన్న కథల సంపుటి)


రచయిత : డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు 

భోజరాజు తరచుగా రాత్రివేళల్లో మారువేషంలో నగర సంచారం చేసి ప్రజల పరిస్థితిని గమనిస్తూండేవాడు. ఒకనాటి రాత్రి ఆలా సంచారం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ ఇంటిలోని వారు కొన్నిరోజులుగా ఇంట్లో లేనట్టుంది. దొంగలు తాము దొంగిలించిన సొమ్మును ఊరివెలుపల ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి పంచుకుందాం అనుకుంటారు. కానీ ఈ లోపుగానే నగరంలో గస్తీ తిరుగుతున్న రక్షక భటులు చేస్తున్న నగారా ధ్వనులు వినిపించాయి. దాంతో ఆ ఇంటిలోనే కూర్చుని ఆ సొమ్మును పంచుకుందాము అని ఆ ఇద్దరు దొంగలు నిర్ణయించుకుంటారు. కానీ వారు భోజరాజుని గమనించలేదు. వారు మాట్లాడుకునేవి భోజరాజుకి వినిపించసాగాయి. 

"శకుంతా! ఎప్పుడు దొరకనంత డబ్బు ఈరోజు మనకు లభించింది కదా! నీ వాటా సొమ్ముతో ఎం చేయాలి అనుకుంటున్నావు?" అని మరాలుడు అడిగాడు. 

"మరాలా! వేదాలు నాలుగు అనే మాటను ఎప్పుడైనా విన్నావా? ఒక పుస్తకమంటూ లేక ఒక గురువు చెప్తుంటే దాన్ని అలా బుద్ధిలో పెట్టుకుని మననం చేసుకుంటూ రోజు లేచి వల్లెవేసుకుంటూ తన గురువునుండి తానూ, తన నుండి తన శిష్యునికి ... ఇలా పరంపరంగా ఆ విద్యని తెస్తూ ఆ వేద సంపదని లోకం నుండి నిష్క్రమించకుండా శ్రమిస్తున్న వేదపండితులకి ఈ ధనాన్ని పంచుదామనుకుంటున్నాను. ఇంకేదైనా పనిచేస్తే రాగల ఎక్కువ ధనాన్ని దృష్టిలోపెట్టుకోకుండా, తమ జీవితాన్ని ఆ వేదాలకే అంకితం చేసిన ఆ పండితులకు, వారు నష్టపోతున్న ధనాన్ని ఈ విధంగా ఈయడం ధర్మమే అని నా అభిప్రాయం" అన్నాడు శకుంతుడు. 

"శకుంతా! నువ్వన్నది నిజమే కావచ్చు. అయితే నువ్వు సొంతంగా ఆర్జించిన సొమ్ముని దానం చేయడం సరి ఔతుందేమో కానీ, ఇలా తస్కరించిన ద్రవ్యాన్ని ఇవ్వడం ధర్మమౌతుందా? అదీ వేదపండితులకి?" అని సందేహం వెలిబుచ్చాడు మరాలుడు. 

మరాలా!

"దానం భోగో నాశ స్థి స్రో భవంతి గతయో హి విత్తస్య!

యో న దదాతి, న భుంక్తే, తస్య తృతీయా గతి ర్భవతి!!

అంటే, ఏ వ్యక్తయినా ధనాన్ని సంపాదించవలసిందేనట, తన కుటుంబాన్ని నడుపుకోవడానికి మించి ఆర్జించవలసిందేనట. ఆ మిగిలిన ద్రవ్యాన్ని అర్హులైనవారికి దానం చేయాలట. లేదా తానే సక్రమమైన పద్దతిలో అనుభవించాలట. ఈ రెండూ చేయలేని వాని ధనానికి - ఇదిగో! ఈ విధంగానే నష్టం జరుగుతుందట."

"ఈ ఇంటివాడున్నాడే! పిల్లికి బిచ్చం పెట్టడు. ఎక్కడ అదిలిస్తే ఒక అన్నం మెతుకు నేలను పడి కాకి తినిపోతుందో అని కాకిని కూడా ఎంగిలి చేత్తో అదిలించడు. అలాగని తాను అనుభవిస్తాడా! అదీలేదు. త్రోవను పోతుంటే ఎవరైనా వీణ్ణి చూచి 'పాపం బిచ్చం వేద్దాం' అనుకునేలా కనిపిస్తాడు. అందుకే వీని ఇంటికి ముహుర్తాన్ని పెట్టి నిన్ను పిలిచాను."

ఇక "సొంతంగా ఆర్జించి దానం చేస్తే ఫలితం దక్కుతుంది కానీ ఇలా దొంగసొమ్మును దానం చేయడమా?" అన్నావె! విను ఇలాంటి నికృష్టుని ఇంట దొంగతనం చేసేది నా కోసం కాదు. వేదాన్ని ఉద్ధరిస్తున్న వేదపండితులకోసం. దురదృష్టవశాత్తు దొంగగా దొరికితే శిక్ష మాత్రం వారికి కాదు. నేననుభవించడం కోసం. ఈ అపహరించిన ద్రవ్యంలో చిల్లి గవ్వ కూడా నేను తీసుకోను" అన్నాడు శకుంతుడు. 

మరి నువ్వేం చేస్తావు అని శకుంతుడు అడుగగా మారాలుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 

"మరణం మంగళం యాత్ర దర్శనం పాపనాశనం!

కౌపీనం యాత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే?!!

 అంటే, "ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అది అశుభమే కానీ కాశీ లో మరణిస్తే అది పుణ్యప్రదం. అలాగే స్మశానాన్ని ఎక్కడైనా మనం చూస్తే అది అశుభమే కానీ మహాశ్మశానమనే పేరున్న కాశీని చూస్తే అది పాపాలని నశింపచేస్తుంది. ఎక్కడైనా గోచి ధరించిన వ్యక్తి కనిపిస్తే, మనం అతన్ని పేదవాడుగా నిరాదరణ చేస్తాంగానీ, కాశి లో గోచిపెట్టిన ఏ సిద్ద యోగి కనిపించినా అతడు పట్టు పీతాంబరాలు ధరించిన విష్ణువుతోను, అష్టైశ్వర్యాలకి అధిపతి అయినా శివుడు తోను సమానం. అలంటి కాశీ క్షేత్రాన్ని మారె క్షేత్రము పోలేదు."

"నా తల్లిదండ్రులు బాగా వృద్దులు. నేను వారిని కాశికి తీసుకుపోగలిగేంతటి స్థోమతతో లేను. మాకెఱిఁగిన ఒక కుటుంబం కాశీకి పోతోందని తెలిసింది. మా తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబాన్ని కాశీకి పంపడానికి ఈ మొత్తం ద్రవ్యాన్ని వినియోగించాలి అనుకుంటున్నాను. ఆ కుటుంబం కూడా కాశీకి వెళ్లగలిగేంతటి స్థోమతలో లేదు. అందుకే ఈ ద్రవ్యాన్ని వినియోగిస్తాను" అన్నాడు. 

ఇదంతా చాటుగా విన్న భోజుడు ఆ ఇంటి యజమాని ఎవరా అని కాసేపు ఆలోచించగా, ఇంటి పన్ను కట్టలేదని పలుమార్లు రాజదండన విధించినట్టుగా జ్ఞాపిక వచ్చింది. ఆ ఇంటి యజమాని మంచి సంపన్నుడే అయినా నిరుపేదల తిరుగుతున్నాడని గ్రహించాడు భోజుడు. ఇదంతా బుద్దితో గమనించి ధర్మకార్యాలు నిమిత్తమై దొంగతనాన్ని చేస్తున్న ఆ ఇద్దరినీ అసలు విచారించనక్కరలేదని నిర్ణయించుకుని అక్కడనుండి వెళ్ళిపోతాడు. 

సద్భుద్ది గల దొంగలుండడం విశేషం అయితే, వారి సద్భుద్ధిని గమనించి శిక్షలేకుండా చేయడం భోజరాజులోని మరొక విశేషం.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

భగవద్గీత

 *భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*


*1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.

*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.


*విస్సాప్రగడ సత్యహరి*

హిందూత్వం - వ్యక్తిత్వం 

http://www.youtube.com/c/SatyahariVissapragada

9948256662

దేహి దేహం

 దేహి దేహం 

మన మహర్షులు అత్యంత మేధస్సు కలిగిన జ్ఞానులు వారు వారి మేధాశక్తితో ఈ సృష్టి రహస్యాలు అనేక విధాలుగా తెలుసుకున్నారు. ఆ పరంపరలోనే భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు.  మనిషి మొదటినుంచి ఈ ప్రపంచాన్ని తన ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న ప్రతి విషయాన్నీ కూలంకుషంగా పరిశీలించటం మొదలు పెట్టాడు. అట్లా పరిశీలిస్తూ వెళితే క్రొత్త క్రొత్త విషయాలు తన జ్ఞానానికి అందటం జరిగింది. 

ముందుగా ఇక్కడ కనిపించేది ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకత కలిగి వున్నది. ఒకదానికి ఇంకొకటి పోలిక లేకుండా ఉంటడం గమనించాడు. ఒకే రకమైన వస్తువులలో కూడా సూక్షమ తేడాలు కనపడుతూవున్నాయి. కొన్ని తేడాలు తేలికగా తెలుసుకోవచ్చు కొన్ని కొంత సూక్ష్మ జ్ఞానంతో తెలుసుకోగలుగుతున్నాడు. 

ఈ విషయాలు ఇలానే ఎందుకు ఉండాలి. దానిని నియంత్రించే నియంత ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. యెంత ప్రయత్నంచేసి పరికించినా ఆ నియంత ఆచూకీ తెలియటం లేదు. కానీ కారణభూతుడు ఎవరో వున్నారని మాత్రం జ్యోతకం అవుతున్నది. 

మానవుడు తన తెలివితేటలతో అనేక శాస్త్రాల పరిజ్ఞానాన్ని పొందుతున్నాడు. కానీ అన్ని శాస్త్రాలు కొంతమతుకే ఉండి ఏదో ఒక దశలో అవి కొనసాగలేక పోతున్నాయి. ఉదాహరణకు భౌతిక శాస్త్రాన్ని తీసుకోండి అది ప్రతి పదార్ధం అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్సు, ప్రొటన్సు, న్యుట్రాన్సు తో అణువులు ఏర్పడ్డాయి అని చెప్పి అంతకన్నా ముందుకు పోలేక పోతున్నది. అక్కడ ఆగిన శాస్త్రం ఒక రకంగా అర్ధంతరంగానే వున్నది అని చెప్పాలి. 

న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అని చెప్పుతున్నారు. ఈ ఎలక్ట్రానులు నెగటివ్ ఛార్జి కలిగి వున్నదని, నూక్లియస్ పాజిటివ్ ఛార్జి కలిగి వున్నదని మన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఒక మూలకంలో వున్న ప్రతి పరమాణువు ఒక నిర్దిష్ట ఎలక్ర్టానులు, అదే సంఖ్యలో ప్రోటానులు ఉండటానికి కారణం ఏమిటి. అట్లా వున్నా పరమాణువుల్ని ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండటానికి కారణం ఏమిటి. ఇలాంటి ప్రశ్నలకు ఇంతవరకు జవాబు లేదు. 

ఒక వృక్ష శాస్త్రమో లేక జంతు శాస్త్రమో తీసుకున్నామనుకోండి అది ఏక కణ జీవి నుండి అభివృద్ధి చెందినదని తెలుసుకున్నారు. మరి ఆ ఏక కణ జీవి ఎలా భూమిమీదికి వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. కొన్ని ఊహా గానాల సిదంతాలు వున్నాయి కానీ వాటికి నిరూపణ ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు చేయలేక పోయాడు. 

దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి శాస్త్రం కూడా కొంత వరకు చేరుకొని ఆ తరువాత అది ఒక దగ్గర ఆగి పోతున్నది. అంటే మన శాస్త్రాలకు అంతుచిక్కని విషయం ఏదో మనకు ఉండవచ్చనే అభిప్రాయాన్ని కలుగ చేస్తున్నది. మరి ఆ అంతుచిక్కని విషయం ఏమిటీ అదే విచారణ మన మహర్షులు చేశారు. తెలియని మహర్షులకు వారు కనుగొన్న విషయాలను బోధించారు.  ఆ విధంగా తెలుసుకోబడ్డ జ్ఞానమే అతి ఉత్తమము మహోన్నతమైనది గా నేటికీ పరిగణించబడుతుంది. ఎందుకంటె మన ఋషులు బోధించిన విషయాలకు బిన్నంగా ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేక పోయాడు అంటే దాని అర్ధం ఆ జ్ఞానమే పరిపూర్ణమైనది. అందుకే దానినే బ్రహ్మ జ్ఞ్యానం అని అన్నారు. 

ప్రతి కనిపించే దాని వెనుక ఒక కనిపించని శక్తి ఉండి మనకు కనిపించే దానికి ఊతం ఇస్తున్నది. 

మన ఋషులు ఈ విషయాన్నీ రధి రాధికుడు అని వివరించారు. దానినే మనకు సాధారణంగా అర్థమైయేటట్లు మనం  రోజు చూసే  కారు డ్రైవరుగా పేర్కొంటూ మీకు వివరిస్తాను. 

కారు ఒక జఢ వస్తువు దానిని ఎప్పుడైతే స్టార్టు చేస్తామో అప్పుడు అది చెతన్యం పొంది నడవటానికి సానుకూలం అవుతుంది. కానీ దానిని ఒక నిర్దుష్ట విధానంగా నడిపితేనే అది రోడ్డుమీద సవ్యంగా నడుస్తుంది. ఆలా నడిపే వ్యక్తే డ్రైవరు. అంటే ఒక జడంగా వున్న కారుని ఒక చేతనయవంతమైన డ్రైవరు నడపటం వాళ్ళ అది చక్కగా రోడ్డు మీద నడుస్తుంది. కారు నడపటమే కాదు కారు సవ్యంగా ఉంచటం కూడా డ్రైవరు భాద్యతే. 

మన శరీరం కూడా ఒక కారు లాంటిదే డ్రైవరు ఎవరో ఒకరు మన లోపాడ వుంది ఈ శరీరాన్ని నియంత్రిస్తున్నాడు. అందుకే ఈ శరీరం సవ్యంగా సమాజంలో సామాజిక వ్యవస్థలో ఇమిడి వుంటున్నది. ఎలాగైతే డ్రైవరు సవయంగా లేకపోతె కారు ప్రమాదాలకు గురి అవుతున్నదో అదే విధంగా మనిషి తనలోని డ్రైవరు సరిగా లేకపోతె అనేక వ్యసనాలకు బానిసగా మరి ఒక చెడ్డ మనిషిగా మారుతున్నాడు. 

తెలివయిన మనిషి తనలోపల వున్న ఆ డ్రైవరు ఎవరు అని ఆలోచిస్తాడు.  ఆ డ్రైవరునే మన ఋషులు ఆత్మ అని పేర్కొన్నారు. అదే ఈ దేహంలో వున్న దేహి.






జ్యోతిర్లింగములు

 Sri Siva Maha Puranam -- 7 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శశిశేఖరుడు – జ్యోతిర్లింగములు


‘శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః’ – ఆయనను శశిశేఖరః’ అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. దూకేస్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో వుంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. దానిని పట్టుకుంటే ‘శశిశేఖరః’ అన్నమాటకున్న తాత్త్వికమయిన అర్థం తెలుస్తుంది. కాలంలో సుఖదుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే రోజూ చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీ ---- నామ సంవత్సరే --- ఆయనే ----- ఋతౌ --- మాసే ---- పక్షే --- తిథౌ --- వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే శ్రీమాన్ శ్రీమతః’ అని చెప్తారు. ఆయన తన పాదములు పట్టుకున్నవారికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతులను చేసి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్నమాటకు అసలు తాత్త్వికమయిన రహస్యం.

  సోమనాథ లింగము అన్నమాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి.

కాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు.

“సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని చదివే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రములో ఈ పన్నెండింటినీ జ్యోతిర్లింగములని పిలుస్తారు.

1.సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్; 

2.మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్;

 3. మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్; 

4. అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్; 

5. వైద్యనాథుడు – పర్లి – మహారాష్ట్ర; 

6. భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర; 

7. రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు; 

8. నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్; 

9. విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్; 

10. త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర; 

11. కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్; 

12. ఘృష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర.

జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ శివలింగమే కనపడుతుంది జ్యోతి కనపడదు. ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉన్నది. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు తెలియకుండానే మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది.

‘శశిశేఖరః’ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు – దక్ష ప్రజాపతికి 27మంది కుమార్తెలు. ఈ 27మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణనాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. చంద్రుని చరిత్రయందు ఒకదోషం ఉన్నది. ఆయన కొంచెం తొందరపడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ శాస్త్రం స్త్రీపట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒకచోట ఉన్నది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునకి పాపఫలితం ఒకదానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరచాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రిగారి వద్దకు వెళ్లి ఈ విషయమును చాలా బాధపతుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో కుంగింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడయిన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకు వచ్చి కూర్చోపెట్టాడు. దక్షుడు చంద్రునితో ‘నీకు నేను నా 27మంది కుమార్తెలను యిచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చావు. నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో’ అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటానని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పులేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్షప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి నీ విశ్రుంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానీయదని ఆయన ఉద్దేశ్యం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడి పోయారు.

చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయ వ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు. ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు, ప్రజలు మాడిపోయారు. ఇది అన్ని లోకముల సమస్య అయింది. అందరూ తమలో తాము చర్చించుకుని అత్రిమహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మగారు –

“నేను లోక్ష సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇపుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉన్నది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపము మృత్యుంజయమంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణవాక్కునూ, అటు చంద్రుడినీ చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకరికి సాధ్యం కాదు. శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్లి పార్థివలింగమునకు అర్చన చేయమనండి’ అని చెప్పాడు.

వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్లి పంచాక్షరీ మంత్రమును, మృత్యుంజయ మహామంత్రముతో అనుసంథానం చేశాడు. ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే – ‘శివా శరవ్యాయా తవ త యా నో రుద్రా మృడయ’ – రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిన తర్వాత భగవానుడు శంకరుడు పార్వతీ సహితుడై ప్రత్యక్షమై ‘ఏమిటి నీ అభీష్టము?’ అని అడిగాడు. చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. అలా అన్నట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి. తప్పు చేసిన వాడయినా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చాద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టే ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో ‘నీకు క్షయ ఉంటుంది. కానీ నీవు పదిహేను రోజులు క్షీణిస్తావు, పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. ఎప్పుడూ హాయిగా ఉంటావు. ఇపుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింప బడినవాడివని తెలుసుకోవడానికి నాతో కలిపి నీ దర్శనం చేయించడానికి నాపేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను’ అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇదీ ఆయన కారుణ్యం అంటే.

   ఇంత కారుణ్య మూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని ‘శశిశేఖరః’ అని పిలువవలసి వచ్చింది. చంద్రుని క్షయ వ్యాధి పోయింది. చాంద్రమానం వచ్చింది. ఈ చంద్రుడు పార్వతీ దేవికి గొప్పభక్తుడు అయ్యాడు.  

మనుః చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః

అగస్తి రగ్ని సూర్యశ్చ ఇంద్రః స్కందశ్శివస్తదా

క్రోధభట్టారకో దేవ్యాః ద్వాదశామీ ఉపాసకా!! (సౌభాగ్య భాస్కర భాష్యం)

సూర్యుడు, స్కందుడు – అని పన్నెండుమంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.

Hindu brother

 निःशुल्क


If any Hindu brother wants to teach his son in Bhopal Gurukul, then there will be an interview at Acharya Panigrahi Chaturved Sanskrit Ved School, Bhopal, Madhya Pradesh from 15 March to 30 April 2021. 


Child should pass Class 6. Living in Gurukul, food and other amenities will be free. And 1000 rupees per month scholarship will also be given. 


The child will be taught all four Vedas, grammar, literature, English, etc. modern subjects. And a Veda specialist will be made. Acharya (M.A.) will also be directed to study. Put this message in all your Hindu groups.


Get in touch immediately!


Acharya Avnish Trivedi 9630966969


Acharya Dinesh Panigrahi 9425371542


This message is of use only for Hindu brothers. So send it to ′every Hindu.


🙏🏻💐🙏🏻 


Hail Lord Rama 


🚩🚩🚩🚩🚩

కనపడుట లేదు

 🌸           *కనపడుట లేదు*           🌸


*మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.*


ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.


ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.


✔️ మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.


✔️ చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.


✔️ రెండు చేతులకూ గోరింటతో *(మెహెంది కాదు),* పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.


✔️ మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.


✔️ తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.


✔️ తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.


✔️ చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి *ఎఱ్ఱటి కుంకుమ బొట్టు* పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).


✔️ కాళ్లకు మువ్వల అందెలతో *(కాలి పట్టీలు అనకూడదు)* ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.


✔️ ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.


🌸 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!


😢

..........


దానికి నేను రాసిన సమాధానం ఇది 👇


ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు. 

తెలుగబ్బాయి ఎవరా అనా?

ఆనవాళ్ళు చెపుతాను. 


ధైర్యంగా ముందుకు పోయే తత్వం.


ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు. 


నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు. 


కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు. 


అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.


తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు. 


చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.


తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు. 


అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.


చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు. 


చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.

శనేశ్వరస్వామి దేవాలయం,

 #శనేశ్వరస్వామి దేవాలయం,మందపల్లి, కొత్తపేట మండలం, తూ.గో జిల్లా*

 

హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. 


మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. 


ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు,మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.


రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ శ్రీ శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామిని దర్శించుకోవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. శనీశ్వరునికి ప్రీతికరమైన "శనిత్రయోదశి" పర్వదినాన మందేశ్వరునికి విశేష పూజలు గావించిన వారికి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.


మీ ఈతిబాధలు, సమస్త దోషములు తొలగిపోవాలంటే... "శనిత్రయోదశి" నాడు (జనవరి 21- శనివారం) మందేశ్వర స్వామిని దర్శించుకుని ఏకాదశి రుద్రాభిషేకం, తైలాభిషేకం చేయించండి. శనిత్రయోదశి శనివారమే రావడం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయించేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.


#మందేశ్వర ఆలయానికి ఎలా వెళ్లాలంటే:


మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ దివ్యక్షేత్రానికి తూర్పుగోదావరి జిల్లా "రాజమండ్రి" నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా "రావులపాలెం" చేరుకోవాలి. రావులపాలెం నుంచి మందేశ్వర స్వామి వారి ఆలయం సుమారు 9 కిలోమీటర్లు దూరంలో ఉంది. రమణీయమైన కోనసీమ ప్రాంతం "మందపల్లి" గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం వెలసి ఉంది.


అలాగే పరమేశ్వరుడు మునులకు శనైశ్చర కవచం బోధించాడు. శని అంటే శక్తి. శనీశ్వరుడంటే శివభక్తి. సింగణాపురంలో శని శిలామూర్తిగా వెలసాడంటారు. గుడి, గోపురం లేని దేవతగా భక్తులచే పూజలందుకుంటున్నాడు ఈ క్షేత్రంలో మద్యపానం, మాంసాహారం నిషిద్ధం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని మందపల్లిలో ఈ శనీశ్వరాలయం ఉంది. ద్రావిడ శైలిలో నల్లరాతిపై మలచిన ఈ విగ్రహాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశినాడు అభిషేకిస్తారు.


#మందేశ్వర (శనీశ్వర స్వామి) ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలు:

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలతో పాటు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అనుమతులు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సింగం రాధా తెలిపారు, కోవిడ్ 19 కారోనా వైరస్ సందర్భంగా గత 5 నెలల నుండి ఆలయంలో స్వామివారి అభిషేకములు పూజా కార్యక్రమాలను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పూజా కార్యక్రమాలను స్వామివారికి అభిషేకములు చేయడం జరిగిందని ఆమె తెలిపారు, అయితే ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు అరుపు ఇకనుండి స్వామివారి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలను అభిషేకములు స్వామివారి దర్శనములు చేసుకునేందుకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు,

మానవ ప్రయాణం

 1. మానవ ప్రయాణం: 

మన  వేదాలు, వేదాల తరువాత ఉపనిషత్తులు. పురాణ ఇతిహాసాలు ఒక్కొక్క హిందూ గ్రంధం మనిషిని ఆధ్యాతిమిక వైపు దృష్టిని మళ్లించటానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం మాత్రమే. వేరే ఏ ఇతర మతాలలో కనీసం మాట వరుసకు కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలోని వున్నా అతి ఉన్నతమైన, పవిత్రమైన భావన ఈ మోక్షం. 

వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరలో వున్నవి ఉపనిషత్తులు, అందుకే వేదాంతం అని అన్నారు.  నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి, ఎందుకంటె వేదాలు కర్మ కాండని తెలుపుతే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞాన కాండని తెలుపుతాయి. కర్మలు చేయటం వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు యెట్లా తెలుసుకోవాలి, మనిషి తానె యెట్లా భగవంతుడు గా కావలి అని చెప్పేవి ఇవి. 

ఉపనిషత్తులు చాలా వున్నాయ్ అని అన్నారు, కానీ అందులో 108 ప్రముఖంగా అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహా ఋషుల తో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిస్యులకు ఇచ్చిన జ్ఞాన సంపద మాత్రమే. 

మనం ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఏ ఒక్క మహర్షి కూడా యెంత జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి తానూ కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. తానూ మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియ చేస్తున్నాను అని నుదువుతారు. దీనిని బట్టి మన మహర్షులు యెంత నిస్వార్ధంగా ఇతరులకు జ్ఞాన బోధ చేసారో తెలుస్తున్నది. ఏ వక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా వున్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు. 

ఈ రోజుల్లో ఏదో చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభ అని తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనం చుస్తువున్నాం. 

ఉపనిషత్తులలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను సూక్షంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు రెండు లేక మూడు పదాలతో ఉండి భగవత్ శక్తిని తెలియ చేస్తుంటాయి. 

ఉదా : 1) అహం బ్రహ్మస్మి: రెండు పదాలతో వున్నా ఈ మహా వాక్యం నేను బ్రహ్మను ఐ వున్నాను అని తెలుపుతుంది. 

2) తత్ త్వమసి : ఈ మహావాక్యం కూడా చాల ప్రముఖంగా వినబడేది. దీని భావం నీవు వెతికే బ్రహ్మ పదార్ధం నీవే అయి వున్నావు అని చెపుతున్నది. ఈ విధంగా అనేక మహా వాక్యాలు చోటుచేసుకున్నాయి. 

ఉపనిషత్తులు అన్ని కూడా అద్వయిత జ్ఞానాన్ని మనకు తెలియ చేస్తున్నాయ్. అంటే దేముడు జీవుడు వేరు కాదు ఒకటే వివరంగా చెప్పాలంటే ఈ చరా చార సృష్టిని నియంత్రించే శక్తీ ఆయన భగవంతుడు జ్ఞానీ ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నత జ్ఞానం మనకు తెలుపు తున్నాయి. 

ఆది శంకరా చర్య ఈ అద్వియేత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అప్పటి బౌద్ధ వాదాన్ని నివారించి భారతావనిలో 

హిందువాన్ని పునరుద్దించారు. బౌద్ధ వాదం నుండి చార్వాక వాదం వెలువడింది ఒక రకంగా చెప్పాలంటే ఇది నాస్తిక వాదం లాంటిదే. 

తరువాత కాలంలో మనకు విశిష్ట అద్విఏతము, ద్వయితం లాంటివి  వచ్చినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది. తరువాత తరువాత ఇప్పుడు నాస్తిక వాదం కూడా వ్యాప్తి చెందుతున్నది. 


కాల గమనంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గనుక మనం పరిశీలిస్తే 1) నేను, దేముడు వేరు కాదు నేనే దేముడిని అనే అద్విఏత వాదం 2) నేను దేవుడితో సన్నిహితంగా వుంటాను అనే విశిష్ట అద్వియతః జ్ఞానం, 3) దేముడు వీరు నేను వేరు అనే ద్విఏత జ్ఞానం 4) నాకు దేముడితో పని లేదు నేను చూసే, నేను చేసే దానికి నేనే కర్తను అనే నాస్తిక వాదం. ఇది చార్వాకుడి సిధాంతానికి దగ్గరలో ఉంటుంది. 


ఇవ్వన్నీ పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధ పడుతుంది. 


మనిషి పరిణామం ఏ దిశలో వున్నది అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది. 


రాను రాను దైవత్వం సన్నగిల్లి మూఢ భక్తి ప్రబలుతున్నది. దేముడి గుడికి వెళితే చాలు నా జన్మ ధన్యమైనది, నేను తిరుపతి దేముడిని దగ్గర నుండి రెకమండేషన్తో చూసాను చాలా ఆనందంగా వుంది, నాకు జన్మ సార్ధకం అయంది. ఫలానా బాబా నాతొ మాట్లాడాడు, అయన కళ్ళకు నేను మొక్కాను నా తలమీద చేయి వేసి నన్ను నిమిరాడు, దీవించాడు, ఫలానా స్వామి నాకు ఉపదేశం చేసాడు ( డబ్బులు తీసుకొని) నేను ధన్యుడిని అయ్యాను. నా కోరికలు తప్పకుండా తీరుతాయి. ఫలానా ఆయనకు, ఆమెకు దేముడు వంటిమీదికి వస్తాడు తాను అడిగినది (డబ్బులు, ఇతరములు) ఇస్తే మన కస్టాలు తీరుతాయి. ఫలానా సమాధి వద్దకు వెళ్లి మొక్కుతె నా కోరికలు తీరుతాయి. ఫలానా బాబా గుడికి వెళ్లి మొక్కితే నాకు మంచి జరుగుతుంది. ఇటువంటి మూఢ భక్తి రోజు రోజుకి పెరుగుతున్నది. దీనికి ఆనకట్ట వేయవలసిన అవసరం వున్నది. 



మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తీ గలిగిన మహర్షులని, దేవర్షులని చూసాము. వారు చూపిన అద్భుత శక్తులు మనకు పురాణ ఇతిహాసాలలో కనపడుతున్నాయి. 




సృష్టికి ప్రతి సృష్టి చేసిన బొందితో త్రిశంకుని స్వర్గానికి పంప ప్రయత్నించిన విశ్వామిత్రుడు, చనిపోయిన భార్యను తన కుమారుడైన పరశురాముని కోరికతో బతికించిన జమదగ్ని, కుశుడిని సృష్టించిన వాల్మీకి మహర్షి, తన భార్యను రాయిని చేసిన గౌతమ మహర్షి ఇలా చెప్పుకుంటూ పొతే అనేక మహర్షులు మన భారతావనిలో కనపడతారు. 




నిజానికి అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని ఎవ్వరిని కూడా దేముడు అని కొలవ లేదు. అది మన సాంప్రదాయం ఎందుకంటె అప్పుడు భూమిమీద వున్న జనులు అందరు గొప్ప వాళ్ళు శాపాలు ఇవ్వ గలవారు. ఎంతో కొంత తప్పశెక్తి వున్నవాళ్లు. అంతే కాదు ఇప్పటికి కూడా మనం ఆ మహర్షులను దేముళ్ళగా చూడటం లేదు. వాళ్ళకి ఆలా చూడాలి అనే కోరిక కూడా లేదు. 




నేనే దేముడిని: 


నేనే దేముడిని అనే వాదం మొదటి సారిగా మనం హిరణ్యకశ్యపుని చూస్తాము. తాను నేనే దేముడిని అని అనటంలో నిజానికి అర్ధం వుంది కూడా యందు కంటే   హిరణ్యకశ్యపుడు మహా బలవంతుడు, మహా తపోశక్తి వంతుడు. ఇంద్రాది దేవతలని, నవగ్రహాలని తన స్వాధీనంలో తెచ్చుకున్న ధీశాలి. అంత శక్తీ వంతుడు తన శక్తీ వల్ల వచ్చిన గర్వంతో తానూ దేముడిని అని అనుకున్న కొంత అర్ధం వుంది. 



మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్యు మానవులు తాము బాబా లమని సాక్షాతూ ఫలానా దేముడి అవతారలమని, మేము ఆ మాయలు చేస్తాము ఈ మాయలు చేస్తాము  అని సామాన్యు ప్రజలని మభ్య పెట్టి అనేక విధాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటే. అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి వారి పూజలు, వ్రతాలు, వారికి అస్ట్తోతరాలు, సహస్ర నామ పూజలు, భజనలు, హారతులు ఇచ్చి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారు. అంతే కాదు ఎవరైనా పండితులు, జ్ఞానులు మీరు చేసేది పొరపాటు అట్లా మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలని పాడు చేయవద్దని అంటే వారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించటం చేస్తున్నారు.




మన సమాజంలో సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేక పోవటమే  దీనికి కారణం. మనం దేముడిని తాత్కాలికమైన ఐహిక మైన తుచ్చమైన వాంచితాలని కొరకుడదని అది అసురత్వం అవుతుందని మనలో చాలా మందికి తెలియదు. దానికి కూడా కరణం లేక పోలేదు. మనలో చాలా మంది శ్రీమత్ భగవత్ గీత జీవితంలో ఒక్క సారి కూడా చదవక పోవటమే. 




శ్రీమత్ భగవత్ గీత లో కృష్ణ భగవానుడు 16 అధ్యాయంలో దివాత్వాన్ని గూర్చి అసురత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించారు.  ఏ మానవుడు శ్రీమత్ భగవత్ గీత చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణా పరుడు దేముడి మీద ఒక స్థిర భావం కలిగిన వాడు అవుతాడు. అతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేముడిగా అంగీకరించాడు. గీతా జ్ఞానం సంపూర్ణంగా అలవవరచుకున్న మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడు అవుతాడు అందుకు సందేహం లేశమంతయినా లేదు. 



ఇప్పటి కాల పరిస్థితుల్లో ప్రతి మనిషికి శ్రీమత్ భగవత్ గీత చదివే ఒక మంచి అలవాటుని చేయాలి. ఏ ఆహరం భుజించే వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలు ఏమిటి అందులో సత్వ గుణం ఎలా గొప్పది, సత్వ గుణ వంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, రోజా గుణవంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, తమోగుణవంతుడి నడవడి యెట్లా ఉంటుంది లాంటి అనేక విషయాలు ప్రతి మనిషి శ్రీమత్ భగవత్ గీత వల్ల మాత్రమే తెలుసుకోగలరు. 



ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమత్ భగవత్ గీత మానవాళికి అందించిన ఒక మహా వరం 



మీరు, రామాయణ, మహా భారతాదులు వేదాలు, అష్టా దశ పురాణాలు చదవక పోయిన ఏమి నష్టం లేదు వాటి వల్ల మనకు జ్ఞానం వస్తే రావచ్చు కానీ ఒక్క శ్రీమత్ భగవత్ గీత చదివితే మీకు మంచి నడవడిక వస్తుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది వినయము విధేయత, గౌరవము, మర్యాద. అదే గీత చదివి ఆకళింపు చేసుకునే వాడి వల్ల ఈ సమాజం ఉద్దరించ బడుతుంది. ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరంతా తప్పక గీతను ముందుగా  చదవండి, చదివించండి. మారె ఇతర హిందూ గ్రంధాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాగ్మయం చాలా ప్రశస్తమైనది ప్రతి గ్రంధం అపార జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. మన వాగ్ముయం చదవటం కాదు దానిని గూర్చి తెలుసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువండి ఈ మహా వట వృక్షన్ని గడ్డి పరకకన్నా చిన్న గున్న మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ వున్నాము. యెందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవటం వల్ల శ్రీమత్ భగవత్ గీత గూర్చి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమి చేయటంలేదు. ఎందుకు మనకు శ్రీమత్ భగవత్ గీత గూర్చి తెలియక పోవటం వల్ల.  ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు. ఎంతయినా వ్రాయవచ్చు. మన ధర్మం అపారం, ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి. అనంతమైనది.  


ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

సర్వే జన సుఖినో భవంతు.

మరణం లేని నీవు.

 మరణం లేని నీవు. 


ఈ మాట ఎవరైనా అంటే అది నిజం కాదు అబద్దం అని మనం అనుకుంటాము కదా. కానీ ఇది నిజంగా నిజం. ముందుగా మనం ఏదైతే మనం మరణం అనుకుంటున్నామో అది ఏమిటి మరి మరణం లేకుండా ఎలావుంటుంది అనేది తెలుసుకోవాలి.   


నిజానికి మనం ఈ చరాచర సృష్టిలో కొంత కాలం ఉండటానికి వచ్చాము. ఆ విషయాన్ని మరచి పోయి మనం ఇక్కడ అనేక బంధాలను ఏర్పాటు చేసుకొని వాటితోటె మన జీవితం అని బ్రాంతి కలిగి ఉంటాం. దాని పర్యవసానమే మరణం. కానీ ఆ బంధాలు కేవలం ఈ శరీరానికి మాత్రమే కానీ నాకు కాదు అని అనుకుంటే నీకు మరణమే లేదు. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 


ఒక నదిలో ఎన్నో కర్ర దుంగలు కొట్టుకొని పోతూవున్నాయి అందులో ఒక రెండు దుంగలు ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒకదానితో ఒకటి కలిసి కొంత దూరం ప్రయాణించింది అనుకోండి. నిజానికి ఆ రెండు దుంగలు ఒకదానితో ఒకటి ఏరకంగా కలిసి లేవు కానీ ప్రక్క ప్రక్కన ఉన్నందున అవి రెండు కలిసి వున్నాయి అని అనుకుంటున్నాయి. నిజమేమిటంటే ఆ ప్రవాహంలో దేని దారి దానిదే కొంత సమయం తరువాట్ అవి విడిపోతాయి. అవి ఎలా విడి పోతాయి అంటే ఒకదానికి ఒకటి ఆనవాళ్లు కూడా లేకుండా విడిపోతాయి. అంటే దేని గమ్యం దానిదే 


మన జీవితాలు కూడా రెండు లేక ఇంకా నాలుగు దుంగలు లాంటివే వాటి కలయిక కూడా కొంత కాలమే ఉంటుంది. కానీ మనం ఆ బంధాలు శాశ్వితం అని ఆనుకోటం ఒక అబద్ధం. కానీ అదే నిజము అని అనుకోటం మనం చేసే పొరపాటు. నిజానికి మనం ఏది నిజమో అది అబద్ధం అని ఏది అసత్యమో అదే నిజమని అనుకోటం మన ప్రస్తుత మానసిక స్థితి. ఈ స్థితిని దాటాలంటే మనం జ్ఞానవంతులం కావలి.

మహాభారతము ' ...65 .

 మహాభారతము ' ...65  . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


ధర్మరాజుని ద్రౌపదీ, భీమసేనులు నిష్టురవాక్యాలతో బాధపెడుతున్న సమయంలో, వ్యాసభగవానులు ధర్మజుని చూడడానికి వచ్చి,  పరిస్థితిని చక్కదిద్దాడు.


వ్యాసుడు పాండవుల పాదపూజ స్వీకరించిన అనంతరం, ' ధర్మజా !  ప్రస్తుతం మీ అన్నదమ్ములు ఐదుగురూ, ద్రౌపదీ వున్న మానసికస్థితి అవగతం చేసుకుని యిక్కడకు వచ్చాను.  మీరు భవిష్యత్తు గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు.  భీష్మ  ద్రోణాది వీరులను యెదుర్కొనలేమని చింతించవలదు.  ' ప్రతిస్మృతి ' అనే మంత్ర విద్యతో,  అర్జునుడు,  శివునిదర్శనము, ఇంద్రుని దర్శనం చేసుకుని, అఖండ శక్తివంతములైన అస్త్రాలు సంపాదిస్తాడు.  నేనిప్పుడే ఆమంత్రాన్ని నీకు వుపదేశిస్తాను. ' అని చెప్పి  దూరంగా తీసుకువెళ్లి యెదురుగా కూర్చుండబెట్టుకుని ఆ విద్యను వుపదేశించాడు వ్యాసభగవానుడు.  ' తగిన సమయంలో అర్జునునికి యీవిద్య నీద్వారా అనుగ్రహించు. ' అని చెప్పాడు.


తరువాత, ధర్మరాజుతో, ' మీరు ద్వైతవనానికి వచ్చి చాలాకాలమైంది.  మీరు శత్రువు దృష్టిలో పడకుండా వుండాలంటే, యెక్కువకాలం ఒకేచోట నివసించరాదు.  తిరిగి కామ్యకవనానికి వెళ్ళండి. ' అని హితబోధ చేశాడు.  ఆ విధంగానే పాండవులు కామ్యకవనం చేరారు. 


మారిన  వాతావరణంలో  కొంతకాలం  మనసులు  తేలికపరచుకున్న తరువాత, ఒకనాడు, ధర్మరాజు అర్జునుని పిలిచి, ' ప్రతిస్మృతి '  ని వుపదేశించి '  ఇంద్ర, పరమేశ్వరులను సంతుష్టులను చేసి, దివ్య అస్త్రాలతో  తిరిగిరా ! '  అని ఆదేశించాడు.  అర్జునుడు కూడా ధృడసంకల్పంతో, భక్తిగా అన్నగారికి, ఋషిపుంగవులకు నమస్కరించి,  యెప్పుడు యే అవసరం వస్తుందో అని, క్షత్రియధర్మంగా ధనుర్బాణాలు తీసుకుని, తపస్సు చేయడానికి మొదటగా హిమాలయాల లోనికి వెళ్ళాడు.  ఆపై గంధమాదనపర్వతం  ద్వారా, ఇంద్రకీలపర్వతం చేరుకున్నాడు.  


ఇంద్రకీలపర్వతం పై నున్నప్పుడు, అర్జునునికి '  ఆగు ' అని అశరీరవాణి పలికినట్లు అనిపించింది.   ఆ చుట్టుప్రక్కల పరిశీలించగా, ఒక చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ ఒక ఋషి కనిపించాడు.  ఆ ఋషి ' ఓయీ ! ఎవడవు నీవు ? ఇంత ప్రశాంతప్రదేశంలో, మునిపుంగవులు తిరిగేచోట, ధనుర్బాణాలతో యెందుకు తిరుగుతున్నావు ?   వెంటనే ధనుర్బాణాలు వదలి దండకమండలాలు ధరించు, నీకు తపస్సుచేసే ఆలోచన వుంటే '  అన్నాడు.  అయితే అర్జునుడు, ఆ ఋషికి వినయంతో నమస్కరించాడు గానీ, ధనుర్బాణాలు విడిచిపెట్టలేదు.  


ఆ ఋషి అతని కార్యనిష్ఠకు సంతోషించి, తన నిజరూపంలో ఇంద్రునిగా ప్రత్యక్ష మయ్యాడు అర్జునుని ముందు.  ' ఏం వరం కావాలో కోరుకో ' మన్నాడు.  దివ్యాస్త్రాలు ప్రసాదించమని అడిగాడు అర్జునుడు. ' నీకు దివ్యాస్త్రాలు కావాలంటే, ముందుగా తపస్సుద్వారా ఈశ్వరుని ప్రసన్నం చేసుకో ! '  అని సూచించి, అర్జునుని నమస్కారాలు అందుకుని అంతర్ధానమయ్యాడు, ఇంద్రుడు.


హిమాలయాల్లో అకుంఠిత తపోదీక్షతో వున్నాడు అర్జునుడు.  శరీరాన్ని కృశింపజేసుకుని ఏకాగ్రత పెంచుకునే వుద్దేశ్యంతో,  మొదటి మాసమంతా, మూడురోజులకొకసారి,కేవలం ఫలాలు భుజిస్తూ, తపమాచరించాడు, అర్జునుడు.  క్రమంగా రెండవమాసంలో, ఆరు రోజులకొకసారి  ఫలాహారం తీసుకుంటూ, మూడవనెల వచ్చేసరికి, పక్షానికి ఒకసారి చొప్పున ఆహారం తీసుకోవడం చేశాడు.  


నాలుగవ మాసంలోకి ప్రవేశించినా, తన తపస్సు ఫలించనందుకు ఈశ్వర దర్శనం కానందుకు యెంతో ఆవేదన చెంది, పట్టుదలతో, కేవలం వాయుభక్షణం చేస్తూ తపస్సు కొనసాగించాడు అర్జునుడు.  అర్జునుని వాయుభక్షణ క్రియ వలన, క్రమంగా ప్రకృతి స్తంభించ సాగింది. దేవలోకం అతని తపస్సును గుర్తించింది. ప్రకృతి యింకా భీభత్సంగా మారకముందే,  దేవతలు,  ఈశ్వరుని ఆశ్రయించి, కాపాడమని ప్రార్ధించారు. శివుడు వారికి  అభయమిచ్చి, హిమాలయాలలో వున్న అర్జునునివద్దకు బయలుదేరాడు.


శివుడు అర్జునుని పట్టుదలకు ముచ్చటపడి, అతని పరాక్రమం కూడా పరీక్షించదలచి, కిరాతుని రూపంలో, తన ధనుస్సు ' పినాకం ' ధరించి,  పక్కన పార్వతీమాత, కిరాతస్త్రీ రూపం లో వెంటరాగా, అర్జునుడు తప్పస్సు చేస్తున్న స్థలం చేరారు, ఆదిదంపతులు.  


వస్తూవస్తూనే కిరాతరూపం లో వున్న శివుడు మూకాసురుడు అనే రాక్షసుని వరాహ రూపంలో వచ్చి అర్జునుని తపస్సు భగ్నం చెయ్యమని చెప్పాడు.   వరాహం పెద్ద ధ్వనితో మీదకు వస్తుండగా అర్జునుడు తపస్సు నుండి మేల్కొని, ప్రక్కన వున్న వింటిని తీసుకుని బాణం దానిపై వదిలాడు.  అదేసమయానికి కిరాతుడు కూడా బాణం వదలగా,ఆది చనిపోయినట్లు పడిపోయింది.  


వరాహం చనిపోవడం చూసి, అర్జునుడు ఆగ్రహంతో ఆ కిరాతుని చూస్తూ, ' ఈ జంతువును వధించేహక్కు నీకెక్కడిది ?  నేను ఆత్మరక్షణార్థం బాణం విడిచాను. కానీ నీవు యేకారణం లేకుండా దానినెందుకు చంపావు ? నిన్ను నేను వదలను. ' అంటూ  బాణం తీసుకున్నాడు.


' ఓహోహో ! ఇది మరీ విడ్డూరంగా వున్నది.  నేను కిరాతుడను, నావృత్తి వేటాడడమే.  నీవు క్షత్రియునివలే వున్నావు. ఇక్కడేమి పని.  ఎందుకు ఒంటరిగా వున్నావు  ? ' అని అడిగాడు కిరాతుడు.  '  ఈ వరాహాన్ని ముందు నేనుకొట్టాను. ఇది నా ఆహారం.  నీవు తప్పుకో ' అని గద్దించాడు కిరాతుని రూపంలో వున్న శివుడు.  అర్జునునిపై బాణాలు వెయ్యనారభించాడు.  . 


అయితే, అర్జునుడు  అందుకు ఒప్పుకోక, కిరాతుడు వేసే ప్రతిబాణాన్ని, తట్టుకుని, కిరాతునిపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు యెన్ని బాణాలు వేసినా, అవి శివునిలో లీనమవుతున్నాయి.  కిరాతుని రూపం లో చెక్కుచెదరని చిరునవ్వుతో, శివుడు అర్జునుని   వైపు చూస్తూ బాణప్రయోగం చేస్తున్నాడు.


అర్జునుడు విస్తుబోయి చూస్తున్నాడు, యేమిటి యీమాయ అనుకుంటూ....


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో....


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

మంచి మాటలు*

 *మంచి మాటలు*

చిన్నచిన్న విషయాలు గురించి గొప్పగా ఆలోచించండి. జీవితంలో ఎలా సర్దుకుపోవాలో తెలుసుకోండి. హెచ్చుతగ్గులు లేని భావనను కలిగి ఉండండి. ఇతరుల అదుపులో ఉండకండి. గొప్ప కోరికలను కలిగి ఉండండి. మీరు ఏపనికి తగుదురో ఆ పనిని చేయండి. మంచిని వెతికి దానికి కట్టుబడి ఉండండి. చాలా పదునుగా ఉండండి. పైఎనిమిది గుణగణాలను అలవర్చుకోండి. ఏపని ఎలా చేయాలో తెలిసి చాలా బాగా చేస్తున్నప్పుడు ఎలాంటి దిగులును కలిగి ఉండకండి. గెలుపు నిర్దిష్టతపౖౖె ఆధారపడి ఉన్నప్పుడు తొందరపాటును కలిగి ఉండకండి.

ప్రయత్నించకుండా అసంభవమైనదన్న సంగతిని విశ్వసించకండి. మంచి ఉద్దేశ్యం మాత్రం చాలని ఎప్పుడూ ఊహించకండి. మీవద్ద పూర్తి వివరాలు వాస్తవాలు లేనంతవరకు మీ స్నేహితుడి గురించి చెడు ఆలోచనను రానివ్వకండి. ఎవరిపట్ల దురుసుతనాన్ని ప్రదర్శించకండి. మాట్లాడే ముందు వినండి. రాసే ముందు ఆలోచించండి. ఖర్చు చేసేముందు సంపాదించండి. పెట్టుబడి పెట్టేముందు ఆరాతీయండి. విమర్శించేముందు నిదానించండి. ప్రార్ధించే ముందు క్షమించండి. పనిని వదిలే ముందు ప్రయత్నించండి. పదవీవిరమణ చేసేముందు దానం చేయండి. మీ స్నేహబంధాలను బలపరుచుకునేందుకు తోడ్పడగలవు. బాధ్యతలను నవ్ఞ్వతూ స్వీకరించండి. కొత్తభావాలను ఆహ్వానించండి . మంచినడత కల్గియుండాలి. లక్ష్యాలను నిర్ణయించుటకు పనిని ప్రారంభించండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగివ్ఞండాలి. ఉత్సాహపు విలువ తెలుసుకోండి. కోపతాపాలు హద్దులోకి రానివ్వకండి. ఆత్మవిమర్శను మానుకోండి. గృహానికి అందం సామరస్యం, భద్రతవిశ్వాసం, ఆనందం, ప్రేమ, సమృద్ధి బిడ్డలు నియమం సేవ, సౌకర్యం తృప్తిపడే ఉత్సాహాలు, దైవభక్తే ఇంటికి కిరీటం. క్రమం ఇంటికి అందం, అతిధ్యమే ఇంటి గొప్పదనం, సంతృప్తే ఇంటికి వరప్రసాదం. ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలను తయారు చేసుకొండి. ప్రార్ధన పూర్వకంగా ప్రణాళికలను తయారు చేసుకొండి. సక్రమమైన ఆలోచనలతో ముందుకు సాగండి. విడవకుండా సాధిస్తూ రండి. శ్రేష్టతను సాధించేందుకు తోడ్పడగలవు. చేస్తున్న పనిని ఆనందంగా చేయడానికి కావలిసినంత ఆరోగ్యం, అవసరాలకు కావలిసినంత సంపద, కష్టాలతో పోరాడి గట్టెకడానికి కావలిసినంత బలం, చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని వదులు కోవడానికి కావలిసినంత దయ, మంచిని సాధిచేంతవరకు కష్టపడడానికి కావలిసినంత సహనం, మీ పొరుగువారిలో మంచిని చూడడానికి కావలిసినంత ఉదారగుణం ఇతరులకు ఉపయోగపడడానికి, సహాయపడడానికి కావలిసినంత ప్రేమ, భగవద్‌ విషయాలను నిజం చేయడానికి కావలిసినంత నమ్మకం భవిష్యత్తుకు సంబంధించిన అన్ని భయాలను పారద్రోలేందుకు కావలిసిన ఆశ ఇవే సంతృప్తికరమైన జీవితపు తొమ్మిది సూత్రాలు. మీ పనిని మీరు ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయడం, మీతోటివారితో న్యాయసమ్మతంగా నడుచుకోవడం తగ్గించి పనులను చేపట్టడం, మీరు మనసా, వాచా, కర్మణా అతిఉత్తమమైన దానిని ఆలోచించడం, దృఢ నిశ్చయముతో, నవ్ఞ్వ ముఖంతో సమస్యలతో పోరాడడం, మీరు వినయ విధేేయతలతో సేవ చేస్తూ, పనులను శ్రద్ధచేయగా చేయడం, వీటిని మీరు అనుసరిస్తే గెలుపు మా చెంతే ఉంటుంది. అత్యంత స్వార్ధపూరితమైన మాట ‘నేను దానిని మానండి.

అత్యంతతృప్తికరమైన మాట ‘మనం అని వాడండి. అత్యంత హానికరమైన మాట ‘అహంకారం దాన్ని వదలండి. అత్యంత శక్తికరమైనమాట జ్ఞానం దాన్ని సంపాదంచుకొండి. అత్యంత నిశ్చయమైనమాట ‘విశ్వాసం దానిని పొందండి. అత్యంత స్నేహశీలమైన మాట చిరునవ్ఞ్వ దానిని ఉంచుకొండి. అత్యంత ఆహ్లాదకరమైనమాట ‘ప్రేమ దానిలోని విలువను పరిగణించండి. అత్యంత ప్రసంశనీయమైన మాట విజయం దాన్ని సాధించండి. నిన్నటి తప్పులను సరిదిద్దుకోలేని మనిషి, గెలుపును సాధించిన ప్రతిమనిషికి సహాయం చేసేవారుంటారని భావించే మనిషి, తన మనసును మార్చుకునే ధైర్యంలేని మనిషి, తన అదృష్టం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూసే వ్యక్తి అది అయ్యేపని కాదు అన్నమాటను తన నాలిక చివర ఉంటుందనుకునే వ్యక్తి, ఏమాత్రం విలువలేని వాటిపై డబ్బును నీళ్లలాగా ఖర్చు చేసే వ్యక్తి తాను భగవంతుడు సహాయం లేకుండా నెగ్గుకొని రాగలను అని భావించడమైనదిగా ఉండకండి. అత్యంత ప్రాముఖ్యమైనఆరు మాటలను మీరు జీవితంలో అనుసరించండి.

”నేను తప్పు చేసానని అంగీకరిస్తున్నాను.

ఏడు ముఖ్యమైన మాటలు ‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.

నాలుగు ప్రధానమైన పదాలు బహుశానీదే ఒప్పుకావచ్చు. మూడు ముఖ్యమైన మాటలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను

రెండు ముఖ్యమైన మాటలు ‘మీకువందనాలు ఒకేఒక ప్రధానమైనమాట ‘దయచేసి అత్యంత అప్రధానమైనమాట ‘నేను.

పిల్లలకు మీ ప్రేమను వారికి ఇవ్వండి అంతేకానీ మీ ఆలోచనలను కాదు వారి ఆలోచనలు వారికి ఉండడమే అందుకు కారణం. మీరు వారి శరీరాలను అదుపులో ఉంచవచ్చు. అంతేకాని వారి ఆత్మలను కాదు. కారణం వారి ఆత్మలు రేపటి కోరికల తో నిండి ఉంటాయి. వారి కోరికలను మీకలలో కూడా చూడలేరు. వారిలాగా ఉండ డానికి ప్రయత్నించండి.

అంతేగాని మీలాగ వారు ఉండాలని కోరికుంటే కారణం జీవితం వెనక్కుపోదు. మీరు వారి పాలిట ధనస్సులు. మీ పిల్లలు అక్కడి నుండి పంపబడే సజీవ బాణాల లాంటివారు. మీ ఆలోచల్ని గమనిస్తూవుంటే అవే మీమాటలవుతాయి. మీమాటల్ని గమనిస్తూ వుంటే అవి నీచేతలవుతాయి. మీచేతల్ని గమనిస్తూ వుండు అవే మీ అలవాటులవుతాయి. మీ అలవాట్లను గమనిస్తూ ఉంటే అదే శీలం అవుతుంది. మీ శీలాన్ని గమనిస్తూ వుంటే అదే మీ భవిష్యత్తు. మీ ఆలోచనపట్ల జాగ్రత్త వహించండి. మీ ఆలోచనలను పవిత్రంగా వ్ఞంచుకొండి. మీమాటలను నిజమైన వాటిగా ఉండనివ్వండి.

మీ పనులు స్వార్ధరహితంగా ఉండేలా చూడండి. అప్పుడు మీరు అద్భుతాలను చూడగలరు.

మీ నిజజీవితం ఆనందంతో పొంగిపొర్లుతుంది. తీర్పు యిచ్చేముందు వినగలిగితే మాట్లాడే ముందు ఆలోచించితే మీనాలుకకు కళ్లేం వేయగలిగితే చాడీలకు చెవి వొగ్గకుంగే చెడు ఫిర్యాదులను నమ్మకుంటే బాధలో ఉన్నవారిని ఆదుకుంటే అందరిపట్ల ఓపికను ప్రదర్శించగలిగతే అందరికి మంచి చేయగలిగితే అందరిని గౌరవించగలిగితే మీరు అసలు బాధపడవలిసిన అవసరం ఉండదు. ఇతరుల తగాదాల్లో ఇరుక్కొని కష్టాలుకొని తెచ్చుకున్నప్పుడు గట్టిగా వుండు, ఇతరులు పుకార్లు వ్యాపింపచేస్తున్నప్పుడు మూగగా వుండు. ఇతర వ్యర్ధప్రసంగాలు చేస్తున్నప్పుడు చెవిటిగా వుండు, అదృష్టాన్ని సాధించేందుకు ఇతరులు నిరీక్షిస్తున్నప్పుడు పని చేస్తూ వుండు, ఇతరుల పైకిలాగే వారి కోసం వేటాడుతున్నప్పుడు నీవు నెట్టుకువెళ్ళు, ఇతరులు కలహ ప్రియులుగా, వివాదాస్పదులుగా ఉన్నప్పుడు, నీవు సహనబుద్ధితో వుండు, ఇతరులు తప్పులు చేసి పట్టుబడినప్పుడు నీవు ఉదారంగా వుండు.

వీటిని హితకరమైనవిగా భావించాలి. ఎప్పుడూ చిరునవ్వులను చిందిస్తూ ఉండండి. ఇతరులు ఏమి చెబుతున్నారో దాన్ని శ్రద్ధగా వినండి. అవతలి వ్యక్తికి ప్రియమైన విషయాన్ని ఎన్నుకొని ఆవిషయంగానే మాట్లాడండి. పొగుడుతున్నప్పుడు చాలా ధారాళంగా ఉండండి. ఎప్పుడూ విమర్శించకండి. ఇచ్చిన బహుమతి లేదా చెప్పిన మంచిమాటను స్వీకరిస్తున్న దానికి ధన్యవాదాలు తప్పక తెలియజేయండి. మీ గురించి చాలా తక్కువగా మాట్లాడండి. ఇంపైన విధంగా వ్యవహరించండి. అవతలివ్యక్తి పేరును సరిగ్గా తెలుసుకుని గుర్తించుకోండి 👏👏👏

ఆనందం

 *ఆనందం... ఆనందం కోసమే మనం చేసే ఏ పని అయిన సాధన అయిన స్థిరంగా ఏ పని చేయకపోయినా... ఆనందం కోసమే..

 తెలుసుకోవడమే...ఆనందం.

నేర్చుకోవడమే....   ఆనందం.

నేర్పించటమే... ..    ఆనందం. లయమవ్వడమే...  ఆనందం.

ఆనందంగా ఉంటే ఏమౌతుంది..? లేకపోతే ఏమౌతుంది.. ? ఒకప్పుడు ఏ పని చేసినా అందులో లయమౌతూ నైపుణ్యంగా మారిపోతు అదే మనము అనే స్తితి అందరిదీ... కారణం ఉరుకులు పరుగులు లేకపోవడమే.. ఇప్పుడు ఆనందం నుండి సంతోషంగా ఉంటే చాలు అనే స్థితికి వచ్చేసాం.. తరువాత సుఖంగా స్థిరపడితే చాలు అనుకుంటున్నాం అనేది ఇప్పుడు జరుగుతున్న స్తితి.. ఈ మూడు స్థితులు మన జీవితంలో ఎలా వస్తున్నాయో గమనిస్తే... మళ్ళీ తిరిగి ఆనంద స్థితిలో స్థిరపడతాం...


   🌸 ఏపని చేసిన ఆనందం కోసం అనేది 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు.. 34 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు సంతోషంగా ఉంటే చాలు.. 56 నుండి మన జీవితం చివరివరకు సుఖంగా ఉంటే చాలు అనేది ఇప్పటి మాట..

18 సంవత్సరాల వయసులో సాహసం చెయ్యటానికి ఏదైన ముఖ ముఖి తెల్చుకోవాలి లేదా ఏదైనా మన ముద్ర ఉండాలి అనేది అందరికి ఉండేదే... ఇక్కడే సరైన లక్ష్యం ఏర్పర్చుకుంటు ముందుకెళ్లే స్థితి... ఇక్కడ ఆశల పల్లకి కన్నా ఆచరణ దారిలో నడిచిన వారు ఎక్కువగా ముందువరుసలో ఉంటారు... ఇదే స్థితిలో పెళ్లి ఎప్పుడైతే జతను తీసుకొస్తుందో అక్కడ ఎగసివచ్చే అలల ఉద్వెగం చల్లబరుస్తూ లక్ష్యాన్ని మార్చుతోంది... అప్పటికే  లక్ష్యం మనలో స్థిరపడితే ఆనందం అనేది మన ప్రతి అడుగులో కనపడుతుంది...

ఇక్కడ ఎవరైతే జతగా ఉన్నారో.. వారికి లక్ష్యాన్ని వివరించి ముందుకు సాగగలిగితే ఉండేది విజయ యాత్ర... చెరోదారి అయిన కొంచం ఆలస్యం అయిన విజయాన్ని అందుకోవచ్చు..


   🌸 33 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి పిల్లలు ఎదుగుతూ మనల్ని అనుసరించటం మొదలుపెడతారు... ఇదే జావితానికి అతి సున్నితమైన మలుపు... ఇక్కడ భార్యాభర్తలు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా జీవితానికి చిరునవ్వు జోడించి నడపగలిగితే ఆ కుటుంబం వరకు ఆనందానికి డోకా ఉండదు... కావలసింది కొద్దిపాటి వివేకం.. ఇవన్నీ జీవితంలో అనుభవం ద్వారా లభించేవి... కానీ18 సంవత్సరాల వయసు కన్నా ముందే ధ్యానం పరిచేయం అయితే... ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి మాటలో ఆనందం తొణికిసలాడుతుంది అనేది అక్షర సత్యం... లక్ష్యం అనాయాసంగా చేరతా0.. సునాయాసంగా జీవిస్తాం.. కారణం మనం ఏ పని చేస్తే మనలోపల ఆనందం కొన్ని రేట్లు పెరుగుతుందో ఆటే మన ప్రయాణం ఉంటుంది... ఇంకా దేనికోసం ఎదురు చూడకుండా ఉన్న ఆనందాన్ని అందరికి పంచుతూ ఆనందోబ్రహ్మ గా మారిపోతాం... అప్పుడు అనవసరమైనవి మన దరికి రానే రావు అనేది అనుభవైక వాస్తవం...


   Thank you...🌸🌸🌸

కథ : కాకి.

 💐💐💐కథ : కాకి. 💐💐💐 ఈ కథ పూర్తిగా చదవండి


......నాపేరు "కాకి"నాకది మనుషులు పెట్టిన పేరు... "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు... ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....


నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.....


ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...


పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....


"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా".. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....


ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...


సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...


మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...


"అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...

వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...


ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత....


అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు .. 

"ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...

వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???


పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది ...

ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...

వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....


"పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....


సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...


"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....


వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??


పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??


బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??


ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...


పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...


ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??


ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??


అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...


గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...

అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....


రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!

" సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...


అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..


"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...


"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....


ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ....అందుకే  కథకు సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ....రేయ్ మనిషి విను....


"ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం" ...వృధాగా పోవు....


"బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం.... వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు"....


చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్...


చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు.... (ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది,ఓం శనైశ్చ రాయనమః)

వెటకారాల దారిలో గోదారి

 వెటకారాల దారిలో గోదారి

(ఎల్లాప్రగడ రామకృష్ణ)


ఒరేయ్‌ అబ్బాయ్‌! అల్లం జీలకర్ర పెసరట్టు చెప్పు... అల్లమ్ముక్కలు నేవళీకంగా తరిగి ధూమాగా వేయించమను..’’

      ‘‘ఆయ్‌! అలాగేనండి...ఉల్లిపాయి ముక్కలు తగిలించొచ్చంటారా?’’

      ‘అలక్కానీయ్‌...కాకపోతే కాస్త లౌక్యంగా జతపడేలా చూడు..’’

      కాలువ గట్టున కాకా హోటల్లో అతిసాధారణంగా వినిపించే పై సంభాషణ ముఖ్యంగా ఆఖరి వాక్యం సరిగ్గా బోధపడిన వారందరికీ ‘ఇది గోదారి జిల్లాల యాస’ అని తెలిసిపోయే ఉంటుంది. ఈ దృశ్యాన్ని కళ్లతో చూసిన వాళ్లకి - పెసరట్టు ఎలాక్కావాలో ఓపిగ్గా విన్నట్టు నటించిన సర్వరు చివరో ‘ఒక పెసరాయ్‌’ అని అరుచుకుంటూ వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించే ఉంటుంది.

      ‘‘గోదారి జిల్లా వోళ్లు సామాన్యులు కారొరోయ్‌! ఆళ్ల మాటల్లో మమకారం, చమత్కారం, ఎటకారమే కాదు, ఆ మాటకొస్తే కాసింత సూరేకారం కూడా కలగలిసుంటాదని అందరనుకుంటారహే’’ అని గోదారోళ్లే అనేసుకోడం కూడా కద్దు. ఆ ఊసులెలాఉన్నా గోదారి జిల్లావోళ్లు పరమ లౌక్యులన్న అభిప్రాయం లోకంలో ఎందుకో మరి స్థిరపడిపోయింది. సినిమావోళ్లు ఈ మాటని బాగా ప్రచారం చేయడమేకాక ‘ఆళ్లకి ఎకసెక్కాలు, ఎటకారాలు ఎక్కువ’ అనే అభిప్రాయాన్ని లోకం మీద రుద్దేశారు. లౌక్యుడనే మాట ఆంగ్లపదం ‘లిటిగెంటు’కి తెలుగు అర్థంలా కనిపిస్తుంది కాని, ‘లౌకిక జ్ఞానం తెలిసినవాడు’ అనేది ఆ మాటకు నిజమైన అర్థం. నన్నయ్య గారిని ‘లోకజ్ఞుడు’ అని ఏ అర్థంలో అన్నారో అదే అర్థంలో లౌక్యుడనే మాటను గ్రహించాలని గోదారి జిల్లా వాళ్ల నిశ్చితాభిప్రాయం!


వెనకటికి బులుసు పాపయ్యశాస్త్రిగారని గొప్ప వేద విద్వాంసులు ఉండేవారు. ఆయన విద్వత్తును మెచ్చి పిఠాపురం రాజావారు గంగాధర రామరాయణింగారో సందర్భంలో ‘‘అయ్యా! మన ఇలాకాలో మీకు ఎక్కడ ఎంత భూమి కావాలో కోరుకోండి... దానపట్టా రాసిస్తాం’’ అన్నారు. వెంటనే       పాపయ్యశాస్త్రి గారొక ఆశీర్వచనం చేసి, నెలకో పుట్టి భూమి చొప్పున ఇప్పించమని కోరారట. పుట్టి అంటే సుమారు ఎనిమిదెకరాల లెక్క. నెలకు ఎనిమిది ఎకరాల వంతున పన్నెండు నెలలకు పన్నెండెనిమిదులు తొంభైయ్యారు ఎకరాల భూమిని రాజావారు రాసిచ్చేశారు. పాపయ్య శాస్త్రిగారే చక్రం తిప్పారో, లేక వేదపండితుడికిచ్చే దానం కదా అనుకుని ఠాణేదారే కావాలని కొలిపించాడోగాని, గోదావరి లంక భూమి పన్నెండుకు బదులు పద్దెనిమిది పుట్లు శాస్త్రిగారికి దఖలు పడింది. ఈ సంగతి కొన్నాళ్లకి రాజుగారి చెవిని పడింది. ఠాణేదారుని పిలిపించి, కూకలేసి, ఉద్యోగంలోంచి పీకేశారు.

      పాపాయ్యశాస్త్రిగారికి ఈ విషయం చేరింది. ఆయన నేరుగా రాజుగారి దగ్గరకొచ్చి తనకు దానం చేసిన భూమిని తిరిగి తీసేసుకోమని కోరారు. అది రాజుగారికి పెద్ద తలవంపుల వ్యవహారం కనుక శాస్త్రి గారికి నచ్చచెప్పబోయారు. తనెంత చెబితే అంత చెయ్యాలి. ఏం చెబితే అదే చెయ్యాలి! తప్ప ఇలాంటి సొంత పెత్తనాలు గుమాస్తాలకు తగునా? అన్నది రాజావారి వాదన! ఠాణేదారు ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించేడంటాడు రాజు. లేదంటారు శాస్త్రిగారు!

      ‘‘తమరు ఈ భూమిని ఎందుకు ఇప్పించారు?’’

      ‘‘మీరు మహాపండితులు, మీకిస్తే మేం తరిస్తాం కనుక!’’

      ‘‘మేం ఎందులో పండితులం?

      ‘‘వేదశాస్త్రాలన్నింటా మీరు మహాపండితులే’’

      ‘‘వేదశాస్త్రాలనగా ఏ భాష?

      ‘‘గీర్వాణ భాష’’

      ‘‘గీర్వాణులంటే దేవతలు! దేవతలు దేవమానంలో కాక, మనుషుల కొలతల్లో ఎలా కొలిపించుకుంటారు? కాబట్టి ఠాణేదారు లెక్క సరైనదే! గజానికి గజంన్నర చొప్పున సరిపెట్టాడు!’’ అని తేల్చారు శాస్త్రిగారు.

      ఇంకేం అంటాడు రాజుగారు? శాస్త్రిగారిటు భూమీ దక్కించుకున్నారు, అటు ఠాణేదారు ఉద్యోగమూ నిలబెట్టారు. అదీ లౌకిక ప్రజ్ఞ అంటే! లౌక్యుడు కాబట్టే ఠాణేదారును రక్షించగలిగాడాయన. (చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిగారి ‘కథలు గాథలూ’లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.)



      ఈ కథ చదివాకా గోదారోళ్లంతా ఇలాంటి లౌక్యులే అని తీర్మానించబోతే - అది చాలా అన్యాయం. మనిషి మనుగడకొక వ్యాకరణాన్ని నిర్దేశించిన గోదావరీతీరాన్ని అది అవమానించడం అవుతుంది. ఈనాటికీ పల్లెల్లో ‘‘చెవిలో చుట్టెట్టుకుంటారు’’ అని లోకం ఎగతాళి చేసే పరమ అమాయక చక్రవర్తులకూ కొరతలేదు. ఓసారేం జరిగిందంటే - మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి - ఆ ఊరి పేరెందుకులెండి - ఓ గ్రామంలో కనకాభిషేకం తలపెట్టారు. అధ్యక్షులుగా కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిస్తే - సభకు ఘనత చేకూరుతుందనితోచి, మొత్తానికి ఎలాగో వారిని ఒప్పించారు. తమ ఊరికి రప్పించారు. తీరాచూస్తే అక్కడ కనకమూ లేదు, అభిషేకమూ లేదు. బుట్టలతో పువ్వులు తెచ్చి నెత్తిన పోశారు. బంగారంతో చేసిన పువ్వులు పదో పరకో లేకుండా వట్టి చేమంతి పూలతో కనకాభిషేకం ఏమిటని విశ్వనాథ వారు విస్తుపోయి, కార్యకర్తలను కూకలేశారు. దాంతో పాపం వాళ్లు తమ అజ్ఞానాన్ని బయట పెట్టారు. కనకాభిషేకమంటే బంగారంతో వ్యవహారమని వారికి నిజంగా తెలియదు. పదం బాగుంది కదా అని ఓ మాట అనేసుకున్నారు. మన నగరాల్లో ‘సమ్‌’ (sum) చిత సత్కారమని చెప్పి ఉచిత సత్కారాలతో సరిపెట్టి, ‘‘చంద్రుడికో నూలుపోగు’’ అంటూ శాలువా కప్పుతారు చూశారా! ఆ బాపతు గడుసుదనం కూడా తెలియని సత్తెకాలం జనం కనుక - విషయం తెలిశాక ఎంతో నొచ్చుకున్నారు. మధునాపంతులవారు వారి నిజాయతీని గ్రహించారు. ‘‘మీరు చేసింది కనకాభిషేకమే’’ అని బాహాటంగా ప్రకటిస్తూ తమ ప్రసంగం ఆరంభించారు. ‘‘మీరంతా ఇంత ఆప్యాయంగా ఆహ్వానించారు ‘కనక’, విశ్వనాథ వారిని సైతం రప్పించారు ‘కనక’, ఇదంతా తెలియకచేసింది ‘కనక’ తీరా తెలిశాక ఇంతగా నొచ్చుకుంటున్నారు ‘కనక’ - ఇన్ని రకాల ‘కనక’లు జతపడ్డాయి ‘కనక’ - నాకు జరిగింది అక్షరాలా కనకాభిషేకమే. లోటేం లేదు.’’ అంటూ ఆ మర్యాదా పురుషోత్తముడు సభను, సన్నివేశాన్ని తేలిక చేశారు. శాస్త్రిగారి అబ్బాయి వెంకటాచలపతి స్వదస్తూరితో ఆ ఊరి పేరుతో సహా ఇచ్చిన సాక్ష్యం నా దగ్గర ఉంది కనక, గోదావరి పల్లెల్లో ఇప్పటికీ అలాంటి అమాయకులున్నారన్నది పచ్చి నిజం కనక, ఒక మహాకవి విషయంలో ఇలాంటి అపచారం చేసే దుర్బుద్ధిగాని, వెటకారం ఆడే కొంటెతనం గాని గోదావరి జిల్లాల్లో ఇంటావంటా లేవు కనక, గోదారోళ్ల పలుకుబళ్లలోని ‘చిలిపికారం’ చెప్పాలి కనక, ఇలా ఈ కనకాభిషేక ఉదంతాన్ని వెల్లడి చేశాను, ఆయ్‌!

      నాగరీకం ముదిరాకా, సాగతీత కాసింత తగ్గింది గాని, మాట తీరును బట్టి పోల్చుకోవాలనుకుంటే - ఒకట్రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఆలుమగలిద్దరూ విడాకులకోసం కోర్టుకెక్కారు. వారికి ముగ్గురు పిల్లలు, నాక్కావాలంటే, నాక్కావాలని తగవులాట! న్యాయమూర్తి దూరం ఆలోచించి ఓ రాజీ మార్గం సూచించాడు. ‘‘మీరిద్దరూ మరో ఏడాది కాపరం చెయ్యండి ఇంకో బిడ్డ కలిగితే చెరో ఇద్దర్నీ తీసుకోవచ్చు కదా!’’ అన్నాడు. అప్పుడు గనక ఆ అమ్మడు ‘‘కవల పిల్లలు పుట్టుకొస్తేనో’’ అని అడిగిందనుకోండి - ఆ పిల్లది ఏ జిల్లానో గుర్తు పట్టేయొచ్చు. 

      లేదా దారినపోతూ ‘‘బాబు! సుబ్బయ్య గారిల్లెక్కడా? - అని మీరడగ్గానే ‘‘ఎక్కడండి! ఇల్లెక్కడానికి ఆయనకేం పని? పైగా పెద్దవయస్సువాడు’’ అన్న జవాబు ఠక్కున మొహాన తగిలిందంటే - మీరే జిల్లాలో ఉన్నారో తెలిసిపోతుంది. కావాలంటే ఓ పాలిటొచ్చి పలకరించి చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే శానా సంగతులుంటాయి గాని, ఇప్పటికి ఇక్కడితో ఆపేద్దారి.

ధార్మికగీత -68*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత -68*

                                     *****

      *శ్లో:- దాసీ భృత్య స్సుతో బంధు: ౹*

             *వస్తు వాహన మేవ చ ౹*

             *ధన ధాన్య సమృద్ధి శ్చా ౹*

             *ప్యష్ట భోగా: ప్రకీర్తితాః  ౹౹*

                                       *****

*భా:- మానవుడు  భోగలాలసుడు. కష్ట సుఖాలు కావడికుండల వంటి వని తెలిసినా భోగభాగ్యాలలోనే నిరంతరం మునిగి తేలాలనుకుంటాడు. ఆ భోగాలు 8 విధాలు. 1. దాసీ :-  కర, కను సైగల మాత్రాన గృహసంబంధమైన అన్ని పనులను చక్కబెట్టగల దాస దాసీజనము.  2. భృత్య:-  ఇంటా-బయటా సకల ఆహార వ్యవహారాలు, రాచకార్యాలు  నేర్పుతో నిర్వహించగల సేవక గణము.  3. సుతః ;- దీక్షాదక్షతలు, శక్తిసామర్ధ్యాలతో సన్మార్గంలో పురోగమిస్తున్న పుత్రసంతతి .4. బంధు: :-  ఎలాంటి ఆపదలోనైనా  మేమున్నాము అని సంసిద్ధులై రాగల  ఆత్మీయ   బంధుగణము.  5.వస్తు :- అవసరానికి మించిన వెండి - బంగారు ఆభరణాలు , గృహ సామాగ్రి . 6. వాహన :- ఆయాసం లేకుండా ప్రయాణం చేయడానికి కావలసిన  ద్వి - చత్వారి చక్ర వాహన సంపత్తి. 7. ధన :- తరతరాలవారు   అనుభవించినా తరగని స్థిర - చర ఆస్తులు, నిల్వ- నిధులు, ధన సంపత్తి. 8. భోగానికి, దానానికి , త్యాగానికి  కొరత లేని  అమేయ ధాన్య సమృద్ధి. అనే యీ ఎనిమిదింటిని  శాస్త్రాలు "అష్టైశ్వర్యాలు" గా అభివర్ణించాయి. భగవత్కృప ఉంటే  ప్రతి  మనిషి అన్ని కాకపోయినా, కొన్నైనా అమరాలని ఆశిస్తాడు. అందుకు అర్హతగల సన్మతి , సచ్చింతన, సత్కార్యాచరణ నిరతి కలిగి ఉండాలని సారాంశము*.

                                     *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

జీవిత వ్యాపారం

 ఆనందం


🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂


 అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి,  రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి ,  కుళ్ళిపోయినవి  తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.


 మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. 


 'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.  వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే,  మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.


 జీవితానుభవాలు అంతే.  బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను , మనసులోంచి తీసేయాలి.


 ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి . సానుభూతి చూపాల్సిన వారిపై,  సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను,  విస్మరించాలి.  ప్రశంసించిన వాళ్లను,  ప్రశంసించాలి. 


మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది.  

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌻🕉️🕉️🕉️

రామాయణమ్.112

 రామాయణమ్.112

...

ఎవరి మాట వారిదే ఎవరి పట్టుదల వారిదే ! 

ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు ! తండ్రి కిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు ! ఎవరి పట్టు వారిదే ! ఈ ధర్మమూర్తులను చూసి అక్కడ చేరిన ఋషిగణమంతా ప్రశంసించింది.

.

కానీ ! వారికి తెలుసు రావణ సంహారం జరగాలంటే రాముడు అడవిలో ఉండాల్సిందే ! లోక కళ్యాణం కోసం వనవాసిగా రాముడు జీవించాల్సిందే .

.

అందుకే వారంతా ముక్తకంఠంతో భరతా నీవు ఉత్తమకులసంజాతుడవు,గొప్ప బుద్ధిమంతుడవు ,మంచి ఆచారము తెలిసిన వాడవు ,గొప్ప కీర్తికలవాడవు ,నీకు నీ తండ్రిపై గౌరవ భావమున్నచో రాముడు చెప్పినట్లుగా చేయి.

.

దశరధుడు కైక ఋణము తీర్చుకున్నందువలననే స్వర్గమునకు వెళ్ళగలిగినాడు.ఇప్పుడు రాముడు వెనుకకు మరలెనా !దశరథునకు అనృతదోషం కలిగి ,

స్వర్గంనుండి నెట్టివేయబడతాడు.

.

భరతుడు గజగజవణికిపోతూ మాటలు తొట్రుపడుతుండగా రామా ! రాజ్యము పాలించే సమర్ధత నాకు లేదయ్యా! అని అన్నాడు.

.

అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు.నీవు రావలసినదే అని ప్రార్ధిస్తూ రాముడి కాళ్ళమీద పడ్డాడు.

.

భరతుడిని దగ్గరకు తీసుకొని ! భరతా నీవు సమర్ధుడవు కావని ఎవరన్నారు? నీకు గురు శిక్షణ ,ఉత్తమమైన బుద్ధి వున్నాయి ,బుద్ధిమంతులైన అమాత్యులతో కలిసి ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగల సమర్ధుడవు నీవు.

.

నీ తల్లి కైక కోరిక వల్లనో ,ఆశవల్లనో ,నీ కొరకు ఇంత చేసినది. నీవు దానిని మనసులో ఉంచుకొనక ఆవిడను గౌరవించు.

.

రాముడి దృఢసంకల్పానికి భరతుడు తలవొగ్గక తప్పలేదు .

.

బంగరు పాదుకలు రెండు రామునికిచ్చి ఇవి నీవు నీ కాళ్ళతో తాకి నాకు ఇవ్వు! ఈ పాదుకలే ఇక నుండీ రాజ్యమేలుతాయి.

.

అంత రాముడు ఆ పాదుకలను ఒకసారి తొడుగుకొని విడిచి భరతునకు ఇచ్చాడు.

.

వూటుకూరు జానకిరామారావు

*శ్రీ వైద్యనాథాష్టకం

 *శ్రీ వైద్యనాథాష్టకం*

🙏🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🙏


*ఉపదేశం:-  సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.*


శ్రీరామ సౌమిత్రి జటాయు వేద, 

షడాననాదిత్య కుజార్చితాయ 

శ్రీనీలకంఠాయ దయామయాయ, 

శ్రీవైద్యనాథాయ నమఃశివాయ (1)


గంగా ప్రవాహేందు జటాధరాయ, 

త్రిలోచనాయ స్మర కాలహంత్రే 

సమస్త దేవైరభి పూజితాయ, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (2)


భక్తి ప్రియాయ త్రిపురాంతకాయ, 

పినాకినే దుష్టహరాయ నిత్యమ్‌

ప్రత్యక్ష లీలాయ మనుష్యలోకే, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (3)


ప్రభూతవాతాది సమస్తరోగ 

ప్రణాశకర్త్రే మునివందితాయ

ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (4)


వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః, 

వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుమఖప్రదాయ

కుష్ఠాది సర్వోన్నత రోగహంత్రే, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (5)


వేదాంత వేద్యాయ జగన్మయాయ, 

యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ

త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (6)


స్వతీర్థ మృత్‌ భస్మభృదంగభాజాం, 

పిశాచ దుఃఖార్తి భయాపహాయ

ఆత్మ స్వరూపాయ శరీరభాజాం, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (7)


శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, 

స్రక్-గంధభస్మాద్యభి శోభితాయ

సుపుత్ర దారాది సుభాగ్యదాయ, 

శ్రీవైద్యనాథాయ నమః శివాయ (8)


బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ

జపేన్నామ త్రయం 

నిత్యం మహారోగనివారణమ్‌ 


*సేకరణ*

🙏🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱🙏

*అద్వైత వేదాంత పరిచయం

 **అద్వైత వేదాంత పరిచయం**


5.1.1.4 మనుష్య యజ్ఞ్ణ:   :` నాలుగో యజ్ఞం మనుష్య యజ్ఞం.


 అన్ని రకాల సంఘసేవలు దీంట్లోకి వస్తాయి. అనాధశరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి, స్కూళ్ళకి, ఆసుపత్రులకి సహాయం చేయటం వగైరా. కాని ఆ సహాయం ఎలా చేయాలో కూడా శాస్త్రం ఉపదేశిస్తుంది.

  శ్రద్ధయా దేయమ్‌.

  అశ్రద్ధయా అదేయమ్‌.

  శ్రియా దేయమ్‌.

  హ్రియా దేయమ్‌.

  భియా దేయమ్‌.

  సంవిదా దేయమ్‌.    తైత్తిరీయం 1`11`6

  వచ్చిన చిక్కేమిటంటే, ఇప్పుడు తక్కిన నాలుగు యజ్ఞాలు పక్కన పెట్టేసి, ఇదొక్కటీ చేస్తే చాలనుకుంటున్నారు. ఇది సరియైన అవగాహన లేక వచ్చిన సమస్య. మనుష్యులకి కేవలం కార్బోహైడ్రేట్సే చాలు అన్నట్టుంది. అందుకని మనుష్య యజ్ఞంతో పాటు, తక్కిన యజ్ఞాలు కూడాచేయాలి.

5.1.1.5 భూత యజ్ఞ: :` ఐదో యజ్ఞం, భూత యజ్ఞం. మనిషితో కూడా

ఉన్న తక్కిన జీవరాశులన్నిటికీ చేసే సేవ. మన జీవితం సుగమంగా సాగటానికి తక్కిన జీవరాశులు కూడా తోడ్పడుతాయన్న విషయాన్ని మరవకూడదెన్నడూ. చెట్లూ, జంతువులూ, నదులూ మనకి తోడ్పడుతున్నాయి.

  అశ్వత్థో వటవృక్ష చందన తరుర్‌ మందార కల్పదృమౌ।

  జంబూ నింబ కదంబ చూత సరళ వృక్షశ్చ ఏ క్షీరిన:।

  సర్వే తే ఫల సంయుతా ప్రతిదినం విభ్రజనమ్‌ రాజతే।

  రమ్యం చైత్ర రథం చ నందనవనం కుర్వంతు నో మంగళం॥

  అశ్వత్థ, కదంబ, మందార, సరుగుడు చెట్లనీ, పండ్లిచ్చే జామ, మామిడి లాంటి చెట్లనీ, చైత్రవనాన్నీ, తోటనీ అవి చేసే సహాయాన్నీ నేను గుర్తుంచుకుని అవి మానవాళికి మంగళం చేకూర్చేలాగా పెంచి పోషించాలి.

  గంగ సింధు సరస్వతి చ యమున గోదావరి నర్మద।

  కావేరీ సరయు మహేంద్ర తనయ చర్మన్‌వతి వేదిక।

  క్షిప్ర వేత్రవతి మహా సుర నది ఖ్యాతీ చ య గండకీ।

  పూర్ణా పూర్ణ జలైహి సముద్ర సహిత: కుర్వంతు నో మంగళం॥

  ఇదే విధంగా గంగ, యమన, గోదావరి, నర్మద లాంటి ప్రవహించే నదులు చేసే సహాయాన్ని గుర్తుంచుకుంటాను. వాటికి నేను తిరిగి సహాయం చేయలేకపోయినా కనీసం వాటిని కలుషితం చేయను, నాశనం చేయను.    భారీ ఎత్తున చేయలేకపోయినా, ఇంట్లో తులసిచెట్టు పెట్టుకోవాలి మనం. దానికి భక్తిగా నీళ్ళు పోయాలి. అలాగే జంతువులన్నింటికీ మేలు చేయలేకపోవచ్చు, కాని తినేముందు కొంచెం అన్నం ముద్ద బయటపెడితే 

కాకులో, ఆవులో తింటాయి దాన్ని.

  ఇది సంపూర్ణమైన అవగాహన. వైదికుడు అంటే విశ్వానికి చెందిన పౌరుడు. ఎందుకంటే అతను ప్రపంచం గురించి, నక్షత్రాల గురించి తెలిసినవాడు. సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని ప్లానెట్లకీ ఆవాహన చెప్తాడు.


  ఆదిత్యం తర్పయామి॥

  సోమం తర్పయామి॥

  అంగారకం తర్పయామి॥

  మొత్తం సౌరమండలాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు.

  ఈ పంచమహాయజ్ఞం చేయటాన్నే నిష్కామ కర్మాణి, సాత్విక కర్మాణి, ఉత్తమ కర్మాణి,పరఉపకారకర్మాణి అంటారని చూసాం. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి తోడ్పడుతుంది ప్రాధమికంగా.


అద్వైత వేదాంత పరిచయం

5.1.2 మధ్యమ కర్మాణి:` ఈ రకం కర్మలు సకామ కర్మలు (కోరికతో చేసేవి). వీటిని రాజస కర్మాణి, పర ఉదాసీన కర్మాణి అని కూడా అంటారు. పర ఉదాసీన కర్మాణి అంటే ఎవరెలా పోతే నాకేం అని యితరులనిపట్టించుకోకపోవటం. వాళ్ళ సమస్యలని, వాళ్ళ ఉనికినే ఖాతరు చేయము. మన కోరిక తీరితే చాలు, అంతే. ఇలాంటి కర్మలు ప్రాపంచిక సౌఖ్యం తెచ్చిపెడతాయి కాని ఆధ్యాత్మిక ఎదుగుదలకిఏమాత్రం తోడ్పడవు.

అద్వైత వేదాంత పరిచయం

5.1.3 అధమ కర్మాణి :వీటిని తామస కర్మాణి, నిషిద్ధ కర్మాణి, పర అపకార కర్మాణి అని కూడా అంటారు. వీటి కింద చేయకూడని కర్మలు లేదా వినాశనకారి కర్మలు వస్తాయి. మనకి లాభం కలుగుతుంది కాని ఎదుటి వారికి హానికరమైన ఈ కర్మలు మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదల చేకూర్చకపోగా, ఇంకాకిందకి జారుస్తాయి.

ఆ విధంగా మొదటిది ఆధ్యాత్మిక పురోగతి కలగజేస్తే, రెండోది ఆధ్యాత్మిక స్థబ్ధత కలగజేస్తే, మూడోది ఆధ్యాత్మిక తిరోగతిని కలుగజేస్తుంది. కర్మయోగి తను చేసే కర్మలలో ఉత్తమ కర్మలు ఎక్కువగానూ, మధ్యమ కర్మలు తక్కువగానూ, అధమ కర్మలు శూన్యంగానూ ఉండేటట్టు మలచుకోవాలి. అధమ కర్మలు తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా అంటే పర అపకార కర్మలు చేసినా, వాటిని ఉత్తమ కర్మలతో తుడిచివేయాలి. ఆ విధంగా ఉత్తమ కర్మలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతాయి, తప్పనిసరి కర్మల నుంచి పుట్టిన పాపాన్ని తుడిచివేస్తాయి.

🙏🙏🙏

సేకరణ

- దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 2  / Sri Devi Mahatyam - Durga Saptasati - 2 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 1

*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 2 🌻*


అతణ్ణి ఇలా ప్రశ్నించాడు : నీవు ఎవరు? ఇక్కడికి రావడానికి కారణము ఏమిటి? శోకగ్రస్తునిలా, ఖిన్నునిలా, కానిపిస్తున్నావెందుకు? సస్నేహంగా పలుకబడ్డ ఈ రాజవాక్యాలను విని వైశ్యుడు వినయపూర్వకంగా (శిరస్సు) వంచి రాజుకు ఇలా బదులిచ్చాడు. (18-19)


వైశ్యుడు పలికెను : నేను సమాధి అనే పేరుగల వైశ్యుణ్ణి, ధనికుల ఇంట జన్మించాను. ధనంపై దురాశతో అసాధువృత్తిని అవలంబించి నా భార్యాపుత్తులు నన్ను విడనాడి, నా ధనాన్ని అపహరించి, నన్ను తరిమేసారు. 


భార్యాపుత్తులను ధనాన్ని కోల్పోయి, ఆప్త బంధువులచే విడనాడబడి దుఃఖీ పహతుడనై నేను ఈ అడవికి వచ్చాను. ఇక్కడ ఉండటం వల్ల నా స్వజనుల, భార్యాపుత్రుల కుశలాకుశలాలు నాకేమీ తెలియడంలేదు. (20-23)


ఇంటివద్ద వారిప్పుడు క్షేమంగా ఉన్నారా, క్షేమాన్ని కోల్పోయి దుర్దశను అనుభవిస్తున్నారా? వారిప్పుడు ఎలా ఉన్నారు? నా సుతులు సత్ప్రవర్తనులై ఉన్నారా? దుష్ప్రవర్తనులై ఉన్నారా? (25)


రాజు పలికెను : లోభంతో నీ ధనాన్నపహరించి నిన్ను నిరసించిన నీ

పుత్త దారాదులయెడల నీ మనస్సు ఎలా స్నేహబంధం కలిగి ఉంది?

వైశ్యుడు పలికెను : మీరు ఇప్పుడు ఎలా పలికారో అలాగే, ఆ భావమే, నాకు కూడా స్ఫురించింది. నేను ఏం చేయగలను? నా మనస్సు కాఠిన్యం వహింపకుంది. ధనంపై పేరాసతో తండ్రిపై నెయ్యాన్ని, స్వజనంపై ప్రేమను, పూర్తిగా విడనాడి భర్తయైన నన్ను వెళ్ళగొట్టిన వారిపైనే అది గాఢానురాగము కలిగి ఉంది. (26–31)


నాకిది తెలిసినా, ఇది దోషమని గ్రహించలేకున్నాను, ఉదార చిత్తుడవైన ఓ రాజా! బంధువులు దుర్గుణులైనా చిత్తం వారిపై ప్రేమాయత్తమై ఉంటోందే, ఏం చిత్రం! వారికై నేను నిట్టూర్పులు విడుస్తూ భేదం పొందుతున్నాను. ఆ అప్రీతిపరులపై నా మనస్సు నిష్ఠురత పూనకుంది. నేను ఏం చేయగలను? (32–34)


మార్కండేయుడు పలికెను : ఓ విప్రా ! అంతట సమాధి అనే ఆ వైశ్యుడూ, సురథుడు అనే ఆ రాజసత్తముడూ కలసి మేధసముని వద్దకు వచ్చి సముచిత మర్యాదలొనరించి, కూర్చొని అనేక విషయాలను గూర్చి (ఆయనతో) ప్రసంగించారు. (35–38)


సశేషం...

🌹 🌹 🌹 🌹