2, నవంబర్ 2020, సోమవారం

ధార్మికగీత -68*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత -68*

                                     *****

      *శ్లో:- దాసీ భృత్య స్సుతో బంధు: ౹*

             *వస్తు వాహన మేవ చ ౹*

             *ధన ధాన్య సమృద్ధి శ్చా ౹*

             *ప్యష్ట భోగా: ప్రకీర్తితాః  ౹౹*

                                       *****

*భా:- మానవుడు  భోగలాలసుడు. కష్ట సుఖాలు కావడికుండల వంటి వని తెలిసినా భోగభాగ్యాలలోనే నిరంతరం మునిగి తేలాలనుకుంటాడు. ఆ భోగాలు 8 విధాలు. 1. దాసీ :-  కర, కను సైగల మాత్రాన గృహసంబంధమైన అన్ని పనులను చక్కబెట్టగల దాస దాసీజనము.  2. భృత్య:-  ఇంటా-బయటా సకల ఆహార వ్యవహారాలు, రాచకార్యాలు  నేర్పుతో నిర్వహించగల సేవక గణము.  3. సుతః ;- దీక్షాదక్షతలు, శక్తిసామర్ధ్యాలతో సన్మార్గంలో పురోగమిస్తున్న పుత్రసంతతి .4. బంధు: :-  ఎలాంటి ఆపదలోనైనా  మేమున్నాము అని సంసిద్ధులై రాగల  ఆత్మీయ   బంధుగణము.  5.వస్తు :- అవసరానికి మించిన వెండి - బంగారు ఆభరణాలు , గృహ సామాగ్రి . 6. వాహన :- ఆయాసం లేకుండా ప్రయాణం చేయడానికి కావలసిన  ద్వి - చత్వారి చక్ర వాహన సంపత్తి. 7. ధన :- తరతరాలవారు   అనుభవించినా తరగని స్థిర - చర ఆస్తులు, నిల్వ- నిధులు, ధన సంపత్తి. 8. భోగానికి, దానానికి , త్యాగానికి  కొరత లేని  అమేయ ధాన్య సమృద్ధి. అనే యీ ఎనిమిదింటిని  శాస్త్రాలు "అష్టైశ్వర్యాలు" గా అభివర్ణించాయి. భగవత్కృప ఉంటే  ప్రతి  మనిషి అన్ని కాకపోయినా, కొన్నైనా అమరాలని ఆశిస్తాడు. అందుకు అర్హతగల సన్మతి , సచ్చింతన, సత్కార్యాచరణ నిరతి కలిగి ఉండాలని సారాంశము*.

                                     *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: