2, నవంబర్ 2020, సోమవారం

మిడిసి పాటు*

 *మిడిసి పాటు*


పొలాల సమీపంలో ఇల్లు కట్టుకుని, ఏపనీ చేయక పని చేసేవారిని ఎగతాళి చేస్తూ సునాయాసంగా జీవించ సాగింది సురభి అనే నక్క.


ఓరోజు కూతురి పెళ్ళి చూపులు అబ్బాయి అమ్మా అబ్బ వచ్చారు. వారికి వెంట్రకాయలతో విందు చేసింది. పండి పోయారు. అమ్మాయిని కూడా నచ్చారు.

"అబ్బాయి ఏం పనిచేస్తుంటాడు?"

"మా వాడు మంచి రైతు. ధాన్యం పండించి అందరికీ అన్నం పెట్టి దేశానికి వెన్నెముక  అన్నదాత  రైతేరాజు అనే బిరుదులు అందుకున్నాడు."

"ఏం రైతులేవయ్యా! ఆరుగాలం కష్టపడి పండించి, అమ్ముకునే సమయంలో దిక్కుతోచక కూటినీళ్ళకు అమ్ముకునే వాడు. మాకవసరం లేదు.

ప్రభుత్వ ఉద్యోగులకయితే, పుట్టినా పోయినా తుమ్మినా దగ్గినా శెలవు లు ఇస్తారు."

మారుమాటాడక వెనుతిరిగింది రైతుకుటుంబం.


ఓరోజు ఏం పాలుపోక  రాజుగారైన పులి దగ్గరకు పోయింది సురభి.

"ఏం సురభి ఇలా వచ్చావు?"

"అందరూ పనులు చేసుకుంటున్నారు. నాతో మాట్లాడేటందుకు ఒక్కరూ లేరు నీ వైతే తీరికగా ఉంటావని వచ్చాను."

అయ్యో!రామా! నాకుమాత్రం తీరికెక్కడుంది? నేనుకూడా వేటకు బయలు దేరబోతున్నాను."

"మీరూ పనిచేసి మేమూ పనిచేస్తే మీ గొప్పేముంది?

" ఏం చేద్దాం మాతల రాత పనిచేయాలని వుంటే తప్పదు గదా"!


చూసేదానికి గంభీరంగా కనిపిస్తారు లోపలంతా లొట్టే ఎందుకొచ్చానురా "తలబాదుకుంటూ ఇల్లు చేరుకుంది.


సాయంత్రం వేళ పొలాల వైపుకు వేటకు బయలు దేరింది సురభి.

 బొరియలలో తోక పోనించి తిప్పుతుంది అదేదో వింతని తోక పట్టుకుని బయటకు వస్తుంది. దాన్ని తీసుకుని బుట్టలో వేసుకుంటుంది.

అలాచేస్తూ చేస్తూ ఒక బొరియలో తోకపెట్టి తిప్పింది. తోకపట్టుకుని పాము బయటకు వచ్చి కసితీరా కరిచింది.

చచ్చానురా దేవుడాయని ఏడుస్తూ వస్తున్నది. అంతలో పులి కనిపించింది. జరిగింది చెప్పింది. రాజవైద్యులను పిలిపించి మందు వేయించాడు. కొంత సేపటికి నొప్పి తగ్గింది.


" క్షమించండి మహారాజా! మీ స్థాయి ఏమిటో తెలుసుకోలేక ఆనాడు ఏవేవో వాగాను అది మనసులో పెట్టుకోక నాప్రాణం కాపాడారు"అంటూ కాళ్ళ మీద పడింది.


మరునాడు రైతు కుటుంబాన్ని పిలిపించి "పండించి అందరికీ అన్నం పెడుతున్నారు మీరు లేనిదే మానవ మనుగడే లేదు నా అజ్ఞానాన్ని మన్నించండి." అని  రైతు కొడుకు నకు కూతురునిచ్చి వైభవంగా పెళ్ళి జరిపించింది సురభి.

✍🏻జంజం కోదండ రామయ్య

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

కామెంట్‌లు లేవు: