2, నవంబర్ 2020, సోమవారం

శనేశ్వరస్వామి దేవాలయం,

 #శనేశ్వరస్వామి దేవాలయం,మందపల్లి, కొత్తపేట మండలం, తూ.గో జిల్లా*

 

హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. 


మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. 


ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు,మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.


రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ శ్రీ శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామిని దర్శించుకోవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. శనీశ్వరునికి ప్రీతికరమైన "శనిత్రయోదశి" పర్వదినాన మందేశ్వరునికి విశేష పూజలు గావించిన వారికి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.


మీ ఈతిబాధలు, సమస్త దోషములు తొలగిపోవాలంటే... "శనిత్రయోదశి" నాడు (జనవరి 21- శనివారం) మందేశ్వర స్వామిని దర్శించుకుని ఏకాదశి రుద్రాభిషేకం, తైలాభిషేకం చేయించండి. శనిత్రయోదశి శనివారమే రావడం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేయించేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.


#మందేశ్వర ఆలయానికి ఎలా వెళ్లాలంటే:


మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ దివ్యక్షేత్రానికి తూర్పుగోదావరి జిల్లా "రాజమండ్రి" నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా "రావులపాలెం" చేరుకోవాలి. రావులపాలెం నుంచి మందేశ్వర స్వామి వారి ఆలయం సుమారు 9 కిలోమీటర్లు దూరంలో ఉంది. రమణీయమైన కోనసీమ ప్రాంతం "మందపల్లి" గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం వెలసి ఉంది.


అలాగే పరమేశ్వరుడు మునులకు శనైశ్చర కవచం బోధించాడు. శని అంటే శక్తి. శనీశ్వరుడంటే శివభక్తి. సింగణాపురంలో శని శిలామూర్తిగా వెలసాడంటారు. గుడి, గోపురం లేని దేవతగా భక్తులచే పూజలందుకుంటున్నాడు ఈ క్షేత్రంలో మద్యపానం, మాంసాహారం నిషిద్ధం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని మందపల్లిలో ఈ శనీశ్వరాలయం ఉంది. ద్రావిడ శైలిలో నల్లరాతిపై మలచిన ఈ విగ్రహాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశినాడు అభిషేకిస్తారు.


#మందేశ్వర (శనీశ్వర స్వామి) ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలు:

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలతో పాటు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అనుమతులు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సింగం రాధా తెలిపారు, కోవిడ్ 19 కారోనా వైరస్ సందర్భంగా గత 5 నెలల నుండి ఆలయంలో స్వామివారి అభిషేకములు పూజా కార్యక్రమాలను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పూజా కార్యక్రమాలను స్వామివారికి అభిషేకములు చేయడం జరిగిందని ఆమె తెలిపారు, అయితే ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు అరుపు ఇకనుండి స్వామివారి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలను అభిషేకములు స్వామివారి దర్శనములు చేసుకునేందుకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు,

కామెంట్‌లు లేవు: