2, నవంబర్ 2020, సోమవారం

దేహి దేహం

 దేహి దేహం 

మన మహర్షులు అత్యంత మేధస్సు కలిగిన జ్ఞానులు వారు వారి మేధాశక్తితో ఈ సృష్టి రహస్యాలు అనేక విధాలుగా తెలుసుకున్నారు. ఆ పరంపరలోనే భగవంతుని గూర్చిన జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు.  మనిషి మొదటినుంచి ఈ ప్రపంచాన్ని తన ఇంద్రియ జ్ఞానంతో తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న ప్రతి విషయాన్నీ కూలంకుషంగా పరిశీలించటం మొదలు పెట్టాడు. అట్లా పరిశీలిస్తూ వెళితే క్రొత్త క్రొత్త విషయాలు తన జ్ఞానానికి అందటం జరిగింది. 

ముందుగా ఇక్కడ కనిపించేది ప్రతిదీ ఏదో ఒక ప్రత్యేకత కలిగి వున్నది. ఒకదానికి ఇంకొకటి పోలిక లేకుండా ఉంటడం గమనించాడు. ఒకే రకమైన వస్తువులలో కూడా సూక్షమ తేడాలు కనపడుతూవున్నాయి. కొన్ని తేడాలు తేలికగా తెలుసుకోవచ్చు కొన్ని కొంత సూక్ష్మ జ్ఞానంతో తెలుసుకోగలుగుతున్నాడు. 

ఈ విషయాలు ఇలానే ఎందుకు ఉండాలి. దానిని నియంత్రించే నియంత ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. యెంత ప్రయత్నంచేసి పరికించినా ఆ నియంత ఆచూకీ తెలియటం లేదు. కానీ కారణభూతుడు ఎవరో వున్నారని మాత్రం జ్యోతకం అవుతున్నది. 

మానవుడు తన తెలివితేటలతో అనేక శాస్త్రాల పరిజ్ఞానాన్ని పొందుతున్నాడు. కానీ అన్ని శాస్త్రాలు కొంతమతుకే ఉండి ఏదో ఒక దశలో అవి కొనసాగలేక పోతున్నాయి. ఉదాహరణకు భౌతిక శాస్త్రాన్ని తీసుకోండి అది ప్రతి పదార్ధం అణువులు, పరమాణువులు, ఎలక్ట్రాన్సు, ప్రొటన్సు, న్యుట్రాన్సు తో అణువులు ఏర్పడ్డాయి అని చెప్పి అంతకన్నా ముందుకు పోలేక పోతున్నది. అక్కడ ఆగిన శాస్త్రం ఒక రకంగా అర్ధంతరంగానే వున్నది అని చెప్పాలి. 

న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అని చెప్పుతున్నారు. ఈ ఎలక్ట్రానులు నెగటివ్ ఛార్జి కలిగి వున్నదని, నూక్లియస్ పాజిటివ్ ఛార్జి కలిగి వున్నదని మన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఒక మూలకంలో వున్న ప్రతి పరమాణువు ఒక నిర్దిష్ట ఎలక్ర్టానులు, అదే సంఖ్యలో ప్రోటానులు ఉండటానికి కారణం ఏమిటి. అట్లా వున్నా పరమాణువుల్ని ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉండటానికి కారణం ఏమిటి. ఇలాంటి ప్రశ్నలకు ఇంతవరకు జవాబు లేదు. 

ఒక వృక్ష శాస్త్రమో లేక జంతు శాస్త్రమో తీసుకున్నామనుకోండి అది ఏక కణ జీవి నుండి అభివృద్ధి చెందినదని తెలుసుకున్నారు. మరి ఆ ఏక కణ జీవి ఎలా భూమిమీదికి వచ్చింది అనే ప్రశ్నకు జవాబు లేదు. కొన్ని ఊహా గానాల సిదంతాలు వున్నాయి కానీ వాటికి నిరూపణ ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు చేయలేక పోయాడు. 

దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి శాస్త్రం కూడా కొంత వరకు చేరుకొని ఆ తరువాత అది ఒక దగ్గర ఆగి పోతున్నది. అంటే మన శాస్త్రాలకు అంతుచిక్కని విషయం ఏదో మనకు ఉండవచ్చనే అభిప్రాయాన్ని కలుగ చేస్తున్నది. మరి ఆ అంతుచిక్కని విషయం ఏమిటీ అదే విచారణ మన మహర్షులు చేశారు. తెలియని మహర్షులకు వారు కనుగొన్న విషయాలను బోధించారు.  ఆ విధంగా తెలుసుకోబడ్డ జ్ఞానమే అతి ఉత్తమము మహోన్నతమైనది గా నేటికీ పరిగణించబడుతుంది. ఎందుకంటె మన ఋషులు బోధించిన విషయాలకు బిన్నంగా ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేక పోయాడు అంటే దాని అర్ధం ఆ జ్ఞానమే పరిపూర్ణమైనది. అందుకే దానినే బ్రహ్మ జ్ఞ్యానం అని అన్నారు. 

ప్రతి కనిపించే దాని వెనుక ఒక కనిపించని శక్తి ఉండి మనకు కనిపించే దానికి ఊతం ఇస్తున్నది. 

మన ఋషులు ఈ విషయాన్నీ రధి రాధికుడు అని వివరించారు. దానినే మనకు సాధారణంగా అర్థమైయేటట్లు మనం  రోజు చూసే  కారు డ్రైవరుగా పేర్కొంటూ మీకు వివరిస్తాను. 

కారు ఒక జఢ వస్తువు దానిని ఎప్పుడైతే స్టార్టు చేస్తామో అప్పుడు అది చెతన్యం పొంది నడవటానికి సానుకూలం అవుతుంది. కానీ దానిని ఒక నిర్దుష్ట విధానంగా నడిపితేనే అది రోడ్డుమీద సవ్యంగా నడుస్తుంది. ఆలా నడిపే వ్యక్తే డ్రైవరు. అంటే ఒక జడంగా వున్న కారుని ఒక చేతనయవంతమైన డ్రైవరు నడపటం వాళ్ళ అది చక్కగా రోడ్డు మీద నడుస్తుంది. కారు నడపటమే కాదు కారు సవ్యంగా ఉంచటం కూడా డ్రైవరు భాద్యతే. 

మన శరీరం కూడా ఒక కారు లాంటిదే డ్రైవరు ఎవరో ఒకరు మన లోపాడ వుంది ఈ శరీరాన్ని నియంత్రిస్తున్నాడు. అందుకే ఈ శరీరం సవ్యంగా సమాజంలో సామాజిక వ్యవస్థలో ఇమిడి వుంటున్నది. ఎలాగైతే డ్రైవరు సవయంగా లేకపోతె కారు ప్రమాదాలకు గురి అవుతున్నదో అదే విధంగా మనిషి తనలోని డ్రైవరు సరిగా లేకపోతె అనేక వ్యసనాలకు బానిసగా మరి ఒక చెడ్డ మనిషిగా మారుతున్నాడు. 

తెలివయిన మనిషి తనలోపల వున్న ఆ డ్రైవరు ఎవరు అని ఆలోచిస్తాడు.  ఆ డ్రైవరునే మన ఋషులు ఆత్మ అని పేర్కొన్నారు. అదే ఈ దేహంలో వున్న దేహి.






కామెంట్‌లు లేవు: