మరణం లేని నీవు.
ఈ మాట ఎవరైనా అంటే అది నిజం కాదు అబద్దం అని మనం అనుకుంటాము కదా. కానీ ఇది నిజంగా నిజం. ముందుగా మనం ఏదైతే మనం మరణం అనుకుంటున్నామో అది ఏమిటి మరి మరణం లేకుండా ఎలావుంటుంది అనేది తెలుసుకోవాలి.
నిజానికి మనం ఈ చరాచర సృష్టిలో కొంత కాలం ఉండటానికి వచ్చాము. ఆ విషయాన్ని మరచి పోయి మనం ఇక్కడ అనేక బంధాలను ఏర్పాటు చేసుకొని వాటితోటె మన జీవితం అని బ్రాంతి కలిగి ఉంటాం. దాని పర్యవసానమే మరణం. కానీ ఆ బంధాలు కేవలం ఈ శరీరానికి మాత్రమే కానీ నాకు కాదు అని అనుకుంటే నీకు మరణమే లేదు. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి.
ఒక నదిలో ఎన్నో కర్ర దుంగలు కొట్టుకొని పోతూవున్నాయి అందులో ఒక రెండు దుంగలు ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒకదానితో ఒకటి కలిసి కొంత దూరం ప్రయాణించింది అనుకోండి. నిజానికి ఆ రెండు దుంగలు ఒకదానితో ఒకటి ఏరకంగా కలిసి లేవు కానీ ప్రక్క ప్రక్కన ఉన్నందున అవి రెండు కలిసి వున్నాయి అని అనుకుంటున్నాయి. నిజమేమిటంటే ఆ ప్రవాహంలో దేని దారి దానిదే కొంత సమయం తరువాట్ అవి విడిపోతాయి. అవి ఎలా విడి పోతాయి అంటే ఒకదానికి ఒకటి ఆనవాళ్లు కూడా లేకుండా విడిపోతాయి. అంటే దేని గమ్యం దానిదే
మన జీవితాలు కూడా రెండు లేక ఇంకా నాలుగు దుంగలు లాంటివే వాటి కలయిక కూడా కొంత కాలమే ఉంటుంది. కానీ మనం ఆ బంధాలు శాశ్వితం అని ఆనుకోటం ఒక అబద్ధం. కానీ అదే నిజము అని అనుకోటం మనం చేసే పొరపాటు. నిజానికి మనం ఏది నిజమో అది అబద్ధం అని ఏది అసత్యమో అదే నిజమని అనుకోటం మన ప్రస్తుత మానసిక స్థితి. ఈ స్థితిని దాటాలంటే మనం జ్ఞానవంతులం కావలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి