2, నవంబర్ 2020, సోమవారం

శ్లోకం – 37:*

 *శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*

*శ్రీ సద్గురు పరమాత్మనే నమః – సర్వమహర్షిభ్యోనమః*

*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*

*9494970459*

*ఓం శ్రీ లలితాంబికాయై నమః*

*సౌందర్య లహరి – సాధన*

*ప్రథమ భాగః – ఆనంద లహరి*


*శ్లోకం – 37:*


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


*ప్రతిపదార్థము :*


*తే* = నీ యొక్క;

*విశుద్ధా* = విశుద్ధ చక్రంలో;

*శుద్ధ స్ఫటిక విశదం* = దివ్యంగా ప్రకాశించే మణిలా నిర్మలమైన;

*వ్యోమజనకం* = ఆకాశతత్త్వం జనించడానికి ఆధారభూతుడై లేదా మనః ప్రభావ వికసితుడై;

*శివం* = శివ త్తావాన్ని;

*దేవీం అపి* = భగవతి రూపాన్ని;

*సేవే* = ఉపాసిస్తాను;

*యయోః* = ఏ శివ - శివాణీల నుండైతే;

*యాంత్యా* = వస్తోందో;

*(అట్టి) శశికిరణ సారూప్య సరణేః* = చంద్రకిరణరూప మార్గాల యొక్క;

*కాంత్యాః* = ప్రకాశంతో;

*జగతీ* = ముల్లోకాలూకూడ;

*విధూతాంతః ధ్వాంతా* = లోలోపల అంధకారం ఆవరిస్తున్న చోట దాన్ని తరుమునో;

*విలసిత* = చకోరిలా ప్రకాశిస్తున్నది.


*తాత్పర్యము / భావము:*


*శుద్ధ ఆకాశ తత్త్వమైన దేవీ భగవతి - భగవానుల యొక్క విశుద్ధ చక్రాధిష్ఠానస్తుతి ఇది. అమ్మా ! దోషం ఎంత మాత్రం లేని దివ్య స్ఫటిక విలసితుడైన వాడు - ఆకాశం ఉత్పాదనలో హేతువైన వాడు పతి అయిన సదాశివుడు. అట్టి శుద్ద స్ఫటిక మూర్తినీ - అంతే స్థాయిలో సమానురాలివైన నిన్ను నేను ఆరాధిస్తున్నాను. శివాణీ శివాత్మకాలైన మీ నుండి వచ్చే చంద్ర కిరణాలతో సాటి వచ్చే మీ వైభవం గల కాంతులు, ముల్లోకాలలోని అజ్ఞానం అనే చీకటిని పోకాల్చే వెన్నెల వెలుగులనడానికి సందేహంలేదు. చంద్రునికై వేచి ఉండే చకోరపక్షి, ఆ వెన్నెల త్రాగి ఎలా సంతృప్తి చెందుతుందో, మీ దివ్య దీధితుల చేత లోకం అలా కాగలదు.*


*ఉపాసన :*


*రోజుకి వెయ్యిసార్లు చొప్పున నీటిమీద పై యంత్రాన్ని వ్రాస్తూ - వెయ్యిసార్లు మంత్రోచ్ఛారణ చేయాలి. బెల్లంపాయసం, అరటిపండ్లు కొబ్బరి కాయలు నివేదించాలి. బ్రహ్మ మనలోని రాక్షసత్వం దుర్లక్షణాలు మొదలైన వాటిని నిర్మూలించేందుకు ఆ మంత్రజలం అద్భుతంగా పనిచేస్తుంది.*


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


💐💐💐💐💐💐💐💐💐

*తృతీయ శ్రీమద్భాగవతసప్తాహం*

*ప్రవచనకర్త*

*బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు*

*December 10th to 16th, 2020*

*December 17th – రుక్మిణీకృష్ణుల కల్యాణము*

*KUKATPALLY, HYDERABAD*

💐💐💐💐💐💐💐💐💐

*JAGADGURU CHARITABLE TRUST*

*AXIS BANK CURRENT Account* 

*No.: 919020035877535*

*IFS Code: UTIB0000702*

💐💐💐💐💐💐💐💐💐

*Google Pay / Paytm / PhonePe**

*9494970459 / 8793824603*

💐💐💐💐💐💐💐💐💐

*srijagadgurutrust@gmail.com*

*www.srijagadguru.com*

*Phone : 040-48546039*

💐💐💐💐💐💐💐💐💐


*విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం*

*శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్!*

*యయౌ కాంత్యా యాంత్యా శశికిరణసారూప్యసరణేః*

*విధూతాంతర్ద్వాంతా విలసతి చకోరీవ జగతీ ||37||*


💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: