10, ఏప్రిల్ 2023, సోమవారం

మహాభారతం

 *కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్  దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ నిర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్*


మహాభారతం సభాపర్వం, ద్యూతక్రీడా ఘట్టంలో నన్నయ్యగారు రాసిన పద్యం ఇది. అందరికీ తెలిసినదే కదా!  


భీమసేనుడి భీషణ ప్రతిజ్ఞ.  కురువృధ్ధులు, పెద్దలైన గురువులు, బంధువులు ఇలా అనేకులు చూస్తూండగా ద్రౌపదిని అవమానించబూనిన దుశ్శాసనుడి రొమ్ముని భయంకర యుధ్ధంలో చీల్చి వధించి, వాడి రక్తాన్ని  ఉగ్రరూపం ధరించి తాగుతాను అన్నది భీముడు చేసిన ప్రతిన.   


ఈ పద్యంలో నన్నయ్యగారు    అనేక పొల్లు అక్షరాలు వాడారు.


కురువృధ్ధుల్, 

బాంధవులనేకుల్, 

చూచుచుండన్, 

ఖలున్,  

దుశ్శాసనున్, 

లోకభీకర లీలన్, 

చివరిగా ఉగ్రాకృతిన్!


పొల్లులు ఇన్ని ఎందుకు వాడారు నన్నయ్య గారు. ఏదైనా ప్రత్యేక కారణము కలదా. లేదా కేవలం గణ విభజన గురించే ఇలా వాడుకున్నారా అని కొన్ని రోజులుగా ఆలోచించి ఆలోచించి సతమతమవుతుండే వాడిని.


పై పద్యంలోని విపరీతంగా ప్రయోగించి బడిన పొల్లు అక్షరాల గురించి ఆరా తీస్తున్నప్పుడు దొరికిన పూర్తి వివరాలు ఇవిగో. 


ఇలాంటిదే అంటే దీనికి విరుద్ధమైన నన్నయ్య గారి మరో పద్యాన్ని గూడా పరిశీలిద్దాం. 


*ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరుని జోరు దేశమున మీ నుండగ బిల్చినని ద్దురాత్ము దుర్వార మదీయ బాహు మీ పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్*


పైపద్యం భీముడు దుర్యోధనుడి ఊరువులు పగలకొడతానన్న సంధర్భం లోనిది. అదీ నన్నయ్య గారు వ్రాసిందే.  


చివరిలో ఒక్క పొల్లు తప్ప మరెక్కడా పొల్లు కానరాదు. అంటే ఇక్కడ నన్నయ్య గారి ఉద్దేశం కేవలం గణ విభజన ప్రక్రియకు అనువైనదిగా పూరించడానికి గాను ఆ పొల్లును వాడినట్లు మాత్రమే అవగతమవుతుంది. ,  

 

అలాంటప్పుడు మనం మొదట్లో చర్చకు గైకొన్న పద్యంలో నన్నయ్య గారు అన్ని పొల్లులను ఎందుకు వాడినట్టు మరి.   


నన్నయ ఈ నకార పొల్లులు ఇన్ని ఎందుకు వాడారో తెలుసుకొనే ముందు మనం తెలుగు వ్యాకరణం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. క్షమించాలి, తెలుసుకోవాలి అనడం కన్నా మరోసారి మన జ్ఞాపకాలను తిరగేద్దాం. 


*క* నుండి *క్ష* వరకు ఉన్న అక్షరాలను హల్లులు అని అంటారని మనందరికి  తెలుసు. అంటే అచ్చుల సహాయం లేనిదే హల్లులు పలకబడవు. 


ఉదాహరణకు *క* అనాలంటే *క్*+అ  కలిస్తేనే *క* అవుతుంది. వీటిని వ్యంజనములు అని అంటారు.(వ్యజతే అనేన ఇతి వ్యంజనం). 


దీనివల్ల  అక్షరం స్పష్టంగా చెప్పగలం. ప్రాణములు (అచ్చులు) కలసివుంటాయి కనుక వీటిని ప్రాణులు అనీ అంటారు.


ఇక అచ్చులు 16.అ నుండి అః వరకు ఉన్నవి. ఇవి స్వతంత్రం గా ఉచ్చరింపబడుతవి కనుక వీటిని ప్రాణములనీ, స్వరములనీ అంటారు.


పొల్లు అంటే అక్షరానికి ప్రాణమైన అచ్చు లేకుండా వాడబడిన హల్లు.


ఇలా ప్రాణరహితమైన అక్షరాల లాగానే దుశ్శాసనుడు కూడా నిర్జీవుడౌతాడు సుమా అని హెచ్చరిస్తున్నట్టు అలాంటి పొల్లును నన్నయ్యగారు పదేపదే వాడి భావోద్రేకాన్ని తీవ్రతను సూచించడమే బహుశా కవి యొక్క నెపమేమో.  


సమంజసమేనని అనిపిస్తుంది. అంటే కవి ఆ విషయ తీక్షణతను తన పద్య రచనలో ఇలా పొందుపరిచి ఉండవచ్చునని ఓ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తప్పుకావొచ్చు కూడా.

 

శంకరాభరణం సమూహం వారు ఇచ్చిన

సమస్య - 4390

9-4-2023 (ఆదివారం) 


ఇది...


*“జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్”*


నా ప్రయత్నం ఇలా......


కొలువు చేసిన పనికి జీతమిచ్చుట వాడుక


మలుపులు తిరుగు కొలవులు మాన్యుల ఆజ్ఞపై 


నీలిమేఘశ్యాముని సేవ జీతము లేనిదౌ


కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.

:


 సమస్య(122):-


"వేడి పెరుగుచుండఁ బ్రజకు వేడుక కలిగెన్"


నా ప్రయత్నం:


మధురలో కంసుని పాలన క్రూరమయ్యాను


మధురమయ్యేను రేపల్లెలో శ్రీకృష్ణుని చేష్టలు 


మాధవుడు మధురకు వచ్చునను వార్త చేరి


అధీశుని కంస దేహవేడి పెరుగుచుండ ప్రజకు వేడుకగలిగెన్.

మూర్ఛవ్యాధి హరించుటకు

 మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు  - 


 * రేగుగింజలలోని పప్పు , మిరియాలు , వట్టి వేళ్ళు , నాగకేసరములు ఈ వస్తువులను సమానంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు రెండున్నర గ్రాములు చూర్ణం చొప్పున తేనెతో కలిపి ఇచ్చుచుండిన యెడల మూర్ఛలు హరించును . 


 * ఒక జాజికాయకి రంధ్రం చేసి పట్టుదారంతో గ్రుచ్చి కంఠము నందు కట్టుకొని తీయకుండా ధరించుచుండిన స్త్రీల మూర్చవ్యాధి , హిస్టీరియా వ్యాధి నశించును.


 * ఇనుప గంటె లో పొంగించిన అల్లపురసం గిద్దెడు తీసుకుని ముప్పై గ్రాములు పటికబెల్లం పొడి కలుపుకుని ప్రాతఃకాలం నందు నిత్యం సేవించుచున్న యెడల మూర్చవ్యాధి హరించును . 


 గమనిక - ఇనుప గంటె తీసుకుని దానిలో అల్లంరసం పోసి వేడి చేసిన వేడికి గంటె లోని అల్లం రసం పొంగును.


 *  జటామాంసి చూర్ణం 60 గ్రాములు , హారతి కర్పూరం రెండున్నర గ్రాములు , దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు మూడింటిని తీసుకుని కలిపి మెత్తగా నూరి ఒక గాజు సీసాలో పోసుకొని ప్రతినిత్యం భోజనమును ముందు 3 గ్రాముల చొప్పున తింటూ ఉన్న యెడల అపస్మారం హరించివేయును . దీనిని మించిన ఔషధం లేదు . 


 *  ఆవు యొక్క ఎడమ కొమ్ముని ఉంగరంలా చేసుకుని ఎడమ చేతికి ధరించిన అది చేతికి ఉన్నంతవరకు మూర్ఛ రాదు .


 గమనిక - 


 మూర్చ వచ్చి కొట్టుకుంటున్న వ్యక్తి కి సీతాఫలం చెట్టు ఆకు నలిపి ముక్కుదగ్గర పెట్టి వాసన చూపించిన వెంటనే మూర్చ తగ్గి తెలివి వచ్చును.


     రావిచెట్టు పాలు 4 చుక్కలు ముక్కులో వేసినను మూర్చ తగ్గి వెంటనే తెలివి వచ్చును. రెండు ముక్కులలో అటు 2 ఇటు 2 వేయవలెను . 


     ఇవి నా అనుభవ యోగాలు ..


          


          

కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు

 కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో????


ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది


ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే 

ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు


దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది


ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి

రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు

 

ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.


అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను 

కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు


భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది


భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు


సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త


వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది


దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు


జీవతం చాలా నేర్పిస్తుంది


నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది


అహంకారం అసలు పనికిరాదు

జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు


ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని

నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.


 మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.


 సర్వేజనా సుఖినోభవంతు 🙏🏻🙏🏻

అభిజ్ఞాన శాకుంతలం

 శ్లోకం:☝️

*సరసిజమనువిద్ధం శైవలేనాపిరమ్యం*

*మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి l*

*ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపి తన్వీ*

*కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం ll*


భావం: అందానికి ఏ ఆభరణమైనా అలకారమే

కాళిదాసుని "అభిజ్ఞాన శాకుంతలం" నాటకంలో, వేటకోసం అడవికొచ్చిన దుష్యంతుడు మునివాటికలో వున్న శకుంతలను చూసి ఇలా అనుకుంటాడుట.

కమలం నాచులో పుట్టినా రమ్యంగానే ఉంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే. అసలు సహజ సౌందర్యమే ఉండాలి గాని, ఎలాంటి బట్టకట్టినా బాగానే ఉంటుంది. ఈమె నారచీర కట్టినా బాగానే ఉంటుంది. మధురమైన ఆకృతిగల శరీరానికి అలంకారం కానిదేది? (ఏ వస్తువు(నగ/చీర) తొడిగినా అది అందంగానే తోస్తుంది.

మహాస్వామి

 


 మహాస్వామి - మానసిక చికిత్స


బుద్ధిమాంద్యంతో ఉన్న తమ పిల్లాణ్ణి తీసుకుని దంపతులొకరు కాంచీపురానికి వచ్చి, పిల్లవాడు చాలా దీన స్థితిలో ఉన్నాడని, అతని స్థితి బాగుపడేలాగా ఆశీర్వదించమని మహాస్వామివారితో మొరపెట్టుకున్నారు.


అప్పుడు వారికి, మహాస్వామివారికి జరిగిన సంభాషణలో నేను గ్రహించినది.


మహాస్వామి : “పిల్లాడు ఏదేని నెప్పితో బాధపడుతున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు పెరియవా”


మహాస్వామి : “ఆహారం కావాలని లేదా తిననని మారాం చేస్తున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు, ఏది పెడితే అది తింటున్నాడు”


మహాస్వామి : “తన ఈ స్థితి వల్ల మానసిక కృంగుబాటుకు లోనవుతున్నడా?”

తల్లితండ్రులు : “లేదు, తను అందరిలాంటి పిల్లవాడు కాదని తనకు అస్సలు తెలియదు”


మహాస్వామి : “కోరిక, బాధ, ఆకలి, ఆశ, నిరాశ లేని ఉత్తమ స్థితి కోసం మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మీ పిల్లాడి స్థితి అటువంటిది. అది భగవంతుడు తనకి ఇచ్చిన గొప్ప వరం. అతనికి శారీరక, మానసిక సమస్యలు ఏవీ లేవు. ఆ స్థితిని పోగొట్టి అతనికి బాధను ఎందుకు కలగజేయాలని అనుకుంటున్నారు? మీరు ఇచ్చే మందులు పూర్తిగా అతడి సమస్యను తీర్చి, సాధారణ పిల్లాడిలా మార్చగలిగితే మీరు ప్రయత్నించవచ్చు. కాని అది సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు”


ఇది సాధారణ ఆలోచనలకు అతీతంగా ఉన్న విషయం. కాని సరైనది, స్థిరమైనది కూడా!


ఒకసారి పోస్ట్ మేనింజిటిక్ హెమిపరెసిస్ తో బాధపడుతున్న బిడ్డతో తల్లితండ్రులు మహాస్వామివారి వద్దకు వచ్చారు. వారు మధ్యతరగతి ఆదాయానికి చెందినవారు. చాలా బాధలో ఉన్నారు. వారు స్వామివారితో, “ఇలా మాకే ఎందుకు జరిగింది? ఏమి తప్పు చేశామని మాకు ఈ బిడ్డ బరువుని ఇచ్చారు? వేలకొలది తల్లితండ్రులకు మంచి పిల్లల్ని ఇచ్చిన భగవంతుడు మాకు మాత్రం ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడు?” అని బాధపడ్డారు.


స్వామివారు ఆ దంపతులతో, “భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు. నిజానికి మీరు దేవునిచేత ఎన్నుకోబడ్డారు. ఏదో పూర్వజన్మ పాపకర్మ వల్ల ఈ పిల్లాడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతేకాక ఈ బాధ తనకి ఎక్కువగా ఉండరాదు అని భగవంతుడు ఆలోచించాడు. ఈ పిల్లాడికి మంచి ధనవంతులైన తల్లితండ్రులను ఇచ్చుంటే, బహుశా వారు పిల్లాడి బాగోగులు చూడటానికి పనివారిని నియమించేవారు. దాని వల్ల తల్లితండ్రుల నిజమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం తనకి లభించేవి కాదు. అలాకాక, పేదవారైన తల్లితండ్రులైతే, వారికే తినడానికి తిండి లేకపోవడంతో, పిల్లాణ్ణి చూసుకోవడానికి వారికి సమయము, డబ్బు రెండూ ఉండేవి కావు. వేలమంది తల్లితండ్రులలో భగవంతుడు మిమ్మల్నే ఇతనికి తల్లితండ్రులుగా ఇచ్చాడు కావున అతను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని బాధ కూడా కొద్దిగా ఉపశమనం పొందుతుంది. ఈ పనికి మీరు మాత్రమే సరైనవారని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. భగవానుడు మిమ్మల్ని శిక్షించడంలేదు” అని తెలిపారు.


మరలా పూర్తి భిన్నమైన కోణంలో ఆలోచన, కానీ ఇదొక పూర్తిగా కొత్తదైన మానసిక చికిత్సా విధానం.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం



గుంటూరు జిల్లా 


మంగళగిరి 


*యర్రబాలెం శ్రీనగర్ కాలనీ*


కంచి  పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి సోమవారం సాయంత్రం 5గంటలకు మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శ్రీనగర్ కాలనీ లక్ష్మీ సూర్యా ఎస్టేట్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయనున్నట్లు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ విష్ణుబట్ల సుబ్రహ్మణ్యం సలక్షణ ఘనపాటి, జి కామేశ్వర శర్మ మాట్లాడుతు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి తెలంగాణా -ఆంధ్ర  రాష్ట్ర పర్యటనలో భాగంగా నగర పరిధిలోని యర్రబాలెంకు విచ్చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటరాజ శర్మ, రాధాకృష్ణ, నరసింహారావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఎ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందా

 🔥ఎ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము🔥


1.మత్స్యపురాణం 

2.కూర్మపురాణం

3.వామనపురాణం

4.వరాహపురాణం

5.గరుడపురాణం

6.వాయుపురాణం

7. నారదపురాణం 

8.స్కాందపురాణం

9.విష్ణుపురాణం

10.భాగవతపురాణం

11.అగ్నిపురాణం 

12.బ్రహ్మపురాణం

13. పద్మపురాణం

14.మార్కండేయ పురాణం

15.బ్రహ్మవైవర్తపురాణం 

16.లింగపురాణం

17.బ్రహ్మాండపురాణం

18.భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


🐋మత్స్య పురాణం:*

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


🐢కూర్మ పురాణం:*

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


👶వామన పురాణం:* 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


🐷వరాహ పురాణం:*

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


🦅గరుడ పురాణం:*

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


🌪వాయు పురాణం:*

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


🔥అగ్ని పురాణం:*

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


🦚స్కంద పురాణం:* 

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


🔱లింగ పురాణం:*

లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


🪕నారద పురాణం:*

బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


🪷పద్మ పురాణం:*

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.


☸ విష్ణు పురాణం*

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


🙏🏻మార్కండేయ పురాణం:*

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


🕉 బ్రహ్మ పురాణం*

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


🪈భాగవత పురాణం :

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


🌍 బ్రహ్మాండ పురాణం*:

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


🪐భవిష్య పురాణం:*

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


💫 బ్రహ్మావైపర్త పురాణము :

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి...


🙏సర్వేజనాసుఖినోభవంతు🙏

జ్యోతిష్కుడు

 శ్లోకం:☝️

*అద్వేషీ నిత్యసంతుష్టః*

 *గణితాగమ పారగః ।*

*ముహూర్తగుణ దోషజ్ఞో*

 *వాగ్మీ కుశలబుద్దిమాన్‌ ।।*

*శాంతశ్చామృతవాక్సౌమ్యః*

 *త్రికాలజ్ఞో జితేంద్రియః ।*

*నిత్యకర్మరతో యో వై*

 *స దైవజ్ఞః ప్రకీర్తితః ।।*


భావం: జ్యోతిష్కుడు ఎలా ఉండాలో మన శాస్త్రాలు ఈ విధంగా నిర్దేశిస్తున్నాయి.

    ద్వేష స్వభావములేనివాడు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషముతో గడిపేవాడు, గణిత శాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలవాడు, ముహూర్తము యొక్క గుణదోషాలను తెలిసియున్నవాడు, (అంటే సమయముపై మంచి అవగాహన కలిగి ఉండేవాడని అర్థం.) మంచి సంభాషణా నైపుణ్యం కలవాడు, సూక్ష్మబుద్ధి కలవాడు అయి ఉండాలి.

    ఎల్లప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి. భూత, భవిష్యత్‌ వర్తమానాలపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరించేవాడై ఉండాలి. ఇటువంటి సత్సాంప్రదాయములు నిరంతరం ఆచరిస్తూ జ్యోతిషం అభ్యసించే వారిని జ్యోతిష శాస్త్ర అధిదేవత అయిన ఆ వాగ్దేవి వాక్ శుద్ధిని ప్రసాదించి వారిని అన్ని రకాలుగా కాపాడుతుంది.🙏

శూన్య హస్తాలతో వెళ్ళకూడదు.

 అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధబాలకౌ

రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్.


అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించిన గృహానికి (యజ్ఞశాలకు), పుణ్యక్షేత్రానికి, గర్భవతి, వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే ఇళ్లకు, రాజును, దైవాన్ని, గురువును దర్శించటానికి వెళ్ళేటప్పుడు శూన్య హస్తాలతో వెళ్ళకూడదు.

(వాళ్ళకేదో ఒక కానుక తీసుకు వెళ్ళాలి అని ఆర్యోక్తి )