10, ఏప్రిల్ 2023, సోమవారం

జ్యోతిష్కుడు

 శ్లోకం:☝️

*అద్వేషీ నిత్యసంతుష్టః*

 *గణితాగమ పారగః ।*

*ముహూర్తగుణ దోషజ్ఞో*

 *వాగ్మీ కుశలబుద్దిమాన్‌ ।।*

*శాంతశ్చామృతవాక్సౌమ్యః*

 *త్రికాలజ్ఞో జితేంద్రియః ।*

*నిత్యకర్మరతో యో వై*

 *స దైవజ్ఞః ప్రకీర్తితః ।।*


భావం: జ్యోతిష్కుడు ఎలా ఉండాలో మన శాస్త్రాలు ఈ విధంగా నిర్దేశిస్తున్నాయి.

    ద్వేష స్వభావములేనివాడు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషముతో గడిపేవాడు, గణిత శాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలవాడు, ముహూర్తము యొక్క గుణదోషాలను తెలిసియున్నవాడు, (అంటే సమయముపై మంచి అవగాహన కలిగి ఉండేవాడని అర్థం.) మంచి సంభాషణా నైపుణ్యం కలవాడు, సూక్ష్మబుద్ధి కలవాడు అయి ఉండాలి.

    ఎల్లప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి. భూత, భవిష్యత్‌ వర్తమానాలపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరించేవాడై ఉండాలి. ఇటువంటి సత్సాంప్రదాయములు నిరంతరం ఆచరిస్తూ జ్యోతిషం అభ్యసించే వారిని జ్యోతిష శాస్త్ర అధిదేవత అయిన ఆ వాగ్దేవి వాక్ శుద్ధిని ప్రసాదించి వారిని అన్ని రకాలుగా కాపాడుతుంది.🙏

కామెంట్‌లు లేవు: