1, డిసెంబర్ 2024, ఆదివారం

కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

 ॐ కార్తీకపురాణం - 30 వ అధ్యాయం ॐ

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉🕉️🕉🕉🕉


♦️చివరి రోజు పారాయణం.


🍃🌷కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి: 


నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు” మని కోరిరి...


అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు... 


కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము - ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.  


ఓం నమః శివాయ…🙏🙏

సమస్య పూరణ.

 *వారము లోన వచ్చె రవివారము మిత్రమ మూడు మార్లుగన్*

ఈ సమస్యకు నాపూరణ. 


చేరితినయ్య కొల్వునను చైత్రమునందున, మూడు మాసముల్


పోరితి - నిద్ర మానితిని, పుస్తకముల్ పఠియించి వ్రాయ యీ


వారము లోన వచ్చె - రవి వారము మిత్రమ! మూడు మార్లుగన్


హారతు లిత్తు దేవునికి నన్నిట నాకు జయంబు లీయగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

అధ్యాపకుడు


అంత రంగాన్ని మించిన అధ్యాపకుడు లేడు, కాలాన్ని మించిన గురువులు లేరు, లోకాన్ని  మించిన సద్గ్రంథము లేదు, సన్మార్గ జీవితాన్ని మించిన ధర్మము లేదు. ఇంత స్పష్టంగా వేదాంతాన్ని, జీవితాన్ని అభేద్యంగా, సమన్వయంగా దర్శించిన వారే ఇతరులకు మార్గ దర్శనము చేయగలరు.*ఇటువంటి  దార్శనికులకు మన గ్రూప్ లో కొదవ లేదు*.


అవుతే, ఈ కలియుగంలో, అందునా ఈ అధునాతన యుగంలో, మరీ ఈ ధార్మిక హాని/గ్లాని ఏర్పడుతున్న సమయంలో ఏదీ సులభంగా లభించదు *ఒక్క దుర్మార్గులకు తప్ప*.

 ఏదీ సాధించాలన్నా అకుంఠిత దీక్ష,  నిరంతర శ్రమ, అనన్య సామాన్య కృషి, మొక్కవోని పట్టుదల, క్రియాశీలత, సామాజిక సమన్వయము, సహకారము అన్నిటికంటే మించి స్థిర ధైర్యము సహనం తప్పనిసరి. *సాధకులకు తగ్గ  సౌశీల్యము, సౌశీల్యానికి తగ్గ సాహసము ఉంటే  "విధి" కూడా సాధకులకు సహకరిస్తుంది*. శాస్త్ర వాక్యమొకటి  చూద్దాం *సాధనాథ్ సాధ్యతే సర్వం*.


ఇవన్నీ మాన్యులకు తెలియవని కాదు కాని, ఇది ఒక పునశ్చరణ మాత్రమే. *చేరాల్సిన శిఖరాలు చేరాను, జీవితంలో స్థిరపడ్డాను, ఇదే జీవిత సాఫల్యం అని అనుకుంటే సరిపోదు. జీవన సార్ధకతకు విద్య, సంపాదన, ధనం ఎంత గొప్పవో దేశ సేవ మరియు ధర్మ సేవ గూడా అంత గొప్పవే. అవే అసలైన పురుషార్థాలు*.


ధార్మిక దివిటీలైన  ఈ గ్రూప్ సభ్యులకు వినతి మన దేశంలోనూ, పొరుగు దేశాలలోనూ హిందూ ధర్మానికి, సంస్కృతికి మరియు హిందువులకు మన ముందు వాటిల్లుతున్న హాని కురించి "క్లుప్తంగా".

 *1) హిందువులపై మరియు హిందు దేవాలయాలపై దాడులు*

*2) హిందువుల మతాంతీకరణ*

*3) భారత దేశంలో హిందువుల "సంఖ్యా బలంలో  తగ్గుదల", హైందవేతరుల "సంఖ్యా/ప్రజా బలంలో హెచ్చుదల*

4) హైందవేతరులచే ఆహార పదార్థాల కల్తీ/హలాల్/ ఎంగిలి మరియు విష తుల్య కృత్యాలు.

5) ఇతర మతస్తులచే *"జిహాదీ చర్యలు*"

6) సెక్యులర్ ముసుగులో హిందువులకు అన్యాయము,  పైగా  హైందవేతరులు  బహిరంగంగా చేసే దేశ/జాతి వ్యతిరేక పనుల పట్ల  చట్టం అవసరమైనంత పదునుగా  ఉండక పోవడం.

7) waqf board చే హిందువుల,దేవాలయాల భూమి ఆక్రమణ ఆగడాలు.

 8) సెక్యులర్ ముసుగులో పాలకులు, హిందు దేవాలయాలలో అన్య మతస్తులను ఉద్దేశ్య పూర్వకంగా నియమించడం. హిందు సంస్కృతి, సంప్రదాయాలను భ్రష్టు పట్టించే చర్యలకు ఒడిగట్టడం.

9)  హిందు దేవాలయాల సన్నిహిత ప్రాంతాలలో దర్గా మరియు చర్చ్ లాంటి అన్య మతస్తుల ప్రార్థనా మందిరాలను అనుమతించడం. 


సభ్యులందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం *అన్య మతస్థులందరూ దుర్మార్గులు కారు*. కరడు గట్టిన అన్యమత చాంధసవాదులు, వారికి వత్తాసు పలికే సెక్యులర్ కుహానా మేధావులు వలననే హైందవ ధర్మానికి, దేశానికి పెను ముప్పు పొంచిఉన్నది. 


*శ్లో! పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతామ్* I

*ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే* ll 

భగవద్ గీత.

ధర్మానికి హాని జరిగినప్పుడు భగవద్ గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ తెలియజేసినట్లు, ఈ కలియుగంలో భగవంతుడు శంఖు, చక్రాలతో తాను స్వయంగా  భువికేతెంచే  అవకాశాలు మృగ్యము.

 *భగవాన్ మానుష రూపేణ* అని కూడా చదువుకున్నాము కాబట్టి ధర్మ సంస్థాపన కొరకు మనమే సంఘటితంగా ఉద్యమించ వలసి ఉంటుంది. మన హిందూ జాతి ఐకమత్యం మాత్రమే మన ధన,మాన ప్రాణాలను కాపాడగలుతుంది.


జీవితంలో ప్రతి మలుపును, మార్పును కాలానికే వదిలివేయడం, నిశ్చేష్టులుగా జీవించడం *నాలాంటి* కొంతమంది 

 *సామాన్యుల స్వభావం*.

 కాని, స్వ ప్రయత్నాన్ని నమ్ముకుని *ఆశించిన  గమ్యాలను చేరుకోవడం మీలాంటి అసామాన్యుల, మాన్యుల లక్షణం*. సమాజ సహకారంతో నిర్దేశించుకున్న ఫలితాలు పొందగల్గుతారు. *జయం భవతు*.


ధన్యవాదములు

*(సశేషం)*

మొగిలిచెర్ల అవధూత

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దత్తోపదేశాలు - ఇరవై రెండవ భాగము - సమయ పాలన 


"జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. అంతే కాదు, ఆ లక్ష్యాన్ని ఎన్ని రోజులలో సాధించాలి అని ఒక నియమం ఉండాలి. అప్పుడే నీ జీవితములో నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాకుండా, నీ లక్ష్యాన్ని కూడా నువ్వు తప్పక చేరగలుగుతావు." ఈ వాక్యాలు దాదాపు అన్ని కార్యాలయాల్లో కానీ లేక విద్యాలయాల్లో కానీ, ఎవరికైనా ఒక స్ఫూర్తిదాయకమైన బోధ చేసేటప్పుడు తప్పక వినిపించేవి. అలానే ఈ వాక్యాలకు ఋజువులుగా చరిత్రలో చాలా మంది జీవిత గాధలను తెలుపుతారు. కానీ, ఎక్కడైనా, ఏనాడైనా ఇలాంటి వాక్యాలకు ఋజువుగా మన నేల మీద నడయాడిన ఋషిపుంగవుల గురించి కానీ ప్రస్తావించరు. దీనికి కారణాలు ఎన్నో, కొంతమందికి అసలు మన సంస్కృతి యొక్క పూర్వ గాధలు తెలియక పోవటం ఒక కారణం అయితే మరొక కారణం అలాంటి ఉదహరణాలు చెప్తే రుచించవని అభిప్రాయం. 


పాఠకులారా! వర్ణించే తీరును బట్టి ఎంతటి పాత చరిత్రనైన ప్రస్తుత తరానికి రుచించే ప్రజ్ఞ కనుక ఉంటే, ఖచ్చితంగా యువతరం మన సంస్కృతిని ఎంతో చక్కగా అందిపుచ్చుకుంటారు. ఒక్కసారి, మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవనాన్ని నిశితంగా పరిశీలిస్తే, శ్రీ స్వామి వారు జన్మించిన తేదీ మే 6, 1944 అలానే శ్రీ స్వామి వారు సిద్ధిపొందిన తేదీ మే 6, 1976. అంటే శ్రీ స్వామి వారు వారి మోక్ష సాధన అనే లక్ష్యాన్ని ఖచ్చితంగా 32 ఏళ్లకు అందుకున్నారు. కనీసం ఒక్క రోజు అటు ఇటు కాకుండా. శ్రీ స్వామి వారు వారి జీవనయానంలో ఎన్నో ప్రదేశాలలో సంచరించారు, ఎంతో మందికి సద్బోధలను చేశారు కానీ వారి సాధనని మాత్రం రవ్వంత కూడా ఆలస్యం చెయ్యలేదు. ఏ ప్రాంతములో ఉన్న, ఎంత మంది మధ్యలో ఉన్న వారు ఒక సమయానికి చేరుకోవాల్సిన ఘట్టాలని అదే సమయానికి చేరుకున్నారు. ఎక్కడా ఏమరుపాటు లేదు అలానే ఎక్కడ కంగారు కూడా లేదు. 


ఇప్పుడు అర్థమయిందా పాఠకులారా! ఎందుకని మాలకొండ మీద నుంచి శ్రీధరరావు దంపతులు ఎంత వారిస్తున్నా "ఇది దైవ నిర్ణయం మీకు అర్థం కాదు" అని పట్టుబట్టి మరీ మాల్యాద్రి మీద నుంచి కిందకు వచ్చేసారో. ఎందుకని, ఉదయం 3.00 గంటలకు నేను ఇక ఇక్కడ ఉండకూడదు అని సాధనస్థలికి వెళ్లిపోయారో. ఆరోజు అయితే, శ్రీధరరావు గారు కనీసం ఒక్క రోజు గడువన్న ఇస్తే ఆ సాధనా స్థలిలో ఒక పాక వెయిస్తాను అంటే, కుదరదు గాక కుదరదు అని పట్టుబట్టి బయలుదేరిపోయారు. అలానే, కొంతమందితో సమయం గడిపారు, కొంతమందితో ఎక్కువ సేపు గడపలేదు. మరికొంతమందికి, శ్రీ స్వామి వారి దర్శన భాగ్యము కూడా కలుగలేదు. ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలు నిజం ఇదే, మనం మన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనకి అనేక అవాంతరాలు వస్తాయి, అనేక ఆకర్షణలు కనిపిస్తాయి కానీ, వాటికి లోబడితే ఇక ఆలస్యం జరిగిపోయి, ఏనాడు అందవల్సిన ఫలితం ఆనాడు అందదు. 


చివరి రోజులలో అయితే, శ్రీ స్వామి వారు మరీ చిక్కిపోయినప్పుడు ప్రభావతి గారు, "ఎం నాయనా సరిగ్గా తినటంలేదా?" అని అడిగితే, శ్రీ స్వామి వారు చెప్పిన సమాధానం, "లేదు తల్లీ అంత సమయం కూడా వృద్ధా చేయడంలేదు" అని. జన్మరాహిత్యము కోరుకునే వారు మోక్షం పైన అంతటి వ్యామోహాన్ని అలానే అంతటి సమయపాలనను చూపిస్తారు కనుకనే పరమాత్మలో వారు లీనం కాగలుగుతారు.


కాబట్టి పాఠకులారా! మనం కూడా శ్రీ స్వామి వారిలాగా మన పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోయినా మనం మనకున్న పరిధిలో నిశ్చయించుకున్న ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవాలి అంటే, మనం ప్రతిరోజులో రోజులో ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమని పెట్టుకున్న సమయాన్ని ఎంతటి అవాంతరాలు, ఆకర్షణలు వచ్చిన కానీ మనం సమయపాలన చేయగలిగితే ఈనాడు కాకపోయినా ఏదొక నాడు మనం కూడా మన చిట్టచివరి గమ్యానికి తప్పక చేరుకుంటాము.


సర్వం,

శ్రీ దత్త కృప

ధన్యోస్మి

పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు : 

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699

----

ఇంతటి మహానుభావుని దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


---

దక్షిణామూర్తి స్తోత్రము

 దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్య సహితం


విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా

యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః

మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్

మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్

యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం

జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే

జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః

మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 


రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్

ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 


విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం

శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

తాత్పర్యము: ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 

తాత్పర్యము: ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్

సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః

సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్

తాత్పర్యము: ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్

త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం

జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి

తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*దేహీతివచనాత్ ద్వారా* 

*దేహస్థా పంచదేవతాః*

*తత్ క్షణాత్ ఏవలీయన్తే*

*ధీః హ్రీః శ్రీః కాన్తి కీర్తయః*


!!!!!!!!! *భావము* !!!!!!!!


*సహజసిధ్ధముగాన*

*మానవదేహమును*

*ఆశ్రయించుకుని*

*దేవతలుందురు*


*ఎవరైతే "దేహిదేహి" అనే యాచనా పూర్వకమైన మాటను పలుకుదురో అపుడు బుధ్ధి శ్రేయస్సు అభిమానము కాంతి కీర్తి అనుపేర్లు కలిగిన దేవతలు....మానవ దేహము నుండి వెంటనే తొలగిపొతారు*....

*కనుక మానవులు కష్టపడి ఆర్జించవలెను, అట్టి సంపదను మాత్రమే దేవతలు ఆశ్రయించి ఉందురు*


*అన్యాయార్జితమును కూడపెట్టరాదు...* 


 *అన్యాయార్జితమునకు దైవీస్పర్శ ఎప్పుడూ ఉండదు కనుక మరలా "దేహిదేహి" అనే పరిస్థితిరాగలదు.....* 


✍️🌺🌹💐🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


  *సలిలమ్ము న్జులుకప్రమాణ మొక పుష్పమ్ము న్భవన్మౌళి ని*

  *శ్చల భక్తి ప్రతిపత్తిచే నరుఁడు పూజల్సేయఁగా ధన్యుఁడౌ* 

  *నిల గంగానదిఁ జంద్రఖండము దానిందుం దుదిన్గాంచు*

  *నీ చెలువంబంతయు నీ మహాత్త్యమిదిగా శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 106*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! *ఒక భక్తుడు నీయందిలి పరమభక్తితో ఇంచుక నీరు, ఒక పుష్పము నీ లింగముపైన భక్తితో ఉంచిన మాత్రముననే ధన్యుడై, జీవన్ముక్తుడై ‘కొండంత దేవునకు మరి కొండంతయు ప్రతియిడెడి కుశలులు గలరే?’ నీవు ప్రసన్నుడవై ఆ నరునికి గంగానది మొదలు నీ తలపైని చంద్రఖండమును కూడా చూపెదవు కదా... ఆశుతోషుడవు నీవు స్వామి*.


✍️🌷🌹🌺🙏

⚜ శ్రీ మరికాంబదేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 946


⚜ ఉత్తర కర్ణాటక : సిరిసి


⚜ శ్రీ మరికాంబదేవి ఆలయం



💠 షిర్సిలోని శ్రీ మరికాంబ దేవాలయం ఉత్తర కన్నడలోని అత్యంత ప్రసిద్ధ మరియు పురాతన దేవాలయాలలో ఒకటి. 

ఈ దేవాలయం ఉత్తర కర్నాటకలో ఉన్నప్పటికీ, దీని ఖ్యాతి కర్నాటక అంతటా వ్యాపించి ఉంది. ఆమె ఆశీస్సులు పొందేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 


💠 కర్ణాటకలోని మరియమ్మ దేవతలందరికీ దొడక్క అని పిలుస్తారు. 

అంటే కొల్లూరులోని మూకాంబికే, మైసూర్‌లోని చాముండేశ్వరి కూడా ఆమె సోదరి అన్నమాట. శిర్సీలోని మరికాంబ దేవాలయాన్ని శ్రీ మరికాంబ ఆలయం, అమ్నోర గుడి, మరిగుడి, దొడ్డమ్మన దేవాలయం మొదలైన అనేక పేర్లతో పిలుస్తారు. 

ఆమెను దర్శించుకుని పూజిస్తే తప్పకుండా అన్ని కష్టాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.


💠 మరికాంబ ఆలయం దుర్గా దేవతకు అంకితం చేయబడింది, దీనిని రేణుక మరియు ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు. ఇది సిరిసిలో చూడదగిన ప్రదేశాలలో ఒకటి . ఈ ఆలయం 1688 సంవత్సరంలో నిర్మించబడింది మరియు ఇది కర్ణాటకలోని శక్తి ఆరాధన యొక్క ముఖ్యమైన స్థానాలలో ఒకటి. 


💠 ఉత్తర కన్నడ మరియు దక్షిణ కన్నడ జిల్లాల ప్రజలు మరికాంబ దేవిని తమ కుటుంబ దైవంగా భావిస్తారు, ఎందుకంటే దేవి అన్ని దుష్ట శక్తులను నాశనం చేస్తుందని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి తమను కాపాడుతుందని నమ్ముతారు.

ఆలయ గర్భగుడిలో పులిపై 8 చేతులతో భీకరమైన రూపంలో దుర్గాదేవి యొక్క చిత్రం ఉంది. 7 అడుగుల ఎత్తైన ఈ చిత్రం హంగల్ సమీపంలోని చెరువులో కనుగొనబడిందని పురాణాలు చెబుతున్నాయి.


🔆 ఆలయ చరిత్ర:


💠 అమ్మవారి విగ్రహం హానగల్ నుంచి శిర్సీకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. హనగల్‌లో శక్తివంతమైన శక్తి పీఠాలు ఉన్నాయని మహాభారతంలో పేర్కొనబడింది. వనవాసంలో ఉన్న ధర్మరాయుడు విరాటనగరం వైపు వెళ్తున్నాడు. ఊరి ముఖద్వారం వద్ద దుర్గను చూశాడు. సమాజ రక్షణ, దయ మరియు సంక్షేమం కోసం వారు ఆమెను అక్కడ పూజించారని చెబుతారు. 

హానగల్‌ను అప్పట్లో విరాటనగర అని పిలిచేవారు. 

చాళుక్యుల శాసనాలలో దీనిని 'విరాట కోట' అని కూడా పిలుస్తారు. 

హానగల్ మహారాష్ట్రలోని విరాటనగర్ అని కూడా పరిశోధకులు నమోదు చేశారు.


💠 హానగల్ జాత్రా మహోత్సవాల అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఆభరణాలతో కూడిన పెట్టెలో ఉంచారు. దానిని ఎత్తుకెళ్లిన దొంగలు నగలు తీసుకుని విగ్రహం ఉన్న పెట్టెను శిర్సీలోని దేవీకెరెలో పెట్టారు. బసవ అనే భక్తుడు ప్రతి సంవత్సరం చంద్రగుత్తి జాతరకు వెళ్లేవాడు. ఒకప్పుడు అతడిని ప్రజలు వేధించారు. 

దాంతో విసుగు చెంది చంద్రగుత్తి జాతరకు వెళ్లకుండా శిర్సీలోనే అమ్మవారికి పూజలు చేశారు.


💠 ఒక రాత్రి దేవి అతనికి కలలో "నేను మీ పట్టణంలోని సరస్సులో ఉన్నాను. నన్ను తీసుకురండి" అని చెప్పింది. దాని ప్రకారం పెట్టెలో అమ్మవారి ఉపకరణాలను జోడించి వైశాఖ శుద్ధ అష్టమి మంగళవారం రోజున అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత అదే స్థలంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. దేవత విగ్రహం కనుగొనబడినందున ఈ సరస్సుకు దేవి కెరె అని పేరు పెట్టారు.


💠 శ్రీ మారికాంబ దేవి మొదటి ప్రతిష్ట 1689లో జరిగింది.  అప్పుడు శిర్సి ఒక చిన్న గ్రామం.  అప్పటి విజయనగర సామ్రాజ్యంలో భాగమైన సోండా సంస్థానానికి చెందిన మహాప్రభువును భక్తులు కోరగా, ఇక్కడి సరస్సులో శ్రీ ఇమ్మడి సదాశివరాయ రాజు శిరసి గ్రామదేవతగా కొలువుదీరిన శ్రీ దేవి కొయ్య విగ్రహాన్ని ప్రతిష్టించమని కోరగా శ్రీ దేవిని ప్రతిష్ఠించడానికి అనుమతి ఇచ్చారు.

శ్రీ ఆలయం యొక్క అద్భుతమైన చంద్రశాల, గర్భగుడి, గోపురం మరియు మహాద్వార 1850 మరియు 1875  మధ్య నిర్మించబడ్డాయి.

 

💠 బెంగాల్‌లోని కాళికా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్‌లలో అంబాభవాని వలె, కర్ణాటకలో అత్యంత చైతన్యవంతమైన శక్తి పీఠంగా శిర్సీలోని శ్రీ మారికాంబే ఉంది.  

శ్రీ దేవి కేవలం ప్రార్థనతో భక్తుల కోరికలన్నింటినీ తీర్చే ప్రఖ్యాతి పొందింది. 


💠 శ్రీ మరికాంబ విషయంలో ఆమె ఆరాధన చాలా సులభం మరియు సరళమైనది. 

బలి అర్పణలు అవసరం లేదు మరియు అలాంటిదేమీ లేదు. ధూపం వేయడం మరియు కర్పూరం వెలిగించడం వంటి భక్తుడి చిన్న క్రతువులతో ఆమె సంతోషిస్తుంది. 

అన్నింటికంటే "ఓ అమ్మా, నన్ను రక్షించు" అనే మాట చాలు


💠 మరికాంబ ఆలయం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మరికాంబ జాత్రకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది కర్ణాటకలోని అతిపెద్ద 'రథయాత్రల'లో ఒకటిగా పరిగణించబడుతుంది. 

పండుగ సందర్భంగా, ఆలయం నుండి అమ్మవారిని అందమైన చెక్క 'రథ'పై 'మారికాంబ గడ్డుగే' అనే ప్రదేశానికి తీసుకువెళ్లి, ఏడు రోజుల పాటు అమ్మవారిని అక్కడ కూర్చోబెడతారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండి ప్రజలు సిరిసికి వస్తుంటారు


💠 గోకర్ణకు తూర్పున 83 కిమీ


Rachana

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -75*

 **తిరుమల సర్వస్వం -75* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 14*

*సూర్యప్రభ వాహనం* 

బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు ఉదయం సప్తగిరీశుడు ఒక్కరే - ఏడు గుర్రాలు పూన్చిన రథంపై, ఏడంతస్తుల కనకపు సింహాసనాన్ని అధిష్టించి, వజ్రకవచధారియై; బాలభానుడు తన ఉదయపు లేలేత కిరణాలతో నమస్కారాలు సమర్పిస్తుండగా మాడ వీధుల్లో ఊరేగుతూ *"సూర్య మండలం మధ్యనున్న నారాయణ మూర్తిని నేనే"* - అని భక్తులకు సందేశమిస్తారు. 

*"ధ్యేయస్సదా సవిత్రృమండల మధ్యవర్తి నారాయణః"* అంటే, *"సూర్య మండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింప దగినవాడు"* అని వేదశృతి. అందుకే హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన చేసే సంస్కృతి ఉంది. గాయత్రీ మంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాము. సూర్యుడు తేజోనిధి. నిత్యం కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు ప్రకృతికి, జీవులకు చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల కలిగే పాడి పంటలు, చంద్రుడు అతని షోడశకళల వల్ల వృద్ధిచెందే ఔషధులు; అన్నీ సూర్యప్రసాదితాలే. సూర్యుడు కర్మసాక్షి, 

నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తట్టుకునే రోగనిరోధకశక్తి, లేలేత సూర్యకిరణాల ద్వారా లభించే "విటమిన్ డి" లో మెండుగా ఉంటుందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మయూరాదులు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసనచేతనే శారీరక అనారోగ్యం నుండి విముక్తులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. *"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్!!"* 

శ్రీమహావిష్ణువుకు సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమనేత్రంగా చెబుతారు. అందుకే విష్ణుమూర్తి దివారాత్రాలకు (పగలు, రేయి) అధిపతి. 

రాజవంశాలలో సూర్యవంశం ప్రథమం. శ్రీమహావిష్ణువు పుత్రుడు బ్రహ్మతో మొదలైన సూర్యవంశంలో ముప్పయ్యెనిమిదవ తరానికి చెందినవాడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మకు మరీచి, అతనికి కాశ్యపుడు, అతనికి సూర్యుడు జన్మించారు. రామ-రావణ సంగ్రామంలో శ్రీరామచంద్రుడు *"ఆదిత్యహృదయం"* పఠించి, తన పూర్వజుడు, వంశనామ కారకుడు అయిన సూర్యనారాయణుని ఆశీస్సులు పొంది, తద్వారా రావణసంహారం గావించాడు. 

సూర్యుడు నమస్కార ప్రియుడు. మనకు అంతులేని ఫలాలు ప్రసాదించినా, ఏ ప్రతిఫలం ఆశించడు. మనం త్రికరణశుద్ధిగా చేసే నమస్కారానికే ఆయన సంతృప్తి చెందుతాడు. *"ఆరోగ్యం, కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం - ఇవన్నీ సూర్యదేవుని అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి"* అని సూర్యశతకం తెలియజేస్తుంది. సూర్యోపాసన, చక్షూరోగ (కంటి సంబంధిత వ్యాధులు) నివృత్తి గావిస్తుందని యజుర్వేదంలోని చాక్షూషోపనిషత్తు విదిత పరుస్తుంది. చర్మరోగగ్రస్తులు సైతం సూర్యనారాయణుని పూజించి బాధా విముక్తులవుతారు. 

ఇప్పుడు ఓసారి మలయప్పస్వామివారు అధిరోహించిన వాహనాన్ని దగ్గరనుంచి దర్శించుకుందాం. జపాకుసుమాలు ధరించిన స్వామి వాహనానికి, గరుత్మంతుని అన్నగారైన "అనూరుడు" సారథ్యం వహిస్తున్నాడు. రథాన్ని లాగుతున్న ఏడు గుర్రాలను ఏడు ఛందస్సులుగా పరిగణిస్తారు. *గాయత్రి, బృహతి, ఉష్ఠిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి* అనేవి ఆ ఛందస్సుల పేర్లు. విష్ణుసహస్రనామంలో *"అనుష్టుప్ ఛందః"* అని పఠిస్తాం. అంటే "అనుష్టుప్ అనబడే ఛందస్సులో వ్రాయబడినది" అన్నమాట. 

అనూరుడు అంటే "ఊరువులు (తొడలు) లేకుండా జన్మించినవాడు" అని అర్థం. సూర్యరథసారథి అయిన అనూరుడు; తన తమ్ముడూ, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని వద్దకు వచ్చాడు. 

ఆహా, ఏమి ఆ అపూర్వ సంగమము! 

ఒకరేమో జగతి కాలచక్రాన్ని నిర్ధారించే సూర్యదేవుని రథానికి సారథి, మరొకరేమో జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని ముల్లోకాలను విహరింపజేసే వాహనము! 

ఇంతటి ధన్యులైన ఇద్దరు పుత్రరత్నాలను కన్న "వినతి" చేసుకున్న పూర్వజన్మల పుణ్యఫలం ఎంత గొప్పదో కదా! 

సూర్యప్రభవాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాహనసేవ దర్శనం ద్వారా భక్తకోటికి ఆరోగ్యం, ఐశ్వర్యం సంపూర్ణంగా సిద్ధిస్తాయి. *అదివో చూడరో అందరు మొక్కరో* *ముదిగొనె బ్రహ్మము కోనేటి దరిని* *రవిమండలమున రంజిల్లు తేజము* *దివి చంద్రునిలో తేజము* *భువి ననలంబున బొడమిన తేజము* *వివిధంబులైన విశ్వతేజము* 

అంటూ, ఆ శ్రీనివాసుడే సూర్యమండల మధ్యవర్తియగు శ్రీమన్నారాయణడని ధృవపరిచి, కీర్తించాడు, పదకవితా పితామహుడు అన్నమయ్య. *స్వయం ప్రకాశా గోవిందా!* *ప్రత్యక్షదేవా గోవిందా!!* *దినకరతేజా గోవిందా 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*212 వ రోజు*

*సంజయునికి ధర్మజుడు బదులిచ్చుట*

సంజయుని మాటలు విన్న ధర్మరాజు " సంజయా! నీవు పలికింది నిజమే. కర్మలలో ధర్మం శ్రేష్టమైనదనుట సత్యం. ఒక్కొక్క చోట ధర్మం అధర్మ రూపంలో కనపడుతుంది. మరొకచోట ధర్మం అధర్మంగా కనపడుతుంది. ఇంకొకచోట ధర్మం తన సహజమైన ధర్మ రూపాన్నే ధరిస్తుంది. విద్వాంసులు తమ బుద్ది చేత దాని అసలు రూపాన్ని చూడగలరు. ధర్మాధర్మాలు ఆపత్కాలంలో భిన్న లక్షణాన్ని పొందుతాయి. ఆపత్ధర్మం యొక్క స్వభావం వీరేగా ఉంటుదని తెలుసుకో. కనుక నన్ను నిందించదలచుకున్న నేను చేసినది అధర్మం అని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది. అహింస పరమ ధర్మమే. కానీ లోక కంటకులను, వంశనాశకులను, పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. ఈ భూమండలం మీదున్న సమస్త ధనం లభిస్తుందన్నా,దేవతల సంపత్తి లభిస్తుందన్నా, దానికంటే గొప్పదైన బ్రహ్మలోక వైభవం వస్తుందన్నా సరే నేను అధర్మం స్వీకరించను. ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతిజ్ఞుడు, కుశలుడు, కర్తవ్యాకర్తవ్యములను, ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు నేను చేయునది ధర్మమా అధర్మమా అని నిర్ణయించి చెప్పగలడు. అతడు రెండు వైపులా హితాన్ని కోరువాడు. అతని ఆధ్వర్యంలో అంధక, భోజక, యదు, వృష్టి, శృంజయ, కేకయ రాజులు నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యం " అన్నాడు.

*సంజయునికి శ్రీకృష్ణుడి సమాధానం*

ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు " సంజయా! నేను పాండవుల మేలు కోరుకుంటున్నాను. అదే విధంగా దృతరాష్ట్రుని అభివృద్ధిని కూడా కాంక్షిస్తాను. నేను ఇద్దరినీ శాంతించమనే చెప్తాను. నా కోరిక కూడా అదే. నా వల్లగాని యుధిష్ఠిరుని వల్ల గాని ధర్మ లోపం జరుగదు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు తెలివి తెచ్చుకుని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవూ నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి. పైకి సవ్యంగా కనిపిస్తున్నా ధర్మరాజు మాటలు సంధి పొసగదని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాటలు సరి అయినవే. ఎందుకంటే పుత్రపక్షపాతి అయిన ధృతరాష్ట్రుడు కొడుకు మాటలు విని పాండవుల రాజ్యంను ఆశిస్తూ వుంటే ధృతరాష్ట్రుడి తీపి మాటలకు పాండవులు రాజ్య భాగం వదులుతారా? యుధిష్ఠిరుడు స్వధర్మాన్నే ఆచరిస్తాడు. ఒకవేళ తమ స్వధర్మాచరనలో దైవ వశం చేత మృత్యువును కూడా పొందవచ్చు. అది కూడా వారికి మంచిదే. నీకు అన్ని ధర్మాలు తెలుసు. గతాన్ని మరచి పాండవులు కౌరవులతో సఖ్యంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ గొప్పతనం. ధర్మం ప్రకారం తమ తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారు యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బతకడం కంటే యుద్ధం చేయడం మేలు అని నాకు అనిపిస్తుంది. యుద్ధం క్షత్రియ ధర్మం కాదా? అని ధర్మరాజు అడిగాడు కదా! ద్విజులకు ధర్మాధర్మాలు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించ కూడదు వారు ఇవ్వడమే కాని తీసుకోకూడదు అని చెప్పిన విషయం లోక విదితం. వర్ణాశ్రమ ధర్మ రక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించడం ధర్మమని శాస్త్రాలు భోదించ లేదా? సంజయా! ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా ? వారు కాదా అధర్మంగా ప్రవర్తించినది. వారు కాదా నిండు సభలో ద్రౌపదిని వలువలు లాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించినది. లోకంలో జూదం ఎవరూ ఆడలేదా వారిని ఇలాగే అవమానించారా? పాండవులు సంధికీ సిద్ధమే యుద్ధం చేయడానికి సిద్ధమే. ఈ రెండు పరిస్థుతులు గ్రహించి నీవు ధృతరాష్ట్రుడికి వున్నది ఉన్నట్లుగా చెప్పు" అని సంజయుడిని నిలదీశాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*

 

*శ్రీధరరావు, ప్రభావతి గార్ల అనుభూతి..*


*(పదమూడవ రోజు)*


శ్రీ స్వామివారు తన తపోసాధనకు భూమి కావాలని అడగటం..ఆపై అందుగురించి వివరణ ఇవ్వటం అయిన తరువాత ..శ్రీధరరావు దంపతులు "దైవ నిర్ణయం ఎలా వుంటే..అలా జరుగుతుంది..మనం నిమిత్తమాత్రులం!.." అని ఒక నిర్ణయానికి వచ్చేసారు..


శ్రీధరరావు గారి అన్నయ్య కూతురు "కుమారి" మొగలిచెర్ల కు వచ్చింది..కొద్దిగా ఆధునిక భావాలున్న అమ్మాయి..దేవుడూ.. సాధువులు అంటే ఆట్టే నమ్మకం లేకుండా.."మీదంతా చాదస్తం పిన్నమ్మా..అనవసరంగా అందరినీ నమ్మి మోసపోతూవుంటారు" అంటూ ప్రభావతి గారితో వాదించసాగింది..ప్రభావతి గారికేమో..ఎలాగైనా ఈ అమ్మాయికి మాలకొండ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించాలని..వీలైతే శ్రీ స్వామివారిని కూడా చూపించాలనీ కోరిక..మొత్తం మీద కుమారి మాలకొండ రావడానికి ఒప్పుకున్నది.. కానీ ఒక షరతు పెట్టింది..మధ్యాహ్నం రెండు గంటల లోపు తిరిగి వచ్చేయాలనీ..తాను సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోవాలనీ నూ..ప్రభావతి గారు "సరే తల్లీ..ఉదయాన్నే ఎడ్ల బండి కట్టిస్తాము..బయలుదేరి వెళ్లి వద్దాము.." అన్నారు..


ప్రభావతి గారు శనివారం తెల్లవారుఝామున లేచి, తమకూ బండితోలే మనిషికి మరో పదిమంది కి సరిపోయేటట్లు గా పులిహోర, దద్దోజనం తయారు చేసుకుని, బండిలో సర్ది.. కొద్దిసేపటిలో బైలుదేరాలని అనుకుంటున్నంతలో..ఒక్కసారిగా మబ్బులు క్రమ్ముకొచ్చి..కుంభవృష్టి కురవసాగింది..బండి వాడు, గబ గబా ఎద్దులను విప్పేసి, కొష్టం లోకి తోలుకెళ్లి పోయాడు..


"పిన్నమ్మా!..ఎక్కడ మీ దేవుడు?..ఎప్పుడు నాకు మాలకొండ స్వామి దర్శనం?.." అంటూ కుమారి ఆట పట్టిస్తోంది..శ్రీధరరావు గారు కూడా "ఈ వానలో మనం వెళ్లలేము ప్రభావతీ.." అన్నారు..ప్రభావతి గారు హతాసులయ్యారు.. ఆవిడ మనసులో ఒకటే బాధ.."స్వామీ..నీ ఉన్నావన్న సత్యాన్ని ఈ అమ్మాయి చేత నమ్మించలేకపోతే..ఇక దైవం పట్ల విశ్వాసం కోల్పోతుంది..సాధువులను.. బాబాలను నమ్మకపోయినా నష్టం లేదు..అసలు దైవాన్నే నమ్మకపోతే..మనలను మనమే మోసగించుకోవటం అవుతుంది.." అని తనలో తానే తర్కించుకుంటూ నేరుగా దేవుడి గది లోకి వెళ్లి..(ప్రత్యేకంగా వారింట్లో దేవుడి గది ఉంది) ఆ లక్ష్మీనారసింహుడిని ప్రార్ధిస్తూ కూర్చున్నారు..


ఇంతలో..వాకిట్లోకి జీపు వచ్చిన శబ్దం వచ్చింది..రెండు నిమిషాల తరువాత శ్రీధరరావు గారు గబ గబా దేవుడి గది దగ్గరకు వచ్చి.."ప్రభావతీ!..ప్రభావతీ!.." అని పిలిచారు..ఆవిడ లేచి రాగానే.."కందుకూరు నుంచి అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు దంపత్సమేతంగా వచ్చారు..వాళ్ళు మాలకొండ లో దర్శనం చేసుకుని..మనలను చూసి వెళదామని వచ్చారు.." అన్నారు..ఈలోపల ఆ దంపతులిద్దరూ లోపలికి వచ్చేసారు..కొద్దిసేపు మాటాడుకున్న తరువాత, శ్రీధరరావు గారు మాటల్లో..తాముకూడా మాలకొండ వెళదామని అనుకోవడం, ఈ వర్షం వల్ల ఆగిపోవడం.. చెప్పేసారు..ఆ దంపతులిద్దరూ వెంటనే.."మా జీపులో వెళ్ళిరండి..మేమిక్కడ రెస్ట్ తీసుకుంటాము.." అని దాదాపు బలవంతం చేసినట్లుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను, కుమారి ని కూడా జీపెక్కించేశారు..ఒక్కక్షణం ప్రభావతి గారి కళ్ళముందు నవ్వుతున్న ఆ దేవుడు.. లక్ష్మీనృసింహుడు..కనిపించాడు..మనస్ఫూర్తిగా ఆ స్వామికి మొక్కుకొని మాలకొండ చేరారు..


కుమారి కి ఆశ్చర్యంగా ఉంది..దాదాపు ఆగిపోయిందనుకున్న ప్రయాణం మళ్లీ మొదలవడం వింతగా ఉంది..ముగ్గురూ మాలకొండ చేరారు..వర్షం సన్నగా పడుతూనే ఉంది..కొండమీద నుంచి జాలువారుతున్న నీటి పాయలు.. కొండచుట్టూ అలుముకున్న మబ్బులు..మెట్ల మీది నుంచి పరుగులు పెడుతున్న నీటి జాడలు..ఒక అద్భుతమైన అనుభూతిని ఆ అమ్మాయికి కలిగిస్తున్నాయి..ఆ కొండమీద లక్ష్మీ నృసింహుడి దర్శనం కాగానే..ఒక విధమైన ఉద్వేగంతో.."పిన్నమ్మా..చిన్నాన్నా.. దైవం వున్నాడు..నేనీ క్షణాన చూస్తున్నాను..నిజంగా ఇది దైవ సంకల్పమే.."అన్నది..ముగ్గురూ శివాలయం వద్దకు వచ్చారు.."ఇక స్వామివారిని కూడా చూద్దాం చిన్నాన్నా.." అన్నది..


"కష్టం తల్లీ..బహుశా ఆయన ఈ సమయం లో కిందకు దిగిరారు..మనం ఆ పైనున్న గుహల వద్దకు వెళ్లలేము..ఈ వర్షం లో బండల మీద జారుతుంది.." అని నచ్చచెప్పబోతున్నారు...ఇంతలో..


ఆ వర్షంలో..తలపైనుండి నీళ్లు జాలువారుతూ..ముడివీడిన జుట్టు , పాయలుగా విడిపోయి..తెల్లటి శరీరఛాయతో..శ్రీ స్వామివారు ఒక్కొక్క బండ మీద జాగ్రత్తగా కాలు వేస్తూ దిగివస్తున్నారు.. సాక్షాత్తూ పరమశివుడి లాగా గోచరిస్తున్నారు..శ్రీధరరావు దంపతులు అప్రయత్నంగా చేతులెత్తి మొక్కారు..ప్రక్కనే ఉన్న కుమారి..కూడా నమస్కారం చేసింది..శ్రీ స్వామివారు వీళ్ల దగ్గరకొచ్చి.."ఇంత శ్రమపడి రావాలా?.." అన్నారు..ఈ లోపలే కుమారి స్వామికి వారికి మళ్లీ ప్రణమిల్లింది..చేయెత్తి ఆశీర్వదించారు.."మరో వారం రండి!..మనం మాట్లాడుకుందాము.." అన్నారు స్వామివారు..ముగ్గురూ మౌనంగా తలూపి..వెనక్కు వచ్చేసారు..


తిరుగుప్రయాణంలో , జీపులో..కుమారి తన భావోద్వేగాన్ని అణుచుకోలేక పోయింది.."పిన్నమ్మా..మీరిద్దరి వల్ల ఒక గొప్ప అనుభవాన్ని పొందాను..దైవాన్ని దగ్గరగా చూసాను..భవిష్యత్ లో కూడా మీరెలా చెపితే అలా వింటాను..నా వివాహ విషయం లో కూడా..!" అన్నది..శ్రీధరరావు ప్రభావతి గార్లు ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామికి, తపోసాధన లో మునిగిపోయివున్న శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కరించుకున్నారు..


శ్రీ స్వామివారి సోదరుడు.. పద్మయ్య..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

తెలుగు సాహిత్యంలో

 *తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*#దేవులపల్లి_కృష్ణ_శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం 

విప్పి చెబితే విమర్శ’’

*డా.#సి_నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ 

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*#కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

*#నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*#సుబ్బారావు_పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

*#బలిజేపల్లి_లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*#బసవరాజు_అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*#గుర్రం_జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*#కాళ్ళకూరి_నారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*#దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*#తిరుపతి_వెంకట_కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ #గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*#గరిమెళ్ళ_సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*#శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*#పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*#గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*#శ్రీశ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *#వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*#కొనకళ్ల_వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*#అల్లసాని_పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*#చేమకూరి_వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*#త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*#ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

*#బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*#వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*#కంచర్ల_గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*#సుద్దాల_హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*#ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*#వేముల_శ్రీ_కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*#త్రిపురనేని_రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*#బాలాంత్రపు_రజనీకాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*#అడవి_బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*#కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*#గుడ_అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*#అలిసెట్టి_ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*#సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*#ఖాదర్_మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*#బాలగంగాధర_తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*#అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*#ఏనుగు_లక్ష్మణ_కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*#పాలగుమ్మి_విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*#చలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*#విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*#నండూరి_సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*#అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*#చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*#కందుకూరి_రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*#మిట్టపల్లి_సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(#శ్రీకృష్ణదేవరాయలు)


వీరినందరినీ మీ పిల్లలకు పరిచయం చేయండి.....


🙏👍👏👏👍🙏....collected

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - అనూరాధ -‌‌ భాను వాసరే* (01.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మాంసభక్షణ మహాపాపం

 *🙏సాయి శరణం...  బాబా శరణం...🙏*

  

*🌷మాంసభక్షణ మహాపాపం🌷*


ఈనాడు ఎవరైనా సరే, భగవద్భక్తులుగా ఉండేవారు మాంస భక్షణను వదలాలి. పశుమాంసము పశుగుణములను పెంచుతుంది. హిందీలో చెబుతారు, 'జైసే అన్న్ ఐసే మన్' అని. ఎట్టి తిండో అట్టి త్రేపు. క్రూరమృగముల యొక్క మాంసమును భుజించడం చేత మనలో క్రూరత్వము అభివృద్ధి అవుతుంది. ఇదొక్కటే కాదు. పరప్రాణులను చంపడం ఎంత పాపం! కనుక, నిజమైన దైవభక్తులు కావాలని ఆశించేవారు మాంసభక్షణమును తక్షణమే వదలిపెట్టాలి. “మేము సాయిభక్తులం”, “మేము రామభక్తులం”, “మేము కృష్ణ భక్తులం" అని చెప్పుకుంటూ కోళ్ళు కోసుకుని తింటూ కూర్చునేవారు భక్తులు ఎలా అవుతారు? వారు కేవలం రాక్షసులే! అలాంటి రాక్షసులను భగవంతుడు ఏమాత్రము అనుగ్రహించడు. కనుక, స్వదేశీయులుగాని, విదేశీయులుగాని స్వామి ఆజ్ఞను పాటించేవారు మాంసభక్షణమును తక్షణమే విసర్జించాలి.


(నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన - భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్యోపన్యాసములనుండి)