*🙏సాయి శరణం... బాబా శరణం...🙏*
*🌷మాంసభక్షణ మహాపాపం🌷*
ఈనాడు ఎవరైనా సరే, భగవద్భక్తులుగా ఉండేవారు మాంస భక్షణను వదలాలి. పశుమాంసము పశుగుణములను పెంచుతుంది. హిందీలో చెబుతారు, 'జైసే అన్న్ ఐసే మన్' అని. ఎట్టి తిండో అట్టి త్రేపు. క్రూరమృగముల యొక్క మాంసమును భుజించడం చేత మనలో క్రూరత్వము అభివృద్ధి అవుతుంది. ఇదొక్కటే కాదు. పరప్రాణులను చంపడం ఎంత పాపం! కనుక, నిజమైన దైవభక్తులు కావాలని ఆశించేవారు మాంసభక్షణమును తక్షణమే వదలిపెట్టాలి. “మేము సాయిభక్తులం”, “మేము రామభక్తులం”, “మేము కృష్ణ భక్తులం" అని చెప్పుకుంటూ కోళ్ళు కోసుకుని తింటూ కూర్చునేవారు భక్తులు ఎలా అవుతారు? వారు కేవలం రాక్షసులే! అలాంటి రాక్షసులను భగవంతుడు ఏమాత్రము అనుగ్రహించడు. కనుక, స్వదేశీయులుగాని, విదేశీయులుగాని స్వామి ఆజ్ఞను పాటించేవారు మాంసభక్షణమును తక్షణమే విసర్జించాలి.
(నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన - భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్యోపన్యాసములనుండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి