*దేవాలయాలలో పాటించ వలసిన విధివిధానములు*
1. పూర్తిగా మౌనంగా ఉండటం, తోటివారికి విక్షేపం కలగకుండ ఉండటం
2. స్త్రీలైనా పురుషులైనా నిరాడంబరమైన, నిండైన దుస్తులు ధరించి వెళ్ళటం
3. కేవలం సంప్రదాయిక దుస్తులతోనే వెళ్ళటం
4. స్త్రీలు జుట్లు విరబోసుకుని పోకుండా ఉండటం
5. ఆధునిక పరికరాలు (చర వాణి ఇత్యాదులు)
వస్తువులకు అది ప్రదర్శన శాల కాదని
గుర్తించటం
6. లోకం, లోకులను, కథలను, ఇతర ఆలోచనలను కాలక్షేపాలను పక్కకు పెట్టటం
7. అది పిక్నిక్ స్థలం కాదని, ఆడుకునే చోటు
కాదని పిల్లలకు తెలియచెప్పటం
8. అనవసరంగా గంటలు కొట్టటం, పరిగెత్తడం
చేయవద్దని పిల్లలకు నేర్పటం
9. తీర్థం ప్రసాదాలు కిందపడనివ్వకుండా, వృథా
చేయకుండా, రుచులు చర్చించకుండా
ఉండటం
10. పూజారి లేనప్పుడు తీర్థాదులు స్వయంగా
తీసుకోకుండా ఉండటం
11. చేతులు కాళ్ళు కడుగుకునే నీరు వృథా చేయకుండా ఉండటం
12. క్రమపద్ధతిలో నిలబడటం, ఎవరినీ తోయకుండ ఉండటం
13. ఇతరుల వస్తువులు, దుస్తులు, చూసుకుంటూ
విమర్శలతో కాలక్షేపం చేయకుండా ఉండటం
14. ఇతరులను దూషించటం చేయకుండా,
నిందావాక్యాలు, తప్పుడు మాటలు అనకుండా
ఉండటం
15. దేవుడి ప్రసాదం, పూలు కిందపడితే తీసి పక్కకుఎవరూ తొక్కకుండా పెట్టటం
16. భగవంతుడి ఎదుట వినమ్రంగా ఉండటం,
భక్తిభావంతో, సమర్పణ భావంతో, కృతజ్ఞతగా
ఉండటం
17. మరీ వేగంగా కాక నెమ్మదిగా,అడుగులు చప్పుడు కాకుండా ప్రదక్షిణలు చేయటం
18. పనిలేకుండా అతిగా అటూ ఇటూ తిరగకుండా
ఉండటం
19. భగవంతుడి పై ఎక్కువ దృష్టిపెట్టటం, ఆ మూర్తి
కేవలం రాయి కాదని స్ఫురణతో ఉండటం
20. దర్శనం చేసుకుని కన్నులు మూసుకుని కొద్దిసేపైనా Bఆ మూర్తిని మనసులో ధ్యానించటం
21. దర్శనం అయ్యాక తప్పక కాసేపు ఆ పరిసరాల లో పద్మాసనం, లేదా ఆసనం వేసుకుని కూర్చోవటం
22. లోనికి వెళ్ళింది మొదలు బయటకు వచ్చేవరకు వదలకుండా ఏదైనా నామం స్మరించటం – దీనివల్ల మౌనం పాటించటం సహజంగా వస్తుంది.
23. ఆ దేవాలయం విశేషం ఏంటి అనేది తెలుసుకోవటం స్మరించటం
24. ఏదైనా ఆ దేవతకు సంబంధించిన స్తోత్రం
తప్పక చదవటం
25. అక్కడ గడిపిన కాసేపు జీవితంలో
అమూల్యభాగమని గుర్తించటం.
Muneeswara Enamundrum
SOURCED
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి