30, నవంబర్ 2024, శనివారం

సాధనకు సమయం దొరకడంలేదు

 

సాధనకు సమయం దొరకడంలేదు 

ఓం సహనాభవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు
మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః

అతడు అనగా పరమాత్మ మా గురుశిష్యులను కాపాడుగాక
మేమిరువురుము బ్రహ్మానందమును అనుభవింతుము గాక
మా అధ్యయనము తేజస్వంతమగును గాక
మేమిరువురము పరస్పరమూ ద్వేషించుకునకుండా వుండుదుము గాక

ఎంత అధ్బుతమైన శాంతిమంతమైన మంత్రం ఇక్కడ గురు శిషులు ఒకరికొకరు ఎలాంటి విద్వేషాలు కలుగకుండా భగవంతుడు వుండాలని కోరుకోవాలని చక్కటి సందేశం వున్నది.

చాలామంది సాధకులు చెప్పేది ఏమిటంటే నాకు సాధనకు సమయం దొరకటం లేదునిజంగా ఇది వినటానికి వింతగా వున్నా ఇది నిజం. మీకు ఎందుకు సమయం దొరకడంలేదు అని అడిగితె వాళ్ళు చెప్పే సమాదానాలునాకు ఆఫీసులో పని వత్తిడిగా వుంది. ఇంట్లో నాభార్య నాకు అనుకూలంగా లేదు కాబట్టి నా మనస్సు ఎప్పుడు చికాగుగా వుంటున్నది. దేనిమీద మనస్సు నిలవటం లేదునిజానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు మరి ఎలా సాధన చేయాలి. అని అనేక సాకులు చెపుతువుంటారు. యదార్ధానికి ఇవి ఏవి కూడా సాధనకు అవాంతరాలు కావు వారికి సాధన చేయాలని ఉంటే సమయం అదే దొరుకుతుంది

మీరు రోజు టీ కాఫీ తాగుతున్నారా అయ్యో టీ తాగకుంటే నాకు వెంటనే తలకాయ నొప్పి పుడుతుంది. కాబట్టి సమయానికి నాకు టీ కావలసిందే. మీరు రోజు ఫలహారాలు తింటున్నారా అంటే నాకు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిరోజు ఒకటే తినాలంటే నాకు ఇష్టముండదు. అంటారుమరి భోజనం సంగతి అంటే పాటు తప్పినా సాపాటు తప్పదుగా అని హాస్యం చేస్తాడు. సమయానికి భోజనం చేస్తాను  అందుకే ఇంతమాత్రం ఆరోగ్యంగా వున్నాను అని అంటారు. నీ దైనందిక జీవితంలో ప్రతిదానికి నీకు సమయం దొరుకుతుంది మరి సాధనకు ఎందుకు సమయం కేటాయించలేక పోతున్నావు? నీ దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావుచాలా సంతోషం మరి నీకు దేహాన్ని ఇచ్చిన భగవంతునికి సాధన చేయటానికి సమయాన్ని ఎందుకు కేటాయించలేక పోతున్నావు

నిజానికి నీకు చిత్త శుద్ధి ఉంటే నీ దైనందిక జీవితంలో సాధనను కూడా ఒకటిగా చేసుకుంటావుఆలా చేసుకొని చూసుకోతప్పకుండ నీకు సాధనకు సమయం చేకూరుతుంది. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సాధకుడు తన దైనందిక జీవితంలో సాదనను కూడా ఒక భాగంగా చేసుకోవాలి, అప్పుడే సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తెలివిగా ప్రతి వక్కరు వారి దైనందిక జీవితాన్ని ఒక ప్రణాళికా బద్దంగా రూపుదిద్దుకుంటే తప్పకుండ సాధన నిరంతరాయంగా కొనసాగుతుంది. మోక్షం కారతలామలకాలం అవుతుంది.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ.

కామెంట్‌లు లేవు: