30, నవంబర్ 2024, శనివారం

అరుదైన అమావాస్య

 *అరుదైన అమావాస్య ఇది*


_శ్రీ విష్ణుపురాణంలో ఈ విధంగా వ్యాసుడు చెప్పాడు._


అమావాస్య యదా మైత్ర  విశాఖా  స్వాతి యోగినీ|

శ్రాద్ధైః పితృగణస్తృప్తిం తదాప్నోత్యష్టవార్షికీమ్||


స్వాతి విశాఖ అనూరాధ నక్షత్రాలు అమావాస్యతో కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు  సంతోషిస్తారని విష్ణుపురాణంలోని మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం అంటోంది.


ఇటువంటి అరుదైన సంగమం డిసెంబర్ 1వ తేదీన వస్తోంది, ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి. 

అమావాస్య 10.43 వరకూ ఉంటోంది, అనూరాధ మధ్యాహ్నం 2.10 వరకూ ఉంటుంది. 


*నిజానికి ఈ సంగమం శనివారమే ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 9.16 తరువాత అమావాస్య ప్రవేశిస్తుంది* *మధ్యాహ్నపరివ్యాప్తమై ఉంటుంది. విశాఖ 12.17 వరకూ ఉంటుంది. తదుపరి అనూరాధ ప్రవేశిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం విశాఖ, అనూరాధలతో అమావాస్య కలిసి రావడం మహత్తరం కనుక ఈ దివ్యమైన సంయోగం శనివారం ఉదయం 9.16 నుంచీ ప్రారంభమై ఆదివారం ఉదయం 10.43 వరకూ ఉంటుంది. ఇది మహదవకాశంగా అందరూ భావించాలి. కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చనను ఇస్తోంది.  పితరుల శాపం నుంచీ విముక్తిపొందడానికి అద్భుతమైన అవకాశం. శనివారం, ఆదివారం పెద్దలను అర్చించడం మంచిది* *తిలతర్పణములు, పిండప్రదానాలు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకొని పెద్దల పేర్లు తలచుకోవడం వలన ఉత్తమఅభివృద్ధి సాధించవచ్చు.*


 

*కనుక  శని ఆది వారాలు మీకు దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళి గోసేవ చేసుకోగలరు. వీలైనంత మందికి అన్నదానం చేసుకోండి, సువర్ణ దానం ఇంకా మంచిది*

*ఏమి వీలుకాని పరిస్థితులలో బీద సాదలకు  ----స్వయంపాకం ఇవ్వడం మంచిది*.

కామెంట్‌లు లేవు: