1, నవంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *1.11.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*21.9 (తొమ్మిదవ శ్లోకము)*


*కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా|*


*యతో నివర్తతే కర్మ స దోషోఽకర్మకః స్మృతః॥13051॥*


కర్మలు చక్కగా నెరవేరుటకు, అందుకు కావలసిన సామాగ్రి పూర్తిగా లభించుటకు అనువైన కాలమే పవిత్రమైనది. కర్మలను నిర్వహించుటకు తగిన సామాగ్రి లభించునట్టి, ఆగంతుకమైన లేదా సహజమైన దోషములచే కర్మలు కొనసాగనట్టి కాలము అపవిత్రము - - అశుద్ధము అని తెలియవలెను.


*21.10 (పదియవ శ్లోకము)*


*ద్రవ్యస్య శుద్ధ్యశుద్ధీ చ ద్రవ్యేణ వచనేన చ|*


*సంస్కారేణాథ కాలేన మహత్వాల్పతయాఽథ వా॥13052॥*


ద్రవ్యములు, వచనములు, సంస్కారములు, కాలము, అధికము, అల్పము మొదలగువానిని బట్టి పదార్థములయొక్క పవిత్రతను, అపవిత్రతను నిర్ణయింపవలెను.


పాత్రలు జలముచే పవిత్రములగును, మూత్రాదులచే అపవిత్రములగును. ఏదైనను ఒక వస్తువు పవిత్రమైనదా? అపవిత్రమైనదా? అను శంక కలిగినప్పుడు బ్రాహ్మణుడు చెప్పినమీదట అది పవిత్రమగును. లేనిచో అది అపవిత్రమగును. పుష్పాదులపై జలములను చల్లినప్పుడు అవి పవిత్రములగును. వాసన చూచినచో అవి అపవిత్రములగును. అప్పుడే వండిన అన్నము పవిత్రము. చద్దిఅన్నము అపవిత్రము. పెద్దపెద్ద సరోవరములు, నదులు మొదలగు వాటియందలి జలములు పవిత్రములు, చిన్నచిన్న గుంతలలోని నీరు అపవిత్రము.


*21.11 (పదకొండవ శ్లోకము)*


*శక్త్యాశక్త్యాథ వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే|*


*అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః॥13053॥*


దేశకాల, అవస్థాది భేదములను అనుసరించి, శక్తినిబట్టి, అశక్తతనుబట్టి, బుద్ధిబలమునుబట్టి, సంపద్వైభవనములనుబట్టి దోషాదోషభావములు వర్తించును. ఉదాహరణమునకు గ్రహణాదుల సమయమున శక్తిగలవారు స్నానాదులను ఆచరింపకుండుట దోషమగును, శక్తిలేనివారి విషయమున అది దోషముగాదు. పుత్రజన్మాదుల విషయమున తెలిసి జాతాశౌచములను పాటింపకుండుట దోషము, తెలియనప్పుడు అది దోషముగాదు. అట్లే సంపద్వైభవములు కలిగియున్నప్పుడు జీర్ణ మలినాది వస్త్రములను ధరించుట దోషము, నిర్ధనుల విషయమున అది దోషముగాదు. దేశ, కాల, అవస్థాదుల విషయమునగూడ దోషాదోషములు ఇట్లే వర్తించును (ధనికుడు, దరిద్రుడు, బలవంతుడు, దుర్బలుడు, బుద్ధిమంతుడు, మూర్ఖుడు, ఉపద్రవములు, ప్రశాంతతగల దేశములు, యువకులు, వృద్ధులు, ఇత్యాది భేదములనుబట్టిగూడ దోషాదోషముల విచారణ (నిర్ణయము) చేయవలెను.


*21.12 (పండ్రెండవ శ్లోకము)*


*ధాన్యదార్వస్థితంతూనాం రసతైజసచర్మణామ్|*


*కాలవాయ్వగ్నిమృత్తోయైః పార్థివానాం యుతాయుతైః॥13054॥*


ధాన్యములు, కర్రలు, ఏనుగు దంతములు మొదలగు ఎముకలు, దారములు (వస్త్రములు), నెయ్యి, తేనె, ఉప్పు, నూనె మొదలగు రసపదార్థములు, బంగారము, కంచు మొదలగు తైజస వస్తువులు, చర్మవస్తువులు, మట్టి వస్తువులు మొదలగునవి కాలానుగుణముగను, వాయువు, అగ్ని, మట్టి, జలము మొదలగువాటివలన పరిశుద్ధములగును.


ధాన్యాదులు కాలానుగుణముగా, వాయువువలనను, దార్వాది (చెక్కమొదలగు) పాత్రలు, మట్టి, జలములతోడను, గజ దంతాదులు వాయువు, సూర్యరశ్మిచేతను, వస్త్రాదులు జలములవలనను, క్షీరాదులు కాచుటవలనను, బంగారము, కంచు మొదలగు లోహములు అగ్నివలనను, చర్మవస్తువులు తైలముతోను, అన్నము మొదలగు భోజన పదార్థములలో కేశములు వచ్చినప్పుడు వాటిని తీసివేసి, ఆజ్యసంస్కారము జరుపుటవలనను పరిశుద్ధములగును.


*21.13 (పదమూడవ శ్లోకము)*


*అమేధ్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి|*


*భజతే ప్రకృతిం తస్య తచ్ఛౌచం తావదిష్యతే॥13055॥*


అపవిత్ర పదార్థములు అంటినప్పుడు దుర్గంధములు, మాలిన్యములు తొలగిపోయి యథాస్థితికి వచ్చునంతవరకు వాటిని శుభ్రపరచవలెను. అప్పుడవి పవిత్రములగును.


*21.14 (పదునాలుగవ శ్లోకము)*


*స్నానదానతపోఽవస్థా వీర్యసంస్కారకర్మభిః|*


*మత్స్మృత్యా చాత్మనః శౌచం శుద్ధః కర్మాచరేద్ద్విజః॥13056॥*


ద్విజులు (మానవులు) నన్ను (భగవంతుని) స్మరించుచు, చిత్తశుద్ధిని పొంది, స్నానము, దానము, తపస్సు, వయస్సు (కర్మానుష్ఠాన వయస్సు), శక్తి, ఉపనయనాది సంధ్యోపాసనాది సంస్కారములు మున్నగు వాటిని ఆచరింపవలెను. అప్పుడు ఆ కార్యములు పరిశుద్ధములు అగును. అట్లొనర్చిన పిమ్మట ఇతర కార్యములను నిర్వర్తింపవలెను.


*21.15 (పదునైదవ శ్లోకము)*


*మంత్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణమ్|*


*ధర్మః సంపద్యతే షడ్భిరధర్మస్తు విపర్యయః॥13057॥*


గురువుద్వారా ఉపదేశమును పొంది, దాని అర్థపరిజ్ఞానముతో మననము చేసినప్పుడు మంత్రశుద్ధి ఏర్పడును. కర్మములను భగవదర్పణము చేసినప్పుడే అవి పవిత్రములు (సార్థకములు) అగును. ఈవిధముగా దేశము, కాలము, పదార్థము, కర్త, మంత్రము, కర్మలు అను ఆరును శుద్ధమొనర్చుట ధర్మము, దీనికి వ్యతిరేకముగా ఆచరించినచో అవి పరిశుద్ధములుగావు. అట్లు చేయుట అధర్మము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం

 *1.11.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*21.1 (ప్రథమ శ్లోకము)*


*య ఏతాన్ మత్పథో హిత్వా భక్తిజ్ఞానక్రియాత్మకాన్|*


*క్షుద్రాన్ కామాంశ్చలైః ప్రాణైర్జుషంతః సంసరంతి తే॥13043॥*


*శ్రీకృష్ణభగవానుడు పలికెను* ఉద్ధవా! నేను ఉపదేశించిన మోక్షసాధకములైన భక్తి, జ్ఞాన, కర్మ మార్గములను వీడి చంచలములైన ఇంద్రియములద్వారా క్షుద్రములైన శబ్దాది విషయములను అనుభవించువారు పదేపదే జన్మమృత్యురూపమైన సంసారచక్రమున పరిభ్రమించుచుందురు.


*21.2 (రెండవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*విపర్యయస్తు దోషః స్యాదుభయోరేష నిశ్చయః॥13044॥*


మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల యందు దృఢమైన నిష్ఠకలిగియుండుటయే గుణము. అందులకు విరుద్ధముగా ఇతర వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట దోషము. సారాంశమేమనగా గుణదోషములయొక్క నిర్ణయము ఆయా వ్యక్తుల అర్హతలనుబట్టి యుండును.


*21.3 (మూడవ శ్లోకము)*


*శుద్ధ్యశుద్ధీ విధీయేతే సమానేష్వపి వస్తుషు|*


*ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాఽశుభౌ॥13045॥*


తాత్త్విక (వాస్తవిక) దృష్టితో చూచినప్పుడు వస్తువులు అన్నియును సమానములే. వాటి ప్రయోజనమును బట్టి, వాటి గుణదోషములు నిర్ణయింపబడును. ద్రవ్యముయొక్క మంచి-చెడులను గురుంచి కలిగిన సందేహముసు నివారించుటకై ఆ ద్రవ్యమును చక్కగా పరిశీలించి నిరీక్షణ-పరీక్షణలద్వారా దాని సహజస్వభావమును గురుంచిన గుణదోషములు, శుభాశుభములు నిగ్గుదేల్చబడును.


*21.4 (నాలుగవ శ్లోకము)*


*ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ|*


*దర్శితోఽయం మయాఽఽచారో ధర్మముద్వహతాం ధురమ్॥13046॥*


పుణ్యపురుషా! ఉద్ధవా! వర్ణాశ్రమ ధర్మానుష్ఠానము శాస్త్రసమ్మతముగా, లోకవ్యవహారమునకు అనుగుణముగా, వ్యక్తులయొక్క జీవనవిధానములకు తోడ్పడునదిగా ఉండవలెను. ధర్మబద్ధముగా జీవించువారికి కలిగే సందేహములను నివారించుటకొరకే ఆచార (ధర్మ)మును నేను మనువుద్వారా తెలిపియుంటిని.


*21.5 (ఐదవ శ్లోకము)*


*భూమ్యంబ్వగ్న్యనిలాకాశా భూతానాం పంచధాతవః|*


*ఆబ్రహ్మస్థావరాదీనాం శారీరా ఆత్మసంయుతాః॥13047॥*


భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను పంచమహాభూతములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు గల సకల శరీరములకును మూలకారణములు. ఇవి అన్నియును శరీరదృష్టితో చూచినప్పుడు సమానములే. వీటియందలి ఆత్మకూడ ఒక్కటే.


*21.6 (ఆరవ శ్లోకము)*


*వేదేన నామ రూపాణి విషమాణి సమేష్వపి|*


*ధాతుషూద్ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థసిద్ధయే॥13048॥*


ఉద్ధవా! పంచమహాభూతములు సమస్తప్రాణి పదార్థములయందును సమానముగనే యున్నవి. లోక వ్యవహారమునకై వాటికి వేదము వేర్వేరు నామరూపములను కల్పించెను.


*21.7 (ఏడవ శ్లోకము)*


*దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమ|*


*గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణామ్॥13049॥*


సాధుసత్తమా! మానవుల కర్మలయందు విశృంఖలప్రవృత్తి ఏర్పడగూడదనియు, నియమాను సారముగా, మర్యాదపూర్వకముగా కర్మలను ఆచరించుట కొరకు దేశము, కాలము, ద్రవ్యము మొదలగు వాటి గురుంచి గుణదోషములను విధించితిని.


*21.8 (ఎనిమిదవ శ్లోకము)*


*అకృష్ణసారో దేశానామబ్రహ్మణ్యోఽశుచిర్భవేత్|*


*కృష్ణసారోఽప్యసౌవీరకీకటాసంస్కృతేరిణమ్॥13050॥*


కృష్ణసారములు (నల్లజింకలు) లేనిదేశమును, ధార్మికప్రవృత్తి లేని దేశమును అపవిత్రమైన దేశముగా భావింపవలెను. ఒకవేళ కృష్ణసారములు ఉన్నను వేదవేత్తలను ఆదరించనిచో ఆ దేశములు అపవిత్రములే యగును. కీకట (కళింగాది) దేశములు అపవిత్రమైనవే. తీర్థయాత్రలకై దప్ప అవి మసలుటకు అర్హములు కావు. సంస్కారరహితములు, మరియు ఊసరక్షేత్రములు గూడ అపవిత్రమైనవే.


(శ్రీ వేదవ్యాసప్రణీతబ శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*486వ నామ మంత్రము* 1.11.2021


*ఓం శ్యామాభాయై నమః* 


శ్యామలవర్ణంలో భాసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్యామాభా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శ్యామాభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ రాకినీదేవిస్వరూపంతో భాసిల్లు ఆ జగన్మాతను ఆరాధించు సాధకులు సకలార్థసిద్ధిని పొందుటయే గాక, ఆ పరమేశ్వరిని హృదయస్థానమునందలి దహరాకాశంలో ప్రతిష్టించుకొని, ధ్యాన నిరతితో తరించుదురు.


అనాహతాబ్జనిలయమందు విలసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరి శ్యామల వర్ణముతో (నల్లని శరీర వర్ణముతో) భాసిల్లును. పదహారు వత్సరముల బాలికను *శ్యామ* అని అందురు. అమ్మవారు అటువంటి పదహారు వత్సరముల బాలికగా భాసిల్లుచున్నది గనుక, రాకినీస్వరూపిణియైన ఆ తల్లి *శ్యామాభా* అని యనబడినది. *భా* యని అనగా ప్రకాశించుట అని అర్థము. నల్లనికాంతితో భాసిల్లు రాకినీదేవి నలుపులోనే చక్కదనముగల నలుపు వర్ణము. అ నల్లని వర్ణముగల ముఖమునందు దొండపండువంటి పెదవులు, నక్షత్రకాంతులను ధిక్కరించే నాసాభరణముతో అమ్మవారు ప్రసన్నస్వరూపముతో భక్తులకు వరదాయనిగా గోచరిల్లు చుండును. సిందూరవర్ణశోభితమైన కుంకమతిలకముతో భాసిల్లు ఆ పరమేశ్వరి నల్లనిమోము నీలోత్పలమువలె (నల్లకలువవలె) తేజరిల్లుచున్నది. 


నీలోత్పలమువంటి మోము గలిగిన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శ్యామాభాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*485వ నామ మంత్రము* 1.11.2021


*ఓం అనాహతాబ్జనిలయాయై నమః*


హృదయమునందలి అనాహతచక్రము అను ద్వాదశ (పన్నెండు) దళముల పద్మమందు రాకినీయోగినీ రూపంలో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అనాహతాబ్జ నిలయా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు రాకినీస్వరూపిణియైన ఆ పరమేశ్వరి వారికి ఇష్టమగు కోరికలను నెరవేర్చును.


జగన్మాత హృదయమునందు పండ్రెండుదళములుగల అనాహతపద్మమునందు రాకినీయోగిని స్వరూపంలో విలసిల్లుచున్నది. రాకినీయోగిని ఈ విధముగా వివరింపబడినది: రాకినీదేవి పండ్రెండుదళములుగల పద్మమందు శ్యామలవర్ణముతో భాసిల్లుచున్నది. ఆ దేవికి రెండుముఖములుగలవు. నాలుగు బాహువులయందును చక్రము, శూలము, కపాలము, డమరుకములను ధరించియున్నది. ఆ తల్లి మూడునేత్రములు గలిగినదిగా ఉన్నది. సప్తధాతువులలో రక్తధాతునందు విలసిల్లుచున్నది. రాకినీదేవి కాళరాత్రి మొదలగు పండ్రెండు మంది యోగినులచే పరివేష్టింపబడినది. రాకినీదేవికి నేతి అన్నము అనిన ప్రీతి. ఆమె ఉపాసకశ్రేష్ఠులచే నమస్కరింపబడుచున్నది. ఆ దేవి ఇష్టమైన కోరికలు నెరవేర్చునదిగా చెప్పబడుచున్నది. అనాహతాబ్జ చక్రాధిష్ఠానదేవతను వామదేవి అందురు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను వాక్కునకు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి యను నాలుగురూపములు ఉండగా పరాస్థానమునందు పుట్టి, పశ్యంతిగామారిన వాక్కు అనాహతాబ్జమునందు మధ్యమ రూపమునకు చేరును. అనాహతాబ్జపద్మము బంగారు రంగులో ఉండును. అనాహతాబ్జ చక్రమునకు అధిధేవత రుద్రుడు. అనాహతాబ్జపద్మమునందుగల పండ్రెండు దళములందు క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ అను పండ్రెండు వర్ణములు పండ్రెండు శక్తిరూపములుగా ఉండును. *అనాహతాబ్జనిలయా* యను 485వ నామ మంత్రము నుండి *మహావీరేంద్రవరదా* యను 493వ నామ మంత్రమువరకూ రాకినీదేవియొక్క విశేణములు వివరింపబడినవి. 


రాకినీదేవి స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అనాహతాబ్జనిలయాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ఇదే కదా ఇదే కదా

 *ఇదే కదా ఇదే కదా* 

*నీ కథా..*


కూతురు అమెరికాలో..

అమ్మ అంబాజీపేటలో..

కొడుకు ఇంగ్లండ్ లో

తండ్రి ఇరుకు సందులో..

నువ్వు ఇన్ఫోసిస్

నాన్నకేమో క్రైసిస్..

నువ్వు వీసాపై ఎక్కడో

అమ్మ అంపశయ్యపై 

నీ ఊళ్ళో

నువ్వు రావు..

రాలేనంటావు..

నిజానికి రావాలని అనుకోవు..

టికెట్ దొరకదంటావు..

సెలవు లేదంటావు..

వస్తే తిరిగి రావడం కష్టమంటావు..

నువ్వు వచ్చేదాక

పెద్ద ప్రాణం పోనంటుంది..

నీ రాక కోసం ఆ కళ్ళు 

గుమ్మం వైపే..

రావని నాన్నకి

తెలిసినా అమ్మకు 

ఆ కబురు చెప్పలేక..

కక్కలేక..మింగలేక..

మంచం చుట్టూ 

అటూ ఇటూ

అవతల ఆ తల్లి 

ఇంకాసేపట్లో అటో ఇటో..!


వయసు వచ్చినప్పటి నుంచి 

డాలర్ డ్రీమ్సే..

పొద్దున లేస్తే ఆ ఊసే..

నీ కలల వెనకే 

తల్లిదండ్రుల పరుగు..

వారి ఆశలన్నీ నీ అమెరికా పయనంతోనే కరుగు..

బ్రతుకుతెరువు కోసం నువ్వక్కడ..

గుండె బరువుతో వారిక్కడ..

మొదట్లో రోజూ 

ఓ వాట్సప్ కాలు

రెండ్రోజులకో వీడియో ఫోను

పోను పోను కొంత విరామం

ఏంట్రా అంటే వర్కులోడు

అప్పటికే నిద్ర లేచి ఉంటాడు 

నీలో ఓ మాయలోడు...

అక్కడ కొనుక్కున్న 

కొత్త కారుతో 

నీ ఫోటో ఫోజు

ఇక్కడ డొక్కు స్కూటరుతో

తంటాలే నాన్నకి ప్రతిరోజు..!


ఈలోగా అన్నీ బాగుంటే 

పెద్దలు కుదిర్చిన పెళ్లి..

లేదంటే అక్కడే 

ఓ మేరీతో మేరేజ్..

ఆలికి కడుపో కాలో వస్తే

ఆయాగా అమ్మకి వీసా

నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా..!

ఎంత అమ్మయినా

నీ పిల్లలకు నాన్నమ్మయినా

ఆమె నాన్నకు భార్య

అక్కడ పెద్దాయన 

రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని

బెంగ..

ఆ దంపతులను 

అలా వేరుగా ఉంచి 

మీ జంట మాత్రం

టింగురంగ..!


మొత్తానికి అలా అమ్మ అవసరం కొంత తీరాక

అప్పుడిక ఆమె ఉంటే బరువు

ఈలోగా ముగుస్తుంది 

ఆమె వీసా గడువు..

ఆమె చేతిలో టికెట్

నాన్నకిమ్మంటూ 

ఓ గిఫ్టు పేకెట్..!


ఇటు నిన్ను వదలి వెళ్ళలేక

అటు భర్తని విడిచి ఉండలేక

చెమ్మగిల్లిన కళ్ళతో

విమానం ఎక్కిన అమ్మకి తెలియదు అదే చివరి చూపని

ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు

నీళ్లలా ఖర్చయ్యే డబ్బు..

నువ్వు పంపుతావేమో..

కాని ఆ వయసులో 

నాన్నకు శ్రమ..

నువ్వు వస్తావని అమ్మకి భ్రమ..

వచ్చే ప్రాణం..పోయే ప్రాణం

చివరకు అనివార్యమయ్యే మరణం..

వాడు వస్తున్నాడా..?ఏమంటున్నాడు..

ఊపిరి వదిలే వరకు 

అదే ప్రశ్నతో అమ్మ..

నిర్జీవమైన ఆ కళ్ళలో 

నీ బొమ్మ..

కొరివి పెట్టాల్సిన 

నువ్వు సీమలో...

నాన్న కర్మ చేస్తుంటే 

ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో..

అస్తికల నిమజ్జనం అంటూ 

నాన్న కాశీకి పయనం

అంత శ్రమ ఎందుకు..

పక్కనే ఉండి కదా 

గోదారని నీ అనునయం..!


ఇప్పుడిక నాన్న కథ..

ఉన్న ఊరు..

కట్టుకున్న ఇల్లు

ముఖ్యంగా ఆ ఇంట్లో 

అమ్మ జ్ఞాపకాలు వదిలి రాలేక..

ఒంటరి బ్రతుకు ఈడ్వలేక..

కష్టాలకు ఓర్వలేక..

ఓ రోజున ఆయన కధా కంచికి

ఈసారి వస్తావు..

కొరివి పెట్టి

ఊళ్ళో ఇల్లు అమ్మేసి

ఉన్న ఊరు..కన్న తల్లి..

అన్నిటితో రుణం తెంచుకుని 

నేను ఎన్నారై..

మిగిలినవన్నీ 

జాన్తా నై..

అంటూ

పుట్టిన గడ్డను వదిలి

పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస

ఇదే కదా చాలామంది వరస..!


(అన్ని కథలూ ఇలాగే ఉంటున్నాయని కాదు..

కానీ చాలా ఇళ్ళలో

ఇదే బాగోతం.!

సంపాదనపై మోజుతో విదేశాలకు వెళ్ళడం..

ఇక్కడి కన్నా అక్కడ జీవితం చాలా గొప్పగా 

ఉంటుందంటూ 

సన్నాయి నొక్కులు..

మారిపోయే దృక్కులు..

అక్కడి నుంచి మేజిక్కులు..జిమ్మిక్కులు..

ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను నెత్తిన పెట్టుకుని చూసే పిల్లలూ..

ఈ దేశంలో ఉండి కూడా పట్టించుకోని పిల్లలూ లేకపోలేదు.అయితే పూర్తిగా అలాగే ఉంటున్న సంతానం గురించే ఈ ఆవేదన..

కాస్తయినా 

మారండని నివేదన)


      *ఇ.సురేష్ కుమార్*

   మరో సముదాయం నుంచి🙏👏

రామాయణం Day -5*

 *రామాయణం Day -5*

     

నారదుని వలన నీకు ఏవిధముగా *రామ కథ* చెప్పబడెనో ఆ విధముగనే నీవు *రామ కథ* చెప్పు.


*రాముడు* ధర్మాత్ముడు,లోకములో శ్రేష్ఠమైన గుణములు అని మనము చెప్పుకొనేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి!

*రాముని* గూర్చిన అన్నివిషయములు నీకు తేటతెల్లము కాగలవు!


" కురు రామకధాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్"


మనస్సును రమింపచేసేది, పుణ్యప్రదము అయిన *రామకథను* అక్షర బద్ధం చేయి. నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షరసత్యము కాగలదు!.


యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావద్రామయణకధా లోకేషు ప్రచరిష్యతి!


....ఎప్పటి వరకైతే భూమిమీద పర్వతాలు నిలచి ఉంటాయో! 

ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో

అప్పటివరకు భూమి మీద *రామకథ* ప్రాచుర్యంలో ఉంటుంది!.


అప్పటివరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు!

అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు.


బ్రహ్మ వరంచేత మహర్షి మనోఫలకం మీద ( మనసు తెర మీద) *రామచరిత* మొత్తం కనపడజొచ్చింది! .


*రామకథను* అక్షరబద్ధం చేయటానికి మహర్షి సంకల్పం గావించుకొన్నారు! .


పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశముండేది! వారు కోసలదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు.

 అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు.


విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య! ఉన్నతమైన కోట బురుజులు, వందలకొద్దీ శతఘ్నులు మొహరించి ఉండేవి ! రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది.

ప్రజలంతా ధనధాన్యసమృద్ధితో, సుఖసంతోషాలతో, ఆనందంగా ఏ లోటులేకుండా జీవనం సాగించేవారు .


ఆ సమయంలో దశరధుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు.

ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవారాయన!.


దశరధమహారాజు వద్ద ఎనమండుగురు మంత్రులుండేవారు!

వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు! ఎదుటివ్యక్తి ముఖకవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు!

రాజుకు మేలుకలిగించేవి, హితకరంగా ఉండేవి,మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్ధులు.


వారు వరుసగా, ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్దుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు .


వసిష్ఠ, వామదేవులు ప్రధాన ఋత్విక్కులు.


మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు , పటిష్ఠమైన గూడచార వ్యవస్థ కలిగి , రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకొన్నారు.

ఆ మంత్రులు, స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారుకాదు! 

వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు! ..


బలవంతుడయిన వ్యక్తి, బలహీనుడయిన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది! ( సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము).


రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు!


రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్రవైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరధమహారాజు!


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో....... *जय श्रीराम*

గుండె పోటు.

 గుండె పోటు.

దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.

1)అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).

2) మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.

3) ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది

ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.

మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.

4) దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.

5) మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.

6) మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?

చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.

వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.

7) అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని రక్షించుకోవచ్చు.

దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.

ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.

8) గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.

బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.

ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.

9) ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.

10) ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.

11) జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి

తెలియజేయండి.

12 ) ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.

మీరంటే శ్రద్దతో ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది

మీ కోసం ఈ సందేశం పంపిన వారు.

డా. ఎం .అశోక్

Cardiology Doctor

అందరి గమ్యం.....*

 *ఇదేకదా నిజమైన జీవితం?*

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : మధ్యతరగతి పడక గది

వయసు. : భర్త 21+ ఏళ్ళు, భార్య:18+ఏళ్ళు. 

భర్త : అబ్బా రాత్రి 10 అవుతుంది, ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలి నీకోసం , తొందరగా రావచ్చుగా గదిలోకి, ఒక్కడినినే ఉండి ఏంచేయాలో తోచక చేతులు, దిండు నలుపుతున్నా. 

భార్య : నాకూ రావాలనే ఉంది మీ అమ్మ వదిలితేగా, ఏదో ఒక పనో, మాటలో చెప్తూ ఉంది, అవన్నీ అయ్యేటప్పటికి ఈసమయం అయింది. 

               *******

        వయసు: 30+, 

సమయం : రాత్రి 10

ప్రదేశం : అదే పడకగది

భర్త: పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు, బాధ అంతా ఈ చిన్నోడి తోటే, నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు, మనం మంచి మూడ్ లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూం వస్తుంది, మంచి నీళ్ళు కావాలి, ఆకలి ఐతుంది అంటాడు....

భార్య : ఏం చేస్తాం మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా అంతే మరి...

                     ****

వయసు : 50+

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : అదే పడక గది

భర్త: గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశావా, పాలు తోడు పెట్టావా..

భార్య:ఆ ఆ అన్నీ చేశా, మీరు కళ్ళజోడు, ఫోన్

 తెచ్చుకున్నారా? 

భర్త : ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు. 

భార్య : సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది.

          *******

వయసు. : 55+

సమయం : రాత్రి 10 ఎప్పటి లాగే

ప్రదేశము : అదే పాత పడక గది

భర్త : బి.పి, షుగరు టాబ్లెట్ లు వేసుకున్నవా, పిల్లలు పండగకి వస్తామన్నారా?

భార్య: నేను, వేసుకున్నా, మీరు వేసుకున్నారా, పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట కుదరదన్నాడు. 

భర్త : సరే ఏం చేస్తాం , పడుకో, అన్నట్టు పాలు తోడు పెట్టావా?

భార్య : తోడు పెట్టాను, మీరు ఫోను, కళ్లజోడు దగ్గర పెట్టుకున్నారా?

ఇద్దరు చెరో వైపు తిరిగి పడుకున్నారు

                   ******

   వయసు : 65+

సమయం : రాత్రి 10 గంటలు

ప్రదేశం : అదే పాత పడకగది

భర్త : బి.పి, షుగరు తో పాటు మోకాళ్ళ నొప్పుల మందు కూడా వేసుకున్నవా....

భార్య : నేను వేసుకున్నా, మీవి కూడా పట్టుకొచ్చా వేసుకోండి...

భర్త: సరే ఇటియ్యి, వేసుకుంటా, అవునూ, అమెరికా నుండి మనవళ్లు, మనవరాళ్లు ఫోన్ చేసారా ఈమధ్య , ఎప్పుడయినా వస్తామంటున్నార, పుట్టి పదేళ్లు వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు, ఫోన్లో వీడియో కాల్ లో చూడటమే తప్ప నిజంగా ఒక్కసారి చూసింది లేదు.

భార్య : నిన్న చిన్నవాడు, పెద్దవాడు ఇద్దరి కుటుంబాలు ఎదో హోటల్ లో కలుసుకొని అక్కడినుండి ఇద్దరు వాళ్ళ , వాళ్ళ పిల్లలతో ఫోన్ లో మాట్లాడించారు. మంచి డాక్టర్ కి చూపించుకోండి, మందులు వాడండి ఎన్ని డబ్బులు అయినా ఫరవాలేదు పంపిస్తాము అన్నారు, వాళ్ళకి ఇంకో 2 ఏళ్ల దాకా రావటానికి కుదరదట, సరే పొద్దు పోయింది పడుకోండి..

భర్త: వాళ్ళు రారు, మనం వాళ్ళని, వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే,

పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలతో రాత్రి ఒంటిగంట దాకా నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే పిల్లలు గుర్తొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది, అసలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేసామేమో, ఒక్కడినన్న ఇక్కడ ఉండమనాల్సింది, సరే లే ఇప్పుడు అనుకోని ఏంచేస్తాం, నీకన్నా నిద్ర పడుతున్నదా?

భార్య: నాది మీ పరిస్థితే నాకూ ఒంటిగంట తరువాతే నిద్ర, కళ్ళు తెరిచినా, మూసినా పిల్లలే కళ్ళలో మెదులుతున్నారు, ఏంచేస్తాం అంతా మన ఖర్మ , 

సరే నిద్ర రాకపోయినా అట్లాగే కళ్ళు మూసుకొని పడుకుందాం ఎప్పటికో నిద్ర పట్టక పోదు.

ఇద్దరూ బలవంతాన కళ్ళు మూసుకున్నారు.

                   *******

వయసు : 80+

సమయం : రాత్రి 11 గంటలు

ప్రదేశం : ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో, కాళ్ళు సరిగా లేని కుంటి మంచం. 

భార్య: ఆయన పోయి నెల రోజులు అయింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ, ఒక్క కోడలు కానీ, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ వచ్చిన పాపాన లేదు, కన్నతండ్రి చనిపోతే కర్మ కాండకూడా చేయలేని, తీరిక లేని కొడుకులు, సమయానికి మా తమ్ముడు, వాడి కొడుకు రాబట్టి కనీసం కర్మకాండలు అయినా పూర్తి అయినయి. 

ఇక నా పరిస్థితి ఏమి కానుందో....

ఎప్పటికయినా నా పిల్లలు వస్తారో..రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది, అంతే ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు, మర్నాడు పనిమనిషి వచ్చి తలుపు ఎంత సేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు, అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే "భార్య" శాశ్వత నిద్రలోకి పోయింది.

చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు.

*ఇదండి జీవితం,,,,,*

*ఇదేనండి అందరి గమ్యం.....*

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన

 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన

I

*Devulapalli Krishna Sastry*


మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.. 

సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది.. 

మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…

అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. . 

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…

మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం…ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..

అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..

“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”

అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…

కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…

“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…

సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..

చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమె తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..

మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…చిత్ర పరిస్రమకు సంబందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..

గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..

ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలోమారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..

“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..

ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..

కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..

మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..

“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తె ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”

తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్నఅక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..

అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..

ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…

మీరే చదవండి .తెలుస్తుంది .

శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…

మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చిఅలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…

ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…

అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…ఆ తరువాత అందులోని విషయాన్నిసంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…

“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ ఉగాదులూ వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…

ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..

“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి.. 

ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…

దుంఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…

“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”

తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపది మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..

ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని

“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…

అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాదించారు శాస్త్రిగారు…

“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”

వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…

“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..

“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”

దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు.. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..

“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”

“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…

ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..

వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…

కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…

“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…

గుండె పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..

“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “

“..సరే…అట్లాగే రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..

వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…

అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…

వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…

“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”

అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..

“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”

“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…

ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….

ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా వున్నారు…అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..

ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..

మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు

“…అయ్యా మీరిక్కదేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా ” అని…

దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..

“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..

అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…

ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..

ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..

ఆ పాటే…

అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”

ఉపసంహారం 

ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…

“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం) “.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు) “..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం) “..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం) మొదలైనవి…ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు.. 

“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ… రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..

ముక్తాయింపు

“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం.   

                   స్వస్తి!


రసజ్ఙభారతి సౌజన్యంతో--

అరచేతులులలో చెమటని హరించుట

 అరికాళ్ళు , అరచేతులులలో చెమటని హరించుట కొరకు సులభ యోగం - 


      దానిమ్మ చిగుళ్లు పూటకు 5 చొప్పున రోజూ రెండుపూటలా తీసుకుంటూ ఉంటే అరికాళ్లు , అరచేతుల్లో పుట్టే చెమట హరించును ....


          

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శ్రీమద్భాగవతము

 *01.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2309(౨౩౦౯)*


*10.1-1449*


*మ. బలుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా*

*రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు*

*జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ*

*డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై* 🌺



*_భావము: "ఈ బలరామకృష్ణులు సామాన్య మానవులా? కానే కారు. మోక్షప్రదాత యగు ఆ శ్రీమహావిష్ణువే భూభారాన్ని తగ్గించటం కొరకు ఈ రామకృష్ణుల రూపాలలో అవతరించాడు. మోక్ష కాములు ప్రాణోత్క్రమణ సమయమున, ఈ రూపములోనున్న సర్వేశ్వరుడగు శ్రీహరిని స్మరించినంత మాత్రమున, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ, నిత్యమైన, మహోత్కృష్టమైన పరబ్రహ్మమును పొందగలడు."_* 🙏



*_Meaning: “These Boys are not any ordinary mortals. To reduce the weight on this earth, the Supreme Being Bhagwan Sri Maha Vishnu took incarnation as Sri Krishna and Balarama. The mere chanting and reciting the names of Sri MahaVishnu, by the seekers of Moksha, in their dying moments, will shine like the Sun, reach His Lotus Feet and attain eternal Moksha.”_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

తెలుగునాట సూర్యదేవాలయం...

 🙏తెలుగునాట సూర్యదేవాలయం...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿🌸గొల్లల మామిడాడ.🌿🌸

కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది.

మామిడాడ క్షేత్రంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి.అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగాఉంటాయి.ఈ రెండు తూర్పు,పచ్చిమ దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి

.దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది.రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది.

వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి.మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు,కాలువలు,కాకినాడ ప్రాంతం,ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చును ....

ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం.గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ,మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా,సుందరంగా అమర్చారు.ఆ శిల్ప సౌదర్యం చూస్తూఉంటే ఆనాటి రామాయణ,మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి.....

ఆలయానికి చేరుకొనే మార్గం :

మామిడాడ గ్రామం కాకినాడకు 20కి.మీ దూరం,రాజమండ్రికి 58కి.మీ దూరం ,సామర్లకోటకు 17కి.మీ దూరంలో ఉంటుంది.కాకినాడ,రాజమండ్రి,సామర్లకోట వరకు రైలు సౌకర్యం కలదు.అక్కడనుండి బస్సులు,ఆటోలు,ఇతర ప్రెవేటు వాహనాలద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.....💐😊🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వరమా - శాపమా*

 *వరమా - శాపమా*

                  

*సిక్కుల మత గురువు గురునానక్ తన శిష్యులతో కలసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ దేశమంతా తిరుగుతూ ఉన్న సమయంలో ఎదురైన జరిగిన రెండు సంఘటనలు వాటిని వారికి శిష్యులకు వివరించిన తీరు గురించి తెలుసుకుందాం.*


*ఒకసారి గురునానక్ వారి శిష్య బృందం ఒక ఊరిని సందర్శించారు, ఆ ఊరిలోని ప్రజలు వీరిని ఆదరించ కపోగా, కనీసం అతిథులనే మర్యాద కూడా వీరి పట్ల చూపించక వీరిని దుర్భాషలాడి రాళ్లతో కొట్టి ఆ ఊరి నుండి తరిమివేశారు.*


*గురునానక్ గారు ఆ ఊరు వెలుపలికి వెళ్ళిన తర్వాత ‘ఈ ఊరిలోని వారు ఎక్కడికీ పోకుండా ఇక్కడే ఉందురు గాక!’ అని దీవించి వెళ్ళాడు.*


*అలాగే మరుసటి రోజు వీరు మరొక గ్రామం చేరుకోవడం జరిగింది. ఆ గ్రామంలో వీరిని సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేకూర్చి వీరు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలను జాగ్రత్తగా వినడం జరిగింది. వీరు తిరుగి పోతూ ఉంటే గ్రామ పొలిమేరల దాకా వచ్చి వీరిని సాగనంపి వెళ్లారు.*

 

*వారు వెళ్ళిన తర్వాత గురునానక్ గారు ‘ఈ ఊరిలోని ప్రజలు చెల్లా చెదురు అయి పోదురుగాక!’ అని చెప్పి వెళ్ళిపోయాడు.*

 

*బృందంలో ఉన్న కొందరికి ఈ మాటలు అంతగా రుచించలేదు. అంతేకాక వారిని కొంచెం బాధించాయి కూడా. ఉండబట్టలేక ‘గురువుగారూ! మీరు చేసినటువంటి పనులు మాకు ఏమీ అర్థం కావడం లేదు! మనల్ని అవమానించిన వారిని దీవించారు, మనల్ని ఆదరించిన వారిని శపించారు! ఎందుకలా చేశారు కొంచెం వివరంగా చెప్పగలరా?’ అని అడిగారు.*


 *’నాయనా మొదటి ఊరివారు వారికి తెలిసిందే వేదాంతం అని అనుకుంటున్న అజ్ఞానులు, ఆచార వ్యవహారాలు తెలియని మహా మూర్ఖులు.’*


*వీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ వీరి అజ్ఞానపు చేష్టలతో, తగాదాలు వివాదాలు సృష్టిస్తారు, వీరు మిగిలిన ప్రజలందరినీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. కాబట్టి ఇలాంటి మూర్ఖులు ఇక్కడ ఉండడమే ప్రజహితం.’*


*’ఇక రెండో ఊరి వారి గురించి వారు చాలా గొప్పవారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నవారు. అతిది మర్యాదలు తెలిసిన ఉత్తములు. వారు ఎక్కడ ఉంటే అక్కడ చక్కటి సంస్కృతి అలవడుతుంది. మంచి మర్యాదలు పదిమందికి నేర్పుతారు కాబట్టి వారి అవసరం ప్రపంచానికి ఉంది. అందుకనే వారిని ఆ విధంగా ఆశీర్వదించ వలసి వచ్చింది.’*


*ఈ రెండు సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత వ్యవహారాల కు చైనా, భారత్ కు చక్కగా సరిపోతాయి.*

 

*తాగి తాను చెడ్డ కోతి వనం అంతా పాడు చేసింది అన్నట్లు చైనా వారు వారి విషసంస్కృతి తో వారు చెడింది కాక ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేశారు.*


*ప్రపంచ దేశాలన్నీ నేడు వీరిని చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి.*


 *ఇక భారత దేశం గురించి...!*


*తులసి మొక్క లాంటి వారు భారతీయులు, తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ ఆయుష్షు, ఆరోగ్యం రెండూ పంచి పెడుతుంది. భారతీయులు కూడా అలాంటి వారే.*


*తులసి ఆకులు తిన్నా తులసి నీళ్లు తాగినా ఆరోగ్యం పదింతలు మెరుగుపడుతుంది. భారతీయులతో స్నేహం చక్కని సంస్కృతితో పాటు మంచి వైద్య విధానాన్ని కూడా అలవాటు చేస్తుంది.*


*ఈ కథలోని నీతి ఏమిటంటే మనం మన పిల్లలకి సంపద ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చక్కని సంస్కారం నేర్పాలి. అది లేకపోతే మనం వారికి ఇచ్చిన సంపద బూడిదలో పోసిన పన్నీరు తో సమానంగా సర్వ నాశనం అయిపోతుంది.*


*భావితరాలకు వారసులు వారు వారిని చక్కగా పెంచుకుందాం భారతీయ గొప్పదనాన్ని కాపాడుకుందాం.*


                   


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

తెలుగు మర్చిపోయాము

 తెలుగు మర్చిపోయాము ?

తెలుగు భాష ను మన ఇళ్ల లోనే వాడటం మానేశామా ?


డోర్ లాక్ చెయ్యకండి, నేను వెళ్తున్నా డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ ? ’ఇందులో ‘కీస్’ కు అచ్చ తెలుగు పదం వాడొచ్చు. కానీ మనం వాడం.


ఎందుకు ? 


ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 

తలుపు తాళం వేసుకో, గడియ పెట్టుకో అనే వాళ్ళం. ఇవేకాదు, చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లల కు నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం ?


మన తెలుగులో మాటలు లేవా ? 

ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి !

కానీ మనం పలకం. 


వంటింటిని......కిచెన్ చేసాం. 

వసారా.....వరండాగా మారింది. 

ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.


మన ఇళ్ళ కు చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. గెస్ట్‌ లే వస్తారు. 

ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. ఏ లంచో, డిన్నరో చేస్తారు. 

భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 

అందులో వడ్డించే వన్నీ.......

రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో అని భయం. అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. 

బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాము. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.


ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడను అడిగా. ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి ? అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నావంతయింది. 


టీ.వీ లో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 

వంటా - వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళ కు అలవోకగా ఆంగ్ల పదాలు పట్టుబడతాయి మరి. 

అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 


టీ.వీ వంటల కార్యక్రమం లో ఒకావిడ మన కు వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 

అది ఏ భాషో మీరే చెప్పండి. 

‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలాసాగుతుంది. 

మరి మన కూరల కు అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?


నిన్న మా పక్కింటాయన వచ్చి 

‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ అని చెప్పి వెళ్ళాడు. 

మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది ? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం ?


అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 

అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.


పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. స్కూల్‍ కు పంపిస్తాం. 

సరే బడికి వెళ్ళాక వాళ్ళకు ఎలాగూ ఇంగ్లీషు లో మాట్లాడక తప్పదు. 

ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 


మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం ? ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా ? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి ? ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు, నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం , 

 చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన.


ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.


అలాగని వాడుకలో ఉన్నమాటలను వదిలేసి పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించి పోతుంది. బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా, కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. మన తెలుగు భాషని కాపాడాలని ఈ రోజు నుంచి మన వంతు కృషి మనం చేద్దామా మరి.

https://chat.whatsapp.com/JXrTvoDSVhnF3Nx7GJXO12

మొగలిచెర్ల

 *ఆశీర్వాదం..ఆయుష్షు..*


అప్పటికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొంది సుమారు రెండు సంవత్సరాల కాలం గడిచింది..ఆ సరికే మొగిలిచెర్ల చుట్టుప్రక్కల ఓ ముప్పై కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో శ్రీ స్వామివారి గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు..శ్రీ స్వామివారి ని నమ్మి కొలిస్తే తమకు కష్టాలు తీరుతాయని ప్రచారం జరిగిపోయింది..


1978 వ సంవత్సరం..ఒక పల్లెటూరు నుంచి మరొక పల్లెటూరికి ప్రయాణం చేయాలంటే..ఎడ్లబండి కానీ..కాలినడక గానీ శరణ్యం అనుకునే రోజులు..తాము ఉంటున్న వెంగళాయిపల్లె గ్రామం (ప్రస్తుత ప్రకాశం జిల్లా..P C పల్లె మండలం) నుంచి కరణం మాలకొండయ్య, లక్షమ్మ దంపతులు, ఇరవై కిలోమీటర్ల దూరం నడచివచ్చి, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలుచున్నారు..తమ మనసులో సుడులు తిరుగుతున్న వేదన..ఆ స్వామికి విన్నవించుకుందామనే బలీయమైన కోరిక.. వారిని అంతదూరం నడిపించింది..కారణం..అప్పటికి తమకు పుట్టిన ఇద్దరు బిడ్డలూ అల్పాయుష్కులై చనిపోయారు..కడుపుకోత భరించలేనిదిగా ఉంది..


ఆ సమయంలో, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మొక్కుకుంటే ఫలితం ఉంటుందనే ఆశతో..మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చారు..స్వామి దగ్గర మంటపంలో సాగిలపడి, తమ బాధ చెప్పుకున్నారు..అలా వరుసగా ఐదు శని, ఆదివారాల పాటు, రాను ఇరవై, పోను ఇరవై కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణం చేసి, శ్రీ దత్తాత్రేయుడిని కొలుచుకున్నారు..


ఈసారి వారి ప్రార్ధన ఆ స్వామివారినీ కదిలించిందేమో..1980 లోమగపిల్లవాడు పుట్టాడు.. దంపతులిద్దరూ..ఆ పిల్లవాడిని మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి ప్రసాదంగా భావించి "దత్తాత్రేయుడు" అని పేరు పెట్టుకున్నారు..ఆ తరువాత మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..ఆ అమ్మాయికి.."దత్తాత్రేయమ్మ" అని పేరు పెట్టారు..


ఇక పిల్లలిద్దరి భారం శ్రీ స్వామివారి మీదే వేసి..తమ బిడ్డలు ఇంతకుముందు పుట్టిన వాళ్ళలా అల్పాయుష్కులు కాకూడదని శ్రీ స్వామివారిని వేడుకున్నారు..భక్తితో ఆర్తిగా వేడుకుంటే స్వామివారు కరుణించరా...?..స్వామివారి చల్లటి చూపుతో పిల్లలిద్దరూ లక్షణంగా పెరిగారు..


పిల్లలిద్దరికీ...తాము మొగలిచెర్ల దత్తాత్రేయుడిని నమ్ముకోబట్టే.. మీరిద్దరూ ఇలా లక్షణంగా ఉన్నారు అని చెప్పుకునేవారు ఆ దంపతులు..ఆ పిల్లలకూ స్వామి వారి మీద అపరితమైన విశ్వాసం కుదిరింది..వివాహాలూ జరిగాయి..జీవితంలో ఏ కష్ట సుఖాలైనా దత్తాత్రేయుడి కృపే నని ఆ సంసారం మొత్తం నమ్మి, స్వామివారిని కొలిచేవారు..


 కొన్నాళ్ల క్రితం శ్రీ మాలకొండయ్య గారు మరణించారు.."నాన్నగారు మరణించి సంవత్సరం దాటిపోయింది..ఏటి సూతకం అయిన తరువాత, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను.." అంటూ బెంగుళూర్ లో PG (పేయింగ్ గెస్ట్ హోమ్) నడుపుతున్న మాలకొండయ్యగారి పెద్దకుమారుడు దత్తాత్రేయుడు నాతో చెప్పుకొచ్చాడు..శ్రీ స్వామివారి దయవల్ల తన సోదరి కూడా బాగుందని..క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటామనీ..భక్తి పూర్వకంగా చెప్పుకున్నాడు..


సాక్షాత్తూ శ్రీ స్వామివారి ఆశీస్సులతో పెరిగిన ఆ పిల్లలకు ఏ ఇబ్బందీ రాదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రము మండలం..ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

 నీహారిక సౌగంధి వేగుచుక్క ఎక్కడ మీరు ?

.............................................................


(1) వేగుచుక్క అనగా ?


(అ) గూఢచారి

(ఆ) శుక్రుగ్రహం

(ఇ) దళనాయకుడు

(ఈ) దోపిడిదొంగ


(2) సౌగంధికుడు అనగా ?


(అ) సుగంధద్రవ్యములు అమ్మువాడు

(ఆ) బాటసారి

(ఇ) ప్రధాని

(ఈ) పూలమాలలు ధరించినవాడు


(3) చెంగావిరంగు అనగా ?


(అ) పసుపు

(ఆ) ఆకుపచ్చ

(ఇ) నీలం

(ఈ) ఎరుపు


(4) గజస్నానమని సంబోధిస్తే 


(అ) ఏనుగుజలక్రీడలను ఆచరించుట

(ఆ) ఎక్కువసేపు స్నానం చేయుట

(ఇ) నిష్ఫలప్రయత్నం

(ఈ) పెద్దకార్యాన్ని తలపెట్టుట


(5) ఉప్పరిగ అనగా ?


(అ) మేడ

(ఆ) మిద్దె

(ఇ) అంతస్తు

(ఈ) గవాక్షం


(6) బొబ్బర్లు అనగా ?


(అ) శెనగలు

(ఆ) పెసలు

(ఇ) అలసందులు

(ఈ) మినుములు (ఉద్దులు)


(7) పులుగు అనగా ?


(అ) పక్షి

(ఆ) పురుగు

(ఇ) పాము

(ఈ) బొద్దింక


(8) బోకులు అనగా ?


(అ) కత్తులు

(ఆ) వంటపాత్రలు

(ఇ) చెడినవారు

(ఈ) సైనికులు


(8) తలుగు అనగా ?


(అ) నాగలి

(ఆ) నాగలిమేడి

(ఇ) మోకు

(ఈ) పలుపు (పలుపుతాడు )


(9) ఎలమావి అనగా ?


(అ) పూదోట

(ఆ) మామిడితోట

(ఇ) మంచినీల్ల బావి

(ఈ) చిగుర్చుట


(10) నీహారిక అనగా ?


(అ) నీలిరంగు దండ

(ఆ) దట్టమైన పొగ

(ఇ) దట్టమైన పొగమంచు

(ఈ) కలువపూవు.

...................................................................... ....................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

*లక్ష్మీ నివాసం

 *నీతికథ*

-----------------------------------

          *లక్ష్మీనివాసం*

--------------------------------------

లక్షీదేవి ఒకసారి ఒక వ్యక్తి పై 

అలిగి నేనూ వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు అని అంటుంది


అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవి తో ఇలా అంటాడు.


అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు.

కాకపోతే దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరి వున్న ప్రేమాభిమానాలు 

అలాగే వుండేటట్లు వరం ఇవ్వమని అంటాడు.


లక్ష్మీదేవి తథాస్తు అని వెళ్లిపోతుంది.

             **


కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న

ఆ వ్యక్తి భార్య 

  కూరలో ఉప్పు,కారం సమపాలలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.

కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు,కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.


కొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి

తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.


ఇంతలో అత్తగారు వచ్చి 

కోడళ్లు ఇద్దరు తమ పనిలో 

పడి వుప్పు వేశారో లేదో అని

తనూ కొంత వేస్తుంది.


మధ్యాహ్నం భోజనానికి ఆవ్యక్తి తను తినే సమయంలో కూరలో

ఉప్పు ఎక్కువ అయినది గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించింది 

అని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు.


కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినది అని గ్రహించి నాన్న గారు తిన్నారా అని భార్యను అడుగుతాడు.


తిన్నారు అని చెబుతుంది.


దానితో నాన్న నే ఏమి అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండ తిని లేస్తాడు.


ఇలా ఇంటి వాళ్లంత తిని వంట గురించి

మాటలాడకుండ వుంటారు.


ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గర కు వచ్చి నేను వెళ్లిపోతున్నాను.

ఉప్పు విషం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా 

ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండ అని వెళ్లిపోతుంది.


దరిద్ర దేవత వెళ్లిపోవటం తో 

ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.


*ఏ ఇంటిలో *ప్రేమ,అప్యాయతలు మరియు శాంతి* వుంటాయో 

ఆ ఇంటిలో 

*లక్ష్మీ నివాసం*

అయ్యి వుంటుంది.


* ఈ కథ చదివి వారి

ఇంట లక్షీదేవి నివాసం అయ్యి వుండాలనికోరుకొంటున్నాను.*

భగవంతుడు ఎవరికి దాసుడు

 *భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలి???*


*భగవంతునితో ముందు - ఎలాంటి భావంతో ఉండాలి???*



ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్దమనిషి నిందగా భగవాన్ తో ఇలా సంభోధించారు ...



 "భగవాన్ ! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు... 


కావాలని వాళ్ళని పలకరిస్తారు, లాలిస్తారు ,చేతుల మీద వారికి తినిపిస్తారు, మేము మీ చూపు కోసం ,మాట కోసం, మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా , ప్రాధేయపడినా, ప్రార్ధించినా మా వంకే చూడరు... ఇది మీకు న్యాయమేనా ? మీ సమత్వానికి భంగం కాదా? " అని నిష్టూరంగా మాట్లాడాడు...



భగవాన్ పెదవులపై చిరునవ్వుతో తొణికిసలాడింది, కొద్దిసేపు మౌనం వహించారు...


తర్వాత మృదువుగా "అదా ! మీ సందేహం! ఆ పశువులు, పక్షులు, పిల్లులు, అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు... ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు...


అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను...


అట్లా సహజంగా ప్రవర్తించడం నాకిష్టం, ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో , కాపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టకుపోవాలనే కాంక్షతో ఆవస్తారు. 


దానికోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు, ఇవన్నీ వేషాలు, మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు" అన్నారు...


నా అంతటి భక్తుడు లేడని, పెద్ద దండో , పూలో , ఫలాలో బుట్టలనిండా తెస్తారు, ఇవి అవసరమా!!! , నిర్మలమైన భక్తి ఒక్కటి చాలదా!!!...


నీ గూర్చి తెలిసిన భగవంతునికి, నీ మనసులో ఏముందో తెలియదా!!!, ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసుడవుతాడు, భక్తుడు ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండాలి...


*ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలి???*



                     *_🌷శుభమస్తు🌷_*


             🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

శ్రీమద్వాల్మీకి రామాయణం


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)


                ----------------------- 


          11. ప్రజా జీవనం - నాగరికత 


అ) అయోధ్య తరతరాల ప్రజలకు ఆయురారోగ్యభాగ్యాలని కొల్లలుగా పంచియిచ్చిన దివ్యభూమి. 

ఆ) జ్ఞానులయెడ రక్షకులు గౌరవం కలిగి రాజ్యపాలన చేసేవారు. 

ఇ) స్త్రీ పురుషులు 

     - ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు, 

     - ఇంద్రయనిగ్రహం కలవారు, 

     - సదాచార సంపన్నులు, 

     - సత్స్వభావం కలవారు. 

ఈ) అయోధ్యలో

       - కామాతురుడుగానీ, 

       - లోభిగానీ, 

       - క్రూరుడుగానీ, 

       - విద్యావిహీనుడుగానీ, 

       - నాస్తికుడుగానీ ఎంతవెదికినా కానరాడట. 

ఉ) అయోధ్య జనులు 

    - ధర్మాత్ములు, 

    - అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినవారు, 

    - సుఖసంతోషాలతో, శాంతంగా జీవించేవారు. 


      వీటన్నింటికీ మూలం సత్యధర్మాలు, 

     "సత్యం వద - ధర్మం చర" అనేదే ప్రధానం. 


      తద్విరుద్ధంగా, ఈ రెంటి లోపంవల్లే, లంకలో రావణుడూ అతని పరివారమూ విలాసవంతమైన జీవితాలు గడిపినప్పటికీ, నాశనమయ్యారు. 

      ధర్మాచరణతోనున్న విభీషణుడే లంకాధిపతి అయ్యాడు. 

      కేవలం భౌతిక భోగలాలసత మాత్రమే అయితే, అది దేనికి దారితీస్తుందో రావణ పరివారం ద్వారా తెలుస్తుంది. 


      అయోధ్యలో శ్రీరాముని నుంచీ అట్టడుగు స్థాయివరకూ అంతా త్యాగం కనిపిస్తుంది. 

      పలు అంతస్తుల భవనాలలో నివసిస్తున్నా, జీవనం సత్య - ధర్మబద్ధంగా ఉండడంవల్ల, అయోధ్య ఏ రంగంలోనైనా ఆదర్శవంతంగా కనబడుతుంది. 


ముగింపు 


      శ్రీమద్రామాయణంలో ప్రస్తుత విద్యావిషయాలైన 

1. చరిత్ర, 

2. సార్వభౌమత్వము - సామ్రాజ్యవాదము, 

3. భూగోళ శాస్త్రము, 

4. ఆర్థిక, వాణిజ్య విషయాలు, 

5. పరిపాలనా విధానం, 

6. గణితం - సంఖ్యా శాస్త్రం, 

7. భౌతిక శాస్త్రాలు, 

8. జీవశాస్త్రం, 

9. సాంకేతిక విజ్ఞానం, 

10. వైద్యశాస్త్రం, 

11. ప్రజా జీవనం - నాగరికత వంటివాటికి సంబంధించి పరిశీలించినప్పుడు, 

        ఏ విద్యావిషయంపైన అయినా, 

      శ్రీమద్వాల్మీకి రామాయణ కథ 

      ఆ విషయానికి సంబంధించి, 

     - మౌలికంగా, 

     - సమగ్రంగా, 

     - ఆదర్శవంతంగా అనేక విషయాలు బోధపడతాయి. 


       శ్రీమద్రామాయణం వల్ల మన మస్తిష్కమే ఒక "విజ్ఞాన సర్వస్వం" (Encyclo Paedia)గా అయి, 

      - అనూహ్యమైన సత్ఫలితాలతో, 

      - సుఖసంతోషాలతో కూడిన, 

      - దైవత్వ జీవతాన్ని కలిగి, 

        మన దేశం ప్రపంచంలోనే శక్తివంతమై ఉంటుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం