*భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలి???*
*భగవంతునితో ముందు - ఎలాంటి భావంతో ఉండాలి???*
ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్దమనిషి నిందగా భగవాన్ తో ఇలా సంభోధించారు ...
"భగవాన్ ! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు...
కావాలని వాళ్ళని పలకరిస్తారు, లాలిస్తారు ,చేతుల మీద వారికి తినిపిస్తారు, మేము మీ చూపు కోసం ,మాట కోసం, మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా , ప్రాధేయపడినా, ప్రార్ధించినా మా వంకే చూడరు... ఇది మీకు న్యాయమేనా ? మీ సమత్వానికి భంగం కాదా? " అని నిష్టూరంగా మాట్లాడాడు...
భగవాన్ పెదవులపై చిరునవ్వుతో తొణికిసలాడింది, కొద్దిసేపు మౌనం వహించారు...
తర్వాత మృదువుగా "అదా ! మీ సందేహం! ఆ పశువులు, పక్షులు, పిల్లులు, అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు... ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు...
అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను...
అట్లా సహజంగా ప్రవర్తించడం నాకిష్టం, ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో , కాపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టకుపోవాలనే కాంక్షతో ఆవస్తారు.
దానికోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు, ఇవన్నీ వేషాలు, మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు" అన్నారు...
నా అంతటి భక్తుడు లేడని, పెద్ద దండో , పూలో , ఫలాలో బుట్టలనిండా తెస్తారు, ఇవి అవసరమా!!! , నిర్మలమైన భక్తి ఒక్కటి చాలదా!!!...
నీ గూర్చి తెలిసిన భగవంతునికి, నీ మనసులో ఏముందో తెలియదా!!!, ఇలా నటన భక్తికి భగవంతుడు ఎలా దాసుడవుతాడు, భక్తుడు ఎప్పుడూ నిర్మలమైన మనసుతో ఉండాలి...
*ఇప్పుడు చెప్పు భగవంతుడు ఎవరికి దాసుడు, ఎవరిని ఇష్టపడాలి???*
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి