27, నవంబర్ 2023, సోమవారం

Telangana garelu


 

Mirchi bajji

 https://youtube.com/shorts/cLX3HVSs7MY?si=VOMpWI0eFD99K5AP


 #ఆముక్త మాల్య#


విష్ణుచిత్తుడు "వాదించడానికి రాజ సభకు వెళ్ళు" అనిన స్వామితో      ఇలా అంటున్నాడు.



సీ. "స్వామీ ! మహాదేవ ! శరణాగతుడ నేను

               పెనుభార మీరీతి  బెట్ట దగునె !

     అపఠితశాస్త్రుండ నత్యంతమూఢుండ 

              గ్రంధజాత్యంధుండ కడుజడుండ 

     నారామభూమిని ననయంబు ద్రవ్వుచు

              పట్టియు గుద్దలిన్  బాటు పడగ

     పటు ఘర్షణంబున పాణి ద్వయంబున 

            కాయలు గాచిన కర్షకుడను

     భక్తితో నీ గీము బరిశుభ్ర మొనరించు

            భావమ్ము నందుండు  సేవకుడను

తే. అట్టి నను వాదమున కీవు పట్టుబట్టి

      ప్రభువు సభకును దెలిసియు పంపితేని

      గల్గు నపజయ, మపకీర్తి కాదె నీది,

      పంపుటకు ముందె యోచించు పరమపురుష! 


సీ. పరమాత్మ ! నిరతంబు భవదాలయమ్మునన్

                పరిమార్జనము సేయు పనిని కాని 

     స్నానమ్మునకు దివ్య సలిలమున్ దెచ్చెడి

                భవ్యమౌదివ్యమౌ పనిని కాని

     శృంగార పల్లకిన్ జేబూని మోసెడు

                వాహనసేవయన్ పనిని కాని

     తులసిదండలు గట్టి తోమాలగా నీకు

                 భక్తితో నర్పించు పనిని కాని

      ప్రభువు లర్పించెడు పలువిధ ధ్వజముల 

                 పట్టియల్ మోసెడు పనిని కాని

      ఛత్ర చామరములు సద్భక్తి తోడను 

                 పరవశమ్మున బట్టు పనిని గాని

      ముందు దీపమ్ముల  మోదమ్ము తో  నెత్తి

               నిను గాంచు భాగ్యమౌ  పనిని కాని

 తే. సల్ప నర్హుండ  నేను, నో  సర్వవినుత !

     వాదమది యేల యీశ్వరా ! వదలు నన్ను

     నన్యు లెవ్వరు కనరారె యవనియందు

     నీదు లీలలు ప్రకటించ నీరజాక్ష !"       


సరళపద్యానుసరణము :

గోపాలుని మధుసూదన రావు

 🕉 మన గుడి : నెం 251





⚜ గుజరాత్ : పట్టి, సురేంద్రనగర్


⚜ శ్రీ వర్నీంద్ర ధామ్ 


💠 శ్రీ స్వామినారాయణ్ మందిర్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి మరియు ఇది స్వామినారాయణ సంప్రదాయంలో భాగం.  


💠 స్వామినారాయణ సంప్రదాయం స్థాపకుడు అయిన స్వామినారాయణ్ తన ఆస్తికత మరియు దేవతా ఆరాధనలో భాగంగా దేవాలయాలను స్థాపించాడు.  

అతను క్రింది నగరాల్లో తొమ్మిది దేవాలయాలను నిర్మించాడు;  

అహ్మదాబాద్, 

భుజ్, 

ములి, 

వడ్తాల్, 

జునాగఢ్, 

ధోలేరా, 

ధోల్కా, 

గధ్‌పూర్ & జెతల్‌పూర్.  


💠 ఈ దేవాలయాలలో అతను నారాయణ్ దేవ్, లక్ష్మీనారాయణ్ దేవ్, రాధాకృష్ణ దేవ్, రాధారామన్ దేవ్, రేవ్తి-బల్దేవ్జీ, మదన్ మోహన్ దేవ్ మొదలైన వివిధ హిందూ దేవుళ్ల చిత్రాలను ఏర్పాటు చేశాడు. 


💠 శ్రీ స్వామినారాయణ దేవాలయాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు కానీ విదేశాలలో కూడా చాలా ఖ్యాతిని కలిగి ఉన్నాయి.  

USA, ఆస్ట్రేలియా, సీషెల్స్, కెనడా, థాయిలాండ్, ఫిజీ, మారిషస్, న్యూజిలాండ్, ఒమన్, UAE మరియు జాంబియాలలో ప్రసిద్ధ స్వామినారాయణ దేవాలయాలు ఉన్నాయి.  స్వామినారాయణ వారసత్వం యొక్క ప్రముఖ లక్షణాలలో ఒకటి ఆలయ వాస్తుశిల్పం.  స్వామినారాయణుడు నిర్మించిన ఆలయాల్లోని కృష్ణుని ప్రాధాన్యతకు నిదర్శనం.  


💠 ఇక్కడి వర్నీంద్ర ధామ్ స్వామినారాయణ దేవాలయం, సురేంద్రనగర్ జిల్లా, దాసాదా తాలూకాలోని విరామ్‌గాం, గాంధీనగర్ హైవే, మల్వన్ చోక్డి పట్టి మీదుగా పట్టి వద్ద ఉన్న అందమైన ఆలయం. 

ఈ ఆలయం పోయిచాలోని నీలకంఠం స్వామినారాయణ ఆలయంలో రెండవ భాగం. 


💠 ఈ అందమైన ఆలయాన్ని శ్రీ వడ్తాల్ స్వామి నారాయణ ఆలయం కింద శ్రీ స్వామి నారాయణ గురుకుల్ సూరత్ నిర్వహిస్తోంది.


💠 ఇప్పుడు ప్రతిరోజూ వేలాది మంది భక్తులతో గుజరాత్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రం మరియు పర్యాటక ప్రదేశం.  

అద్భుతమైన డిజైన్, విగ్రహాలు, ఎగ్జిబిషన్, లైటింగ్ మొదలైన వాటితో 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పవిత్ర స్థలం మినీ పోయిచ్ అని ప్రసిద్ధి చెందింది. 

వర్నీంద్రధం శ్రీ స్వామినారాయణ గురుకుల్ సూరత్ పరిధిలోని శ్రీ వడ్తాల్ స్వామినారాయణ గడి కింద ఉంది మరియు దీనిని ధర్మవల్లభదాస్ స్వామి రూపొందించారు. 


💠 ఈ ప్రధాన తీర్థయాత్ర ఆకర్షణ 17 అక్టోబర్ 2017న సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది మరియు తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది.  

ప్రతి ఒక్కరి మనస్సు మరియు ఆత్మ పరమాత్మతో ముడిపడి ఉన్నట్లు భావించే పరమేశ్వరుని ఆరాధనకు ఇది సరైన స్థలం.  


💠 ఇతర హిందూ దేవాలయాల మాదిరిగానే స్వామినారాయణ దేవాలయాలు, ఆరాధకులు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా కేంద్ర మందిరం చుట్టూ నడక మార్గాలను కలిగి ఉంటాయి.  

వీటిని తరచుగా డిజైన్లు మరియు పొదగబడిన పాలరాతితో అలంకరిస్తారు.  

ప్రధాన మందిరం ప్రాంతం రెయిలింగ్‌లతో విభజించబడింది.  


💠 దేవుడిపై పూర్తి ఏకాగ్రత ఉండేలా దేవాలయాల్లో స్త్రీ, పురుషులను వేరు చేయాలని స్వామినారాయణ్ ప్రచారం చేసినందున రైలింగ్‌లో ఒక వైపు మహిళలకు ప్రత్యేకించబడింది. 


💠 సమీప రైల్వే స్టేషన్ విరామగం రైల్వే స్టేషన్ (30 కి.మీ.).


 

Great job


 

Prarambhahs

 https://youtube.com/shorts/RR-H5mOJ4s4?si=B7gLKhXixT3QknNI


 *జైశ్రీరామ్*


                            11-5-2020

                            అభ్యాసం-11


                          *సుభాషితం* 


"అదాన దోషేణ భవేద్దరిద్రో

  దారిద్ర్య దోషేణ కరోతిపాపం |

  పాపా దవశ్యం నరకం ప్రయాతి

  పున ద్దరిద్రీ పునరేవ పాపీ" ||


                            *భావం*


ఎవరికిని ఏమీ యివ్వని,పెట్టని పాపం

చేత దరిదృ డవుతున్నాడు. దరిదృడవటంచేత మళ్ళీ పాపాలు చేస్తాడు.పాపాలు చెయ్యటం వల్ల నరకానికి పోతాడు.

మళ్ళీ దరిదృడుగా పుట్టి మళ్ళీ పాపాలే చేస్తాడు.

మళ్ళీ నరకానికే పోతాడు.ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

కావున ప్రతీ వ్యక్తీ తనకు ఉన్నంతలో దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి.దానగుణం తన సహజ లక్షణం, స్వభావం అవ్వాలి.దానివలన మానవునికి ఉన్నత జన్మలు లభించి ముక్తికి మార్గం సుగమం అవుతుందని సనాతన ధర్మం చెబుతోంది.


                      *అమృతవచనం* 


*నారాయణ*సూక్తం* ఇలా  అంటుంది: "అంతర్ భహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః".

భగవంతుడు సర్వాంతర్యామి అని, సర్వత్ర వ్యాపించి యున్నాడని చెబుతుంది.విశ్మమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి రధసారధిగా వ్యవహరించి, నైరాశ్యంలో కూరుకుపోయిన పార్ధునికి జగద్గురువుగా *గీతోపదేశం* చేసాడు.మార్గశిర శుద్ధ దశమినాడు అలా ఆ భగవంతుని ముఖతః ప్రపంచానికి అందిన అమృతభాండం,  మానవులను తట్టిలేపే ధర్మఘంట శ్రీమద్భగవద్గీత.భగవత్ సంభందాన్ని పొందితే ఏ విషాదమైనా "యోగం" అవుతుంది.అప్పుడసలు దుఃఖమే ఉండదు.దైవసంభందం లేకుండా మానవుడు విషయాల కోసం విలపిస్తే ధుఃఖించవలసిందే.సుఖధుఖాలు బయటి ప్రపంచం నుండి రావు, అవి మనలోనే ఉంటాయి.వీరు యిస్టులని, వారు అయిస్టులని మనసు మాయవలన రాగద్వేషాలకు లోనవుతుంది,వశమవుతుంది.దాని ఫలితమే మానవులకు సుఖదుఃఖాలు.కావున మానవులందరూ ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగి ఉండాలి, భగవద్గీత చెపుతున్నది కూడా అదే. 


                        శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

 )()( ఆలోచనాలోచనాలు )()( సంస్కృత సూక్తి సుధ )()( అక్షర రూపం దాల్చిన సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక )()(                                      1* భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖిల భయం, కాయే కృతాన్తాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవాభయమ్!!         ఈ లోకంలో భోగాలు అనుభవిస్తున్నప్పుడు రోగం వచ్చి మీద పడుతుందేమోనని భయం. మంచికులంలో పుట్టామా? కులగౌరవం దెబ్బతింటుందేమోనని భయం. ధనం సంపాదిస్తే ప్రభుత్వం గాని, దొంగలు గాని అపహరిస్తారేమోనని భయం. మానం ఉన్నవాడికి అది పోయి దైన్యం ఏర్పడుతుందేమోనని భయం. బలవంతుడికి తన శత్రువు తనపై గెలుస్తాడేమోనని భయం. మంచి రూపం వుంటే , ముసలితనం ఏర్పడి అందచందాలు పోతాయేమోననే భయం. శాస్త్రాలు చదివి పాండిత్యం ఉంటే వాదనలో ఓడిపోతానేమోననే భయం. మేలైన గుణాలు ఉంటే అవి తొలగిపోయి దుర్జనులు నిందిస్తారనే భయం. దేహం ఉన్నది అంటే దానికి యమధర్మరాజు ఎప్పుడు తీసుకెళతాడోననే భయం. ఇట్లా లోకంలో అన్ని వస్తువులకు భయం అంటూ వుంది. భయంలేని ఏకైక వస్తువు "" వైరాగ్యం"" మాత్రమే సుమా! (భర్తృహరి సుభాషితం)          2* పండితేచైవ, మూర్ఖేచ, బలవత్యపి దుర్బలే, ధనికో దరిద్రేచైవ, మృత్యోస్సర్వత్ర తుల్యతః!!                           ధనవంతుడేకాని, దరిద్రుడేకాని-- బలవంతుడేకానీ, బలహీనుడేకానీ -- ధనవంతుడేకానీ, దరిద్రుడేకానీ, అందరినీ సమానంగా చూచేది ఒక్క మృత్యువు మాత్రమే! దానికి ఎక్కువ,తక్కువలు-- తారతమ్యాలు లేవు.              3* మాతరం, పితరం, పుత్రం, భ్రాతరం వా సుహృత్తమమ్!                    లోభావిష్టో నరో హన్తి, స్వామినంవా సహోదరమ్!!                        అధికమైన ఆశ ఎవడినైతే పీడిస్తూవుంటుందో అట్లాంటివాడు తల్లినిగాని, తండ్రిని గాని, కొడుకునుగాని, స్నేహితునిగాని, తోడబుట్టినవానిని గాని, యజమానిని గాని, ప్రభువును గాని చంపుటకు వెనుదీయడు. కనుక అత్యాశ మిక్కిలి చెడ్డది.         4* య ఏవం వేత్తి హన్తారం.  యశ్చైనం మన్యతే హతం! ఉభౌ తవ్ న విజానీతో వాయం హన్తి నహన్యతే!!( భగవద్గీత)      ఆత్మ చంపేది కాదు; చంపబడేది కాదు. దానికి చావుపుట్టుకలు లేవు. కొంతకాలం ఉండిపొయ్యేదికాదు. ఎప్పుడూ ఒకే రీతిగా , స్థిరంగా ఉండే ఈ ఆత్మ అనాది అయినది.                 5* వాసాంసి జీర్ణాని యథావిహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణా, న్యన్యాని సంయాతి నవాని దేహీ!!                                  వస్త్రములు చిరిగిపోయినప్పుడు మనిషి చిరిగిన వస్త్రములు విడచి నూతన వస్త్రములు ధరిస్తాడు. అట్లాగే ఆత్మకూడా శిధిలమైన శరీరాన్ని విడచి నూతన శరీరాన్ని పొందుతూ వుంటుంది. ( ఈ ఆత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకొన్నవాడు జ్ఞాని అవుతున్నాడు) --(భగవద్గీత)                        6* ఘృతస్య పాత్రమాధారోవా, పాత్రస్య ఘృత మాధారోవా!               తర్క శాస్త్ర చదువుకొనే ఒకానొక మూర్ఖ శిఖామణి గిన్నెకు నెయ్యి ఆధారమా? నెయ్యికి గిన్నె ఆధారమో తెలుసుకోదలచి ,గిన్నెలోని నెయ్యిని ఒలకబోసుకున్నాడట. తెలివి తార్కిక వాదం మిక్కిలి ప్రమాదకరం.             7* వృశ్చిక భయా పలాయ మానః, ఆశీవిషముఖై నిపతితం---                          ఒకడికి తేలు కనబడింది. అది కుడుతుందేమోననే భయంతో పరుగెత్తి ఒక పాము నోటిలో పడ్డాడు. దురదృష్టవంతుల పరిస్థితి ఇట్లాగే వుంటుంది.                8* క్షాన్తి శ్చేత్కవచేస కిం కింమరిభిః.                           క్రోధోస్తి చేదేహినాం, జ్ఞాతిశ్చేదనలేన.                    కింయది సుహృద్ది వ్యోషధైః కింఫలమ్,                            కింసర్పైర్యది దుర్జనాః, కిముధనైర్విద్యా.                   సపద్యాయది, వ్రీడాచే త్కిము భూషణైః,                 సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్!!                                   విద్య గొప్పది. దానిని మించిన ఐశ్వర్యం లేదు. ఓర్పు అనేది ఉంటే వేరే కవచం అక్కరలేదు. కోపం ఉంటే వేరే శత్రువు అక్కరలేదు. మంచి స్నేహితుడంటూ వుంటే వేరే దివ్యౌషధాలు అవసరం లేదు. దుర్జనులు ఉంటే వేరే పాములతో పని లేదు. దోషరహితమైన విద్య ఉంటే వేరే ధనం అక్కరలేదు. లజ్జ ఉంటే వేరే భూషణములు అవసరం లేదు. పాండిత్యం లేదా మంచి కవిత్వం ఉంటే  వేరే రాజ్యం అక్కర లేదు. ( భర్తృహరి సుభాషితం)        చివరగా ఒక చమత్కార శ్లోకం.                                    అశ్వం నైవ, గజం నైవ, వ్యాఘ్రం నైవచ, నైవచ !               అజాపుత్రం బలిం దద్యాత్ , దైవో దుర్బల ఘాతకః!!                             ఎవరైనా గుర్రాన్నిగాని, ఏనుగునుగానీ, పెద్ద పులిని గానీ దేవతకు బలిని ఇవ్వరు. పాపం! అమాయకమైన , దుర్బలమైన "మేక పిల్ల" ను మాత్రమే బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలులనే శిక్షిస్తాడని భావం.                  తేది 26--11--2023, ఆదివారం, శుభోదయం.

 .      *చదువు, హోదా సంస్కారాన్ని నేర్పించలేదు*

🌳🕊️🌳 🕊️🌳🕊️ 🌳🕊️🌳


*టీఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ కై ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రదేశానికి వెళుతున్నారు! మార్గమధ్యలో పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు...*


*అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది...*


*సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు ఎస్కార్ట్ వారితో పిలిపించి, పిచ్చుక గూళ్ళను తీసిస్తే,10 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు! ఆ కుర్రవాడు ఒప్పుకోక పోవడంతో, రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్ ! వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్ళు తియ్యమని యువకుడిని ఆదేశించారు.*


*అయినా తొణకని, బెదరని ఆ యువకుడు "మీరు 50 కాదు, ఎంత ఇచ్చినా, పిచ్చుక గూళ్ళను తీసి ఇవ్వలేను! నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే, ఆ గూళ్ళ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏమి కావాలి ?! అలాగే  సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు పిల్లలు కనిపించక పోతే ఎంత బాధపడుతుంది?!" అన్నాడు!*


*ఇది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు...*


*"నా స్థానం, నాహోదా,నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగావనిపించిది! తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.* 


*విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడుపే !!" అన్నారు శేషన్*


*మేనేజ్‌మెంట్ సెమినార్‌లో అక్కడి విద్యార్థులకు టిఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది !*


*ఓం  🇲🇰 🇲🇰 🇮🇳 🇲🇰 🇲🇰  శాంతి*

🥦💐🥦 🌷🪷🌷 🥦💐🌳

 మధుర సూక్తి 


కలుగరే రాజన్యు లిలను నేలగ లేదె 

         ఘనతతో తిరుగరే  గర్వమునను !

వారేరి ! యిప్పుడీ వసుధలో నున్నారె !

         సిరి తోడ దివముకు  చేరి నారె!

నుర్వి పై వారల కున్నట్టి పేరది 

         నిలిచినే యశముతో నిఖిలమందు 

శిబిచక్రవర్త్యాది శ్రేష్టులౌ రాజులు 

         కోర్కెలన్ దీర్చరే కూర్మి జనుల

వారలను విస్మరించిరె వసుధ యందు  !

ఎన్ని వర్షంబు లేలిన న్నేమి ఫలము

యిహ పరమ్ములు లేకను నహము తోడ

బ్రతుకు నందున యశమును బడయకునికి.



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 *27-11-2023*

*ఇందు వాసరః సోమ వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి   ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.

*వృషభం*

 కొన్ని వ్యవహారాలలో మిత్రులతో  వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి   ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

*మిధునం*

సమాజంలో  ప్రముఖుల  సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  నూతన ఋణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన   వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

*కర్కాటకం*

దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.  స్థిరాస్తి  వ్యవహారాలలో అవరోధాలు  తొలగుతాయి. వృత్తి  వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

*సింహం*

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో  చిన్నపాటి  వివాదాలు  ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

*కన్య*

దూరపు బంధువుల నుండి  ఆసక్తికర  విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద  పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో  మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో  నిర్ణయాలు  స్థిరంగా ఉండవు. వృత్తి  ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

*తుల*

సమాజంలో  పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి  నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ  విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  వృత్తి, ఉద్యోగాలలో  పురోగతి కలుగుతుంది.

*వృశ్చికం*

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో  ఉన్న  సమస్యలు  అధిగమించి ముందుకు సాగుతారు.

*ధనస్సు*

సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.

*మకరం*

చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.  

*కుంభం*

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు కుదురుతాయి.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడతారు.

*మీనం*

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

🕉️

 శు భో ద యం🙏


నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని

క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా

శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ

జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటి!


 భావము:

శ్రీ కాళహస్తి క్షేత్రమున వెలసిన  పరమేశ్వరా! 

నన్ను నీ దగ్గరగా వుండనీయవయ్యా!నీ వనుగ్రహించే భిక్షాన్నమే నాకు మహాప్రసాదము . ఈ సంసారసాగరంలో ,ఆశాపాశాలతో బంధించి నన్ను బాధపెట్టకు.దయతో నీ సేవకునిగా చేపట్టు. "అని కవి శివుని ప్రార్ధిస్తున్నాడు.


శివభక్తులైన కవులందరినీ ఆకర్షించే  పరమేశ్వరుని లీల భిక్షాటన ,ఆదిశంకరాచార్యులతో సహా!

"సదా మోహాటవ్యాం చరతి   యువతీనాం కుచగిరౌ/

నటత్యాశా శాఖా స్వటతి ఝటితిీ స్వైర మభితః/

కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం/

దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో//.

అన్నారు.


ఓ కపాలీ!విభూ!శివా!నీవు ఆదిభిక్షుకుడవు.ఎల్లప్పుడూ సంసారమనే వ్యామోహపు అడవిలో సంచరిస్తూ ,భార్య పిల్లలు అనే సంసారగత  ఆశా ,మోహములను కొమ్మలయందు దుముకుచూ ,పరుగులిడుచూ అతి చంచలమైన నా మనస్సనెడి కోతిని భక్తి యనెడి త్రాటితో గట్టిగా కట్టి నీవశం 🙏చేసుకో ..

(నీవు ఆది భిక్షుడవు కదా?నీ వెంట ఈ కోతిని త్రిప్పుకొనమని ధ్వని.)

శివానందలహరి .

("స్తోత్రకదంబము" నుండి)🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟

 నేడు(తేది : 25-11-23) శనివారం రోజున

*శని త్రయోదశి*

-------------------------------------


👉ఈ నెలలో రెండుసార్లు శనిత్రయోదశి లు రావడం గమనర్హం.


**************************


శనివారం + త్రయోదశి తిథి ఉన్న రోజును 

= శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 



🌸శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు అమితంగా చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.


🌸 సర్వశక్తి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. 

వారిలో

🌸1)యముడు...

వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే..., 

🌸2)శని  దేవుడు...

మానవుడు బతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

శని చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, కచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శనిత్రయోదశి నాడు శనైశ్చరుని ఆరాధించాలని నిర్దేశించారు.


🌸 *"కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.* 

 *👉 దీనిని అందజేసేది శనీశ్వరుడు."*


🌸 భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకిమంచి ప్రతిఫలం, 

చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. 


🌸 ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. 


🌸మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని  కలిగిస్తాడు


🌸 సూర్యభగవానుడు - ఛాయా సంతానమే .......

*శనిదేవుడు* అందుకే ఆయనను *సూర్యపుత్రుడు* అనీ, *ఛాయాసుతుడు* అనీ అంటారు.

గోత్రం: కాశ్యపన  

సోదరుడు: యమధర్మరాజు , సోదరి యమున .

స్నేహితులు: హనుమాన్ , కాలభైరవుడు. 

శనికి ఉన్న ఇతర పేర్లు: కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.


🌸నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. 


🌸 స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది.

---------------------------------------

🌸 ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అని చెప్పిన శని.. శివుని వద్దకు వెళ్లి ఏదేమైనా నా ప్రభావాన్ని రేపే తప్పక మీపై తప్పక చూపిస్తాను అని శపథం చేసి తీరుతాడు. అందుకు పరమశివుడు నేను తలుచుకుంటే నువ్వు  కనుమరుగు అవుతావు జాగ్రత్త  అని హెచ్చరించాడు. ఇరువురు సరే నేనేంటో చూపిస్తా,  రేపటి రోజున అని అనుకున్నారు. 


🌸 శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక,  అప్పటికే చాలామంది దేవతలపై శని ప్రభావ  సంఘటనలు వాటి కష్టాలు అనుభవించిన సంగతి శివుడికి తెలుసు.  రేపటి రోజున శని మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు అతడికి దొరకకుండా భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.  మర్నాడు శివుడు కైలాసానికి చేరుకున్నాడు.


🌸 మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన  అంతటి నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. 


శనిదేవుని ఆత్మస్థైర్యం,చాతుర్యం గ్రహించిన పరమేశ్వరుడు, ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు.

దేవదేవతలమైన మాకే ఇంతటి ప్రభావం చూపిస్తే, సామాన్య మానవులు నీ ప్రభావాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి 

👉 ఈ రోజు శనివారం మరియు త్రయోదశి  కాబట్టి నేడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. నేటి నుంచి నా పేరును కలుపుకొని శనిశ్వరుడిగా పేరొందుతావని అభయం ఇస్తాడు.

అప్పటి నుంచి త్రయోదశి తిథితో వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమపై అతి  ప్రభావం పడకుండా, చూసీచూడనట్లుగా వుండాలని            

భక్తి పూర్వకంగా ప్రార్థించాలని ఆధ్యాత్మిక పండితులు నొక్కి ఒక్కాణిస్తున్నారు.


🌸ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు వీలైతే శని దేవుడు కోసం ఉపవాసం ఉండాలి.


🌸 నవగ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. *నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది.* అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. 


🌸 జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. 


🌸 అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.



🌸జ్యోతిష శాస్తర్రీత్యా ఆయన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సివస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే.


🌸శని దేవుడికి నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. 


🌸జాతకచక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఏలినాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని పీడితులు ఈ శనిత్రయోదశి నాడు పరిహారక్రియలు చేసి ఆ గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు. న్యాయవివాదాలు, శత్రు, రోగ, రుణబాధలు తగ్గుతాయి. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోషకాలంలో శివపూజ, ఉపవాసం చేయాలి.


🌸కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. 

ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.


*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*


🌹శని త్రయోదశి నాడు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే నకారాత్మక శక్తులు  తొలుగుతాయి.


🌹 శని ప్రభావానికి  లోనైనవారు.ఈరోజు రావి చెట్టు లేదా మేడి చెట్టు లేదా జమ్మి చెట్టు లేదా మారేడు చెట్టు లేదా  మర్రిచెట్టు ఇలా ఈ ఐదు చెట్లలో ఏదైనా ఒక చెట్టుకు 

* ఓం శివాయ నమః  అంటూ చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.*



🌹శని త్రయోదశి నాడు సూర్యోదయం సూర్యాస్తమ సమయాల్లో శివుని పూజలు చేస్తే ఎన్నో రేట్ల పుణ్యఫలితాలను ఇస్తుంది.  


🌹నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.


🌹నవగ్రహాల్లో ఏడవ సంఖ్యా కలిగిన శనీశ్వరుడు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది.


🌹నల్ల కుక్కకు గాని కాకికి గానీ  వాటికి ఆహారంగా ఏదైనా పెడితే చాలా మంచిది.


🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.


🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.


🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు ఈ స్తోత్రాన్ని పాటించాలి.


👉👉👉👉👉👉

*నీలాంజన సమభాసం*

*రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం.*


అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.


🌸ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.


దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి.

నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో  *దశరథ శ్రీ శని స్తోత్రం* పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.


 ********* *నోట్:* ********

ఎన్ని పూజలు చేసినా,

ఎన్ని వ్రతాలు చేసినా,

ఎన్ని గుడులు దర్శించిన,

ఎన్ని తీర్థ యాత్రలు తిరిగిన కానీ..................................

(తల్లిదండ్రులను గౌరవించని  వారికి, నెలకొకసారి ఒకసారి అయినా గో సేవ చేయని వారికి

మరియు 

ధర్మానికి కట్టుబడి ఉండని  వారికి )ఇలాంటివారు

 👉ఎన్ని పూజలు, వ్రతాలు, దీక్షలు చేసిన ఈ పుణ్యాఫల ప్రభావం ఫలితం మాత్రం వారికి అంతంత మాత్రం గానే ఉంటుంది.

**************************

కార్తీకమాసం సందర్బంగా ఉసిరి చెట్టు వద్ద దీపం పెట్టేటప్పుడు చెట్టు వేర్ల వద్ద (మొదలు కు) తాకేలా పెట్టకూడదు. ఎందుకంటే ఉసిరి చెట్టు ఈ మాసంలో భగవాన్ స్వరూపం. కాబట్టి చెట్టు వేర్ల వద్ద దీపాలను దగ్గరగా పెడితే ఆ వేడికి చెట్టులోని తేమ శక్తిని కోల్పోయ్యి చెట్టు ఎండిపోయ్యే లేదా చెట్టు పెరుగకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి చెట్టుకు రెండు అడుగుల దూరంలో దీపాలను వెలిగించగలరు.                            **********----------*******

*ప్రశ్న : కార్తిక మాసంలో ఎలాంటి వ్రతం చేస్తే మంచిది. ఏ ఏ నియమాలు పాటించాలి?*


జ : కార్తికంలో స్నానం,జపం,దానం పారాయణ ఏదైనా మహోన్నత ఫలాన్నిస్తుంది. ఎవరికి వీలైన వ్రతాన్ని వారు పాటించవచ్చు. ముఖ్యంగా దీపదానానికి సమానమైన దానం లేదు.

అవ్రతః కార్తికో యేషాం

గతో మూఢధియా మిహ l

తేషాం పుణ్యస్యలేశోపి

న భవేత్.....

" కార్తిక మాసంలో ఏ వ్రతమూ చేయకుండా గడిపే మూఢులకు పుణ్యం లేశమైనా లభించదు. అట్టివారి జన్మ నీచజన్తు జన్మకు సమానమని ధర్మశాస్త్రం కొంచెం గట్టిగానే ఘాటుగానే చెప్పింది.

కార్తిక మాసంలో రామాయణ, సుందరకాండాది పురాణాలను పారాయణం ప్రారంభించి, మాసాంతంలోగా పూర్తి చేయడం కూడా ధర్మశాస్త్రాలు విధించాయి. ఉత్తముడైన పండితుని ద్వారా ఈ మాసం దివ్య పురాణాలను శ్రవణం చేయడం గొప్ప ఫలితాన్నిస్తుందని పురాణవచనం. తాంబూలం, కేశఖండనం వంటివి విసర్జించడం ఉత్తమం. ఆకాశదీపాన్ని విష్ణు ప్రీతికై ఏర్పాటు చేస్తారు కొందరు. కార్తికంలో ఉల్లి, ఇంగువ,పుట్టుకొక్కు,గంజాయి,ముల్లంగి, ఆనపకాయ, మునగ కాడలు, వంగకాయ, గుమ్మడికాయ, వాకుడు,పుచ్చకాయ, వెలగపండు,నూనె, లవణశాకం,చద్ది మొదలైనవీ రెండు మార్లు వండిన అన్నం, మాడిన అన్నం,మినుములు, పెసలు,సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ద్విదళ ధాన్యాలువాడరాదు. సప్తమి నాడు - ఉసిరిక,తిలలు,

అష్టమినాడు - కొబ్బరి, ఆదివారం - ఉసిరికపప్పు కార్తికంలోనే కాక ఏ మాసమందూ ఉపయోగించరాదు.

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి. ఎవరిదారినవారు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు

పత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువూ దొరకలేదు. తన ఆకలిమాట ఎలాగున్నామునిపుత్రులకు ఆహారం

అందించాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు. పైగా

వపిష్ఠులవారిది. తెలిసీ సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధమో మోహమో! దొంగపని చేశాడు.

వసిష్ఠ స్య చ గాం దోగ్రీమపశ్యద్వనమధ్యగామ్ ।

తాం జఘాన క్షుధార్తస్తు క్రోధాన్మోహాచ్చ దస్యువత్ II

(10 - 52)

మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ

మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలినది తాను తింది. తింటూ గుర్తుపట్టింది ఇది మృగమాంసం

కాదు, గోమాంసమని. తరవాత విచారిస్తే తెలిసింది. వసిష్ఠులవారి పాడియావును ఎవరో సంహరించారనీ,

మాంసం తీసుకుపోయి చర్మమూ ఎముకలూ ఒకచోట వదిలేశారనీ, కౌశికాంగన హృదయం భగ్గుమంది.

జరిగింది తెలుసుకుని వసిష్ఠుడు మండిపడ్డాడు. దురాత్ముడా! ఎంతటి మహాపాపం చేశావు.

పిశాచంలాగా గోవును సంహరించావా? నీ శరీరంలో మూడు మేకులు (శంకువులు దిగబడుగాక! నీకు

పిశాచరూపం సంక్రమించుగాక! ఇప్పటినుంచీ నీపేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు.

సత్యవ్రతుడికి పిశాచరూపం వచ్చేసింది. మూడు మేకులూ దిగబడి త్రిశంకుడు అయ్యాడు. సిగ్గుతో ఎటూ

వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి, తపస్సుకి ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవీమంత్రం

ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు.

దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

చాలాకాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవీనవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి

వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి. ఇది నియమం. నాతో హోమం చేయించండి అని

ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు.

సత్యవ్రతా ! నువ్వు పితృపరిత్యక్తుడవు. శ్వపచుడవు. గోహత్యా మహాపాతకివి. గురుశాపదగ్ధుడివి.

పిశాచరూపివి. హోమం చేసే అధికారం నీకు లేదు. అనర్హుడవు. వేదం అంగీకరించదు. మేము

చేయించం. వెళ్ళిపో - అన్నారు.

 

ప్రశ్న పత్రం సంఖ్య: 16

  ప్రశ్న పత్రం సంఖ్య: 16                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) "చందమామ రావే జాబిల్లి రావే" పాట పాడని తెలుగు అమ్మ లేదు.  ఇది ఎవరు వ్రాసారో తెలుసా.  

2) "ప్రస్థాన త్రయం" అని ఏ గ్రంధాలని అంటారు.  

3) "ఉరక రారు మహాత్ములు" అనేది ఒక పద్య పాదం ఇది మనం నిత్యం వాడుతూ ఉంటాము కానీ ఈ వాక్యం ఎక్కడిదో, ఎవరు వ్రాసారో తెలుసా. 

4)  సాధారణంగా ఒక పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి. 

5) ఉపమాలంకారం అంటే ఏమిటి. 

6) " పరి పరి విధముల  వరమొసంగెడి " పాదము ఎందులోది దీనిని వ్రాసిన వాగేయకారుడు ఎవరు. 

7) "హరి హరి సిరి యురమున గల హరి"  పద్యపాదం  ఏ గ్రంధము లోనిది. కవి ఎవరు. 

8) ”పోగాలము దాపురించినవారు దీపనిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”  ఏ పుస్తకములోది రచయిత ఎవరు.  ఇందులో వున్న అలంకారాన్ని చెప్పగలరా 

9) నంది తిమ్మన కవికి ఇంకోపేరు ఏమిటి. 

10) "కృష్ణం వందే జగద్గురు" అని ఎందుకు అంటారు. 

11) "పరివ్రాజకుడు"  అని ఎవరిని అంటారు. 

12) కంచుకాగడా వెలిగించి చూచినా 

13) భావగర్భితము అనగా నేమి 

14) రమణ మహర్షి ప్రకారము "ముక్తి" అనగా నేమి. 

15) పోతన తన శ్రీ భాగవతంలో " మధుపం" అనే పదం ఏ పద్యంలో వాడారు. 

16) "వరూధిని" పాత్ర ఏ గ్రంధములోనిది, దాని కవి ఎవరు. 

17) "వావి వరుస" అనే ద్వంద పదాల  అర్ధము తెలుపండి. 

18) "విద్యుత్లతలు" అంటే వృక్ష విశేషమా కాదా ఏమిటి తెలుపండి 

19) "కొంపలు మునిగినట్లు" పద ప్రయోగం ఎప్పుడు చేస్తారు.   

20) మిత్ర లాభము అనే కధ ఏ గ్రంధములోనిది దాని రచయిత ఎవరు. 

 మజ్జిగ గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


       పెరుగు , నీరు సమాన పాళ్ళలో కలిపి చిలికి తయారుచేసిన మజ్జిగ తేలికగా ఉండి శీఘ్రముగా జీర్ణం అగును. కొంచెం వగరును , పులుపును కలిగి ఉండును. జఠరాగ్నిని వృద్దిచెందించును. కఫవాతాలను హరించును . శోఫరోగం , ఉదరం , మొలలరోగం , బంక విరేచనాలు , మూత్రబంధం , నోరు రుచిని కోల్పోవుట , స్ప్లీన్ పెరుగుట, గుల్మం , అధికంగా నెయ్యి తాగుట వలన కలుగు సమస్య , విషము , పాండురోగం వంటి సమస్యలను నివారించును.


                 మజ్జిగలో కూడా రకాలు కలవు. ఇప్పుడు ఆ రకాలను మీకు వివరిస్తాను. పెరుగుకు నీళ్లు కలపకుండా కేవలం పెరుగును మాత్రం చిలికి చేయబడిన మజ్జిగని "గోళ " అని  అంటారు. పెరుగుకు నాలుగోవ వంతు నీరు కలిపి కవ్వముతో చిలికి చేయబడిన మజ్జిగని "ఉదశ్విత" అనబడును. సగం భాగం నీరు కలిపి పెరుగును చిలికి చేయబడిన మజ్జిగని " తక్రము " అని పిలుస్తారు . పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేయబడిన మజ్జిగని "కాలశేయ" అని పిలుస్తారు . వీటన్నింటిలో సగం పెరుగు , సగం నీరు కలిపి చేసిన తక్రము అని పిలిచే మజ్జిగ బహు శ్రేష్టమైనది. ఇప్పుడు మీకు తక్రము యొక్క విశేష గుణాలు గురించి వివరిస్తాను .


            తక్రమను మజ్జిగని వాడుట వలన శరీరం నందు జఠరాగ్నిని వృద్దిచెందించును. వాంతి , ప్రమేహము , వాపు , భగంధరం , విషము , ఉదరరోగము , కామెర్లు , కఫము , వాతాన్ని హరించును .


                   వెన్నపూర్తిగా తీయని మజ్జిగను మందజాతం అని పిలుస్తారు . ఇది అంత తొందరగా జీర్ణం అవ్వదు . జిడ్డు కొంచం కూడా లేకుండా చిలకబడిన మజ్జిగని అతిజాతం అనబడును. ఇది మిక్కిలి పులుపుగా ఉండి ఉష్ణాన్ని కలుగచేయును. దప్పికను పెంచును. వగరు , పులుపు రుచుల కలిసిన మజ్జిగ మలబద్దకం కలుగచేయును . కేవలం పుల్లగా ఉండు మజ్జిగ మలాన్ని బయటకి పంపును . ఏమి కలపకుండా ఉండు చప్పటి మజ్జిగ ఉదరం నందు ఉండు కఫాన్ని హరించును . కాని కంఠము నందు కఫాన్ని కలిగించును.


                 మజ్జిగని ఉపయోగించకూడని  సమయాల గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.  గాయాలు తగిలినప్పుడు , మూర్చరోగము నందు , భ్రమ , రక్తపిత్త రోగము నందు  తక్రమను మజ్జిగ వాడరాదు.  అదే విధముగా మంచు కాలం నందు , శరీరంలో జఠరాగ్ని మందగించి ఉన్నప్పుడు , కఫముచే జనించిన రోగముల యందు , కంఠనాళం సమస్య యందు , వాతం ప్రకోపించినప్పుడు తక్రము అను మజ్జిగని ఉపయోగించవలెను .


         శరీరం నందు వాతము ప్రకోపించినప్పుడు పులిసిన మజ్జిగని సైన్ధవ లవణము కలిపి తాగవలెను . పిత్తము ప్రకోపించినప్పుడు తీపిగల మజ్జిగ పంచదార కలిపి తాగవలెను. అదేవిధముగా శరీరము నందు కఫము ప్రకోపించినప్పుడు త్రికటుకముల చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన చూర్ణం మరియు ఉప్పు కలిపిన మజ్జిగ తాగవలెను.

   

                  కొంచెం పుల్లగా ఉండు మజ్జిగ శుక్రవృద్ధికరం , మిక్కిలి పులుపు కలిగిన మజ్జిగ జఠరాగ్ని వృద్దిచేయును . పీనసరోగం అనగా ముక్కువెంట ఆగకుండా నీరుకారు రోగం , శ్వాస , రొప్పు వంటి రోగాలు ఉన్నప్పుడు మజ్జిగని కాచి తాగవలెను . శరీరంపైన వ్రణాలు లేచినప్పుడు మజ్జిగ వాడినచో అనేక సమస్యలు వచ్చును. మజ్జిగకు ద్రవాన్ని శోషించుకొనే గుణం ఉండటం వలన నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మజ్జిగ ఇవ్వడం వలన నీటిని గుంజి మలమును గట్టిపడచేయును అందువల్ల విరేచనాలు తగ్గును. గేదె మజ్జిగ కామెర్ల రోగము నందు , పాండు రోగము నందు అద్భుతముగా  పనిచేయును . మేకల మజ్జిగ , గొర్రెల మజ్జిగ , చెడ్డవాసన కలిగిన మజ్జిగ త్రిదోషాలను పెంచును. కావున వాడరాదు.


            మనుష్యల రోగాలకు ప్రధానకారణం మనం తీసుకునే ఆహారం . మనయొక్క శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని మనం తీసుకున్నంతవరకు మనకి సమస్య ఉండదు. తీసుకునే ఆహారం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి . ఈ మధ్యకాలంలో నాదగ్గరకు వస్తున్న రోగులలో చాలావరకు ఆహారసంబంధ రోగాల వారు ఎక్కువగా వస్తుండటం గమనించాను.  అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక ప్రధాన సూక్తి కలదు.  " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని గొప్ప విషయం అంతర్లీనంగా చెప్పబడింది. కావున మీ శరీరతత్వానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడవద్దు.

 *తులసీ ప్రదక్షిణం పాట***

🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

పెద్దవాళ్లు ఒకప్పుడు పాడేవారు.


 గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా 

 ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా !వైకుంఠసన్నిధి నాకియ్యవమ్మా 

 రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నిండైన సందలు నాకియ్యవమ్మా

 మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! ముత్తైదువతనం నాకియ్యవమ్మా  

 నాల్గోప్రదక్షిణం నీకిస్తినమ్మా ! నవధాన్య రాసులను నాకియ్యవమ్మా  

 అయిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా !ఆయువై దోతనం నాక్య్యవమ్మా  

 ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా! అత్తగల పుత్రుణ్ణి నాకియ్యవమ్మా

 ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! వెన్నుని ఏకాంత సేవియ్యవమ్మా 

 ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! యమునిచే బాధలు తప్పించవమ్మా 

 తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ! తోడుగా కన్యలకు తోడియ్యవమ్మా  

 పదోప్రదక్షిణం నీకిస్తినమ్మా !  పద్మాక్షి నీసేవ నాకియ్యవమ్మా 

 ఎవ్వరు పాడినా ఏకాశి మరణం ! పుణ్యస్త్రీలు పాడితే పుత్రసంతానం 

 రామతులసీ , లక్ష్మీ తులసీ ! నిత్యం మాయింట కొలువై విలసిల్లవమ్మా ,,


  శుభాకాంక్షలు..

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి. ఎవరిదారినవారు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు

పత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువూ దొరకలేదు. తన ఆకలిమాట ఎలాగున్నామునిపుత్రులకు ఆహారం

అందించాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు. పైగా

వపిష్ఠులవారిది. తెలిసీ సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధమో మోహమో! దొంగపని చేశాడు.

వసిష్ఠ స్య చ గాం దోగ్రీమపశ్యద్వనమధ్యగామ్ ।

తాం జఘాన క్షుధార్తస్తు క్రోధాన్మోహాచ్చ దస్యువత్ II

(10 - 52)

మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ

మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలినది తాను తింది. తింటూ గుర్తుపట్టింది ఇది మృగమాంసం

కాదు, గోమాంసమని. తరవాత విచారిస్తే తెలిసింది. వసిష్ఠులవారి పాడియావును ఎవరో సంహరించారనీ,

మాంసం తీసుకుపోయి చర్మమూ ఎముకలూ ఒకచోట వదిలేశారనీ, కౌశికాంగన హృదయం భగ్గుమంది.

జరిగింది తెలుసుకుని వసిష్ఠుడు మండిపడ్డాడు. దురాత్ముడా! ఎంతటి మహాపాపం చేశావు.

పిశాచంలాగా గోవును సంహరించావా? నీ శరీరంలో మూడు మేకులు (శంకువులు దిగబడుగాక! నీకు

పిశాచరూపం సంక్రమించుగాక! ఇప్పటినుంచీ నీపేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు.

సత్యవ్రతుడికి పిశాచరూపం వచ్చేసింది. మూడు మేకులూ దిగబడి త్రిశంకుడు అయ్యాడు. సిగ్గుతో ఎటూ

వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి, తపస్సుకి ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవీమంత్రం

ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు.

దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

చాలాకాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవీనవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి

వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి. ఇది నియమం. నాతో హోమం చేయించండి అని

ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు.

సత్యవ్రతా ! నువ్వు పితృపరిత్యక్తుడవు. శ్వపచుడవు. గోహత్యా మహాపాతకివి. గురుశాపదగ్ధుడివి.

పిశాచరూపివి. హోమం చేసే అధికారం నీకు లేదు. అనర్హుడవు. వేదం అంగీకరించదు. మేము

చేయించం. వెళ్ళిపో - అన్నారు.

 🪔 *కార్తీకం - పుణ్యసాధనలు*🪔

🚩 ® *జ్ఞాన సింధు* ®🚩

✍️ బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్ర మూర్తి, ఒంగోలు

🪔🌻🌻🌻🌻✡️🌹🌹🌹🌹🪔


🙏 *కార్తికేయుని దర్శనము*

    

🔯👉 *పూర్ణిమకు కృత్తికా నక్షత్రయోగము ఉన్నచో మహాపుణ్యము.*

   

🔯👉 *రోహిణి - మహాకార్తీకి అనబడును.*  

    

🔯👉 *కార్తీక పూర్ణిమకు కృత్తికా యోగమున్నచో కుమారస్వామి దర్శనముచే సప్తజన్మల వరకు ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుట్టును. వేద పండితుడగును.* 

                    --  ధర్మశాస్త్ర నిర్ణయం 

         ❀┉┅━❀🕉️❀┉┅━❀

   

*27/11/2023 సోమవారం* 


🔯👉 *కార్తీక పౌర్ణమి - 'మహా కార్తీకి' 'చూడామణి యోగము' తో కలదు.*


✅👉 *హిందూ భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు శక్తి మేరకు వినియోగించుకోగలరు.*


🚩® *Gnaana Sindhu* ®🚩

చరవాణి: 96403 00507

🪔🌹🌹🌹🌹✡️🌻🌻🌻🌻🪔

 *దత్తభక్తుడు*


దిగంబరా..దిగంబరా..శ్రీపాదవల్లభ దిగంబరా!!!..." 

"దిగంబరా..దిగంబరా..దత్తావధూత దిగంబరా!!!.." 


శ్రావ్యమైన కంఠంతో..స్వామివారి ప్రధాన మంటపంలో ఓ మూల కూర్చుని ఓ 70 ఏళ్ల పైబడిన పెద్దాయన తనలో తానే పెద్దగా పాడుకుంటున్నారు..ఆయనది తెల్లని మేనిఛాయ..ఆరడుగుల ఆజానుబాహువైన రూపం..నుదుటిన పెద్ద బొట్టు..సంప్రదాయ పంచెకట్టు..ఈ సంఘటన నాలుగు నెలల క్రిందటిది..అప్పటికి సమయం ఉదయం 8 గంటలు..


మా అర్చకస్వామిని  "ఎవరీయన?" అని అడిగాను.."ఆయన పేరు మాధవ శర్మ గారు..వినుకొండ నుంచి వచ్చారు..ఇంతకు ముందు మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లారు..అప్పుడు మీరు ఇక్కడ లేరు..ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలని సంకల్పంతో వచ్చారట..మీతో మాట్లాడతానన్నారు.." అన్నారు..వారిని పిలవమని చెప్పాను..


మాధవ శర్మగారు నా దగ్గరకు వచ్చారు.."ఇక్కడ ఈ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం లో ఓ నలభై రోజులు ఉండాలని సంకల్పం కలిగిందండీ..దానికి కారణం కూడా వుందండీ...మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు నాకు ఒకవిధమైన అనుభూతి కలిగింది..ఆ ప్రక్కరోజు మా వినుకొండ కు తిరిగి వెళ్ళాను..స్వామివారే పదే పదే మనసులో మెదులుతూ ఉన్నారు..ఓ నాలుగురోజుల క్రితం ఒకరోజు రాత్రి ఈ స్వామివారు నాకు స్వప్నం లో దర్శనం ఇచ్చి..ఇక్కడికి వెళ్ళమని ఆదేశం ఇచ్చారు..ఇక ఉండబట్టలేకపోయాను..నేరుగా బయలుదేరి వచ్చేసాను..మీరు అనుమతి ఇస్తే..ఇక్కడ ఓ మండలం రోజులు ఉంటాను..నాకు ప్రత్యేకంగా రూము ఏమీ వద్దు..ఈ మంటపం లోనే ఉంటాను..దత్తావతారాల నామాలు..స్తోత్రాలు కంఠతా వచ్చు..అవే స్మరణ చేసుకుంటూ ఉంటాను.." అన్నారు.."సరే నండీ.. మీ ఇష్టం వచ్చినంత కాలం వుండండి.." అని అన్నాను..


స్వామివారి మందిరం లోనే ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి మందిరం వద్ద ప్రతి శని, ఆది వారాల్లో వచ్చే భక్తులకు హారతి తీర్థము ఇచ్చే అర్చకస్వామి ఎవరూ లేరు..వారం వారం ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది..ఈ మాధవ శర్మ గారిని అక్కడ ఈ విధులు నిర్వహించడానికి అడిగితే ఎలా వుంటుంది అనే ఆలోచన నాలో కలిగింది..మా అర్చకస్వాములతో..సిబ్బందితో చర్చించాను..ఈ ఆలోచన బాగుంది అని వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పారు..


మాధవశర్మ గారిని పిలిచి ఈ ఆలోచన గురించి చెప్పాను..వారి కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు చిప్పిల్లాయి.."నాకు మహాభాగ్యం దక్కింది అనుకుంటాను అండీ..సంతోషంగా ఉంటాను..స్వామి సన్నిధిలో సేవ చేసుకునే అవకాశం కల్పించారు.." అని నాకు నమస్కరించబోయారు..అంత పెద్దవారు నాకు నమస్కారం చేయడం సమంజసం కాదని వారిని వారించాను..మరో మూడు రోజుల తరువాత..మాధవశర్మ గారు ఒప్పుకుంటే..శాశ్వతంగా వారు ఇక్కడే ఉండిపోతే బాగుండు అని నాకు అనిపించింది..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నా మనసులోని కోరిక తెలుపుకున్నాను..ఆ తరువాత వారిని అడిగాను..ఒక్క క్షణం కళ్ళుమూసుకుని ఆలోచించి.."ఈ దత్తాత్రేయుడు నన్ను పిలిపించుకున్నాడు..ఇక్కడే ఉండాలని నాకూ ఉంది..మీరే అడిగారు..ఇక్కడే వుండి సేవ చేసుకుంటూ ఉంటాను.." అన్నారు..


అలా మాధవ శర్మ గారు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో ఒక సేవకుడిగా ఒదిగిపోయారు.. ఈలోపల శ్రీ స్వామివారి ఆరాధన సందర్భంగా దత్తదీక్ష స్వీకరించి..ఆ నలభైరోజులూ నిష్ఠగా దీక్ష లో పాల్గొని..స్వామివారి ఆరాధన రోజు దీక్ష విరమణ చేశారు..అందులో ఆశ్చర్యం ఏమీ లేదు..ఎందుకంటే సాక్షాత్తూ సమాధి లో కూర్చున్న స్వామివారే శర్మగారికి స్వప్న దర్శనం ఇచ్చి మరీ తనవద్దకు పిలిపించుకున్నారు..నేనూ మా సిబ్బందీ కేవలం నిమిత్తమాత్రులం..


మరోమాట.. శ్రీ మాధవశర్మ గారు ఒక కంపెనీ లో పెద్ద హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు వారికి ముగ్గురు సంతానం..భార్యా పిల్లలూ అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు..వారు మాత్రం దత్తసేవకు అంకితం అయ్యారు..


సర్వం..

శ్రీదత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్ : 94402 66380 మరియు 99089 73699)

 *జైశ్రీరామ్*


                            11-5-2020

                            అభ్యాసం-11


                          *సుభాషితం* 


"అదాన దోషేణ భవేద్దరిద్రో

  దారిద్ర్య దోషేణ కరోతిపాపం |

  పాపా దవశ్యం నరకం ప్రయాతి

  పున ద్దరిద్రీ పునరేవ పాపీ" ||


                            *భావం*


ఎవరికిని ఏమీ యివ్వని,పెట్టని పాపం

చేత దరిదృ డవుతున్నాడు. దరిదృడవటంచేత మళ్ళీ పాపాలు చేస్తాడు.పాపాలు చెయ్యటం వల్ల నరకానికి పోతాడు.

మళ్ళీ దరిదృడుగా పుట్టి మళ్ళీ పాపాలే చేస్తాడు.

మళ్ళీ నరకానికే పోతాడు.ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

కావున ప్రతీ వ్యక్తీ తనకు ఉన్నంతలో దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి.దానగుణం తన సహజ లక్షణం, స్వభావం అవ్వాలి.దానివలన మానవునికి ఉన్నత జన్మలు లభించి ముక్తికి మార్గం సుగమం అవుతుందని సనాతన ధర్మం చెబుతోంది.


                      *అమృతవచనం* 


*నారాయణ*సూక్తం* ఇలా  అంటుంది: "అంతర్ భహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః".

భగవంతుడు సర్వాంతర్యామి అని, సర్వత్ర వ్యాపించి యున్నాడని చెబుతుంది.విశ్మమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి రధసారధిగా వ్యవహరించి, నైరాశ్యంలో కూరుకుపోయిన పార్ధునికి జగద్గురువుగా *గీతోపదేశం* చేసాడు.మార్గశిర శుద్ధ దశమినాడు అలా ఆ భగవంతుని ముఖతః ప్రపంచానికి అందిన అమృతభాండం,  మానవులను తట్టిలేపే ధర్మఘంట శ్రీమద్భగవద్గీత.భగవత్ సంభందాన్ని పొందితే ఏ విషాదమైనా "యోగం" అవుతుంది.అప్పుడసలు దుఃఖమే ఉండదు.దైవసంభందం లేకుండా మానవుడు విషయాల కోసం విలపిస్తే ధుఃఖించవలసిందే.సుఖధుఖాలు బయటి ప్రపంచం నుండి రావు, అవి మనలోనే ఉంటాయి.వీరు యిస్టులని, వారు అయిస్టులని మనసు మాయవలన రాగద్వేషాలకు లోనవుతుంది,వశమవుతుంది.దాని ఫలితమే మానవులకు సుఖదుఃఖాలు.కావున మానవులందరూ ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగి ఉండాలి, భగవద్గీత చెపుతున్నది కూడా అదే. 


                        శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

 )()( ఆలోచనాలోచనాలు )()( సంస్కృత సూక్తి సుధ )()( అక్షర రూపం దాల్చిన సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక )()(                                      1* భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖిల భయం, కాయే కృతాన్తాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవాభయమ్!!         ఈ లోకంలో భోగాలు అనుభవిస్తున్నప్పుడు రోగం వచ్చి మీద పడుతుందేమోనని భయం. మంచికులంలో పుట్టామా? కులగౌరవం దెబ్బతింటుందేమోనని భయం. ధనం సంపాదిస్తే ప్రభుత్వం గాని, దొంగలు గాని అపహరిస్తారేమోనని భయం. మానం ఉన్నవాడికి అది పోయి దైన్యం ఏర్పడుతుందేమోనని భయం. బలవంతుడికి తన శత్రువు తనపై గెలుస్తాడేమోనని భయం. మంచి రూపం వుంటే , ముసలితనం ఏర్పడి అందచందాలు పోతాయేమోననే భయం. శాస్త్రాలు చదివి పాండిత్యం ఉంటే వాదనలో ఓడిపోతానేమోననే భయం. మేలైన గుణాలు ఉంటే అవి తొలగిపోయి దుర్జనులు నిందిస్తారనే భయం. దేహం ఉన్నది అంటే దానికి యమధర్మరాజు ఎప్పుడు తీసుకెళతాడోననే భయం. ఇట్లా లోకంలో అన్ని వస్తువులకు భయం అంటూ వుంది. భయంలేని ఏకైక వస్తువు "" వైరాగ్యం"" మాత్రమే సుమా! (భర్తృహరి సుభాషితం)          2* పండితేచైవ, మూర్ఖేచ, బలవత్యపి దుర్బలే, ధనికో దరిద్రేచైవ, మృత్యోస్సర్వత్ర తుల్యతః!!                           ధనవంతుడేకాని, దరిద్రుడేకాని-- బలవంతుడేకానీ, బలహీనుడేకానీ -- ధనవంతుడేకానీ, దరిద్రుడేకానీ, అందరినీ సమానంగా చూచేది ఒక్క మృత్యువు మాత్రమే! దానికి ఎక్కువ,తక్కువలు-- తారతమ్యాలు లేవు.              3* మాతరం, పితరం, పుత్రం, భ్రాతరం వా సుహృత్తమమ్!                    లోభావిష్టో నరో హన్తి, స్వామినంవా సహోదరమ్!!                        అధికమైన ఆశ ఎవడినైతే పీడిస్తూవుంటుందో అట్లాంటివాడు తల్లినిగాని, తండ్రిని గాని, కొడుకునుగాని, స్నేహితునిగాని, తోడబుట్టినవానిని గాని, యజమానిని గాని, ప్రభువును గాని చంపుటకు వెనుదీయడు. కనుక అత్యాశ మిక్కిలి చెడ్డది.         4* య ఏవం వేత్తి హన్తారం.  యశ్చైనం మన్యతే హతం! ఉభౌ తవ్ న విజానీతో వాయం హన్తి నహన్యతే!!( భగవద్గీత)      ఆత్మ చంపేది కాదు; చంపబడేది కాదు. దానికి చావుపుట్టుకలు లేవు. కొంతకాలం ఉండిపొయ్యేదికాదు. ఎప్పుడూ ఒకే రీతిగా , స్థిరంగా ఉండే ఈ ఆత్మ అనాది అయినది.                 5* వాసాంసి జీర్ణాని యథావిహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణా, న్యన్యాని సంయాతి నవాని దేహీ!!                                  వస్త్రములు చిరిగిపోయినప్పుడు మనిషి చిరిగిన వస్త్రములు విడచి నూతన వస్త్రములు ధరిస్తాడు. అట్లాగే ఆత్మకూడా శిధిలమైన శరీరాన్ని విడచి నూతన శరీరాన్ని పొందుతూ వుంటుంది. ( ఈ ఆత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకొన్నవాడు జ్ఞాని అవుతున్నాడు) --(భగవద్గీత)                        6* ఘృతస్య పాత్రమాధారోవా, పాత్రస్య ఘృత మాధారోవా!               తర్క శాస్త్ర చదువుకొనే ఒకానొక మూర్ఖ శిఖామణి గిన్నెకు నెయ్యి ఆధారమా? నెయ్యికి గిన్నె ఆధారమో తెలుసుకోదలచి ,గిన్నెలోని నెయ్యిని ఒలకబోసుకున్నాడట. తెలివి తార్కిక వాదం మిక్కిలి ప్రమాదకరం.             7* వృశ్చిక భయా పలాయ మానః, ఆశీవిషముఖై నిపతితం---                          ఒకడికి తేలు కనబడింది. అది కుడుతుందేమోననే భయంతో పరుగెత్తి ఒక పాము నోటిలో పడ్డాడు. దురదృష్టవంతుల పరిస్థితి ఇట్లాగే వుంటుంది.                8* క్షాన్తి శ్చేత్కవచేస కిం కింమరిభిః.                           క్రోధోస్తి చేదేహినాం, జ్ఞాతిశ్చేదనలేన.                    కింయది సుహృద్ది వ్యోషధైః కింఫలమ్,                            కింసర్పైర్యది దుర్జనాః, కిముధనైర్విద్యా.                   సపద్యాయది, వ్రీడాచే త్కిము భూషణైః,                 సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్!!                                   విద్య గొప్పది. దానిని మించిన ఐశ్వర్యం లేదు. ఓర్పు అనేది ఉంటే వేరే కవచం అక్కరలేదు. కోపం ఉంటే వేరే శత్రువు అక్కరలేదు. మంచి స్నేహితుడంటూ వుంటే వేరే దివ్యౌషధాలు అవసరం లేదు. దుర్జనులు ఉంటే వేరే పాములతో పని లేదు. దోషరహితమైన విద్య ఉంటే వేరే ధనం అక్కరలేదు. లజ్జ ఉంటే వేరే భూషణములు అవసరం లేదు. పాండిత్యం లేదా మంచి కవిత్వం ఉంటే  వేరే రాజ్యం అక్కర లేదు. ( భర్తృహరి సుభాషితం)        చివరగా ఒక చమత్కార శ్లోకం.                                    అశ్వం నైవ, గజం నైవ, వ్యాఘ్రం నైవచ, నైవచ !               అజాపుత్రం బలిం దద్యాత్ , దైవో దుర్బల ఘాతకః!!                             ఎవరైనా గుర్రాన్నిగాని, ఏనుగునుగానీ, పెద్ద పులిని గానీ దేవతకు బలిని ఇవ్వరు. పాపం! అమాయకమైన , దుర్బలమైన "మేక పిల్ల" ను మాత్రమే బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలులనే శిక్షిస్తాడని భావం.                  తేది 26--11--2023, ఆదివారం, శుభోదయం.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*సంసార ఘోర గహనే చరతో మురారే* ! 

*మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య* |

*ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య* - 

*లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-04_* _


*తా:: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండు వేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు కరావలంబన మిచ్చి కాపాడుము.. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.


🧘‍♂️🙏🪷 ✍️🙏



*శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబం స్తోత్రము* 

*అనువాద పద్యము 4*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి* 


*తే గీ.నేను ఘోర సంసారపు కాన మందు* 

*సంచరించగా మన్మథ సర్ప , మృగము*

*లెన్నియో నన్ను వెంటాడి  యిడుము లొసగె*

 *మండుటెండ గా బాధించె మత్సరంబు*

*దుఃఖ బాధల యందున దొరలుచుంటి*

*ఆర్తుడను నన్ను కాపాడి యాదుకొనుము*

*నారసింహుడా చేయూత నందజేయు*

*లక్ష్మితో వచ్చి కాపాడు లక్షణము గ*

*శ్రీధరుని చిత్తమందున స్థిరముకమ్ము*

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం, నవంబరు 27,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి మ2.12 వరకు

వారం:సోమవారం (ఇందువాసరే)

నక్షత్రం:కృత్తిక మ1.50 వరకు  

యోగం:శివం రా12.41 వరకు

కరణం:బవ మ2.12 వరకు తదుపరి బాలువ రా1.55 వరకు

వర్జ్యం:తె5.52నుండి

దుర్ముహూర్తము:మ12.09 -12.53 & మ2.22 - 3.06

అమృతకాలం:ఉ11.28 - 1.02

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్య రాశి : వృశ్చికం

చంద్రరాశి : వృషభం 

సూర్యోదయం:6.15

సూర్యాస్తమయం:5.20


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

 క్రింద ఉన్న లింక్ ను టచ్ చేయండి


1.చిత్రంలో ఉన్న గంటల ను

 టచ్ చేయగానే గంటలు మ్రోగుతాయి


2. తరువాత ఎడమపక్క ఉన్న 

శంకువును టచ్ చేయగానే 

శంకువు శబ్దం వస్తుంది.


3. అర్చన కోసం బిల్వ పత్రం టచ్ చేయండి.


4.పూజ కోసం పువ్వులు టచ్ చేయండి


5. చివరగా కుడిపక్కనిన్న శివ స్తోత్రం కోసం టచ్ చేయండి. చక్కటి ఆధ్యాత్మిక భావన పొందండి.


 …🙏

[ https://static-pages.sharechat.com/Mahashivaratri2022/index.html?l=English-


. 🙏🙇🏻‍♂️🕉️🙇🏻‍♀️🙏

 ॐశుభోదయం, పంచాంగం ॐ  

*ఓం శ్రీ గురుభ్యోనమః* 

 _నవంబరు 27, 2023_* 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం**శరదృతువు*

*కార్తీక మాసం**శుక్ల పక్షం*

*పౌర్ణమి* మ2.12

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *కృత్తిక* మ1.50

యోగం: *శివం* రా12.41

కరణం: *బవ* మ2.12

*బాలువ* రా1.55

వర్జ్యం: *తె మంగళవారం*

*5.52నుండి*

దుర్ముహూర్తము: *మ12.09-12.53*

*మ2.22-3.06*

అమృతకాలం: *ఉ11.28-1.02*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *వృషభం*

సూర్యోదయం: *6.15*

సూర్యాస్తమయం: *5.20*

 *మహాకార్తీకి ధాత్రీ పూజా* 

    *గురు నానక్ జయంతి* 

 లోకాః సమస్తాః* సుఖినోభవంతు*

 శ్లోకం:☝️

   *నమః శివాభ్యాం నవయౌవనాభ్యం*

      *పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం |*

   *నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం*

      *నమో నమః శంకర పార్వతీభ్యాం ||*


భావం: శుభములను ఇచ్చువారు, నిత్య యవ్వనంగా అర్థనారీశ్వర రూపంలో ఒకటై ఉన్నవారు, ఒకరు పర్వతరాజ పుత్రిక, ఇంకొకరు వృషభము సంకేతముగా ఉన్న శివ పార్వతులకు నమస్కారము.🙏 ఈ శ్లోకమంతా ద్వివచన పదాలతో రచించారు.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.27.11..2023

సోమ వారం (ఇందు వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

కార్తీక మాసే శుక్ల పక్షే పౌర్ణమాశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  కార్తీక మాసే  శుక్ల పక్షే పౌర్ణిమౌపరి బహుళపక్ష ప్రతి పత్తిథౌ. 

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.14

సూ.అ.5.20

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

కార్తీక మాసం 

శుక్ల పక్షం పూర్ణిమ మ.2.10 వరకు. 

సోమ వారం. 

నక్షత్రం కృత్తిక మ.11.49 వరకు. 

అమృతం ప. 11.27 ల 1.01 వరకు. 

దుర్ముహూర్తం ప.12.09 ల 12.54 వరకు. 

దుర్ముహూర్తం మ. 2.22 ల 3.06 వరకు. 

వర్జ్యం రా.తె.5.51 ల మరునాడు ఉ. 7.07 వరకు.  

యోగం శివం రా. 12.35 వరకు.

కరణం బవ మ.2.10 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

***********

పుణ్యతిధి కార్తీక శు.పూర్ణిమ మరియు బ. పాడ్యమి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

M3 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *89వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 1*


*"ఈ ఉశనుడు నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నువ్వు నిరాశను దరిజేర నివ్వరాదు , వృషపర్వా !"* ఉశనుడు ధైర్యం చెప్తూ గర్వంగా అన్నాడు. *“అసంభవాన్ని సంభవం చేయడంలోనూ , అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమీ భార్గవుడు అద్వితీయుడు !"*


*"మీ శక్తియుక్తుల మీద నాకు సందేహం లేదు , గురుదేవా ! నా సందేహం , సంతాపం అన్నీ నా శక్తి మీదనే !"* వృషపర్వుడు బరువుగా నిట్టూర్చాడు.


*"వృషపర్వ !"*


*"మీరే ఆలోచించండి ! మా దాయాదులు , దేవతలు సంపద పరంగా ఎలా ఉన్నారు ? మేం ఎలా ఉన్నాం ? సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే ఆ ఇంద్రుడికి కోశాధికారిగా ఊడిగం చేస్తున్నాడే !"* వృషపర్వుడు అక్కసుతో అన్నాడు.


*"ఊ ! నీ నిర్వేదానికి కారణం ఆ దేవతల ఐశ్వర్యమన్నమాట ! ఆ లోటు లోటే ! కానీ పూడ్చలేని లోటు కాదు ,"* ఉశనుడు చిరునవ్వుతో అన్నాడు.


*"మీ విశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కొరతను ఎలా తీర్చుకోగలం , గురుదేవా ? మనం ఆ దేవతలను జయించి , వాళ్ళ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి మాట అది !”* వృషపర్వుడి కంఠంలో నిరాశ ఇంకా కాపురం చేస్తూనే ఉంది.


*"వృషపర్వా ! నాకొక విషయం చెప్పు. ఆ ఇంద్రుడి సంపద గొప్పదా ? కుబేరుడి ఐశ్వర్యం గొప్పదా ?"* ఉశనుడు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.


*"కుబేరుడి ఐశ్వర్యమే గొప్ప ! విశ్వంలోని సకల సంపదలకూ అధిపతి కదా , అతడు !"* వృషపర్వుడు సమాధానం చెప్పాడు.


*“ఆ కుబేరుడి ఆధీనంలో ఉన్న సకల ఐశ్వర్యాన్నీ నీ కోశాగారంలో కుప్పపోస్తే - నువ్వూ , ఆ ఇంద్రుడు - మీ ఇద్దరిలో అధికాధిక ధనికుడు ఎవరవుతారు ? నువ్వా ? ఇంద్రుడా ?"* ఉశనుడు చిరునవ్వు నవ్వాడు.


*“గురుదేవా !”* వృషపర్వుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. *“నువ్వే , వృషపర్వా ! నువ్వే !”* ఉశనుడు నవ్వుతూ అన్నాడు.


సభలో వున్న రాక్షస ప్రముఖులందరూ తమ తమ ఆసనాల్లోంచి లేచి , ఉశనుడిని సమీపించి , చెవులు రిక్కించారు.. 


*"కుబేరుడితో యుద్ధమా గురుదేవా ? అది దేవతలతో యుద్ధంగానే పరిణమిస్తుంది. కద !"* వృషపర్వుడు సందేహం వ్యక్తం చేశాడు.


ఉశనుడు చిన్నగా నవ్వాడు. *"సమరం సర్వవేళలా సాధనం కాదు , రాక్షసేంద్రా !* నిశితమైన ఖడ్గాన్ని నీడలోకి నెట్టివేసే సునిశితమైన మేధ ఉందిగా !"*


*"అంటే... గురుదేవా ?"* వృషపర్వుడు కనుబొమలు ముడివేశాడు. *"ఈ ఉశనుడి యోగశక్తి , నీ ధనయోగాన్ని విస్తృతం చేస్తుంది , సుమా !”* ఉశనుడు గర్వంగా అన్నాడు.


తన ముఖంలోకి ఉత్కంఠతో , ఆశతో చూస్తున్న రాక్షస ప్రముఖులందర్నీ ఉశనుడు ఒక్కసారి కలయజూశాడు. ఆయన ముఖం గర్వంతో కూడిన చిరునవ్వుతో వికసించింది.


*"యోగశక్తి , వృషపర్వా ! ఉశనుడి అమోఘ యోగశక్తి ! ఆ మహాశక్తి ద్వారా ఆ కుబేరుడి అంతరంగాన్ని ప్రభావితం చేస్తాను. దాని ఫలితమేమిటో తెలుసా ? ఆకారం కుబేరుడు , అంతరంగం ఉశనుడు !"* ఉశనుడు వివరించాడు.


*"గురుదేవులు గూఢయోగం అద్భుతం !"* వృషపర్వుడు ఉత్సాహంగా అన్నాడు.


సభలోని రాక్షస కంఠాలు ఏకకంఠంతో అరిచాయి - *"అద్భుతం , అద్భుతం !"* అంటూ.


****************************


ఉశనుడు కుబేరుడి నగరం 'అలకాపురి' చేరుకున్నాడు. ఆయనను స్వాగతించి , ఆతిథ్యం అందించాడు కుబేరుడు. 


*"నేను రాక్షసుల గురువునే , అయినా మనందరం ఆ సృష్టికర్త బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళమే , కుబేరా ! నీ పితామహులు పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు ! మా తండ్రిగారు. భృగు మహర్షి కూడా బ్రహ్మ మానస పుత్రుడే !"* ఉశనుడు దేవ , రాక్షస భేదభావాన్ని దూరం చేశాడు. 


*"ఓనౌను...మనం , మనం బంధువులమే , ఆచార్యా !"* కుబేరుడు నవ్వుతూ అన్నాడు.


*"కార్యార్థం దయచేశారా , ఇక్కడికి ?"*


*“ఒక మహా లక్ష్యం నన్ను అలకాపురికి తీసుకు వచ్చింది. మన మధ్య భేదం లేదనీ , ఈ ఉశనుడూ , ఈ కుబేరుడూ ఒక్కరే అనీ నీకు తెలియజేయడమే ఆ లక్ష్యం !"*


కుబేరుడు కళ్ళు చిట్లించాడు. *"అర్థం కాలేదు , ఆచార్యా..."*



*"ఏముందీ ? ఉశనుడే కుబేరుడు ! కుబేరుడే ఉశనుడు !"* ఒక్కసారి కళ్ళు సగం మూసి , యోగశక్తిని ఆవాహనం చేస్తూ అన్నాడు ఉశనుడు.


కుబేరుడు మంత్ర ముగ్ధుడిలా చూస్తున్నాడు. విశాల నేత్రాలూ మాయా దర్పణాల్లా కుబేరుడి కళ్ళను ఆకర్షిస్తున్నాయి. దృష్టి కిరణాల ద్వారా ఉశనుడి యోగ ప్రభావం కుబేరుడిలోకి ప్రవేశిస్తోంది.


అప్పటి దాకా ముడుచుకున్నట్టున్న కుబేరుడి ముఖం ఉన్నట్టుండి విప్పారింది. చిరునవ్వు అతని ముఖాన్ని వెలుగుతో నింపింది.


*"ఈ ఐక్యతానుభూతి ఆహ్లాదకరంగా ఉంది , ఆచార్యా ! మీరన్నది నిజమే - మీరే నేను !"* కుబేరుడు నవ్వుతూ అన్నాడు.


*"ఔను , కుబేరా ! నేనే నువ్వు !"* ఉశనుడు నవ్వుతూ అన్నాడు. 


*"ఆచార్యా ! నాదో చిన్న కోరిక...”* కుబేరుడు మంత్ర ముగ్ధుడిలా అరమూసిన కళ్ళతో అన్నాడు.


*"ఎంత పెద్ద కోరిక అయినా , తీరుస్తాను !"* ఉశనుడు ఉత్సాహంగా అన్నాడు.


అతనికి తెలుసు...తన వ్యక్తిత్వం , తన ఆలోచనలూ కుబేరుడిలో ప్రవేశించి , తిష్ఠ వేశాయి ! కుబేరుడు ఇప్పుడు - లోపల ఉశనుడు , వెలుపల కుబేరుడు !


*"చిన్న కోరికే ఆచార్యా ! మీరు నా సకల సంపదలనూ , సువర్ణాన్నీ , నా నవరత్నాలనూ , బ్రహ్మ నాకు ప్రసాదించిన శంఖ నిధులూ , పద్మ నిధులూ - సర్వాన్నీ , కోశాగారాలలో ఉన్న ఈ ధనాధిపుని సంపూర్ణ ఐశ్వర్యాన్నీ కానుకగా స్వీకరించాలి !"* కుబేరుడు ఆవేశంగా అన్నాడు.


*"నీ కోరికను ఎలా కాదంటాను , కుబేరా ! తథాస్తు !"* అంటూ ఉశనుడు కుడి చేతిని చాచి , కుబేరుడి ముందు నిలిపి , ఎడమ చేతిలోని తన కమండలాన్ని అతనికి అందించాడు , సాభిప్రాయంగా.


కుబేరుడు మంత్రముగ్ధుడిలా తన కోశాగారాలలోని సకల సంపదలనూ ధారబోస్తూ , కమండలంలోని జలాన్ని తన అరచేతి మీదుగా , ఉశనుడి హస్తంలోకి జారవిడిచాడు. 


ఉశనుడు నవ్వుతూ పైకి లేచాడు. *"అదృష్టవంతుడివి , కుబేరా ! అనుకున్నది ఆచరించావు ! ఇక నేను వెళ్తాను !”.*


*“ధనరాసులూ , రత్నరాసులూ... ఆచార్యా ! అప్పుడే మరిచి పోయారా ?"* కుబేరుడు చిరునవ్వుతో గుర్తు చేశాడు , ఉశనుడి అమాయకత్వానికి జాలిపడుతున్నట్టు.


*"నువ్వు ధారబోసిన క్షణంలోనే అవన్నీ , ఊడ్చి పెట్టుకుని నా స్థావరం చేరుకున్నాయి , కుబేరా ! వస్తాను !"* అంటూ ఉశనుడు కుబేర మందిరంలోంచి నిష్క్రమించాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 13*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *13. ఆనాయ నాయనారు*


మేల్ మళనాడు అనే దేశంలో తిరుమంగళం అనే అందమైన గ్రామం ఉంది.  ఆ గ్రామంలో యాదవ వంశాన్ని ఉద్ధరించడానికా అన్నట్లు

ఆనాయరు అవతరించాడు. పవిత్రమైన విభూతిని ధరించిన అతడు శివునికి

తప్ప వేరొకరికి నమస్కరించడు. ఆనాయరు పశువులను మేపడం వృత్తిగా

కలిగినవాడు. ముల్లైప్రాంతపు పచ్చిక బయళ్లలో వాటిని మేపుతుంటాడు.


 పశువులకు వేర్వేరు కొట్టాలను ఏర్పరచి వాటిలో పశువులను జాగ్రత్తగా ఉంచి కాపాడుతూ వచ్చాడు. సంగీతంలో నిష్ణాతుడైన ఆనాయరు వెదురులో రంధ్రాన్ని ఏర్పరచి

వేణువును తయారుచేసి దానినుండి మధురమైన సంగీతాన్ని వర్షిస్తుండేవాడు.

ఒక పర్యాయం పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని తన వేణువుద్వారా

వాయించడం ప్రారంభించాడు ఆనాయరు. 


శరీరాన్ని మైమరపించే

అద్భుతమైన నాదాన్ని విన్నటువంటి పశువులు మేతమేయడం మానివేసి

ఆనాయరు చుట్టూరా నిలిచాయి. పాలు తాగుతున్న దూడలు పాలు తాగడం

మానివేశాయి. ఆనాయరు సంగీతానికి చరాచర లోకాలు తన్మయత్వంలో

మునిగిపోయాయి.

కపట భక్తికి వశ్యుడు కాని పరమేశ్వరుని చెవులకు ఆనాయరు

వేణునాదం సోకింది.


 వెంటనే ఉమాదేవితో కలసి వృషభవాహనారూఢుడై

అనాయరు ముందు ప్రత్యక్షమయ్యాడు. "భక్తుడా! వేణునాదం ఆలపిస్తున్న

ఈ స్థితిలోనే నీవు మమ్మల్ని చేరుకోగలవు" అని పరమేశ్వరుడు ఆనాయరుని

అనుగ్రహించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

*పదమూడవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 89*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి*

*స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం*

*దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ ‖*


సౌందర్యలహరి 2, 3 శ్లోకాలలో అమ్మవారి పాద రజ ధూళి మహిమనూ, 87, 88 శ్లోకాల్లో ఆమె పాదవైభవాన్నీ వర్ణించిన శంకరులు ఈ శ్లోకములో కూడా ఆమె పాద నఖముల కీర్తిని వర్ణిస్తున్నారు.


నఖై:శశిభిః = అమ్మా, నీ పాదముల గోళ్లు చంద్రవంకల వలె వున్నాయి. వాటిని చూసిన


నాక స్త్రీణాం కరకమల సంకోచ  = శచీదేవి నేతృత్వంలో అమ్మవారి పాదాలను అర్చించటానికి వచ్చిన దేవతా స్త్రీల కరకమలములు సిగ్గుతో ముడుచుకుపోయినవట. కమలములు రాత్రివేళ ముడుచుకుపోతాయి కదా! అంతేకాక


తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ = అమ్మవారి పాదాలు దేవతా వృక్షములైన కల్పవృక్షములను తలచుకొని నవ్వుతున్నాయట. ఎందుకని? కల్పవృక్షములు దేవతల అధీనంలో ఉండేవి, అన్ని కామ్యములను తీర్చేవి. వాటి పూలు తీసుకొని దేవతలు అమ్మవారి పాదార్చనకు వచ్చారంటే ఆమె పాదములు అన్నిటికన్నా మిన్న అయినవనీ, వాటిముందు కల్పవృక్షములు కూడా తీసికట్టు అని అమ్మవారి పాదముల నఖములు నవ్వుతున్నాయట.


ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం = స్వస్థులంటే బాధలు లేని వారు, అనగా దేవతలకు మాత్రమే కల్పవృక్షములు ఫలాన్ని ఇస్తాయి. కానీ, అమ్మవారి పాదాలు


దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దదతౌ = లోకము లోని దరిద్రులకు కూడా స్వర్గానికి వెళ్లలేనివారికి కూడా సమస్త సంపదలను మాత్రమే కాక కల్పవృక్షము,కామధేనువు ఇవ్వలేని మోక్ష సంపదను కూడా ఇస్తాయి అమ్మవారి పాదాలు.


ఈ శ్లోకం రెండవపాదంలో అమ్మవారిని చండి అని సంబోధించారు శంకరులు. చండి అనగా ప్రతిబంధకములను తొలగించునది. ఈ ప్రతిబంధకములనే శత్రువులు, అసురులు అని చెప్పుకుంటున్నాము. 

ఎవరు వీరు? ముముక్షువునకు మోక్షసాధనలో అడుగడుగునా అడ్డు తగిలే ఇంద్రియ వాసనలు, సంసార తాపత్రయములు, కామ క్రోధాది అరిషడ్వర్గములు, రజస్తమో గుణములు మున్నగునవి. అమ్మవారు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క ప్రత్యేకమైన స్వభావం కల అసురులను అణచివేయటానికి అవతరిస్తారు. పైన చెప్పిన గుణములు ప్రధానముగా కల శుమ్భ నిశుమ్భులను, మహిషాసురుడిని, విషంగ విశుక్రులను, భండాసురుడినీ సంహరించటానికి చండీ రూపంలో వస్తారు. ఇదే మార్కండేయ పురాణములోని ప్రసిద్ధమైన దేవీ మాహాత్మ్యము, చండీ, దుర్గా సప్తశతి (700 శ్లోకములు కలిగినది.అత్యంత నిష్ఠతో నిబద్ధతతో పారాయణ చేయవలసిన స్తోత్రము). ఇక్కడ ఈ సంబోధన ఎందుకంటే, విషయవాంఛలు, లౌకికమైన ధన కనక వస్తు వాహనాది వాంఛలు లేని స్వచ్ఛమైన మనస్సు కలిగిన భక్తులకు అమ్మవారు మోక్ష సంపదను ప్రసాదిస్తారు. చండీదేవిగా అమ్మవారిని ఆరాధిస్తే ఆయా ప్రతిబంధకాలను తొలగించి తన భక్తుడిని,పరతత్త్వాన్ని గ్రహించి,అనుసరించే శక్తిని ప్రసాదిస్తారు.


శ్రీ లలితా సహస్ర నామములలోని 44,45 నామములైన *నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా* *పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా* సౌందర్యలహరిలో పైన చెప్పబడిన శ్లోకములోని భావమును తెలుపుచున్నవి.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 13*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*అసారే సంసారే నిజభజనదూరేఽజడ ధియా*

*భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ |*

*మదన్యః కో దీన స్తవ కృపణరక్షాతినిపుణః*

*త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే 13*


ఓ పశుపతీ ! నీ సేవకు దూరమైన నిస్సారమైన ఈ సంసారములో గ్రుడ్డివాడనై భ్రమించునాకు మిక్కిలికరుణతో జ్ఞానమిచ్చి బ్రోవవయ్యా!. నాకన్నా దీనుడు  నీకు ఎవరున్నారు ? ముల్లోకాలకూ నీవే దీనరక్షకుడవు, శరణువేడదగినవాడవు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 12*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*గుహాయాం గేహేవా బహిరపి వనేవా అద్రిశిఖరే*

*జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలమ్ |*

*సదా యస్య అంతఃకరణమపి శంభో! తవ పదే*

*స్థితంచేత్ అసౌ సచ పరమయోగీ సచ సుఖీ  12*


ఓ శంకరా! మనుజుడు, గుహలో కానీ, ఇంటిలో కానీ, బయటనెచ్చటో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటియందు కానీ, పంచాగ్నిమధ్యమందు కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏమి లాభము? ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు స్థిరముగానుండునో అతడే గొప్పయోగి మరియు అతడే పరమానందము కలవాడు అగును.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *కార్తిక పురాణము - 15*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము- పదిహేనవ అధ్యాయము*


ఓ జనకమహారాజా! తిరిగి కార్తీక మహాత్మ్యమును జెప్పెదను.భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తీకమాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిరనివాసి యగును. ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తీకమాసమున శుక్ల పక్షమందు సాయంకాలమందు హరిని బూజించువాడు స్వర్గాధిపతియగును. కార్తీకమాసమందు నెల రోజులు నియతుగా విష్ణ్వాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును. సందేహము లేదు. ఈమాసమందు హరి సన్నిధికిబోయి హరిని దర్శించువాడు విష్ణుసాలోక్యముక్తిని బొందును. కార్తీకమాసమందు విష్ణ్వాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవనరకమును, కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆరోజున పూజ చేసిన పుణ్యమునకు అంతములేదు. ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడిభక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, దూపముతోను, దీపముోను, ఆజ్యభక్ష్యనైవేద్యములతోను బూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని లక్షదీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవ బృందముచేత కొనియాడబడుచు విష్ణులోకమునకు జేరి సుఖించును. కార్తీకమాసము నెల రోజులు దీపమును బెట్టలేనివాడు శుద్ధద్వాదశినాడును, చతుర్దశినాడును, పూర్ణిమనాడును మూడు రోజులు పెట్టవలెను. కార్తీకమాసమందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపమునుంచిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించి వాడు పాపములేని వాడు అగును. కార్తీకమాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములయిన పాపములను నశింపజేసికొనును. ఈవిషయమందొక పూర్వపు కథ గలదు. విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టిమొదలు పూజానైవేద్యములు లేక జీర్ణమైన విష్ణ్వాలయమొకటిగలదు. కార్తీకస్నానార్ధము కర్మనిష్ఠుడను నొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని యెంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకుబోయి నూనెదెచ్చి పండ్రెండు దీపపాత్రలను దెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తిక శుద్ధ ద్వాదశినాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము జేసి మెల్లగా దీపముల సన్నిధికి జేరెను. ఎలుక వచ్చినతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను జూసి దాని దగ్గరను జ్వాలతో గూడిన వర్తిని జూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసికొని జ్వాలలేని వర్తిని గూడ గ్రహించెు. అంతలో జ్వాలతో యున్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తియు మండెను. రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తిక శుద్ధ ద్వాదశినాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని యెలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆరాత్రియే అచ్చటనే మృతినొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారియాయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను. చూచి నీవెవ్వడవు. ఇచ్చటికెందుకు వచ్చితివి అని యడిగెను. ఆమాటవిని ఉద్భూతపురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహితా! నేను ఎలుకను. గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈదేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిపుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది యే పుణ్యముచేత గలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను? ఏమి పాపమును జేసితిని? ఏపాపము చేత ఈమూషకత్వము నాకు ప్రాప్తించినది? ఈవిషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను. శిష్యుడను. దయకు పాత్రుడను. ఆమాటవిని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూతపురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయీ! నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు. బ్రాహ్మణుడవు. నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు. బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును జేయుచు వివేకములేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను జేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దానిచేత అన్నమును బెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడవై యుంటివి. ఈప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆద్రవ్మును భూమియందు దాచి చివర మృతినొందితివి. ఇట్టి పాతకములచేత నరకమనుభవించి తిరిగి భూమియందు మూషకముగా జన్మించి ఈదేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశమువలన ఈదినమందు నాచేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి.గనుక ఆపుణ్యముచేత మూషకత్వము పోయి దివ్య రూపము గలిగినది. ఇక హరభక్తి గలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈప్రకారముగా యతిచెప్పిన మాటను విని ఉద్భూతపురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞతీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికిబోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ యీ మూడు దినములందు స్నానము చేసి ఆమహిమచేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును జేసి తన్మహిమవలన అంతమందు సాయుజ్యముక్తిబొందెను. కాబట్టి కార్తీకశుద్ధి ద్వాదశినాడు భగవత్పరాణుడై పాపముక్తుడై సాయుజ్యపదము పొందును.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే పంచదశాధ్యాయస్సమాప్తః

Making thread


 

Check spelling


 

Puffed rice making

 


Mirchi bajji

 


 *27-11-2023*

*ఇందు వాసరః సోమ వారం*

*రాశి ఫలితాలు*

*మేషం*

నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి   ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.

*వృషభం*

 కొన్ని వ్యవహారాలలో మిత్రులతో  వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి   ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

*మిధునం*

సమాజంలో  ప్రముఖుల  సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  నూతన ఋణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన   వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

*కర్కాటకం*

దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.  స్థిరాస్తి  వ్యవహారాలలో అవరోధాలు  తొలగుతాయి. వృత్తి  వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

*సింహం*

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో  చిన్నపాటి  వివాదాలు  ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

*కన్య*

దూరపు బంధువుల నుండి  ఆసక్తికర  విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద  పూర్తిఅవుతాయి. బందు మిత్రులతో  మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో  నిర్ణయాలు  స్థిరంగా ఉండవు. వృత్తి  ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

*తుల*

సమాజంలో  పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి  నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ  విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  వృత్తి, ఉద్యోగాలలో  పురోగతి కలుగుతుంది.

*వృశ్చికం*

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో  ఉన్న  సమస్యలు  అధిగమించి ముందుకు సాగుతారు.

*ధనస్సు*

సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.

*మకరం*

చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.  

*కుంభం*

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి  ఒప్పందాలు కుదురుతాయి.  విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడతారు.

*మీనం*

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

🕉️

 🔔 *సత్సంగం* 🔔


*కార్తీక పౌర్ణమి విశిష్టత*


ఈ నెల 26,27వ తారీకు వరకు  వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు.

*కార్తీక సోమవారం తో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం*. 


ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. 


మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 


వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.


కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. 


రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. 

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నె పై ఉంచి నదిలో లేదా కొలను లో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు.


కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. 

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.


పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణం గా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. ఆనక్షత్రం లో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధన కు కృత్తిక దీపం అనే పేరు కూడా ఉంది. 


కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం.


*సర్వపాపాలు* కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయి. 

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలి.


*ఉసిరిదీపం* పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరి కాయ తో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.


*365 వత్తుల దీపం* కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తుల తో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయం లో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.


*శివుడి దర్శనం* పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్య్స అవతారంలో దర్శనిమిస్తాడు.


*పాయసం నైవేద్యం* కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కొంతమీరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు.


*నరాలకు మంచిది* కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడు కిరణాలు మీమీద పడటం వల్ల నరాలు, కళ్ళు రిలాక్స్ అవుతాయి.

కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే  ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.


*కార్తీకేయుడికి* కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసి మాత పుట్టిన రోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.


*మహామృత్యుంజయ మంత్రం* కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. *ఓం త్రియంభకం యజామయే సుగంధిమ్ పుష్టివర్ధం ఊర్వరుకమివి బంధానాం మృత్యోర్ ముక్షియ మమ్రితాత్* అనే ఈ మంత్రాన్ని 108సార్లు జపించాలి.


*సాయంకాల దీపం*

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా, మంచి ఫలితం కలుగుతుంది.


*ఆశ్వమేధ యాగం ఫలితం*

ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.


కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. 


ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. 

ఈ రోజు లలితాదేవిని సహస్ర నామాలతో పూజిస్తే, ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగు తుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగు తుందని పూర్వీకులు చెబుతుంటారు.


*పఠించవలిసిన శ్లోకం*


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః

జలే స్థలే  యే నివసంతి జీవాః!

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః

భవంతి టైం శ్వవచాహి విప్రాః!!


దీపం వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షత లో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్థంబదీపం పెట్టిన వారు శ్రీ మహవిష్ణువుకి ప్రీతివంతు లవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచ లవుతాయని విశ్వసిస్తారు.