27, నవంబర్ 2023, సోమవారం

 *జైశ్రీరామ్*


                            11-5-2020

                            అభ్యాసం-11


                          *సుభాషితం* 


"అదాన దోషేణ భవేద్దరిద్రో

  దారిద్ర్య దోషేణ కరోతిపాపం |

  పాపా దవశ్యం నరకం ప్రయాతి

  పున ద్దరిద్రీ పునరేవ పాపీ" ||


                            *భావం*


ఎవరికిని ఏమీ యివ్వని,పెట్టని పాపం

చేత దరిదృ డవుతున్నాడు. దరిదృడవటంచేత మళ్ళీ పాపాలు చేస్తాడు.పాపాలు చెయ్యటం వల్ల నరకానికి పోతాడు.

మళ్ళీ దరిదృడుగా పుట్టి మళ్ళీ పాపాలే చేస్తాడు.

మళ్ళీ నరకానికే పోతాడు.ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

కావున ప్రతీ వ్యక్తీ తనకు ఉన్నంతలో దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి.దానగుణం తన సహజ లక్షణం, స్వభావం అవ్వాలి.దానివలన మానవునికి ఉన్నత జన్మలు లభించి ముక్తికి మార్గం సుగమం అవుతుందని సనాతన ధర్మం చెబుతోంది.


                      *అమృతవచనం* 


*నారాయణ*సూక్తం* ఇలా  అంటుంది: "అంతర్ భహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః".

భగవంతుడు సర్వాంతర్యామి అని, సర్వత్ర వ్యాపించి యున్నాడని చెబుతుంది.విశ్మమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి రధసారధిగా వ్యవహరించి, నైరాశ్యంలో కూరుకుపోయిన పార్ధునికి జగద్గురువుగా *గీతోపదేశం* చేసాడు.మార్గశిర శుద్ధ దశమినాడు అలా ఆ భగవంతుని ముఖతః ప్రపంచానికి అందిన అమృతభాండం,  మానవులను తట్టిలేపే ధర్మఘంట శ్రీమద్భగవద్గీత.భగవత్ సంభందాన్ని పొందితే ఏ విషాదమైనా "యోగం" అవుతుంది.అప్పుడసలు దుఃఖమే ఉండదు.దైవసంభందం లేకుండా మానవుడు విషయాల కోసం విలపిస్తే ధుఃఖించవలసిందే.సుఖధుఖాలు బయటి ప్రపంచం నుండి రావు, అవి మనలోనే ఉంటాయి.వీరు యిస్టులని, వారు అయిస్టులని మనసు మాయవలన రాగద్వేషాలకు లోనవుతుంది,వశమవుతుంది.దాని ఫలితమే మానవులకు సుఖదుఃఖాలు.కావున మానవులందరూ ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగి ఉండాలి, భగవద్గీత చెపుతున్నది కూడా అదే. 


                        శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి


.

కామెంట్‌లు లేవు: