💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*శ్లోకం*
*సంసార ఘోర గహనే చరతో మురారే* !
*మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య* |
*ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య* -
*లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలమ్బమ్* ||
_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం-04_* _
*తా:: ఓ మురారీ! నేను సంసార మనెడి ఘోరమైన అరణ్యములో సంచరించుచున్నాను అందు మన్మథుడనెడి భయంకరమైన క్రూర మృగము నన్ను పట్టి మిక్కిలి పీడించుచున్నది. మత్సరమను మండు వేసవి బాధింపగా మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ నృసింహ దేవా! ఆర్తుడైన నాకు కరావలంబన మిచ్చి కాపాడుము.. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.
🧘♂️🙏🪷 ✍️🙏
*శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబం స్తోత్రము*
*అనువాద పద్యము 4*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
*తే గీ.నేను ఘోర సంసారపు కాన మందు*
*సంచరించగా మన్మథ సర్ప , మృగము*
*లెన్నియో నన్ను వెంటాడి యిడుము లొసగె*
*మండుటెండ గా బాధించె మత్సరంబు*
*దుఃఖ బాధల యందున దొరలుచుంటి*
*ఆర్తుడను నన్ను కాపాడి యాదుకొనుము*
*నారసింహుడా చేయూత నందజేయు*
*లక్ష్మితో వచ్చి కాపాడు లక్షణము గ*
*శ్రీధరుని చిత్తమందున స్థిరముకమ్ము*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి