27, నవంబర్ 2023, సోమవారం

 .      *చదువు, హోదా సంస్కారాన్ని నేర్పించలేదు*

🌳🕊️🌳 🕊️🌳🕊️ 🌳🕊️🌳


*టీఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ కై ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రదేశానికి వెళుతున్నారు! మార్గమధ్యలో పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు...*


*అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది...*


*సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు ఎస్కార్ట్ వారితో పిలిపించి, పిచ్చుక గూళ్ళను తీసిస్తే,10 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు! ఆ కుర్రవాడు ఒప్పుకోక పోవడంతో, రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామన్నారు శేషన్ ! వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్ళు తియ్యమని యువకుడిని ఆదేశించారు.*


*అయినా తొణకని, బెదరని ఆ యువకుడు "మీరు 50 కాదు, ఎంత ఇచ్చినా, పిచ్చుక గూళ్ళను తీసి ఇవ్వలేను! నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తొలగిస్తే, ఆ గూళ్ళ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏమి కావాలి ?! అలాగే  సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు పిల్లలు కనిపించక పోతే ఎంత బాధపడుతుంది?!" అన్నాడు!*


*ఇది విన్న శేషన్ దంపతులు షాక్ అయ్యారు...*


*"నా స్థానం, నాహోదా,నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగావనిపించిది! తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.* 


*విద్య, స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడుపే !!" అన్నారు శేషన్*


*మేనేజ్‌మెంట్ సెమినార్‌లో అక్కడి విద్యార్థులకు టిఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది !*


*ఓం  🇲🇰 🇲🇰 🇮🇳 🇲🇰 🇲🇰  శాంతి*

🥦💐🥦 🌷🪷🌷 🥦💐🌳

కామెంట్‌లు లేవు: