27, నవంబర్ 2023, సోమవారం

 నేడు(తేది : 25-11-23) శనివారం రోజున

*శని త్రయోదశి*

-------------------------------------


👉ఈ నెలలో రెండుసార్లు శనిత్రయోదశి లు రావడం గమనర్హం.


**************************


శనివారం + త్రయోదశి తిథి ఉన్న రోజును 

= శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. 



🌸శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు అమితంగా చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.


🌸 సర్వశక్తి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. 

వారిలో

🌸1)యముడు...

వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే..., 

🌸2)శని  దేవుడు...

మానవుడు బతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

శని చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, కచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శనిత్రయోదశి నాడు శనైశ్చరుని ఆరాధించాలని నిర్దేశించారు.


🌸 *"కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.* 

 *👉 దీనిని అందజేసేది శనీశ్వరుడు."*


🌸 భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకిమంచి ప్రతిఫలం, 

చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. 


🌸 ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. 


🌸మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని  కలిగిస్తాడు


🌸 సూర్యభగవానుడు - ఛాయా సంతానమే .......

*శనిదేవుడు* అందుకే ఆయనను *సూర్యపుత్రుడు* అనీ, *ఛాయాసుతుడు* అనీ అంటారు.

గోత్రం: కాశ్యపన  

సోదరుడు: యమధర్మరాజు , సోదరి యమున .

స్నేహితులు: హనుమాన్ , కాలభైరవుడు. 

శనికి ఉన్న ఇతర పేర్లు: కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.


🌸నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. 


🌸 స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది.

---------------------------------------

🌸 ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అని చెప్పిన శని.. శివుని వద్దకు వెళ్లి ఏదేమైనా నా ప్రభావాన్ని రేపే తప్పక మీపై తప్పక చూపిస్తాను అని శపథం చేసి తీరుతాడు. అందుకు పరమశివుడు నేను తలుచుకుంటే నువ్వు  కనుమరుగు అవుతావు జాగ్రత్త  అని హెచ్చరించాడు. ఇరువురు సరే నేనేంటో చూపిస్తా,  రేపటి రోజున అని అనుకున్నారు. 


🌸 శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక,  అప్పటికే చాలామంది దేవతలపై శని ప్రభావ  సంఘటనలు వాటి కష్టాలు అనుభవించిన సంగతి శివుడికి తెలుసు.  రేపటి రోజున శని మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు అతడికి దొరకకుండా భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.  మర్నాడు శివుడు కైలాసానికి చేరుకున్నాడు.


🌸 మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన  అంతటి నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. 


శనిదేవుని ఆత్మస్థైర్యం,చాతుర్యం గ్రహించిన పరమేశ్వరుడు, ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు.

దేవదేవతలమైన మాకే ఇంతటి ప్రభావం చూపిస్తే, సామాన్య మానవులు నీ ప్రభావాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి 

👉 ఈ రోజు శనివారం మరియు త్రయోదశి  కాబట్టి నేడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. నేటి నుంచి నా పేరును కలుపుకొని శనిశ్వరుడిగా పేరొందుతావని అభయం ఇస్తాడు.

అప్పటి నుంచి త్రయోదశి తిథితో వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమపై అతి  ప్రభావం పడకుండా, చూసీచూడనట్లుగా వుండాలని            

భక్తి పూర్వకంగా ప్రార్థించాలని ఆధ్యాత్మిక పండితులు నొక్కి ఒక్కాణిస్తున్నారు.


🌸ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు వీలైతే శని దేవుడు కోసం ఉపవాసం ఉండాలి.


🌸 నవగ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. *నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది.* అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. 


🌸 జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. 


🌸 అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.



🌸జ్యోతిష శాస్తర్రీత్యా ఆయన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సివస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలా నిలబడుతున్నామో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే.


🌸శని దేవుడికి నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. 


🌸జాతకచక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఏలినాటిశని, అర్ధాష్టమశని, అష్టమశని పీడితులు ఈ శనిత్రయోదశి నాడు పరిహారక్రియలు చేసి ఆ గ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు. న్యాయవివాదాలు, శత్రు, రోగ, రుణబాధలు తగ్గుతాయి. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోషకాలంలో శివపూజ, ఉపవాసం చేయాలి.


🌸కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. 

ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.


*శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు*


🌹శని త్రయోదశి నాడు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే నకారాత్మక శక్తులు  తొలుగుతాయి.


🌹 శని ప్రభావానికి  లోనైనవారు.ఈరోజు రావి చెట్టు లేదా మేడి చెట్టు లేదా జమ్మి చెట్టు లేదా మారేడు చెట్టు లేదా  మర్రిచెట్టు ఇలా ఈ ఐదు చెట్లలో ఏదైనా ఒక చెట్టుకు 

* ఓం శివాయ నమః  అంటూ చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.*



🌹శని త్రయోదశి నాడు సూర్యోదయం సూర్యాస్తమ సమయాల్లో శివుని పూజలు చేస్తే ఎన్నో రేట్ల పుణ్యఫలితాలను ఇస్తుంది.  


🌹నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.


🌹నవగ్రహాల్లో ఏడవ సంఖ్యా కలిగిన శనీశ్వరుడు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది.


🌹నల్ల కుక్కకు గాని కాకికి గానీ  వాటికి ఆహారంగా ఏదైనా పెడితే చాలా మంచిది.


🌹 మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి.


🌹 ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.


🌹 శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు ఈ స్తోత్రాన్ని పాటించాలి.


👉👉👉👉👉👉

*నీలాంజన సమభాసం*

*రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం*

*తం నమామి శనైశ్చరం.*


అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.


🌸ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం.


దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహబలం లేనందున కష్టాలు వస్తే , శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్రం పారాయణము చేసినవారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని , అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు , ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి.

నిత్యం లేదా తప్పక శని వారం శనిత్రయోదశి వంటి పర్వదినాలలో  *దశరథ శ్రీ శని స్తోత్రం* పారాయణము చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.


 ********* *నోట్:* ********

ఎన్ని పూజలు చేసినా,

ఎన్ని వ్రతాలు చేసినా,

ఎన్ని గుడులు దర్శించిన,

ఎన్ని తీర్థ యాత్రలు తిరిగిన కానీ..................................

(తల్లిదండ్రులను గౌరవించని  వారికి, నెలకొకసారి ఒకసారి అయినా గో సేవ చేయని వారికి

మరియు 

ధర్మానికి కట్టుబడి ఉండని  వారికి )ఇలాంటివారు

 👉ఎన్ని పూజలు, వ్రతాలు, దీక్షలు చేసిన ఈ పుణ్యాఫల ప్రభావం ఫలితం మాత్రం వారికి అంతంత మాత్రం గానే ఉంటుంది.

**************************

కార్తీకమాసం సందర్బంగా ఉసిరి చెట్టు వద్ద దీపం పెట్టేటప్పుడు చెట్టు వేర్ల వద్ద (మొదలు కు) తాకేలా పెట్టకూడదు. ఎందుకంటే ఉసిరి చెట్టు ఈ మాసంలో భగవాన్ స్వరూపం. కాబట్టి చెట్టు వేర్ల వద్ద దీపాలను దగ్గరగా పెడితే ఆ వేడికి చెట్టులోని తేమ శక్తిని కోల్పోయ్యి చెట్టు ఎండిపోయ్యే లేదా చెట్టు పెరుగకుండా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి చెట్టుకు రెండు అడుగుల దూరంలో దీపాలను వెలిగించగలరు.                            **********----------*******

కామెంట్‌లు లేవు: