27, నవంబర్ 2023, సోమవారం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఎవరి కోపకారణాలు వారికి ఉన్నాయి. ఎవరిదారినవారు జీవిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు

పత్యవ్రతుడికి అరణ్యంలో ఒక్క జంతువూ దొరకలేదు. తన ఆకలిమాట ఎలాగున్నామునిపుత్రులకు ఆహారం

అందించాలి. ఎలాగా అని ఆలోచిస్తుండగా అల్లంత దూరాన ఒక ఆవు కనిపించింది. అది పాడి ఆవు. పైగా

వపిష్ఠులవారిది. తెలిసీ సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధమో మోహమో! దొంగపని చేశాడు.

వసిష్ఠ స్య చ గాం దోగ్రీమపశ్యద్వనమధ్యగామ్ ।

తాం జఘాన క్షుధార్తస్తు క్రోధాన్మోహాచ్చ దస్యువత్ II

(10 - 52)

మాంసం తెచ్చి ఆశ్రమవృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలాగానే ఆ

మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టింది. మిగిలినది తాను తింది. తింటూ గుర్తుపట్టింది ఇది మృగమాంసం

కాదు, గోమాంసమని. తరవాత విచారిస్తే తెలిసింది. వసిష్ఠులవారి పాడియావును ఎవరో సంహరించారనీ,

మాంసం తీసుకుపోయి చర్మమూ ఎముకలూ ఒకచోట వదిలేశారనీ, కౌశికాంగన హృదయం భగ్గుమంది.

జరిగింది తెలుసుకుని వసిష్ఠుడు మండిపడ్డాడు. దురాత్ముడా! ఎంతటి మహాపాపం చేశావు.

పిశాచంలాగా గోవును సంహరించావా? నీ శరీరంలో మూడు మేకులు (శంకువులు దిగబడుగాక! నీకు

పిశాచరూపం సంక్రమించుగాక! ఇప్పటినుంచీ నీపేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు.

సత్యవ్రతుడికి పిశాచరూపం వచ్చేసింది. మూడు మేకులూ దిగబడి త్రిశంకుడు అయ్యాడు. సిగ్గుతో ఎటూ

వెళ్ళలేక అదే ఆశ్రమంలో ఉండిపోయి, తపస్సుకి ఉపక్రమించాడు. మునిపుత్రుల్లో ఒకడు మహాదేవీమంత్రం

ఉపదేశిస్తే దానినే జపిస్తూ పరాశక్తిని ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు.

దేవీ అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం

చాలాకాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవీనవాక్షర మహామంత్ర జపం ఒక స్థాయికి

వచ్చింది. జపంలో దశాంశంతో హోమం జరిపించాలి. ఇది నియమం. నాతో హోమం చేయించండి అని

ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు.

సత్యవ్రతా ! నువ్వు పితృపరిత్యక్తుడవు. శ్వపచుడవు. గోహత్యా మహాపాతకివి. గురుశాపదగ్ధుడివి.

పిశాచరూపివి. హోమం చేసే అధికారం నీకు లేదు. అనర్హుడవు. వేదం అంగీకరించదు. మేము

చేయించం. వెళ్ళిపో - అన్నారు.

కామెంట్‌లు లేవు: